Previous Page Next Page 
అరుణోదయం పేజి 5


    "అరుంధతీ!" పిచ్చిగా అరిచాడు. "అది అసంభవం అరుంధతీ!... అసంభవం!.. నీవు నా దానివి... నిన్ను కాదని నేను ఎవర్నీ వివాహం చేసుకోలేను.... చేసుకోను గూడా!"
    రాజశేఖరం మనస్సంతా కలుషితమయిపోయింది!

                                                        *    *    *

    రాజశేఖరం గోడ వైపుకు తిరిగి కళ్ళు మూసుకు పడుకున్నాడు.
    అరుంధతికి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏవున్నది.
    తన సౌఖ్యాన్ని వదులుకొని మరొకరి ఆనందానికి తాపత్రయ పడాల్సిన అవసరం ఆమె కెందుకు కలిగింది?
    ఉఁహూఁ.... పిచ్చిపిచ్చి ఆలోచనలతో, ఆశయాలతో తన జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటోంది!
    ఆమెకు ప్రాపంచిక నైజాన్ని విపులీ కరించాలి...
    ఎవరో తలుపు కొట్టారు.
    అరుణ వచ్చి తలుపు తీసింది.    
    రాజశేఖరం తలెత్తి చూచాడు.
    "ఎక్స్ ప్రెస్ డెలివరీ ఉత్తరం- అరుంధతికి!"
    అరుణ సంతకం చేసి తీసుకొని వెనగ్గా వచ్చి నిలబడ్డ అరుంధతికి ఇచ్చింది.
    ఆత్రంగా అరుంధతి కవరు చించి చదివింది.
    ఆమె ముఖంలో కొద్ధిగా కలవరపాటు చూసిన ఇద్దరూ విషయం తెలుసుకోవాలని ఆతృత జెందారు!
    "మా అత్తగారికి చాలా సీరియస్ గా వున్నదట... బావగారు వ్రాశారు- ఒకసారి వెంటనే వచ్చి చూసి వెళ్ళమని!"    "అరె! పాపం!" రాజశేఖరం జాలి చెందాడు. "ఎంత వయస్సు!"
    "అరవై దాటి వుండవచ్చు!"
    సాయంత్రం గోపన్న గుర్రపు బండిలో ఎక్కి చిన్న సూట్కేసుతో వెళ్ళిపోయింది అరుంధతి.
    అలా వెళ్ళబోయేముందుగా- అరుణ అక్కడలేకుండా చూసి-రాజశేఖరం దగ్గరగా వచ్చి, "నేను వీలయినంత తొందర లోనే వస్తాను బావా.. నీకు కావాల్సినవన్నీ ఏలవమూ రాకుండా అరుణ చూస్తుంది. అంతేకాదు... నా కంటే గూడా చురకుగా నీ కోరిక చాలిక మీరుండగానే నెరవేర్చగల శక్తి ఆమెకున్నది!" చిన్నగా నవ్వింది.
    రాజశేఖరం మాట్లాడలేదు. చిరాగ్గా ఆమె మొఖంలోకి చూచాడు.
    "ఒకవిధంగా నా ఈ ప్రయాణం భగవంతుడు కల్పించిన సంఘటననేనేమో అనిపిస్తోంది...అరుణతో ఒంటరిగా గడిపిన ఈ కొద్దిరోజుల్లో నీవు ఆమెను బాగా అర్ధం చేసుకోగలుగుతావ్!"        
    "అర్ధం చేసుకున్నా చేసుకోకపోయినా నీ ఊహలన్నీ వమ్ములయ్యే మాట మాత్రం నిజం!" హేళనగా నవ్వాడు.    
    అరుంధతి మొఖం పక్కకు తిప్పుకున్నది.

                                                    *    *    *
    
    ఇక్కడ మనం ఆలోచంచదగ్గ విషయాలుకొన్ని వున్నాయి.
    ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఎవరూ అంటే 'వీరూ' అని ఎవ్వరూ చెప్పలేకపోవచ్చు. అటు, రాజశేఖరం తొందరపడ్డాడా అంటే సమాధానమూ గట్టిగా 'అవున'నీ చెప్పలేం. ఎందుకంటే అతడు అరుంధతి గృహంలో ఆ ఉద్దేశ్యంతో కాలుపెట్టనే లేదు. అదీకాక- జరిగిన సంగతి గుర్తించి విచారించాడు. ఎంతో బాధపడ్డాడు. అతడు కల్లో గూడా అరుంధతికి అలా జరగాలని ఊహించనూ లేదు- కోరనూలేదు!

 

                 
    దాన్తో -అంతకుముందు ఆమె మీద తనను తిరస్కరించిందనే నెపంతో పేరుకు పోయిన కాస్తోకూస్తో కోపం గూడా-హరించుకుపోయింది. దాని స్థానే జాలి గూడా గూడుకట్టుకున్నది!
    అందుకనే ఆమె మాటల్లో దొర్లిన కొన్ని భావాలతో అతడి భావిజీవితానికి తిరిగి పునాదులు కట్టుకున్నాడు. తను పోగొట్టుకున్న సర్వది భాగ్యాలు తిరిగి పొందబోతున్నట్లుగా భ్రమించాడు- అంతే కాదు- దానివలన కూలిపోతున్న ఆమె జీవన సౌధాన్ని గూడా నిలబెట్టగలుగుతున్నాననే తృప్తి గూడా అతనిని ఆవరించుక పోయింది!- అందువలన అతడు ఎవరూ మార్చలేనంత దృఢమైన అభిప్రాయానికి వచ్చేశాడు!
    అయితే-
    ఈ పర్యవసానానికి అరుంధతే హేతువా అంటే-
    అదీ చెప్పటం కష్టమే!
    ఆమె ఎంత ధనవంతురాలయినా, ఒకప్పుడు స్వేచ్చలో మునిగి, అధికారాన్ని చేజిక్కించుకొని, తల్లిదండ్రులను వ్యతిరేకించి, రాజశేఖరాన్ని కాదన్నా- సంఘాన్ని, సంఘ ఆచారాల్ని ఎదిరించాలన్నంత వూహ ఆమెకు లేదు. తన భర్త పోయాడు కాబట్టి జీవితాంతం విధవగా గడపాలనేదే ఆమెలో పాతుకుపోయిన విశ్వాసం! ఆమె మనస్సు ఇంకా- పురాతనమైనా - దురాచారమైనా సరే- ఆ ఆచారాలకే కట్టుబడి వున్నది. ఇంతవరకు అలాంటి విప్లవాత్మకమైన భావాలను ఆమె పరిసరాల్లోకి ఎవ్వరూ తీసుకురాలేదు. రాజశేఖరం-అతను అనుకోకుండానే- ఆమెలో అలాంటి భావాలు రేకెత్తించేసరికి ఆమెనే పరిస్థితులు ఆలోచనలు, సంఘటనలు తమ అదుపాజ్ఞల లోకితీసుకున్నయి, దాన్తో-రాజశేఖరం చేసిన ప్రతిపాదనలను సమూలంగా తిరస్కరించింది!
    అయితే- ఆమె రాజశేఖరం రాగానే, 'అరుణను నీవు చేసుకోవాలి!' అని విపులంగా అతడికి ఎందుకు చెప్పలేదు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.
    -ఆమె ప్రవృత్తి విప్లవాత్మకమైనది కాదని ఇప్పుడే అనుకున్నాం. ఆలాంటప్పుడు, వివాహం కాని అతగాడు-తను విధవ గనుక తన ప్రసక్తే లేదు- అరుణను వివాహం చేసుకోవటానికి అంగీకరించడా- అని అనుకున్నది. ఇన్నాళ్ళ నుండి అతడికి వివాహం కాకపోవటానికి అతడి కుంటికాలు గూడా ఒక కారణం అయివుండవచ్చు! అలాంటి పేచీలేవీ లేకుండా-అరుణ అందవిహీనగాని అరుణ- వివాహం చేసుకుంటున్నప్పుడు, కాస్త ఎగిరి గంతేస్తాడేమోనని గూడా ఆమె అపోహపడి వుండవచ్చు- అది నైజం గూడా!
    కానీ అలా జరగలేదు.
    ఆమె ఆలోచనలన్నీ తల్లక్రిందులయి నయి.
    ఇక అరుణ సంగతి గూడా చూద్దాం-
    అరుణ రాజశేఖరాన్ని వివాహం చేసుకోవటానికి ఎందుకు అంగీకరించింది? కుంటి వాడివి ఎందుకు ఎలాంటి అభ్యంతరమూ లేకుండా ఒప్పుకున్నది? -ఇవి ఆమెకు, సంబంధించినంత వరకు ప్రశ్నలు!    
    ఒకటి చెప్పుకోవచ్చు దానికి కారణం-తనకు ఎవ్వరూ లేనప్పుడు, తను చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు అరుంధతి రక్షించింది-ఇంత తిండి పెట్టి బట్ట యిచ్చింది- అటువంటి ఆమె కోరికను తిరస్కరించటానికి మనస్కరించక అంగీకరించీ వుండవచ్చు!
    లేదా- రాజశేఖరం 'కుంటి తనం మీద జాలితోనైనా అంగీకరించి వుండ వచ్చు!
    ఏది ఏమైనా- అన్నిటి కంటే విచిత్రమైన ప్రశ్న మరోటి వున్నది..
    రాజశేఖరం అనుమానించినట్లుగానే-ఒకనాడు ఏహ్యతతో కసిరిగొట్టిన తనను తిరిగి అరుంధతి తన గృహానికి సాదరంగా ఎందుకు ఆహ్వానించింది? ఎందుకు జాలి చెందింది? ఎందుకు ఇష్టం ఏర్పరుచుకున్నది?- కానీ, దీనికి సమాధానం ఇంత వరకూ ఎక్కడా దొరకలేదు.. ఇకముందు ముందుగాని తెలుసుకో లేకపోవచ్చు..
    అరుణ- వీళ్ళిద్దరి నడుమ పడి గిలగిలలాడి నలిగిపోతుందా అంటే ఏమో అదీ చెప్పటం కష్టమే!..
    సాయంత్రాన్ని మ్రింగేసిన చీకటి రాజశేఖరం మనస్సును క్రమ్మివేసింది చుక్కలు కిటికీలో నుండి చొచ్చుకువచ్చి రాజశేఖరం గుండెల్లో పొడుచుకుంటున్నయి.
    అరుణ అతడు పడుకున్న గదిలో కాలు పెట్టి తలెత్తకుండానే, "ఎనిమిది గంట లయింది!" అన్నది.
    రాజశేఖరం తలెత్తాడు.
    "వడ్డించమంటారా?"
    "నీ యిష్టం!"    
    "నా యిష్టానికి కాదు... వడ్డించమంటే వడ్డిస్తాను!"
    చిరాగ్గా అరుణ మొఖంలోకి చూచాడు.
    "అరుంధతి నన్నెన్నడూ ఇలా అడగలేదు.... నేనెప్పుడు ఏం చేస్తానో ఆమెకు బాగా తెలుసు!" అంటున్నట్లుగా విసుక్కున్నాడు.
    అరుణ గిరుక్కున వెనుతిరిగి లోపలకు వెళ్ళిపోయింది.
    ఎందుకనో అరుణ ఎదురుగా నిల్చొని వుంటే, అతడి మనస్సు కలుషితమైపోతుంది.
    అరుణ ఆ గృహంలో వుండి తనకు అరుంధతికి నడుమ అంతులేని అగాధాన్ని ఏర్పరుస్తున్నదనిపిస్తోంది రాజశేఖరానికి.
    అరుణ మళ్ళీ వచ్చింది.
    "వడ్డించాను!"
    రాజశేఖరం చిన్నగా లేచాడు. వంటింట్లోకి నడిచాడు.
    కంచం ముందు కూర్చుంటూ- "పక్కాకావాల్సినవన్నీ అక్కడవుంచి వెళ్ళు..వడ్డించుకు తింటాను!" అన్నాడు.
    ఒక్కక్షణమాగి, "అక్కయ్య అలా వేసే దేనే" ఏదో రోషంతో అన్నట్లుగా అన్నది అరుణ.
    "అక్కయ్య అయితే ఎన్నా చేయగలి గేది.. నీవు చేస్తావా అవి అన్నీ...అంతేగాదు. అక్కయ్యకున్న మనస్సు నీకు వున్నది చెప్పి.... ఇదుగో అరుణా!.. నీవు నాతో అనవసరంగా ఏ విషయంలోనూ వాగ్వివాదానికి దిగవద్దు.. నేను చెప్పినట్లల్లా చేయటమే నీవు చేయవల్సిన పని!"    
    మరుక్షణంలో అరుణ అక్కడలేదు!
    తరువాత పదిహేను నిముషాలకు అన్నం తిన్నాననిపించుకొని బయటకు వచ్చాడు.
    మధ్యగది దాటుతూ, గోడ వైపు తిరిగి ఏడుస్తూ నిలబడి వున్న అరుణను చూసి ఒక్కక్షణం జాలి చెందాడు. తను అనవసరంగా ఆ అమ్మాయి బరిస్తున్నాడేమో.
    "లేదు!" అని ఎక్కడి నుండో సమాధానం వచ్చినట్లనిపించింది.
    నడుస్తున్న వాడల్లా ఆగి, "నీ ఇంట్లో వుండటం నీ కిష్టం లేదా" అడిగాడు కర్కశంగా.
    ఆమె ఏడుపు ఆపకుండానే," నేలపు డెలా అన్నాడు ఆమాట... నేను చచ్చినంత నట్టు.... ఇంకెప్పుడూ అలా అనబడకండి! మీ కిష్టంలేకపోతే చెప్పండి. ఏ భావిలో నైనా దూకి చస్తాను!"
    అతడి కోపం తారాస్థాయి నందుకున్నది.
    "నా బాధతో అంత దుర్మార్గుని? తలపడ్డావని అందరూ అనుకోవాలనేనా నీ ఉద్దేశ్యం... చెప్పు! నేను నిన్ను అంతగా...నీవు ఆత్మహత్య చేసుకోవాలన్నంతగా హింసిస్తున్నావా చెప్పు అరుణా చెప్పు!" మీది మీదికి వస్తూ అడిగాడు.
    అతడి ప్రవర్తనకు విశ్రాంతి పొందుతూ గుడ్లప్పగించి చూడసాగింది అరుణ.
    అరుంధతి వుండగా ఇద్దరూ ఎన్నడూ అంతగా మొఖామొఖి మాట్లాడుకోలేదు.
    ఆమె వెళ్ళిన ఈ ఒక్క పూటలోనే తన మధ్య ఇంత రభస జరగాలా!
    ఏవిటి కారణం.
    ఎందు కవుతున్నది ఇలా!
    తనచుట్టూ అక్కయ్య కడుతున్న హర్మ్యాలన్నీ ఈ ఒక్కపూటతోనే ఇలా పునాదులతో .....
    ఆమె కళ్ళు తిరగసాగినయ్..
    గబుక్కున కూలబడిపోయింది.
    రాజశేఖరం తడబడుతూ ముందుకు వచ్చాడు.
    చంకలోని కర్రను జారవిడుస్తూ కూర్చుని ముందుకు వంగాడు.
    అరుణ మొఖమంతా చెమటతో నిండి పోయింది. అత్యంత బాధతో శ్వాస విడుస్తున్నది. తల అటూ యిటూ వూగిస్తోంది.
    రాజశేఖరం వడివడిగా లేచి, కర్రను చేతి క్రిందకు లాక్కొని వంట యింట్లోకి వెళ్ళాడు. గ్లాసుతో నీళ్ళు తెచ్చి ఆమె ముకాన చల్లసాగాడు.
    తరువాత అయిదు నిముషాలకు కళ్ళు తెరిచి జాలిగా భయంగా అతడి ముఖంలోకి చూడసాగింది అరుణ.
    ఆ చూపుకు అతడి హృదయం ద్రవించింది.
    "అప్పుడప్పుడూ ఇలా వస్తుండేది" చాలా నెమ్మదిగా అడిగాడు.
    "ఊహఁ...." తల అటూయిటూ త్రిప్పింది.
    "మరుగున పడిపోయినాయ్"    
    "ఏమో ఏదో భయం వేసింది!" మా ఎక్కడి నుండి లోతైన భావిలో నుండి వచ్చినట్లున్నది. "ఎందువల్ల అయిందో తెలియదు!" తడబడింది.
    "లే!"
    ఆమె లేవటానికి ప్రయత్నించసాగింది.
    "పట్టుకుండేదా"
    "అక్కరలేదు!" తల అడ్డంగా తిప్పింది.
    ఎందుకో ఆమె ముఖం ఎర్రగా కందినట్లయింది. చిన్న మనిషివి ఒణుకు ఉపసాగింది. అడుగులో అడుగు వేసుకుంటూ పడక గదిలోకి నడిచింది.
    రాజశేఖరం అనుసరించాడు.
    "కాసేపు పడుకో!"
    అరుణ మంచం మీద పడుకున్నది.
    మొఖమంతా తడిసి ముద్దయి వున్నది.
    పక్కన వున్న తువ్వాల తీసుకొని చిన్నగా  అద్దసాగాడు.
    ఏదో చిన్నపిల్లకు సేవ చేస్తున్నట్లుగా-లాలిస్తున్నట్లుగా ఫీలవ్వసాగాడు.    
    ఆమె కళ్ళు అతడి పరిచర్యకు కృతజ్ఞత తో మెరిసినయ్. ఆశలేని నిరాశలు కావటం లేదన్నట్లుగా కాంతితోనూ, బలంతోనూ నింపుకున్నయి. ఆమె ముఖం సిగ్గుతో ముడుచుకుంది. మానసికంగా ఎంతో తేలికపడి స్వేచ్చగా ఊపిరి పిలవసాగింది.
    ఆమె కళ్ళల్లోకి చూస్తూ అలాగే వుండిపోయాడు రాజశేఖరం. ఆ నల్లటి కనుపాపలతో గులాబీలా మెరుస్తున్న ఆమె ఆ నవ్వు, ఆ వెలుగు-అతడిని కంపర పెట్టింది!
    మరుక్షణంలోనే అరుంధతి గుర్తుకు వచ్చింది.
    చటుక్కున వెనక్కు తిరిగి ఆ గదినుంచి బయటకు వచ్చేశాడు రాజశేఖరం.
    బయట నిలబడి, మొఖానపట్టిన చిరుచెమటను తుడుచుకుంటూ, శూన్యంలోకి చూస్తూ వుండిపోయాడు రాజశేఖరం!

                                     *    *    *

    "ఇంకా ట్యూషన్ కు వెళ్ళలేదేం."
    "వెళ్ళలేదు!"
    "అదే ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నాను... ఆరోగ్యం బాగాలేదా."
    "ఆరోగ్యంగానే వున్నది!"    
    "మరి?"
    "అక్కయ్య వచ్చిందా? ట్యూషన్ కు వెళ్ళదలుచుకోలేదు!"
    "ఎందుకని" ముందుకు వంగాడు కళ్ళు పెద్దవి చేసికొని.
    ఆమె ఒక్కక్షణమాగి, "మీ కేవైనా కావాల్సి వస్తుందేమోనని!" వోరగా చూస్తూ అన్నది.
    "మం" ఆసరా లేకుండా కొన్ని గంటలైనా గడవలేని అసమర్ధుడ ననుకుంటున్నావా నేను." మొఖాన మొగం పెట్టుకొని అన్నాడు.
    అతడి కంఠానికి ఆమె భీతిల్లింది.
    భయంతో కళ్ళు రెపరెప లాడిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS