నేలబారు మనిషి
"నవ్య సిద్దు నుంచి విడిపోయింది తెలుసా నీకు?"
నా పెళ్ళి రిసెప్షన్ కి ఆహ్వానించడానికి వెళ్ళిన నాతొ అంది సరిత.
ఆశ్చర్యంగా చూశాను. "అదేంటి? ఎందుకు?" అడిగాను.
"ఏమో తను ఊహించుకున్నంత సంతృప్తికరంగా లేదట అతనితో జీవితం" మంచినీళ్ళ గ్లాసు అందించి నా పక్కనే సోఫాలో కూర్చుంటూ అంది.
చల్లగా ఉనా ఆనీళ్ళు వేపాకులతో మరిగించినంత చేదుగా అనిపించాయి. సరిత చెప్పిన వార్త తాలుకూ అనుభూతి కాబొలది. చెదు తిన్న భావన... పెళ్లి అయి ఏడాది కూడా పూర్తీ కాలేదు. అప్పుడే నవ్య భర్త నుంచి విదిపోడం ఏంటి? పైగాప్రేమ వివాహం కూడాను. సుమారు రెండేళ్ళు ప్రేమించుకుని , పెళ్ళి చేసుకున్నారు. అదే అన్నాను. సరితతో. "అదేంటి సరితా.... అప్పుడే విదాకులేమిటి? అసలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకోడానికైనా కొంతకాలం కలిసి ఉండాలి కదా..."
సరిత పెదవి విరుస్తూ అంది.... "లేదులే చాలా ట్రై చేసింది. కుదరలేదు. దూరపు కొండలు నునుపు అని....సిద్దు స్నేహితుడిగా ఉన్నంతకాలం అతనిలో లోపాలు తెలియలేదు. దగ్గరయాక ఒక్కొక్కటే తెలుస్తోంటే భరించలేకపోయింది. అందుకే ఇంక విడిపోయింది. ఇప్పుడు చాలా హాయిగా ఉంది.
"ఏంటసలు ప్రాబ్లం?" అడిగాను.
'అబ్బో చాలా ఉందిలే కధ. తనే చెప్తుంది వెళ్తావుగా. ఒట్టి నేలబారు మనిషి అతను."
"అంటే...." అయోమయంకా చూశాను.
అంటే....ఏం ఉంది? హోప్ లెస్ ....అయినా తోదరెందుకు? దాన్ని ఇన్వైట్ చేయవా? రిసెప్షన్ కి ....వెళ్ళు తనే వివరంగా చెప్తుంది.
అసలే తను బాధలో ఉంటె నేనేల్లి ఇప్పుడు పెళ్ళికి పిలిస్తే ఏమనుకుంటుంది. నాది ప్రేమ పెళ్ళే....
నేనూ విశాల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన దగ్గర్నించి క్లాస్ మేట్స్ మీ.... ఇద్దరం పరస్పరం ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాం. మా రిజిష్టరు మ్యారేజీ అయి వారం అయింది... ముఖ్యమయిన స్నేహితులకు పార్టీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఇద్దరం... ఇరు పక్షాల పెద్దవాళ్ళు ఒప్పుకోకపోడానికి ఒకే ఒక కారణం మా కులాలు వేరు. ఏమైనా మేమిద్దరం మాత్రం మా నిర్ణయాన్ని ఎవరి కోసం వదులు కోలేక పోయాం. ఒకరి నొకరు బాగా అర్ధం చేసుకున్నాం. మా ఇద్దరికీ కూడా పరస్పర అవగాహన, పరస్పర అనురాగం ఉంది. మేము మాత్రం ఇలా అనాలోచితంగా విడిపోము కదా. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. వెడ్డింగ్ కార్డూ ఇస్తూ, విడాకుల గురించి ఆలోచించడం స్తుపిడిటీ.
"హలో ఏంటి ఆలోచిస్తున్నావు?" నా మొహం మీద చిటిక వేస్తూ అడిగింది సరిత.
"ఏం లేదులే... వెళ్ళనా వద్దా నవ్వ దగ్గరికి అని ఆలోచిస్తున్నా" అన్నాను.
"అదేంటి నన్ను పిలిచి తనని పిలవకపోతే ఏమనుకుంటుంది? ముగ్గురం స్నేహితులమేగా ధన్యా" అంది.
"అవును....కానీ పాపం తనే బాధలో ఉంటె...."
'నాన్సెన్స్ ' నామాట మధ్యలోనే కట్ చేస్తూ అంది సరిత. బాధా, పాడా... శుభ్రంగా గారెలోండి తద్దినం కూడా పెట్టేసింది.
నకేలాగో అనిపించింది. ఆరునెల్ల కే అంత విరక్తి కలిగిందా? ఇదేనా వివాహానికి ఉన్న బలం. మాంగల్య బలం అంటారు... అది ఈనాటి తరానికి వర్తించదా? ఇంత బలహీనమైందా ఈతరం వాళ్ళ మాంగల్యం.... ఏది ఏమైనా వినకూడని వార్త. వినకూడని సమయంలో విన్నాను. ఈ వార్త నా మనసులో ముల్లులాగా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆ ముల్లు తాలుకూ బాధ అనుభవిస్తూనే అన్యమనస్కంగా సరిత ఇచ్చిన కాఫీ తాగి, తన అభినందనలు అందుకుని నవ్య ఇంటి వైపు వెళ్ళాను.
నన్ను చూడగానే మొహం నిండా నవ్వుతో ఆహ్వానించింది. నేను ఊహించినట్టు విషాదం మూర్తిభావించి లేదు. చాలా హాయిగా రిలాక్స్ గా ఉంది.
"కంగ్రాట్స్ ధన్యా.... హాప్ విశాల్ ఈజ్ నైస్...." అంది.
"చాలా మంచివాడు . నీకూ తెలుసుగా విశాల్" అన్నాను.
"అవును కానీ , నీకు తెలిసినంత గా కాదు" అంటూ నవ్వి "జ్యూస్ తాగుతావా?" అడిగింది.
"నాకేం వద్దు కానీ ఎంటి నేను విన్నది నిజమేనా?
"ఏం విన్నావు?" చిరునవ్వుతో చూసింది.
నేను చెప్పలేక, చెప్పలేక చెప్పాను. "నువ్వు సిద్దూ...."
సోఫాలో వెనక్కి వాలి "నిజమే విడిపోయాం.." అంది.
"ఎందుకిలా?" బాధగా అడిగాను.
"నుదుటి రాత అననా? నా ఖర్మ అననా? లేక నా అదృష్టం అననా?"
"ఏమైంది మీ మధ్య ఇంత తీవ్రంగా గొడవలు ఎందుకయ్యాయి? ఎలా అయ్యాయి."
"గొడవలా ? నో, నో నేనసలు అతనితో గొడవే పడలేదు."
"మరి....విడాకులు..."
"అతనిస్వభావం, పద్దతులు, అతనిలో పర్వతంలా పేరుకుపోయిన స్వార్ధం, ఇంకా చాలా ఉన్నాయిలే తరవాత మాట్లాడుకుందాం సావకాశంగా... నువ్వేదో శుభవార్త తో వస్తే, ఈ గొడవెందుకు?" అంటూ లేచి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి అరేంజ్ జ్యూస్ రెండు గాజు గ్లాసుల్లో పోసి తీసుకొచ్చింది.
"ఏంటో చాలా బాధగా ఉంది నవ్యా " అన్నాను జ్యూస్ సిప్ చేస్తూ.
"నాకు మాత్రం చాలా శాంతిగా , సుఖంగా ఉంది" అంది జ్యూస్ తాగుతూ.
కొన్ని క్షణాలు మామధ్య నిశ్శబ్దం నిట్టూర్చింది.
"ప్రేమికులుగా ఉన్నప్పుడు ఎదుటి వారిలో మైనస పాయింట్స్ కూడా ప్లస్ గా కనిపిస్తాయి. వాళ్ళలా కనిపించేలా ప్రవర్తిస్తారనుకుంటా.... కానీ, దగ్గర కొచ్చాక అసలు రూపం బైట పడుతుంది. అవి భరించే శక్తి మనలాంటి వాళ్ళ కుండదు. మనం ఇండివిడ్యూవాలిటీ కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళం కదా..." నవ్వి గ్లాసు టీపాయ్ మీద పెట్టింది.
"అవునూ ఇంతకీ విశాల్ ఏం చేస్తున్నాడు?"
"ఈమధ్యే ప్రైవేట్ కంపెనీలో చేరాడు."
"నువ్వు...?"
"నీకు తెలియదా నేను మూడు నెలలైంది డిగ్రీ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ గా చేస్తున్నాను.
"ఇంజనీరింగ్ చేసి లెక్చరర్ బాబా?"కొంచెం వెయిట్ చేస్తే మంచి జాబ్ వస్తుందిగా."
నేను మాట్లాడలేదు. లెక్చరర్ జాబ్ ఎంచుకోవడంలో విశాల్ ఇష్టానికే ప్రాధాన్యత నిచ్చానన్న సంగతి చెబితే నవ్య ఈ పెళ్ళే ఒద్దంటుంది. నేను ఉద్యోగం పేరుతొ బైట ఎక్కువసేపు గడపడం అతనికిష్టం లేదు. లెక్చరర్ గా అయితే యింట్లో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందనే తనే ఎవరితోనో చెప్పించి నాకీ జాబ్ ఇప్పించాడు. విశాల్ చెప్పింది సబబే అనిపించి నేనూ ఒప్పుకున్నాను. కానీ నవ్య కి ఇలా చెబితే నీకసలు వ్యక్తిత్వం ఉందా? అంటూ ఉపన్యాసం ఇస్తుంది. పెద్ద ఫెమినిస్టసలే. అందుకే మాట మారుస్తూ అన్నాను.... 'పెళ్ళి కోసం జాబ్ చేస్తున్నా.... తర్వాత తీరుబడిగా మంచి జాబ్ వెతుక్కుంటా...."
"పెళ్ళి కేందుకింత తొందరపడుతున్నావు?"
"తొందరా?' నవ్య కళ్ళల్లోకి చూశాను. అలా నన్నడగడంలో నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావా?" అన్న భావన కనిపిస్తుందేమో అని వెతుకుతున్న దానిలా.
నవ్య చాలా క్యాజువల్ గా ఉంది. నా ఆలోచనలు గమనింఛినదానిలా అంది... "ఇంకా ఉద్యోగాల్లో స్థిరపడలేదు కదా అని అంటున్నాను."
"నిజమే.... ఆ విషయం నాకూ తెలుసు, అటు విశాల్ గానీ, ఇటు నేను కానీ ఇంకా పూర్తిగా సెటిల్ అవలేదు. కానీ, సెటిల్ మెంట్ కోసం వెయిట్ చేస్తే జీవితం లో చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఐనా ఇంత త్వరగా ఎలా సెటిల్ అవుతాం? గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదా! మనవి ప్రైవేట్ ఉద్యోగాలు.... ఈ ఉద్యోగం నచ్చకపోతే మరో ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళడమే....దాని కోసం జీవన మాధుర్యం కోల్పోలెం కదా...'
నవ్య నవ్వింది. నాకెందుకో ఆ నవ్వులో ఎగతాళి కనిపించింది. కానీ నన్ను ఎగతాళి చేసేంత కుసంస్కారి కాదు నవ్య. బహుశా నేనే అలా ఊహిస్తున్నా నెమో.
"ఎనీవే కంగ్రాట్స్ .... రిసెప్షన్ కి తప్పకుండా వస్తాను."అంది చేయి అందుకుంటూ.
"థాంక్స్ ...రావాలి.... రాకపోతే ఊరుకోను. కదా" అన్నాను నేను చేయి నొక్కి విడిచి బై చెబుతూ.
