"నిజం-కొట్టినా, తిట్టినా నాకు తెలిసింది చెప్పాను-"అన్నాడు.
బయట బెంచిమీద కూర్చున్న సిద్దార్థ ముఖం మలినమయింది.
అతనికి ఒక్కసారి తన పుట్టుక, తన కుటంబం అంటే విరక్తి కలింది. హంతకుల కుటుంబంలో పుట్టాడా!
యెంత దారుణం!
యెంత నిర్ధాక్షిణ్యం.!
వీళ్ళు నాయకులు!
వీళ్ళు దేశాన్ని నడిపిస్తారు.
వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు.
అతని గుండెల్లో సన్నని మంట బయలు దేరింది.
అందమయిన శ్రీనివాస్ ముఖం కళ్ళముందు మెదిలింది. అతను రాధిక కలిసి అగ్జిబిషన్ లో తీయించుకున్న ఫోటో గుర్తుకు వచ్చింది. ఎంత ధీమాగా, ఎంత హుందాగా.ఎంత నమ్మకంగా ఉన్నాడు.
అతను తలపట్టుకుని బయటికి వచ్చాడు. నరాలు చిట్లిపోతాయేమో ననిపించింది.
ఇంతవరకు మిణుకు, మిణుకుమంటున్న ఆశ ఉండేది. ఇంకా బ్రతికి ఉన్నాడేమోనని ,ఎంత దారుణం నమ్మించి గొంతు కోయటమా! ఏమాత్రం అనుమానించినా మధుమూర్తి వెంట బయలు దేరుతాడా! బయలు దేరినా వాళ్ళిచ్చిన పాయసం త్రాగుతాడా!బయలు దేరినా వాళ్ళిచ్చిన పాయసం త్రాగుతాడా!
సిద్దార్ధకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి.
అక్కడ ఉంటే శ్రీనివాస్ మరణం వర్ణిస్తారు.అది భరించలేడు. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి." అన్నయ్యా!"అన్నాడు కోపంగా.
అతను చర, చర ఇంటికి వచ్చాడు తమ ఇంట్లోకి కాక ఎదురింట్లోకి వెళ్ళాడు సులక్షణకంసాలికి నగలు చేయించటానికి ఆర్డరు ఇస్తుంది.
"రావయ్యా రా...."
"మీ ఆయన ఏడి!"
" మా ఆయన అంటున్నావు! అన్నయ్య వరస మరిచిపోయావా"
" వావి వరసలు ఆయనకు గుర్తున్నాయా!ఆస్తి హస్తగతం అవుతుందంటే రేపు నన్నయినా చెంపేస్తాడు."
"ఏమిట్రా ...యెగిరి యెగిరి పడుతున్నావ్ !"మధుమూర్తి బయటికి వచ్చాడు.
" పాపం ఆ శ్రీనివాస్ ను ఎందుకు చంపావ్!"
" నోరుముయ్యి"
" నీ నోరు పోలీసులు మూయిస్తారు. రాధిక పిచ్చిదియింది. ఇక నేను మిగిలాను. నన్ను చంపెయ్యి."అన్నాడు ఆవేశంగా
" పిచ్చి రాధికకు కాదు, నీకు పట్టింది." అన్నాడు మధుమూర్తి.
"కాసేపట్లో తెలుస్తుంది...." నిరసనగా అని బయటికి వచ్చాడు.
"చిన్నాన్నా.... "అంటూ బబ్లు వెంటబడ్డా విడిపించుకుని వచ్చాడు. అతను తిన్నగా శ్వేత ఉండే దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఏకాగ్రతగా ఉత్తరం చదువుతుంది.
"మైస్వీట్ రాధీ!
నాకు పర్మనెంటు ఉద్యోగం ఇస్తానన్నాడు. మా బాస్ అమ్మో. మీరు రెండు వేలు జీతం ఇచ్చినా నా డార్లింగుకు అన్ని సమకూర్చగలను అని. స్వంతపరిశ్రమ పెట్టాలనే నిశ్చయించుకున్నాను. రెండు సంవత్సరాలు ఓపిక పట్టు డియర్! మీ నాన్న గారితో చెప్పు, నీ గ్రాడ్యూయేషన్ కావాలని ....ఇదిగో విరహంలోని ఆనందం అనుభవించలేవా!నీకోసం నేను, నాకోసం నువ్విలా ఎదురుచూస్తుంటే అద్భుతంగా లేదూ!
రాధికా! శ్రీను ప్రేమికా!మీ నాన్న గురించి నువ్వేం దిగులు పడకు. నాదగ్గర డబ్బు ఉంటే అతనే అsన్నీ మరిచిపోతాడు. వీళ్ళంతా డబ్బు మనుషులు డార్లింగ్.
చదువుతున్న ఉత్తరం ఆపి, వెనుతిరిగి చూచింది శ్వేత. సిద్ధార్థ కళ్ళు వర్షిస్తున్నాయి.
" సిద్దార్థా!"అన్నది ఆదుర్దాగా.
" ఒక వ్యక్త కాదు.ఆత్మ విశ్వాసంతో బ్రతకాలనుకొన్న శక్తిని నాశనం చేసారు....అవును...అవును." అన్నాడు ఆవేశంగా.
