Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 56


    "అది ప్రాడ్ అయి వుంటుంది" అన్నాడు మరో ఇన్ స్పెక్టర్.

    ఆస్తి పంజరాన్ని కూడా అన్ని యాంగిల్స్ ఫోటోలు తీసారు.

    ఆమెతో పాటు, ఆస్తీ పంజరం ఉన్న పెట్టెకూడా పోలీస్ వ్యాన్ లో పెట్టారు. అప్పుడు జనం కదిలారు

    టెంపరరీ టీ కొట్లు వెలిసాయి.

     టెంపరరీ పళ్ళకొట్లు వెలిసాయి గుడిప్రక్కన.

    "ఈ విడకాదు, చీరలు అమ్మేది మరొకతి."

    "అవును సెంట్లు అమ్మేది మరొకతి...."ఇలా రక, రకాలుగా మాట్లాడుకున్నారు జనం.

    వారి మాటలను బట్టిఆమె అంటే శంకరి బ్రోతల్ హౌస్ కూడనడిపేదని అర్ధం అయింది.

    పోలీస్ వ్యాన్లు వెళ్ళిపోగానే అందరూ చల్లాచెదరు అయిపోయారు. వాన వెలిసినట్టు వుంది.

    ఈ ఘోర కృత్యాలు చూడలేక ప్రకృతే అలక వహించినట్టు అకాశమంతా మబ్బులు కప్పుకున్నాయి.


                                       14


    సిద్దార్థ వెళ్ళి చెల్లెలి  చేతిని చేతిలోకి తీసుకుని చూచాడు. అందమైన వెండి ఉంగరం పైన ఆకుపచ్చ ఎనామిల్ తో 'శ్రీనివాస్' అని చెక్కిఉంది.

    ఆ ఉంగరాలు మార్చుకుంటూ ఏమని పబ్రమాణాలు  చేసుకుని ఉంటారు" జీవితాంతం ఒకరిని ఒకరం విడువద్దు."

    కాదు...శ్రీనివాస్ అభిరుచి గలవాడు.

    "ఒకరి కష్టసుఖాలలో  ఒకరం భాగం పంచుకుని,ఇద్దరం ఒకటిగా బ్రతుకుదాం" అని ఉంటాడు.

    అదీకాదు.ఇంకేదో అని ఉంటాడు.

    పాలు తీసుకుని వచ్చింది యశోదమ్మ.

    "ఏం జరుగుతుందిరా!"

    "ఈ పెద్దమనిషి తప్పించుకుంటూ ననుకుంటున్నాడుగాని ఎక్కడున్నా పట్టుకుంటారు."

    "ఏమో నాయనా!ఉన్న ఒక్క పిల్ల అచ్చట, ముచ్చటలేక పడిఉంది." ఆమె మాట పూర్తి కాకముందే పురుషోత్తమరావు వచ్చాడు.

    "మా  బాగా బుద్ధి చెప్పావురా...." అన్నాడు కొర, కొర చూస్తూ.

    "ఏం జరిగింది?" వెటకారం చేశాడు.

    "నాకొడుకు.... నా కొడుకు నాకు అబద్ధం చెప్పడని మురిసిముక్కలవుతావు కద. చేసిన ఘనకార్యం చెప్పాడా!"

    "ఏమిటి బాబూ?"

    " అలా  కాదే! వెన్న రాస్తూ, మంగళహారతి ఇస్తూ,అడుగు. నా ఇంట్లో నాకు శతృవు  ఉన్నాడని తెలిస్తే...."

    " తెలిస్తే శ్రీనివాస్ ను చంపించేవారు కాదు కాదూ.!"

    "నోరు ముయ్యి"

    " నోరు మూసుకోవాల్సినంత తప్పు మీరు చేశారు. నేను కాదు." విసురుగా లేచాడు సిద్దార్థ.

    "శ్రీనివాస్ పేదవాడు కావటం అతని తప్పా! అతని తండ్రి మన దగ్గర పనిచేయటం అతని తప్పా! మనమ్మాయి అతడిని ప్రేమించటం అతనితప్పా!మారుతున్న కాలాన్ని ఎప్పడుఅర్థం చేసుకుంటారుమీరు!"

    "అవున్రా !తేరగా వేలకు, వేలకు పంపితే , చదువుకుని నన్ను ప్రశ్నించే మగాడిని అయ్యావు. కదూ! వెళ్ళు.... వెళ్ళి పొట్ట పోషించుకుంటే నీ ఆదర్శాలు, ఆశయాలు ఎక్కడుంటాయో చూస్తాను" అన్నాడు .

    "నాన్నా!"

    "నన్నా  పేరుతో పిలువకు.ఆస్తి కిపోతుందని నువ్వు కదూ వాడికి నేర్పిపెట్టి , పెద్ద వాడిని ఉరికంభం ఎక్కించాలని చూస్తున్నావ్."అసహాయంగా ఎదురుగా కనిపించిన భార్యను చెడ, మడా తిట్టేసాడు.

    " నోరుముయ్యి.?"

    "నా నోరు మూస్తారు.శ్రీనివాస్ ను చంపింది మీరేనని లోకం కోడయి కూస్తుంది. అందరి నోరు ముయ్యగలరా...."

    "అన్నయ్యా!"రాధిక లేచి వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS