5

తదేకంగా వ్రాసుకొంటున్న గిరికి, తలుపు నెట్టిన చప్పుడు అంతరాయం కలిగించింది. విసుగ్గా చిరాగ్గా లేచి తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. ఎదురుగ్గా దుర్గ నవ్వుతూ నిలబడి ఉంది. ఒక్క క్షణం నిర్ఘాంత పోయినా, మరుక్షణం గిరికి, ఎక్కడ లేని హుషారు వచ్చింది. చేతులు రెండూ పైకెత్తి , "కలయో, ఇది లేక వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్ధమో, గిరినే కానో...." అంటూ పకపక నవ్వాడు.
దుర్గ తను కూడా నవ్వి లోపలకు వచ్చి కూర్చుని మూతి ముడుచుకుని 'ఇలా ఏడిపిస్తే నేను వెళ్ళిపోతాను." అంది. గిరి నవ్వుతూ "నీవాలకం నీ మాటలకు తగినట్లుగా లేదు మూతి ఇంకాస్త ముందుకు రావాలి. కనుబొమ్మలు ముడి పడాలి." అన్నాడు.
దుర్గ నవ్వేసింది. అంతలో గంబీరంగా :మరింత అదృష్ట వంతుడివి గిరీ!' అంది.
"ఎందుకు తల్లీ! నీలాంటి చెల్లెలు దొరికి నందుకా?" కావాలనే అన్నాడు గిరి.
"నీ చుట్టూ పక్కల ఆమడ దూరం వరకూ ఉల్లాసం నింపగల వ్యక్తిత్వము పొంద గలిగి నందుకు."
గిరి ఇబ్బందిగా నవ్వాడు.
"థాంక్స్! అది సరే! ఈ దీనుడి మీద ఇంత అనుగ్రహం కలిగిందెం? దేవుడా! మీ కుటుంబంలో మనుష్యులు ఏ క్షణం లో , ఏ మూడ్స్ లో ఉంటారో మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మ దేవుడి కి కూడా సరిగా అర్ధం కాదు."
దుర్గ ముఖం సిగ్గుతో ఎర్ర బడింది. ఒక్క క్షణ కాలం తల వంచుకుంది. అణచుకుందామన్నా అణగని భావోద్వేగంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"గిరీ! నన్ను దెప్పకు! నీ ప్రేమ నాకు కావాలి. అది ఏ రూపంలో నైనా సరే! నీతో మాట్లాడకుండా ఉండలేను. నువ్వు వదినతో 'దుర్గ నాతొ మాటలు మానేసినందుకు బాధ పడుతున్నానని అన్నావుట! ఆ మాట మండుతున్న నా మనసుకి పన్నీటి జల్లులా అయింది. నీ దగ్గరికి పరుగెత్తుకుని వచ్చేసాను. నేను నిన్ను అర్ధం చేసికో లేపోతున్నాను అన్నావుట. అది నిజమో, అబద్దమో నేను చెప్పలేను. పోనీయ్! మనం స్నేహితులంగా ఉందాము."
గిరి దుర్గ కళ్ళల్లోకి చూసి స్నేహంగా నవ్వి "పిచ్చి పిల్లా! ఇంత భోళా తనం పనికి రాదు. కాస్త గడుసుతనం నేర్చుకోక పొతే, రేపు మా బావగారు నిన్ను తోక పట్టుకు ఆడిస్తారు." అన్నాడు.
"నీకు బావగారు వచ్చినపుడి మాట చూద్దాం లే" అంది దుర్గ.
"రాకపోతే నేను పట్టు కోస్తాను. అదిసరే! ఇదంతా ఉమ ఉపకార మన్నమాట! నేనన్న మాటలన్నీ నీకు చెప్పిందా?"
"నువ్వన్న మాటలే కాదు. ఇంకా చెప్పింది." వూరిస్తున్నట్లుగా అంది దుర్గ-- గిరిలో కుతూహలం పెరిగింది.
"ఇంకా ఏమిటి?"
"హరి నువ్వంటే అంత పడి చావటం లో ఆశ్చర్యం లేదంది. నీతో పరిచయమున్న వాళ్ళు, నీ స్నేహం లేకుండా ఉండలేరంది." కొద్దిగా నవ్వింది దుర్గ. గిరి హృదయంతరాళాలలో హాయి, హయిమని అనుపించింది. ఇదమిద్ద మనలేని ఏదో మధురిమ, అతని ఆపాద మస్తకమూ వ్యాపించింది. అంతలోనే తనను తను హెచ్చరించుకుని, మత్తులో పడబోతున్న తన శరీరాన్ని, మనసునూ అదుపులోకి తెచ్చుకొని తేలికగా నవ్వుతూ, "తను కోపమూ, అనుగ్రహమూ కూడా శృతి మించినవే!' అన్నాడు.
"అయినా ఉమ వదిన మాటల్లో కొంచెమయినా అబద్దం లేదు."
గిరి నవ్వి, "నువ్వొక దానివి!' అని వూరుకున్నాడు.
"నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను." అంది గంబీరంగా దుర్గ.
దుర్గ గంబీరాన్ని లక్ష్య పెట్టకుండా తేలికగా "ముఖ్యమైన విషయాలు , ఎప్పుడూ మాట్లాడ కూడదు." అన్నాడు బద్దకంగా కుర్చీలో వెనక్కు జేర్లగిలబడుతూ.
"కాదు గిరీ! విను, ఉమ వదిన ఎం.బి.బిఎస్. లో చేరతానని పట్టు బడుతుంది. హరి అన్నయ్య కిష్టం లేదు."
గిరి ఒక్కసారి నిటారుగా కూర్చున్నాడు.
"ఇదెక్కడి పిడుగు! రేపు ఎండల్లో, హరి ఉమను పెళ్లి చేసుకోవాలను కుంటున్నాడు గదా! అన్నాడు ఎంతో కుతూహలంగా.
"అవును-- కానీ ఉమ వదిన ఎందుకో ఇలా పట్టు బడ్తుంది. తను మెడిసిన్ లో చేరుతుందిట. చదువు పూర్తయ్యే వరకూ , పెళ్లి చేసుకోదట. ఒకవేళ ఈలోగానే అన్నయ్య పెళ్లి చేసుకోవాలను కుంటే, మరొకర్ని చేసుకోవటానికి తనకు అభ్యంతరం లేదట! అన్నయ్య చాలా బాధపడ్తున్నాడు గిరీ!"
దిగాలుగా అంది దుర్గ -- "అన్నయ్య బాధపడ్తున్నాడు" అనే మాటలు గిరిని కూడా బాగా కదిలించాయి అమాయకమైన హరి ముఖం బుంగ మూటితో, దోషంతో ఎర్రబడిన కండ్ల తో, అతని కనుల ముందు కదలాడింది.
చటుక్కున లేచి "పద! హరిని కలుద్దాం!' అన్నాడు . దుర్గ తాను కూడా లేచి "పద!' అంది.
ఇద్దరూ హరి ఇంటికి వచ్చేసరికి, ఇంట్లో సావిత్రమ్మాగారొక్కరే ఉన్నారు. గిరి,ఆదుర్దాగా "హరి ఏది పెద్దమ్మా?' అన్నాడు.
ఆవిడ ముసి ముసి గా నవ్వి, "ఇప్పుడే హరి, ఉమా , అలా వెళ్ళారు.' అంది.
ఈ సమాధానంతో న్యాయంగా ఉత్సాహంగా రావాలి గిరికి . కానీ, ఎందుకో నీరసంగా సోఫాలో కూలబడ్డాడు. దుర్గ నవ్వుతూ "హరి అన్నయ్య దిగులుగా ఉంటె వోదార్చుదాను వచ్చావు ఆ చాన్స్ తప్పిపోయినందుకు ఫీలవుతున్నావా?' అంది.
గిరి ఉలికిపడ్డాడు. "భలేదానివి " అన్నాడు. అతని అంతరాంతరాలలో దుర్గ మాటలు నిజమని పించింది. చిత్రాతి చిత్రమయిన ఈ హృదయ సంచలనాని కతిని కాస్చర్యమయింది. సిగ్గు కూడా వేసింది. తన మనసు తనకు తెలియకుండానే ఏ దారిన పరుగెడుతుందో అతని కర్దమవసాగింది. అతని నుదురు వేడెక్కింది. హరిని తాను చిన్న నాటి నుండీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అట్లాంటి హరి పట్ల విద్రోహాన్ని ఊహిస్తోందా, తన మనసు? అంతటి నీచుడా తాను? కూర్చున్న చోటు నుంచి చివాలున లేచిపోయాడు గిరి.
* * * *
"తన ప్రతి కదలికతో ఆమెను పులకరింప జేయగలిగిన పురుషుడామె జీవితంలోకి ప్రవేశించినపుడు గానీ నా మాటలామెకు అర్ధం కావు."
ఈ మాటలే పనిచేస్తున్నా, ఉమ మనసులో కదలాడ్తూనే ఉన్నాయి. ఈ మాటలే కాదు. ఆరోజు గిరితో నడిచిన సంభాషణ లోని ప్రతి అక్షరము, ఏ పని చేస్తున్నా , ఆమె మనసులో ప్రతి ధ్వనిస్తూనే ఉంది. ఏదో అసంతృప్తి, ఆవేదన ఆమె హృదయాన్ని కలచి వెయ సాగింది.
సావిత్రమ్మ కు స్వయంగా అన్న కూతురు ఉమ. కలిగిన కుటుంబం లో ఏకైక పుత్రిక గా ఉమ చాలా గారాబంగా పెరిగింది. ఎన్నడూ, ఏ విషయాన్ని ఇంత ;లోతుగా ఆలోచించేది కాదు. క్షణిక మైన ఆవేశాలకు, ఆమె తరచుగా లొంగి పోయేది చిన్నప్పటి నుండీ. హరిని, ఉమనూ అందరూ భార్యాభర్తలుగా అనేవారు. ఆ మాటలు విని, విని, ఉమ కూడా అలాగే బావించేది. ఆ విషయం గురించి తానుగా ఏమీ ఆలోచించేది కాదు----
ఈనాడామే కేవో క్రొత్త ప్రపంచపు తలుపులు తెరవబదినట్లుగా తోచసాగింది. ఈ ప్రపంచంతో అమెకింతకు ముందెన్నడూ పరిచయం లేదు. ప్రేమలో రెండు రకాలున్నాయి. ఒకటి వాత్సల్య పూరితమైన ప్రేమ -- మరొకటి మధురమైన ప్రేమ -- మధురాతి మధురమై, తననూ, ఎదుటి వారిని, సర్వ ప్రపంచాన్ని కూడా మరచి, అందులో లీనమయ్యేలా చేసుకోగలిగే ప్రేమ !..... జీవితానికీ, సార్ధక్యాన్ని కలిగించే ప్రేమ! అనేకిక మయిన ఆనందానుభూతిని అందివ్వగలిగిన ప్రేమ! హృదయాన్నీ, శరీరాన్ని గూడా పులకరింప జేసి మనసును, స్వర సీమలలోకి తీసుకు పోగలిగే ప్రేమ! ఆ దివ్య మయిన ప్రేమానుభూతి , తన జీవితంలోకి వచ్చిందా, అసలు? హరి పట్ల తనకు ఉన్నది వత్సల్యమా? ప్రేమా? హరిని తలచుకున్నంత మాత్రాన, తన శరీరమూ, మనసూ ఉద్విగ్న మవుతాయా? హరి దర్శన మాత్రంతో తన కళ్ళు, వింత కాంతులను నింపుకో గాలుగుతాయా? హరిని గూర్చిన భావనే తన జీవిత సారక్యమని భావించ గలుగుతుందా?
ఉమ ఈ ఆలోచనలను భరించ లేక పోతుంది. కానీ వాటి నుండి తప్పుకోవటం , ఆమెకు నమ్మశక్యం కావటం లేదు. హరి విషయం లో తనలో ఏ ప్రత్యేకమైన కదలికనూ, ఆమె గుర్తించ లేకపోతుంది. తనకు దుర్గ మీద ఉన్న అభిమానం లాంటిదే హరి మీదా ఉంది. తాను దుర్గ అంటే ప్రాణం పెట్టడం లేదా? దుర్గ బాధపడుతుంటే బాధ పడటం లేదా? దుర్గను చూడాలని కోరుకోవటం లేదా? అంతే! అలాంటి అభిమానమే హరి మీద ఉంది. తన స్త్రీత్వాన్ని కదిలించి వేయగల గాడమైన ఆకాంక్ష కాదది-- కాలేదు కూడా.
గిరి..
ఉమకు ఆలోచించడానికి కూడా భయం వేసింది. గిరి వ్యక్తిత్వం లో ఒక విశిష్టత ఉంది. ఎంత దగ్గరగా వస్తాడో అంత దూరంగా ఉంటాడు. చనువిస్తూనే భయం కలిగిస్తాడు. నవ్వుతూనే గంబీరంగా ఉంటాడు.
ఆమె త్రోసి పారేయ్యాలని ప్రయత్నించిన కొద్దీ ఆమె మనసులో, మరింత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాడు గిరి.
చివరకు , తాను గిరిని ప్రేమిస్తున్నాననే నిర్ధారణకు వచ్చింది ఉమ. అవును అందులో తప్పేమీ ఉంది? తాను అతడిని ఆరాధిస్తుంది. ఒకవేళ తన ఆరాధనను అతడు స్వీకరించక పోవచ్చు. అయినా తను మాత్రం బ్రతికినంత కాలమూ, మనసులో అతడిని ఆరాదిస్తూనే ఉంటుంది. ఆ ఆరాధనే తన జీవితానికి మూలం. తన బ్రతుకుకు బలం.
కానీ, హరి . హరి భావన లేలా ఉన్నాయో? ఈ విషయాన్ని హరి సహించగలడా? హరి తనను భార్యగా భావిస్తున్నాడు. తన అంగీకారం కూడా అతనికి లభించింది. ఇప్పుడెలా అతని నిన్ను భర్తగా భావించటం లేదని చెప్పటం? చెపుతే ఏమను కుంటాడు?
హరి ఉదాసీనాన్ని గ్రహించాడు. లక్ష విధాలుగా ప్రయత్నించీ కూడా ఆమెలో ఉత్సాహాన్ని తేలేక పోయాడు. ఒకసారి ఏకాంత సమయంలో ఆమె చెక్కిలిని ముద్దాడబోయి , వెనక్కు తగ్గిపోయాడు. ఉమ కావాలని తనకు దూరంగా ఉంటుందని గ్రహించాడు. కానీ, దానికి కారణం మాత్రం అర్ధం కావడం లేదు. ఉమకు తన మీద ప్రేమ లేకపోవచ్కనే విషయం అతని వూహ కందనిది. ఏదో అలిగిందని అనుకున్నాడు.
