Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 49


    మగవాళ్ళు చర్చించుకున్నారు.

     " ఆ సీనుగాడు పెద్ద. పెద్ద చదువుకున్నోళ్ళు చేసినట్టు లెక్కలు చేసేవాడు" అని ఒకతను అన్నాడు.
   
     "మా పిల్లలకు ఉత్తరం రాసిపెట్టరా అంటే  నిమిషంలో రాసేవాడు అలాంటి వాడు వీళ్ళ జోలికి యెలా వెళ్ళిండో పాపం!"

    "ఏం పాడో....."

     ఒక్కరయినా... ఒక్కరు శ్రీనివాస్ చెడ్డవారని, ధూర్తుడని చెబితే బావుండును అందరూ పొగిడే వారే ,అందరూ మెచ్చుకునే వారే.

    సిద్దార్థ విచారంగా హైద్రాబాద్ వెళ్ళే బస్ వైపు నడిచాడు. దారిలో శ్రీనివాస్ ఇల్లు. శోకాలు వినిరపిస్తున్నాయి.అప్పుడే  కొడుకు చనిపోయినట్టు ఏడుస్తోందామె.
   
    అది వినలేకపోయాడు.
   
     అతను వచ్చి బస్ లో కూర్చున్నాడు. రాధిక గదిలో దొరికిన ఉత్తరాలు కనిపించాయి , జేబులో

    ఇందాక శ్వేత కూడా వచ్చింది.
   
     యెంత ఆశగా,ఆవేశంగా , జీవించాలన్న తపనతో వ్రాసాడు శ్రీనివాస్! మొలకెత్తే అతని ఆశయాలను, చిగురించే అతని ఆశలను ఆదిలోనే సమాధి చేసారు.   

    అందరం సమానం అనే నినాదం ఎందుకో అర్థంకాలేదు.
   
     చిన్న నీలి కాగితం తీసాడు

    " ఏయ్ అల్ల రిపిల్లా!

     నాకు ఆ సినిమా యాక్టరే కు పోలిక తెస్తావా! ఈ సారి వంటరిగా దొరకవా!అప్పుడు చెబుతాను నీ పని. నీకు పదిలో ఏడున్నర మార్కు లొచ్చాయన్నావు. గుడ్, మళ్ళీ  పరీక్షలో ఎనిమిది రావాలి.

     నువ్వు బి.ఏ. కాగానే ఐ.ఏ.ఎస్ కు చదవాలి. పురుషుడికి స్ర్రీఏ విషయంలో తీసిపోదని నిరూపించాలి భార్యంటే బానిసకాదు. భాగస్వామిని, మిత్రురాలు అర్థం అయిందా! మీ పాదదాసి'...ఛీ....ఛీ....ఎంత నీచమైన  ప్రయోగం.... మళ్ళీ ఈసారి విన్నానంటే ఉత్తరం చెత్తబుట్టలో వేస్తాను.... ఇక ఉండనా.... నా తీపి ముద్దులు బుగ్గమీద కాదు.... అందంగా వెలిగిపోయే  నుదుటిపై- ఆ కాటుక అంతగా దిద్దుకోకపోతేనేం- నువ్వు అలా దిద్దుకోక పోయిన అందంగా ఉంటావు. నీకళ్ళే పెద్దవి-"

    ఎంతటి ఉదాత్తమైన భావన!

     చవకబారుతనం లేదు.

     చపలత్వం అతకన్నాలేదు.

     నిజంగా రాధిక అభిరుచిని మెచ్చుకోవచ్చుగాని, ఏం లాభం.అంతా వృధా అయింది.   

     ఆశగా ఎదురు వచ్చే చెల్లెలికి ఏం చెబుతాడు!

     అతను వెళ్ళేసరికి రాధికను షాక్ ఇవ్వటానికి తీసుకెళ్ళారని తీసుకెళ్ళారని తెలిసింది. అతను నర్స్ ను అడిగాడు.

     "మా అన్నగాని , మా నాన్న గారుగాని వచ్చారా?"

    "ఏదియెవరూ రాలేదు-" అంటుండగానే ఆవరణలో జీపుఆగింది.   

     జీపు నడుపుతున్న మధుమూర్తి సిద్దార్థను చూచి ఉలిక్కి పడ్డాడు. అతను జీపును వెనక్కు తిప్పాడు. సిద్దార్థ బయటికి  వచ్చేసరికి జీపు కంటికి కనిపించకుండా పోయింది.   

     రాధికను తెచ్చ పడుకోబెట్టారు.

     యశోదమ్మ ఏడుస్తూ కూర్చుంది.

     "ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం!శ్రీనివాస్ ను చంపేటప్పుడే వద్దన వలసింది!"అన్నాడు.
   
    " శ్రీనివాస్ ను చంపేసారా!"ఆమె ఆశ్చర్యపోయింది.

      వీరప్ప చెప్పిందంతా చెప్పాడు.

     ఆమె కూడా ఏడ్చింది.   

     "నాకు ఏ విషయమయినా చెప్పారా! నన్ను ఒక నౌకరులాగే చూచారాయె."

    " వాళ్ళు చూడటం ఏమిటమ్మా! మీ ఆడవారు-"లేచాడు.

    " ఎక్కడికిరా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS