" ఏమిట్రా మధూ! ఎందుకొచ్చావ్?"
" అబ్బ! ఈ వెధవ పనులన్నీ నాచేత చేయిస్తావు, నువ్వు హాయిగా ఉంటావు. ఆ సీనుగాడి బొంద త్రవ్వుతారట కద."
"అవును. ఇప్పుడే తెలిసింది. త్పవ్వనీ, కోర్టుకు వచ్చి నప్పటిమాట కదా, నేను లాయరు దగ్గరకు వెళ్తున్నాను."
"అది కాదు నాన్నా! ఆ వెధవకు ఎంత బలం అనుకున్నారు.చాలా పెనుగులాడాడు. నా పేరున్న ఉంగరం వాడి చేతిలో చిక్కుకుపోయింది."
"వెంటనే తీసుకోకపోయావా!"
"సరే...అక్కడ బొంద త్రవ్వటం ఏమిటో నేను చూస్తాను.నువ్వు వెళ్ళిపో. లాయర్ తో మాట్లాడిన తరువాత పోలీసులకు చిక్కాలి."
"అలాగే... జీపుండనీ, బస్టాండులో జావా పెట్టి వచ్చాను."
"నిన్ను బస్ స్టాండులో వదిలేసి వస్తాను పద."అన్నాడు.
"యెవరన్నా చూస్తే"
" అందరూ గుడికే వెళ్తున్నారు"
అతనింట్లోకి వెళ్ళాడు. భార్యతో ఏం చెప్పాడో తెలియదు.పదినిమిషాల తరువాత కొడుకులను ముద్దుపెట్టుకుని మధు మూర్తి వెళ్ళి పోయాడు.
శ్వేత చాలా సేపు అక్కడే కూర్చుండిపోయింది.
13
ఆలయ ప్రాంగణంలో ఎన్నడు, కనీవినీ ఎరగనంత జనం ఉన్నారు పోలిసులకు వారిని కంట్రోల్ చెయ్యటం కష్టం.అయిపోయింది బొంద త్రవ్వుతున్న కూలీ పేరు వెంకడు. అతను దాదాపు కాటికాపరి లాంటి వాడు.
యెవరు చనిపోయినా గోతులు త్రవ్వుతాడు.
యెవరు అడిగినా చితి పేరుస్తాడు.
అతను త్రవ్వటం ఆపి చమట తుడుచుకున్నాడు.
"అయ్యా!" అతని కొడుకు వచ్చాడు.
"ఏమిట్రా-"
కొడుకు గుస,గుస చెప్పగానే అతను తల పంకించాడు.
"అయ్యా!అవసరానికి వెళ్ళిస్తాను..." అని బయటికి వెళ్ళాడు. పోలీసులు అనుసరించే లోపలే వెళ్ళిపోయాడు.
వాళ్ళు కంగారుగా వెతుకుతుండగా పది నిమిషాలకు వచ్చాడు.
"అయ్యా ! తమరు లక్ష రూపాయసలిచ్చినా నేను త్రివ్వను...." అన్నాడు.
" అదేమిటి?"
" అదంతే చచ్చినోల్లకు బొంద తవ్వితే మోచ్చం. బొందపెట్టి నోళ్ళను తీస్తే మా పాపం...."అన్నాడు . పైకి ఎగకట్టిన ధోవతి క్రిందకు దించుతూ . పోలీసు బలగం ఆశ్చర్యపోయారు.
"ఇదిగో !"మేమంత ఉన్నాం..."
"మీరంతా తియ్యండీ"అన్నాడు నిర్లక్ష్యంగా.
"యెవరు చేసే పనులు వారు చెయ్యాలి. నువ్వు పోలీసు ఉద్యోగం చేయగలవా!"
"ఇగో గీ మాటలన్నీ నాకు చెప్పకండి బొందలు త్రవ్వితే రక్తం కక్కుకుని సచ్చి పోతమని తెల్సు లేవమ్మా! మా పానాలు పుణ్యానికి వచ్చిన నయనుకుంటున్నావ్" అన్నాడు వెంకడు.
" అవును... బీజీజాన్ బొంద తవ్విన సాహెబ్ చచ్చిపోలేదూ"
" మా పోలీసులు సాయం చేస్తారు. ఆకాస్త కానిచ్చెయ్యి."అన్నాడు డి.ఎస్.పి.
"మా ఇంటాయనను చంపుతున్నారు దేవుడో-"అంటూ వెంకడి భార్య శోకాలు తీసింది.
