Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 43


     "లేదమ్మా! తప్పక దొరుకుతాడు. నేను డాక్టర్ని కాదు. పోలీసులం."

     " దేవుడు వచ్చినా నా శ్రీను దొరకడు.... చంపేసారు- శ్రీనివాస్ ను చంపేసారు. గుడిలో చంపేసారు.... పెళ్ళి చేస్తామని చంపేసారు...." అంటూ డొక్కలు అదిరి పడగా ఏడ్చింది.

     "మేం కనుక్కుంటాం-"

    " వద్దు.... వద్దు.... అబద్దాలు చెప్పకండి అబద్దాలు చెప్పినా శ్రీనును తీసుకు వెళ్ళారు..."  అంటూ విరుచుకు పడిపోయింది. ఆమె గిల, గిల తన్నుకోసాగింది.

     సిద్ధార్ధ డాక్టరును పిలుచుకు వచ్చాడు. అతను మరో మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. అయిదు  నిమిషాల్లో ముఖం వేళ్ళాడేసింది. ఆమెను పడుకోబెట్టారు.

     బయటినుండి వచ్చిన యశోదమ్మ అందరిని  చూచి, వెనక్కు జరిగింది.
   
     "రండమ్మా....మీరు జరిగింది చెప్పాలి." అన్నాడు అధికారి. ఆమె తలయెత్తి చూచింది.

    " ఏం చెప్పాలి! నాభర్త చేసిన పాపాలా! నా మారుటి కొడుకు చేసిన దోషాలా! ఏం చెప్పాలి!" అన్నట్టున్నాయా చూపులు, ఆమె ముఖం పీక్కుపోయి, పది లంఖనాలు చేసినట్టుంది.

     " మీ అమ్మాయి శ్రీనివాస్ ప్రేమించిందని, పెళ్ళి చేసుకుంటానన్నదని, పార్వతమ్మ చెబుతుంది. మీ వారేమో, అదేం లేదు. శ్రీనివాస్ ఏవో క్షుద్ర విద్యలు నేర్చుకుని ,ఆమెపై ప్రయోగించాడంటారు మీరేమంటారు?"అన్నాడు పోలీసు అధికారి.

     ఆమె జవాబు చెప్పలేదు. తలఎత్తి దించింది.

    "మీ రాధిక ఉత్తరాలు పార్వతమ్మ ఇంట్లో దొరికాయి. రైటింగైనా గుర్తుపట్టగలరా!" అని ఉలిపొరలాంటి గులాబి కాగితము అది అందుకున్నది.

     ఆమెకు కాదనే ధైర్యం  లేదు.అది రాధిక వ్రాతే!

    "డియర్ శ్రీనూ!

     నిన్న నీకోసం ఎంతగా ఎదురు చూసానో తెలుసా! నువ్వు కోనట్టే అడ్డగీతల నేతచీర కట్టాను. ఎంకిలా ఉన్నానో, లకుమలా ఉన్నానో నువ్వు చెప్పాలి. నువ్వు రాలేదు  ఎందుకు! నిన్న రానిదానికి శిక్ష ఏమిటో తెలుసా రెండు గంటలు నాతో కబుర్లుచెప్పాలి .బర్కత్ పువా  పార్క్ల్ లో, పిల్లర్ ప్రక్కనే కూర్చోవాలి.అర్ధం అయిందా!ఈ ప్రపంచంలో ఏ శక్తి మనిద్దరిని వేరు చేయలేదు.   

                                                                                                                                               నీ
                                                                                                                                             రాధిక"

     మొదటి వుత్తరం చదువుతూ అలాగే వుండిపోయింది.యెంత ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో రాసింది కూతురు.ఆ హత్మ విశ్వాసాన్ని మంట కలిపింది తాను... కాదు తన భర్త .పురుషాధిక్యతను ఆలవాలమైన ఈ సమాజంలో స్త్ర్రీ జీవితంలో వచ్చిన మార్పేమిటి!

     "ఆమె ఆప్ సెట్ అయింది డి.ఎస్ పి గారూ!శ్రీనివాస్ ను మా చెల్లెలు ప్రేమించింది." అన్నాడు సిద్ధార్ద.

     " మీరు వచ్చి , స్టేట్ మెంటు ఇస్తారా!"

    "తప్పక...."

    "ఊరికి వెళ్తున్నారు"మీరు వస్తే సహకరించిన వారవుతారు."

    "తప్పక వారిని....."సాగనంపాడు.

    అతను వచ్చేసరికి యశోదమ్మ వెక్కిs వెక్కి ఏడుస్తుంది.

    " అమ్మా!"

    "నాలాంటి పుట్టుకయెవరికి వద్దురా-"

    "ఏమయిందమ్మా! రాధికి త్వరలో నయం అవుతుంది."

    "నాకు నమ్మకం లేదు-"

    "నువ్వు అధైర్యపడకు. నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తాను."అని అతను బయటికి  వచ్చేసరికి మధుమూర్తి యెదురు వచ్చాడు.

     "ఒరేయ్.... నీకు స్టూడెంటు విసా వస్తుంది. నా ఫ్రెండ్ ఒకడు స్పాన్సరక్ చేస్తానన్నారు."అన్నాడు.

    ఉరుము లేని పిడుగులా ఇదేం వార్త!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS