"నేను ఇప్పుడే వెళ్ళి వాడిని ఆ మధుమూర్తి గాడిని పట్టుకుని ఉరికంబం ఎక్కించాలి."అన్నాడు.
"ఉరికంబం ఎక్కిస్తే శ్రీనివాస్ బ్రతుకుతాడా!రాధిక పిచ్చి నయం ఉవుతుందా!" అన్నదామె అవేదనగా.
"ఉన్నవారికి బుద్ధివస్తుంది."అన్నాడు కోపంగా.
" వద్దు నాయనా! మీలో మీకు తగువులు వద్దు." అన్నది.
" ఈ ధర్మ సూత్రాలే యువతను నిర్వీర్యుల్ని చేస్తున్నాయి. ఆనాడు నాన్నగారికి చెప్పలేకపోయావా!"
"నా మాట వింటే చెప్పేదాన్ని.
"మీ సలహాలన్నీ వినే వారికన్న మాట...." అన్నాడు కోపంగా ఆమెను దులలేపరించుకునివెళ్ళిపోతూ, ఆమె అసహాయంగా చూడటం తప్ప ఏం చేయలేక పోయింది.
12
సులక్షణం పుస్తకం చదువుతూ కూర్చుంది. పిల్లలిద్దరూ తల్లి ప్రక్కన చేరి కబుర్లు చెబుతున్నారు.
" పొండి అవతలకి-" కసురుకుంది ఆమె.
" మమ్మీ.... మమ్మీ ఈ స్టోరీ చెప్పవూ!"
" మీ స్టోరీలు మీరు. అవతలకి వెళ్ళండి." అని కుసురుకుంది.
"మే అయి కమిన్ మేడమ్-"
ఆ గొంతు విని ఆమె తలయెత్తింది. స్ర్రీఅయిన తనకే ఆశ్చర్యం కల్గించే అందంతో నిలబడిందో స్ర్రీ . మామూలు గళ్ళచీర కట్టుకుంది. అందమైన నొక్కులజుట్టు , తీర్చిదిద్దిన కనుముక్కు, అందం కంటే ఆకర్షణ ఉందా కళ్ళల్లో.
" ఎస్. యెవరు?" అన్నది సులక్షణ.
"నేను కూర్చవచ్చా.?"
తను లేచి కూర్చో అన్నట్టు చూచింది.
"నా పేరు శ్వేత అంటారు. ఈ ఊరు టీచర్ గా వచ్చాను. కరీమ్ అని ఒక ముస్లిమ్ ఇంట్లో ఉన్నాను. అక్కడ అంతగా బావుండ్లా!" అన్నది కూర్చుని.
"అయితే నన్నేం చేయమంటావు?"
"అక్కడ,ఇక్కడ అద్దెకు ఇళ్ళు అడిగానండి. అందరూ మీ పేరు చెప్పారు ఇక్కడయితే క్షేమంగా ఉంటానని-"అన్నది.
"మాది పెద్ద బంగళా! అద్దెకిచ్చే రూములు లేవు." అన్నది అతిశయంగా.
"మీది పెద్ద బంగళా. పెద్ద మనసు అని విన్నాను. నాకేదన్నా ఆశ్రయం మీరే చూపాలి."
సులక్షణ హృదయం పొంగిపోయింది.
"అందరూ మీపేరు చెప్పారు. మీరేం అనుకోనంటే ఇంకో విషయం ప్రస్తావిస్తాంచాలి."
"చెప్పండి."
"మీ భర్త మధుమూర్తి గారు తరచూ వస్తుంటారు.ఆబెడద ఎలా వుదిలించుకోవాలో తెలియలేదు."అన్నది.
సులక్షణం ముఖం ఎఱ్ఱబడింది.
"మీరు ఆవేశం తెచ్చుకోవద్దు." భయం నటించింది శ్వేత.
" ఆవేశం కాదు. ఆ సన్యాసులను చంపేయాలి."అన్నదామె.
"మగవాడెప్పుడూ ఆడదాని ఆసహాయతను ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నాడు. మీరు బాధపడి ప్రయోజనం లేదు."
" షటప్! అయివిల్ హిమ్ లెస్పన్-" అన్నది కోపంగా.
"మనం ఏం చేయలేమండి-"
"నోరు ముయ్యి! నీలాంటిదంటే ఏం చెయ్యలేదేమో, నాకేం తక్కువ! బోలెడుకట్నంతో వచ్చాను-"అన్నా, మనసులో మండిపోతోంది. భర్త స్ర్ర్ర్రీలోలత్వం ఎరగంది కాదు కాని, ఈ రోజు మరొకరి నోట వింటుంటే చాలా భాధగా అనిపించింది.
" నువ్విక్కడే వుండు."
" థాంక్యూ మేడమ్ థాంక్యూ." అన్నది ఆనందంగా.
"క్రింది గరాజు ప్రక్కన ఓ రూమ్ వుంది. డ్ర్రైవర్ కనికట్టించాము."
"మాకు అంతకంటే మంచి ఇళ్ళు ఎలా దొరుకుతాయండి.అలాగే వచ్చి వుంటాను"అన్నది సంతోషంగా.
