Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 46


    "బుద్ధిలేని పనులేం చేసాను"?

    "నన్ను ఇష్టపడటం." అన్నది కొంటెగా.

    "నిజమే బుద్దిలేని పనే చేసాను. ఉద్యోగం లేదు ఊళ్ళోకి వస్తూనే ఓ సమస్య నెత్తిన వేసుకున్నాను."అన్నాడు.

    "ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమేనా!డబ్బు సంపాదించటమేనా! మీరు చేస్తున్నది ఉద్యోగం కాదా!"

     "ఏమో...." అన్నాడు. ఆమె ఆప్యాయంగా చెయ్యి నొక్కింది. అతను చెయ్యి వదిలించుకుని వెళ్ళిపోయాడు.


                                     11


     "ఆ రోజు సాయంత్రం నేను మరో ఇద్దరు కూలీలం కలిసి సరిగ్గా లింగం ముందు గొయ్యి తీసాం బాబూ. గొయ్యి ఎందుకని అడిగితే ఏదో పూజ అన్నారు. మాకు తలాపది రూపాయలిచ్చి వెళ్ళమన్నారు."వీరప్ప చెబుతున్నాడు. పోలీసు టేప్ చేస్తున్నారు.

    వీరప్ప చుట్టూ చూచాడు.

    యమకింకరుల్లాగా పోలీసులు నిలబడ్డారు. ఒకరి  చేతి టైర్ పీస్, మరొకరి చేతిలో బెల్ట్,ఇంకొకరి చేతిలో గొలుసు.ఉంది.

     " ఊ... కానియ్యి..."

    "మంచినీళ్ళు."అన్నాడు.   

     అక్కడే ఉన్న త్రీనాట్ వన్ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. రెండు గుక్కలు త్రాగాడు.  గ్లాసు కింద బెట్టాడు.

    "మేం డబ్బు తీసుకుని  బయటికి వచ్చి, సరిపోదని అనుకుంటున్నాం అప్పుడే స్కూటర్ , దానిపై మధుమూర్తి గారు, పార్వతమ్మ కొడుకు దిగారు.   

     " రాధిక వచ్చిందా!"అన్నాడు పార్వతమ్మ కొడుకు.

    "వచ్చే ఉండాలి." అన్నాడు మధుమూర్తి . వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. పదినిమిషాలాగి నేను వెళ్ళాను. పది నిమిషాలాగి నేను వెళ్ళాను. పార్వతమ్మ కొడుకు పెళ్ళి కొడుకులాగ తాయారయ్యాడు. మధుమూర్తి తలపాగ సరిజేస్తున్నాడు.

    "ఏమిటి?" నన్ను చూచి కసురుకున్నాడు.

    "డబ్బు సరిపోదు బాబూ. బసప్పను అడగాలని-" అంటుండగానే మరో పది రూపాయలు నాకిచ్చేసాడు 'వెళ్ళిపో.'అని కసురుకున్నాడు.

     " ఇంకా ఇద్దరూన్నారు బాబూ-"అన్నాను.

    బసవయ్య భార్య అప్పుడే రెండు కప్పుల్లో పాయసం తెచ్చి, మధుమూర్తికి ఆపెళ్ళికొడుక్కి ఇచ్చింది-" వీరప్పఆగాడు.

    " ఆ పెళ్ళికొడుకు పేరు శ్రీనివాస్! అదే చెప్పు."

    " శ్రీనివాస్ - నవ్వుతూ పారయసం తాగి ముఖం చిట్లించాడు. మధుమూర్తి అతన్నే చూస్తున్నాడు."

    "మోసం-మోసం-"అన్నాడు శ్రీనిsవాస్.

    మధుమూర్తి నవ్వాడు.

     శ్రీనివాసు కక్కేసుకోవాలని  ప్రయత్నం చేసాడు.   

     " అప్పుడేమో మధుమూర్తి ,బసవయ్య,ఆయన భార్య అందరూ కలిసి బలవంతంగా అతన్ని మాతో  త్రవ్వించిన గోతిలోకి నెట్టారు.అతను గట్టిగా అరిచాడు.ఆ అరుపులు బయటికి వినిపించుకూడదని , వాళ్ళు మంత్రాలు చదివారు. అప్పడే పాలు తీసుకుని రంగయ్య వచ్చాడు."

    ఆపాడు వీరప్ప.

    "ఊ.... తరువాత."

    "చెబితే వాళ్ళు చంపుతారు.చెప్పకపోతే మీరు చంపుతారు ఎట్లా గయ్యాచచ్చేది?" ఏడ్చాడు.

    "ఆపు నీ బోగం ఏడ్పులు-" పోలీసు చేతిలోకి రూళ్ళకర్ర లేచింది.

     "వద్దు-వద్దయ్యా...వద్దు.జంగయ్యా గట్టిగా అరిచాడు.అప్పుడేమో మధుబాబు బయటికి వచ్చి మాకు చెరో వందరూపాయలు ఇచ్చి," మేము అతన్ని చంపటంలేదు. మా చెల్లెల్ని పాడు చెయ్యాలనిచూచాడు.అతన్ని భయపెడుతున్నాం." అని మమ్మల్ని వెళ్ళగొట్టాడు. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS