Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 44


    ఆశ్చర్యంగా చూచాడు.

     "నాకు అమెరికా వెళ్ఫాలని ఉందని చెప్పానా!"అన్నడు నిలదీసి నట్టు.

    "లేదు- లేదనుకో. నాన్న గారిఅభీష్టము." అన్నాడు కాస్త తగ్గి.

    "నాన్నగారి ఇష్టా అయిష్టాలు నువ్వు బాగా చూచుకుంటున్నావు కదా. నాకిక్కడే ఉండి చదువుకోవాలని ఉంది."అన్నాడు.

    "ఇంకా చదువుతావా!"

    "ఈ ప్రపంచాన్నిఎంత చదివినా తక్కువే."

    " నీ మాటలు అర్ధం కావు."

    "నీ చేతలు యెవరికి అర్ధం అవుతాయి!" అని కోపంగా బయటికి వచ్చాడు. అతనికి పూర్తిగా అర్ధం అయింది తన ప్రతీ చర్యఅందరూ గమనిస్తున్నారని, వాళ్ళేమన్నా, ఏం చేసినా తన నిర్ణయం మారదు. ఇంకా  వీళ్ళ అహంకారం, ఆధిక్యతతో యువతను దెబ్బ కొట్టాలని చూస్తారా!

    అతను బస్సు దిగి కరీమ్ చాచా ఇంటికి వెళ్ళాడు .అప్పటికే శ్వేత హైద్రాబాద్ రావటానికి తయారవుతుంది.

    " అసక్తి కరమైన విషయాలు తెలిసాయి సిద్దార్దగారూ-" అన్నది."

    "అతన్ని ఇంట్లకు రానియ్యి బేటీ-ఛాయ్ తాగని."

    "ఛాయ్ కాఫీలు వద్దు చాదా. మొదటి ఈ దుర్మార్గులెవరో తేల్చుకోవాలి."అన్నాడు ఆదుర్దాగా.

    "టీ త్రాగుతూ వినండి." ఆమె టీ పెట్టింది.

    "రాధిక స్పృహలోకి వచ్చినట్టేవచ్చి, స్పృహ తప్పిపోయింది.

    " సారీ సిద్ధార్ధ! నువ్వన్నది నిజమే. శ్రీనివాస్ చనిపోయాడు. నిన్న వీరప్పకు బాగా తాగించాక ఒకటే ఏడ్పు," నా ఈచేతులతో ఒక అమాయకుడిని బొందపెట్టాను" అంటాడు. ఇంకా అడిగేలోపల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు."అన్నది.

    "అతడి వదివి పెట్టకుండా ఇంటరాగేట్ చేస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.ఇంకొక కొత్త విషయం తెలిసింది.ఆబసప్ప  భార్య మీ అన్నగారి...." పూర్తి చేయలేక పోయింది."

    "నాకు తెలుసు. మా అన్నగారి రసికత." అన్నాడు."

    "వీళ్ళంతా కలిసి ఏదో గూడుపుఠాని నడుపుతున్నారని నా అనుమానము."అన్నది.

     " అనుమానానికి ఏవయినా ఆధారాలున్నాయా!"

    "ఉన్నాయి.బస్సప్ప భార్య కాపుసారా అమ్ముతుంది. సాయంత్రాలు సూటుకేసుల్లో బట్టలు తీసుకు వెళ్ళి అమ్ముతూంది. అవన్నీ స్మగుల్డ్ గూడ్స్ అని అంటున్నారు."

    "స్మగిలింగ్ వస్తువులని మీకు బాగా తెలుసా!"

    "ఒకేసారి కుతూహలం ప్రకటిస్తే వారికి అనుమానం వస్తుంది. దుకే చీరలు, సెంటు కావాలని చెప్పాను."అన్నది.

    ఆమె టీ ఒంపి తెచ్చింది.ఇద్దరూ టీ త్రాగారు. సిద్దార్ద చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొందరు కూడి, ఒక్కొక్క ఊరును సంస్కరించటం చేర్చుకోవాలి. అప్పుడే సంస్కరణ ప్రారంభం అవుతుంది. కరీమ్ చాచా యిల్లు బయటికి పెంకుటిల్లులా కనిపిస్తుంది, కాని లోపల చక్కగా అలికి ముగ్గులు పెట్టి వుంటాయి. ముందున్న పెద్ద వరండాలో చాపలు పరిచి, దానిపై దిండ్లు పరిచి ఉంటాయి.

     శ్వేత వచ్చిన తరువాతే ముగ్గులు పెట్టటం ప్రారంభించింది.   

     మొదట 'ఎందుకు బేటీ' అన్నా, రాను, రాను నిలబడి ముగ్గులను చూడటం నేర్చుకున్నాడు కరీమ్.

     వాళ్ళింట్లో యెవరూ  లేరు. శ్వేత, సిద్దార్థ మాత్రమే మిగిలారు. సిద్దార్థ మొదటిసారి గా ఒక పురుషుడు చూచినట్లు ఆమె వంక చూచాడు.

    ఆమె వంగిన కనుబొమ్మలు గమ్మత్తుగా ఉన్న ముక్కు అతడిని ఉక్కిరిబిక్కిరి చేసాయి.   

     " శ్వేతా!"

    " ఏమిటి?"

    " మీరు చాలా అందంగా వుంటారు."

    "థ్యాంక్స్- "అని పక,పక నవ్వింది.

    " ఎందుకు నవ్వు? అబద్దం ఆడానా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS