అక్కడక్కడ దొరికినా గుడ్డపీలికలు జాగ్రత్తచేస్తారు.చిత్రం ఏమిటంటే ప్యాంటుపై టెయిలర్ గుర్తులున్నాయి "బ్రైట్ టెయిలర్స్" అంటూ ఆ ఉంగరాలు జాగ్రత్తగా దాచారు.
" నా మట్టెలుంటే తీసుకెళ్ళాడు. 'అమ్మా'! ఉంగరం చేయించుకుంటానే అంటే చేయించుకొమ్మన్నాను' అన్నది. ఉంగరాన్ని చూచిన పార్వతమ్మా" ఆమె చుట్టూ ఆడవారు చేరారు.
సిద్దార్థ యాంత్రికంగా నడిచి వచ్చి గుడి ఎదురుగా కూర్చున్నాడు. అతని మనసు మొద్దుబారిపోయింది.
ఎన్నో ప్రశ్నలు సుళ్ళు తిరుగుతున్నాయి.
జనం మూఢ శ్వాసంలో రాయిలో, రప్పలో దేవుడిని వెతుకుతారు. దేవాలయం అంటే పవిత్రమైన స్థలంలో హత్య జరిగింది.
భగవంతుని ఎదురుగా జరిగింది.
ఆయన కళ్ళు మూసుకున్నాడా! లేకబలి అని తృప్తి చెందాడా!
అంతా భ్రమ!
మానవత్వం, మంచి ఉన్న మనిషే భగవంతుడేమో!
అవును అంతే....
మిస్టర్ సిద్దార్థా!"
"ఎస్ సర్...."
"వేడి కాఫీ త్రాగండి." ఎస్సై కాఫీ అందించాడు.
మౌనంగా కాఫీ సివ్ చేయసాగాడు.
"మీదికి కొత్తగా ఆశ్చర్యంగా ఉందేమో. మేమీ దారుణాలు రోజూ చూస్తాం, మనిషి ఏ అంగానికి ఆ అంగం ఊడగొట్టి, మూటగట్టిన కేసులు చూచాం. దారుణంగా అవయవాలు కోసేసిన వికృత స్వరూపాలు చూచాం మానవుడిలో దాగిఉన్న పాశవికగుణాలకు ప్రతీకలుగా వచ్చే చర్య లన్నీ చూచాం. మొద్దుబారిపోయాము."
"వాళ్ళు ఏం సాధిస్తారు!"
"క్షణికానందం!కాఫీ త్రాగి మీరు రిలీఫ్ పొందినట్టే . వారికి ఉపశమనం దొరుకుతుంది."అన్నాడు.
"రాక్షసత్వం!"
"అదే ఈ నాడు అధికంగా ప్రాచుర్యం పొందింది . డ్రాకులా సినిమాలు వస్తాయి జనం విరగబడి చూస్తారు. మనిషిలోని అన్ని రకాల గుణాలు ప్రాచుర్యం పొంది, అటవిక దశ క్లయిమాక్స్ కు చేరుకుంటుందేమో." అన్నాడు ఎస్సై.
"మీలో ఇంత విచక్షణా గుణం ఉందంటే చాలా సంతోషంగా ఉంది." అన్నాడు.
జనం గోలగా అరుస్తున్నారు.
జీపులో అస్థికలను హైద్రాబాద్ తరలించే ప్రయత్నంలో ఉన్నారు.
పార్వతమ్మ ట్రే పెట్టిన బల్లదగ్గర దొర్లుతుంది.
"పెద్దింటి వాళ్ళతో ప్రేమా, దోమ వద్దు అన్నాను నాయనా!నామాట వినక ప్రాణం మీదికి తెచ్చుకున్నావురా తండ్రీ శీను నన్నెలా బ్రతకమన్నావు కొడకా!"అంటూ పాట పాడినట్టు అరుస్తుంది.
" పార్వతమ్మా!గొంతు ఎండిపోతుంది ఊరుకో-" అంటున్నారెవరో.
కొందరు పోలీసులుండి ,ఒక జట్టు బసప్ప ఇంటిమీద పడ్డారు. అతను చేతులు జోడించారు.
"నన్నేం అనకండి . నేను ఒక బొమ్మలా వుంటానిక్కడ. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. నాభార్య మధుబాబే ఏమేమో చేస్తారు" అన్నాడు.
" అరెస్టు చెయ్యండి .అతను చెప్పేది నిజం అని నమ్మేదెలా!"
" నిజమే చెబుతున్నాను సామీ...."
"నువ్వు నిజం చెబుతున్నావా!అయితే ఇక్కడ హత్య జరిగితే చూస్తూ యెలా ఊరుకున్నావ్?"
"చెబితే చంపుతామన్నారు!
"వేషాలు- వేషాలవి దొరికితే ఏడ్పులు దొరక్కపోతే దొరలు."
అతనిల్లు సోదా చేసారు.
కాపుసారాతో పాటు, గడియారాలు, రేడియోలు, కొరియానుండి వచ్చే ప్యాంటు బిట్టులు, జపాను నైలెక్స్ చీరలు, ఫోర్ స్క్వేరు సిగరెట్టు పెట్టేలు , విస్కీ , బ్రాందీ, సెంటుబుడ్లు , క్రీమ్ బాటిల్స్, ఒక రకమయిన వస్తువులు కావు, అన్నిరకాల వస్తువులు ఉన్నాయి.
