"నువ్వో పని చేయాలి."
"చెప్పండి"అన్నది ఆనందంగా.
"ఏం లేదు. ఈ పిల్లలిద్దరూ చదువుతుంటారు. నువ్వు కాస్త శ్రద్ధగా పాఠాలు చెప్పాలి"అన్నది.
" అంతకంటేనా!"
"థాంక్స్"అన్నది.
"బబ్లూ రంగమ్మను పిలుపు.అన్నది.
"ఏమ్మా ఛాయ్ తీసుకురానా!" రంగమ్మ వచ్చింది. ఆమెను చూస్తే అస్థిపంజరానికి తొడుగు తొడిగారేమో అనిపిస్తుంది.
"ఈ యమ్మకు క్రింద డ్రయివరు కటిన గది చూపించు..."అన్నది.
"ఏదో చూచి వద్దామని..."
"ఊ... తగలడు..." అన్నది.
"మమ్మీ ... మమ్మీ! మేం వెళతాం"
"నోరు ముయ్యండి" గట్టిగా అరిచింది.
పిల్లలిద్దరూ నోరు మూసుకున్నారు.
శ్వేతకు సులక్షణ ఓ పజిల్ లా తయారయింది. ఆమెకు భర్తవిషయము నిజంగా తెలియదా! తెలిసిననా నటిస్తుందా!
ఆమె ఆలోచిస్తూ తన గదికి వచ్చింది. తలుపులో చిన్న చీటీవుంది. అది చూచి మెల్లగా ఆమె గుడివైపు వెళ్ళింది.అక్కడ సిద్దార్థ వున్నాడు. అతనితో నల్గురయిదుగురు యువకులు మాట్లాడుతున్నారు .వాళ్ళు వెళ్ళి పోయేవరకూ దూరంగా నిలబడింది.
వాళ్లు వెళ్ళగానే సిద్దార్థ ముందుకు వచ్చాడు.,
" వచ్చాడా!"
"రాలేదు . నా కొక్క విషయం చెప్పండి సిద్దార్థగారూ! మీ వదిన అమాయకురాలా,అతి తెలివిమంతురాలా!"
"రెండు కాదు, మూర్ఖురాలు."
" భర్తపేరు వూరు, వాడలా మారు మ్రోగుతోంది. తనకు తెలియనట్టు వుందేం?"
"అదో తరహా!"
" తెలియకపోవచ్చు. తెలుసుకోవాలన్న కుతూహలములేదు."
" అయికాంట్ బిలీవ్."
"నమ్మి తీరాలి. నువ్వు మఠం రావద్దుగాని ఇంట్లోనే వుండు"అన్నాడు.
"రాధికకు యెలా ఉంది!"
"బాగానే ఉంది కాని బలహీనంగా ఉంది."
"ఈ విషయం చెప్పనక్కరలేదు కదా! పాపం ఆపార్వతమ్మ. ఏడ్పు చూడలేకపోతున్నాను."
" ఏం చేస్తాం .మన దురదృష్టం"
ఇద్దరు చెరోవైపు వెళ్ళిపోయారు.
శ్వేత ఇంటిముందు జీపు చూచి ఉలికిపడింది. వచ్చింది పురుషోత్తమరావు.
ఆమెకు మఠం వెళ్ళి చూడాలని చాలా కుతుహలంగా ఉన్నది. కాని వెళ్ళలేదు. దాదాపు ఊరు ఊరంతా శివుని గుడిదగ్గర చేరారు. పురుషోత్తమరావు , సులక్షణం, పిల్లలు, శ్వేతఉన్నారు.
అదొక గమత్తయిన సంఘటనగా భావించారు అంతా.
మిట్ట మధ్యాహ్నమప్పుడు మెల్లగా చుట్టూ చూస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు మధుమూర్తి.
శ్వేత కేం తోటనట్టు నిలబడిపోయింది. పోలీసుల కెలాతెలుస్తుంది.
అతని వెనుకే మెల్లగా ఇంట్లోకి వెళ్ళింది.
"బేబీ!వెళ్ళి తాతయ్యను పిలుచుకురా."అన్నాడు.
బయటి గది పిల్లల చదువుకోసం కేటాయించారు. ఏమయితే ఆయిందని గదిలోకూర్చుంది శ్వేత.
బేబితో పురుషోత్తమరావు హడావుడిగా వచ్చాడు.
