Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 40


     అతనికి అర్ధం అయింది వీరప్ప, నాటకం ఆడుతున్నాడని."

    "మధుమూర్తి తెలుసా!"

    "యెవరో తెలియదు బాబూ! నన్ను చంపకండి."

    "నోరుముయ్యి." కోపంగా అరిచాడు పోలీసు అధికారి.

    "మీరెట్ట చెబితే అట్లనే అయ్య-" గట్టిగా నోరుమూసుకున్నాడు.

    "టేక్ హిట్ అవే- నెక్ట్కు-" అన్నాడు.

    టీలు వచ్చాయి. అందరూ త్రాగారు.

     "నమస్తే సర్-" బాలరాజు వచ్చి కూర్చున్నాడు.అతను గడ్డం, జుట్టు పెంచుకున్నాడు.

    " మీ పేరు?"

    " బాలరాజండీ."

    "ఈ మధ్యే మీ నాన్న ఉరేసుకుని చనిపోయాడట."

    "అవునండీ. ఆయనకు కడుపులో నొప్పి వుండేది, ఆది భరించలేక ఉరివేసుకున్నారు."

    "  ఐసీ-మీకు ఎవరన్నా ఉరివేసారని అనుమానం రాలేదా!"

    " లేదండీ."

    " పోనీ మీ నాన్నకు శివునిగుడిలో పూజార్లతో స్నేహం ఉండేదా!"

    "నాకు తెలియదండీ."

    " మధుమూర్తి, మీ  నాన్న తరచు కలుసుకునేవారా!"

    " నాకు అదీ తెలియదు. నా కాలేజీ, నేను తప్ప ఇతర ప్రపంచంతో సంబంధం వుండేది కాదు."

    "ఐసీ....మధుమూర్తి కూడా తెలియదా!"

    "ఆయన తెలుసండీ. అప్పుడప్పుడు ఆయన తమ్ముడిని కలుసుకోవాలని వెళ్ళేవాడిని, వాళ్ళింట్లో చూచాను"

    " నువ్వు మంత్రాలు నేర్చుకున్నావా!"

    " అనుకున్నాను కాని నేర్చుకోలేదు"

    " నేర్చుకుంటుండగా పోలీసులు పట్టుకోలేదా!"

    అతను జవాబు చెప్పలేదు.

    "  మాట్లాడక ఊరుకుంటే నేరం మాసిపోదు.!"

    " నేనేం చేసాను!"

    "నీకు తెలిసిన విషయాలు దాచి పెడుతున్నావు."

    "నేను మంత్రాలు నేర్చుకోవటానికి మా నాన్న మరణానికి సంబంధం ఏమిటండీ?"అన్నాడు కాస్త  పదునుగా.

     "మీ నాన్న మరణానికి ,శ్రీనివాస్ మరణానికి చాలా పెద్ద సంబంధంవుంది."

    " శ్రీనివాసా!-అతనెవరు?"

    " ఇక్కడే నీవు అబద్ధం ఆడుతున్నావని తెలిసి పోయింది నువ్వూ, శ్రీనివాస్ ఒకే రైళ్ళో ప్రయాణం చేసేవారు."

    "సారీ... "అన్నాడు.

    " చూడు బాలరాజూ! నీ వ్యక్తిగత జీవితంలో సంబంధం లేదు కాని ఒక్క  విషయం మీ నాన్న విషయంలో నిజం చెబితే మంచిది. నువ్వు నిజం చెప్పకపోతే పోలిసులు కక్కిస్తారు"అన్నాడు.

     "నాకు  నిజంగా ఏం తెలియదు సార్. ఒక రోజు అర్ధ రాత్రి బాగా తాగి వచ్చాడు మాన్నాన్న.'ఒరేయ్, పెద్దింటి పిల్లను ప్రేమించకురా- ప్రేమించకు' అంటూ ఏదో గొణిగాడు అంతకు మించి నాకేం తెలియదు."

    "అలాగా-" అధికారి తల పంకించాడు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS