Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 55


    "ఊ-హీరో యిన్ ఏది?"

    "ఏమో నాకు తెలియదు-"

    "తెలియదూ!" పోలీసు బసప్ప కాళ్ళపై ఒక్కటిచ్చాడు. లబోదిబోమంటూ ఓ పెంకుటిల్లు చూపాడు.

    పోలీసులు తలుపు  తీసారు.

    బయటికి పెంకుటిల్లులా కనిపిస్తుంది. లోపల సినిమా సెట్టింగ్ కంటే అద్భుతంగా ఉంది ఖరీదయిన కార్పెట్టు, అంతకంటే అందమైన సోఫాసెట్టు ఆలివ్ గ్రీన్ లో ఉంది దానికెదురుగా ఆలివ్ గ్రీన్ పై బంగారు రంగు చారలున్న కర్టెన్స్ వున్నాయి. వాటి ప్రక్కన అందమయిన రోజ్ ఉడ్ రూమ్ లో కి వెళ్ళారు.

    "కూర్చోండయ్య మా అమ్మ వస్తుంది"అన్నదో అమ్మాయి.

     పోలీసుల ననుసరిచి వెళ్ళిన సిద్దార్థ ఆశ్యర్యంగా చూస్తున్నాడు. బసప్ప భార్య యెలా వుంటుంది!

    లంఖిణిలాగా, శంఖిణిలాగా!

    స్మగ్లింగ్ చేసేవారు  బలంగా ధృఢంగా  వుండాలి. లేకపోతే యెలా జనాన్ని  ఎదుర్కుంటారు!

    పడకగదిలో అడుగుపెట్టి ఆశ్చర్యంగా ఆగిపోయారు.ఆధునాతనంగా, చిన్న సిటీలో అంత అందంగా ఉంటుందా అన్న ఆశ్చర్యం కలిగింది. తలుపు తీసి వుంది. బాత్ టబ్లో నుండి నైట్ గౌన్ వేసుకుని వచ్చిందో అందాల సుందరి.

     పోలీసులు వెనక్కి తగ్గారు.

     ఆమె తుండులో తల తుడుచుకుంటూ బయటికి వచ్చింది.

    "ఏం కావాలి!"

    "  మిసెస్ బసప్ప మీరేనా?"

    "నా పేరుశంకరి-" అన్నది చురుకుగా, వీళ్ళ రాకకు ఏమాత్రం చలించక పోలిసులు నీళ్ళు మింగారు.

    "మత్తు పదార్థాలా, మగువా ఏం కావాలి!"నవ్వుతూ అడిగింది.

    "మీ స్టేట్ మెంట్ కావాలి."

    "ఆమె వచ్చి కూర్చుంది.

    "కౌసల్య కాఫీ తీసుకురా."

    "ఇప్పుడేం వద్దు"అన్నాడు ఎస్సై.

    "సిగరెట్..." ఆమె విల్స్ సిగరెట్ తీసుకుని ఆఫర్చేసింది.

    "నో థాంక్స్ . మీ పై అరెస్టు వారంటుంది" అన్నాడు.

    వెనుక సిద్దార్థ లేకపోతే ఆమె వలలో పడటం చాలా తెలిక. ఆమెను బయటికి తీసుకువస్తుంటే పదిమంది ఫోటోగ్రాఫర్లు పోటీ పడిముందుకు వచ్చారు.

    "ఈవిడ బసప్ప భార్యా!" సిద్దార్థ నోరు వెళ్ళబెట్టారు.

    "అది ఫ్రాడ్ అయి వుంటుంది" అన్నాడు  మరో ఇన్ స్పెక్టర్.

    అస్తిపంజరాన్ని కూడా అన్ని యాంగిల్స్ ఫోటోలు తీసారు.

    ఆమెతో పాటు, ఆస్తి పంజరం ఉన్న పెట్టెకూడా పోలీస్ వ్యాన్ లో పెట్టారు. అప్పుడు జనం కదిలారు.

    టెంపరరీ కొట్లు వెలిసాయి.

    టెంపరరీ  పళ్ళ కొట్లు వెలిసాయి గుడిప్రక్కన.

    "ఈ విడకాదు, చీరలు అమ్మేది మరొకతి."

    " అవును సెంట్లు అమ్మేది మరొకతి...."ఇలా రక, రకాలుగా మాట్లాడుకున్నారు జనం.

    వారి మాటలను బట్టి ఆమె అంటే శంకరి బ్రోతల్ హౌస్ కూడనడిపేదని అర్థం అయింది.

     పోలీస్ వ్యాన్లు వెళ్ళిపోగానే  అందరూ చల్లాచెదరు అయిపోయారు. వాన వెలిసినట్టు వుంది.

    ఈ ఘోర కృత్యాలు చూడలేక ప్రకృతే అలక  వహించినట్టు ఆకాశమంతా మబ్బులు కప్పుకున్నాయి.
   
    "నో థాంక్స్. మీ పై అరెస్టు వారంటుంది"అన్నాడు.

    వెనక సిద్దార్థ లేకపోతే ఆమె వలలో పడటం చాలా తేలిక. ఆమెను బయటికి తీసుకువస్తుంటే పదిమంది ఫోటో గ్రాఫర్లు పోటీ పడి ముందుకు వచ్చారు.

    "ఈ విడ బసప్ప భార్యా!" సిద్దార్థా నోరు వెళ్ళబెట్టారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS