Previous Page Next Page 
ఒప్పందం పేజి 46

 

    "చాల్లే ఊర్కోండి... నేను ఇంకా మాధవి అంటే ఆడపిల్లేమో అనుకోని లెటర్ వ్రాసాను.
    'అవును మాధవినే. ఓ ఆయామ్ సారీ. నా పేరు మాధవ్. నా పేరు అచ్చిరాక మాధవి నా చెల్లెలి పేరు పెట్టి పంపించాను. నా కధలన్నీ."
    "గొప్ప పని చేశారు" విసురుగా అన్నది.
    "అన్యాయం అంత ప్రేమగా లెటర్స్ వ్రాసి రమ్మని , ఇంత ఇన్సల్ట్ చేస్తారా?"
    "నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానా? మీరే నన్ను ఫూల్ ని చేశారు."
    "పోనీండి ఎవరైతే ఏం? నాతొ మాట్లాడకూడదా?"
    "ఆవిడతో మాట్లాడినంత ఫ్రీగా మీతో మాట్లాడలేను."
    "ఏవిడతో ...." అల్లరిగా నవ్వాడు. అతని వైపు చూసి కళ్ళు వాల్చుకుంది.
    కాస్సేపు తదేకంగా ఆమెని చూస్తూ హటాత్తుగా "మీరు నేను ఊహించిన దాని కన్నా అద్భుతంగా ఉన్నారు."
    "థాంక్స్" కోపంగా అంది.
    'చెప్పండి. ఏదో మాట్లాడతానన్నారుగా... ఎన్నో విషయాలు అని ఊరించి ఇంత దూరంగా ఉన్నారేం?" అనుపమ కి చిరాగ్గా ఉంది. ఏమిటో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇతన్తో ఎలా మాట్లాడాలి? అనిపిస్తుంది. చివరికి పోనీ ఎవరైతే ఏం?అనుకుంది. వెంటనే, "మీ వాడిన పూలు సీరియల్ చాలా బాగుంటోందండీ..." అన్నది మెరిసే కళ్ళతో.
    "థాంక్స్...." నవ్వాడు.
    'అంత బాగా మీరసలు ఎలా రాస్తారు?"
    "పేపర్ మీద పెన్ తో రాస్తాను"
    "నిజంగా.... నేనింకా ఆకూ మీద పుల్లతో రాస్తారనుకున్నానే...." ఫక్కు,మన్నాడు . "గడుసువారే.."
    "మరి ఏవిటండీ , ఎలా రాస్తారంటే, ఇంత మంచి ఐడియాలు ఎలా వస్తాయి? అసలు, ఆ సస్పెన్స్ , చదువుతున్నవారికి  థ్రిల్ కలిగేలాగా వ్రాయటం ఎలా సాధ్యమవుతుంది? నావసలు ఎన్ని రాసి పంపినా ఒక్కటీ పబ్లిష్ అవటం లేదు...." నిరుత్సాహంగా అంది.
    "ఎందుకవవు. కధ బాగుండాలి. శైలి బాగుండాలి. సంభాషణ బాగుండాలి. ఇంకా... ఎన్నోఎన్నో బాగుండాలి"
    "నా కధలన్నీ బాగుంటాయి. ఇంతవరకూ చదివిన వాళ్ళెవరూ బాగాలేవు అని అనలేదు తెలుసా?"
    "మీ వయసెంత?"
    "పదిహేడు ....ఏం? వయసుకీ, నా కధలకీ సంబంధమేమిటసలు?"
    "పదిహేడు . నిజం చెప్పాలంటే రచనలు చేయటానికి మీ పదిహేనేళ్ళ అనుభవం చాలదు. ఐదు తీసేస్తే పన్నెండేళ్ళు. ...ఊహూ ఇంత అనుభవ శూన్యంగా కధలు వ్రాస్తే ఎలా ఉంటాయో తెలుసా? ఊప్పూ కారం లేని కూరలాగా చప్పగా ఉంటాయి. జీవితంలో కష్టాలు, సుఖాలూ అన్నీ సమపాళ్ల లో అనుభవించాలి. ఎన్నో పుస్తకాలు చదవాలి. ఎన్నో ఊళ్లు తిరగాలి. ఎంతో ప్రపంచ జ్ఞానం సంపాదించాలి. అప్పుడు గాని మనకి రకరకాలమనుష్యులతో పరిచయమావదు. వివిధ రకాల మానవ స్వభావాలు అర్ధం కావు."
    "మీ జీవితంలో ఇవన్నీ అనుభావించారా? ఇంత ప్రపంచ జ్ఞానం సంపాదించారా?"
    "నేను పదహారేళ్ళకే అనుభవాల పుట్టనైనాను అనుపమా! నేను పుట్టిందే మంచి అనుభవం. పుట్టం గానే నదిలో దూకానుట. అంటే నన్ను కన్నతల్లి నన్ను నదిలో పడేస్తే ఒక చేపలు పట్టుకు జీవించే ఒక చేపల వ్యాపారి నన్ను తీసుకొచ్చి పెంచాడు. మా బ్రతుకు చేపల వ్యాపారం మీదే ఆధారపడి ఉండేది. అయినా అతను నన్ను తన కూతురి కన్నా ఎంతో ప్రేమగా పెంచాడు. బాగా చదువు చెప్పించాడు. ఈ సభ్య సమాజంలో నన్ను మనిషిగా నిలబెట్టాడు. మొన్నీ మధ్యే పాము కాటేసింది ఆయనని. మాధవికి నేనే పెళ్ళి చేశాను. నేను ఏ ఊరూ తిరగలేదు. పుస్తకాలు మాత్రం చదివాను. నా అనుభవాలే నన్ను రచయితని చేశాయి. ప్రశాంతమైన ఆ నదీ తీరానికి  వెళ్తే భావాలు వాటంతటవే  పుట్టుకు వస్తాయి. నావెన్ని కధలు తిరిగి వచ్చాయో తెలుసా?"
    "ఎన్ని?"
    "నలభై"
    "నిజంగా"
    "అవును. మరి పుట్టగానే అందరూ కవులూ, రచయితలే అయారా? ఇద్దర్నైనా చంపంది  డాక్టరవడు తెలుసా?"
    'అబ్బ మీరిన్నీ కష్టాలనుభావించారా?" ఆశ్చర్యంగా అడిగింది.
    "పూర్తిగా వినకుండానే కష్టాలంటున్నావే...."
    "వినక్కర్లేదు... బీదవాళ్ళు అన్నమాటే చెప్తుంది. వాళ్ళ కష్టాలనీ"
    "నా కల్యాణీ, మధూ  ఎవరో తెలుసా?"
    "ఎవరు?"
    "నేను నా ఊహా సుందరి . నిజంగా నాక్కాబోయే భార్య కల్యాణే కావాలి. అందుకే నేను నీ లెటర్ చూసి ఎగిరి గంతేశాను. నువ్వు నా కల్యాణివి అనూ, ఆ అమాయకత్వం.... ఆ పొగరు బోతుతనం నా కాల్యాణివే ....నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనూ" ఉద్వేగంగా అన్నాడు మాధవ్.
    "మాధవ్...."
    "ఏం? భయమా?" రచయితల్ని భరించలేవా?"
    "అదికాదు...అదికాదు...."
    "తొందరలేదు. అలోచించి చెప్పు అనూ. ఇంకా వెళ్దామా?"
    "పదండి.... " ఇద్దరూ లేచి చుట్టూ తిరిగి కొండ మీదుగా క్రిందికి దిగసాగారు.
    "మీరు చాలా సాహసం చేశారు." అన్నది అనుపమ.
    "నేనా? ఏం చేశాను?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "మీరు లెటర్ వ్రాసి సంతకం ఎలా చేశారు?"
    "అదా! నువ్వు మాత్రం సాహసం చేయలేదూ... ముందు లెటర్ వ్రాసింది నువ్వేగా.
    'అయితే.... మనకిష్టమైన వాళ్ళని కల్చుకోవాలనుకోవడం తప్పా? అయినా.... మీరు మీ పేరు పెట్టుకోక మాధవి అని ఎందుకు పెట్టుకోవాలి?"
    "అది నా ఇష్టం. నీ లెటర్ చదవగానే నాకు చాలా దగ్గరవాళ్ళు ఎవరో వ్రాసినట్టు ఫీలయ్యాను. అనుపమా... తప్పైతే క్షమించు."
    అనుపమ మాట్లాడలేదు. పెదవులు బిగించి నెమ్మదిగా దిగసాగింది. కాళ్ళకు చీర కుచ్చెళ్ళడ్డం పడి ముందుకు తూలింది అనుపమ. కొంచెం ముందుకెళ్ళిన మాధవ్ ఆమె కెవ్వు మనడంతో చప్పున వెనక్కి వచ్చి చేయి అందించాడు.
    "థాంక్స్" అన్నది నెమ్మదిగా దిగుతూ.
    "దీన్నే మంటారో తెలుసా?"
    "ఏమంటారు?" కళ్ళెత్తి అతని వేపు ఆశ్చర్యంగా చూసింది.
    "ఈమాత్రం తెలియని దానివి నువ్వు కధలెం వ్రాస్తావు? పాణిగ్రహణం అంటారు."
    "ఛీ...ఛీ.." చెక్కిళ్ళు ఎర్రబడగా మొహం తిప్పెసుకుంది. ఏదో అర్ధమైనట్లు పకపకా నవ్వేశాడు మాధవ్.

                                   ***

    కాబోయే ప్రఖ్యాత రచయిత్రికీ, అయిపోయిన ప్రఖ్యాత రచయితకీ వివాహం జరిగిపోయింది. మాధవ్ స్వయంగా అనుపమ తల్లిదండ్రులను కలిసి అనుపమ అమాయకత్వాన్ని తను ప్రేమిస్తున్నట్టు చెప్పి వాళ్ళ అంగీకారం తీసుకున్నాడు పెళ్ళికి.
    మొదటి రాత్రి "నేనెప్పటికైనా రచయిత్రిని అవుతానా" అని అడుగుతోన్న అనుపమతో అన్నాడు... "తప్పకుండా ....కానీ నువ్వింకా ఎదగాలి" అన్నాడు .
    "అంటే! ఎలా?"
    "ఇలా....' నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు.

                                   ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS