పెరటి వైపు తలుపు తీసిన శబ్దం శ్యామ సుందర్ నిద్రని పారిపోఎట్టు చేసింది. తలెత్తి చూశాడతడు. ఆశ్చర్యంతో లేచి వెళ్ళాడు హిమబిందు దగ్గరికి.
"ఏమిటింకా మేల్కొనే ఉన్నారా మీరు?"
"ఆహా! హు! ఆ! నిద్ర రావడం లేదండీ ఎందుకనో ఈరోజు!"
"అయితే ఇక్కడెందుకు? చలిగాలి వీస్తోంది. రండి లోపలికి! నా దగ్గరో మంచి పుస్తకం ఉంది -- చదువు కుందూరు గాని!"
లేచి లోనికి వెళ్ళిందామె. శ్యామ సుందర్ టేబిల్ మీదున్న పుస్తకం తీసి అందించాడామేకి. అతడు తన మనః స్థితి గూర్చి ప్రశ్నించనందుకు కామే సంతోషించింది. ఏ పరిస్థితులో మనిషి నిదురకు దూరమౌతాడో అతనికి తెలుసు ననిపించింది.
"ఏం పుస్తకం?"
"చూడండి!"
"భగవద్గీత! ఇపుడు చదవ....."
"ఇప్పుడే చదువు కోవాలి ! పోనీ, ఈ శ్లోకం వినండి!.....
"మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ
దుఃఖదాః
ఆగమ పాయినో, నిత్యాస్తాంస్తి తిక్షస్వ భారత.'"
అతని కంఠం గంబీరంగా ఉంది. పసిపాపకు బోధించి నట్లు లాలింపు వినిపించింది. తన కేమయిందో ఇతనికి తెలిసి పోయిందా అని అనుమాన పడింది వెంటనే.
"అర్ధం చెప్పమంటారా?"
తల ఊపిందామె.
"ఎంత గొప్పవారి కైనా సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు తప్పవు. రాత్రిం బవళ్ళు మాదిరిగా అవి వస్తూ పోతూ ఉంటాయి. కాని వాటిని ఓర్చుకోవాలి. ఎందుకంటారా? అవన్నీ అస్థిరాలు."
బిందు కళ్ళల్లో నీళ్ళు నిండు కొచ్చాయి అర్ధం వింటుంటే.
"ఎమిటితడు ఇలా నా మనసుని మూల మూలలా స్పర్శిస్తున్నాడు?! దాచుకున్న మంటని వెలికి దీసి చందనం పూస్తున్నాడే!" కొంచెం కుదుట పడిందామె మనస్సు.
"చెప్పండి! బాగుంది!"
"మీరు చదువు కుంటుంటే ఇంకా బాగుంటుంది. నేనా గదిలోకి వెళ్లి పడుకుంటాను. నిద్ర వచ్చేవరకు చదువుకోండి."
అతడు మరో గదిలోకి వెళ్ళాడు. వద్దని అనాలను కుంది. కానీ అప్పటికే అతడు వెళ్ళిపోయాడక్కడి నుంచి.
'ఎంత మధురం ఇతని మనస్సు! కరుణ అదృష్ట వంతురాలు! ఇంతమంచి అన్నయ్య లేందరి కుంటారు? మనస్సు కెంతో చేరువగా వస్తుందతని ప్రవర్తన! ఆత్మీయత వినిపిస్తుందా కంఠనా! పరిచయం తప్ప మరేదీ లేని నా పట్ల తన కెందు కింత శ్రద్ధ!?" ఎందుకో ఆ ప్రశ్న ఆమెని కలవర పెట్టింది. ఆలోచన లకి స్వస్తి చెప్పి గీతలోకి వంగిపోయింది.

ఉదయం హిమబిందు లేచేటప్పటికి ఎనిమిదయింది. అప్పుడైనా కరుణ లేపింది -- "ప్రోద్దేక్కింది. లే!" అంటూ. అంత ప్రోద్దేక్కే వరకు ఆమె ఇటకు ముందెప్పుడూ నిద్రపోయి ఎరుగదు. వెంటనే ఆమెకి రాత్రి జరిగిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. శ్యామసుందర్ కదిలాడు ఆ స్మృతుల్లో.
మనస్సు హాయిగా ఉంది. కళ్ళు మాత్రం కొంచెం ఎర్రబారాయి.
కాఫీ తాగుతూ పలుకరించా డతడు చిన్నగా నవ్వుతూ.
"ఓ గంటె ఉంది మరి టైం మన ప్రయాణానికి. హడావిడిగా బయలు దేరడమంటే మీకూ, కరుణ కీ మహా ఇష్టం అనుకుంటాను! కానివ్వండి మరి! బస్సు దాటిపోతుంది ఏమాత్రం ఆలస్యం చేసినా?"
"నా హడావిడి ని కూడా గమనించుతూందా ఇతని మనస్సు? ఎండుకొన్ని కోణాల్లోంచి చూస్తూ నా అభిరుచులకి , ఆలోచనలకీ రంగు అద్దుతున్నాడు తను? నేను నవ్వితే ఎందుకలా ఇంద్రధనుస్సు విరుస్తుందాతని కళ్ళలో? ఎందుకో నా కళ్ళు అశ్రు సిక్తా లవడం తనకు నచ్చదు. పెదవి కదలడు. కానీ, హృదయాంతరాళాల్ని కదిలించెట్టు కళ్ళతోనే "ఏమైంది?" అన్నట్లు చూస్తాడు.
ఆలోచనలతోనే బస్సులో కూర్చుంది , కరుణ తల్లికి నమస్కారాలు చెప్పి.
ఈసారి ప్రయాణం ఉత్సాహంగా ఉందామె కి. హాస్టల్ కి వెళ్లి రెండు మూడు రోజుల్లో అశోక నగర్ లోని ఇంట్లోకి మారుతున్నారు. అంతవరకూ ప్రాక్టికల్స్ చేయడం, రికార్డు గీయడం ;లో మునిగి పోవాలను కుంది.
'ఒంటరిగా ఉంటె మళ్ళీ గుండె నొప్పి వస్తుందేమో? భగవద్గీత ఒకటి కొనాలి. చదువుతుంటే మనస్సు కేదో పోయినది లభ్యమైనట్టుంది. అర్ధం కావడం లేదు పూర్తిగా. అయినా ఆ శ్లోకాలు చదువు తుంటే ఏ ఊహా క్షణం ని;లువదు. కొండక్కలేక అలిసిపోయినట్లు మనస్సు ఆ శ్లోకాల్లో చిక్కుకుని అలిసి పోతుంది. కానీ, ఆ అలసట లో ఎంత హాయి! ఎవరో నెమ్మదిగా మనస్సుని లాలిస్తున్నట్లుంటుంది.'
కరుణ పిలుపు కూడా వినిపించ లేదామేకి ఊహల్లో తెలిపోతుంటే . మరోసారి పిలిచింది కరుణ.
"ఎక్కడున్నావ్> పక్కన ఓ మనిషి ఉన్న సంగతైనా గుర్తుందా , మహాతల్లి!"
"చెబుతున్నావు గ , ఉన్నానని! ఇంకెలా మరిచి పోతాను" నవ్విందామె. అంత హాయిగా నవ్వి ఎన్నాళ్ళ యిందో ఆమె! ఆ నవ్వుల్లో కళ్ళు మెరిశాయి. కరుణ మనస్సు తేలిక పడింది. ఆ నవ్వు విన్న వెంటనే.
ఆ ప్రయాణం లో శ్యామ సుందర్ మరింత సన్నీహితుడయ్యారు. బస్సు ఆడినప్పుడు విసుగెత్త కుండా పరిహసాలతో బిండునీ, కరుణ నీ ఊపి వేసేవాడు. 'ఆ కధ ఎలా ఉంది?' అంటూ ప్రభాలోని సాహిత్యం మీదికి దూకేవాడు ఉన్నట్టుండి. విమర్శలతో ప్రశంసలతో చిన్న కధ నుంచి మొదలై పెద్ద నవలల వరకు వచ్చి వాదం తెగక ఆగిపోయే వారు ముగ్గురూ. ఆ వాదంలో అతనెప్పుడూ హిమబిందు భావాలనే కనిపించీ కనిపించనట్లు సమర్దిన్చేవాడు. అలా సాగిపోతూన్న సంభాషణ మళ్ళీ సినీ రంగం వైపు మళ్లేది కొంతసేపటికి.
"మీకవరంటే ఇష్టం, బిందు గారూ, ఎక్టర్ల లో?"
"భానుమతి తనలో అన్నీ ఉన్నాయి చూడండి. మధురాతి మధురంగా పాడుతుంది. చక్కగా డాన్సు చేస్తుంది. పాత్రలో లీనామై మనల్ని మరిపించి వేస్తుంది! కధలు వ్రాస్తుంది! అబ్బ! ఒక్క మనిషిలో ఎన్ని టాలెంట్స్!"
"నాకు అంజలీ డేవి ఏక్షన్ బాగుంటుంది. భానుమతి కొన్నిసార్లు పాత్రలను మించిన అవధుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ, అంజలి పాత్రను దాటి పోదు. అందమైన ముఖం " అన్నాడతడు.
అలా ఎన్నో అంశాలు వచ్చాయి వాళ్ళ చర్చల్లోకి. ఏలూరు చేరుకునేసరికి ప్రయాణం కొంచెం అలసటే అనిపించింది. శ్యామసుందర్ వాళ్ళిద్దర్నీ హాస్టల్లో దింపి మళ్ళీ మూడో నాటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
వెళ్ళేటప్పుడు పిలిచి అతడిచ్చిన భగవద్గీత ఇవ్వాలి అనుకుంది హిమబిందు. కానీ, మన స్సంగీకరించలేదు అంతా చదివి ఇవ్వవచ్చు ననుకుంది తరవాత.
హాస్టల్లో హిమబిందు ప్రెసిడెంట్. చదువుతున్న బి.ఎస్ సి. అయినా, బి.ఎ వాళ్లతో కూడా స్నేహంగానే ఉంటుంది. సైన్సు బుక్స్ తీసుకోదు లైబ్రరీ నుంచి. ఎక్కువగా తెలుగు సాహిత్యం -- కధల నవలలు -- ఇవే ఆమె లిస్టులో!
లైబ్రరీ సిస్టర్ లిడియా నవ్వుతూ ఆహ్వానించేది ఆమెని. "ఓ ! యూ! హిమబిందూ ! కమాన్! సి ది లిస్ట్! అల్ న్యూ నావేల్స్! స్టోరీస్! యూ వాంట్ దిస్ నావెల్!" అంటూ క్రొత్తగా వచ్చిన తెలుగు నవలల లిస్ట్ చూపించేది.
కరుణతో కూడా లైబ్రరీ లోనే పరిచయం అయింది మొదట. ప్రేమ చంద్ 'నిర్మల' కోసం వెదుకుతుంటే తీసి ఇచ్చింది-- "ఇంద, ఇక్కడుంది . మీరు చదివాక నాక్కూడా ఇవ్వండోసారి" అంటూ.
కరుణ స్నేహలత తీనేలు వేసి పూలు పూసిన తరవాత శ్యామసుందర్ తో పరిచయ మయింది. కాని మొన్నటి వరకు అది పరిచయం గానే మిగిలిపోయింది. ఆ రోజున వర్షానికి రోడ్డు మునిగి బస్సులు నడవక పోవడం మూలాన ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ హిమబిందు కోరిక కాదనలేక చిక్కవరం వచ్చారు. ఆ మలుపే అతనిలో హిమబిందు పట్ల స్నేహభావాన్ని చిగురింపజేసింది.
కరుణ అన్నతో పాటు అశోక నగర్ లో చూచిన ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. హిమబిందు ని కూడా రమ్మంది . నువ్వు రాకపోతే నేనూ హాస్టల్లో నే ఉంటానన్నది. ఆమెకూ లోన బాధగానే ఉంది కరుణ వెళ్లి పోతుందంటే 'కానీ, అన్నా చెల్లెళ్ళు వాళ్ళు! నేనెలా ఉంటాను అనుకుంది.
ఆ సమస్య కో పరిష్కారం వెదికింది కరుణ. శ్యామ సుందర్ కో చిన్న గది కేటాయించింది. తమకి కొంచెం పెద్దగా ఉన్న గది ఎంచుకుంది. మధ్యన తలుపులు ఉన్నాయి. హిమబిందు సందేహం తీరిపోయింది. శ్యామసుందర్ కూడా మనః పూర్వకంగా ఆహ్వానించాడామెను.
"నాకొ తాళం ఎలాగూ ఉంది కదా? మధ్య తలుపులు మూసే ఉంటాయి. లెండి ఎప్పుడూ! మీ రూం కి మీరిద్దరూ ఓ తాళం వేసుకోండి! నాకూ మీకూ చిక్కే ఉండదు" అన్నాడు. అందుకే మూడో నాడు వచ్చి ఆ ఇంటికి తీసుకు వెళతానని చెప్పాడు.
ఆ మూడు రోజులు ఎలా గడిచాయో తెలియదా ఇరువురికి.
హాస్టల్ మేస్ బిల్ చెల్లించారు. సామానంతా సర్దేశారు. అందరితోనూ చెప్పారు ఉత్సాహంగా వెళుతున్నామని.
ఆ ఇల్లు నచ్చింది హిమబిందు కు. రెండు గదులు ముందు వరండా , ఓ చిన్న కిచెన్ , బాత్ రూం . వేరువేరుగా ఉన్నాయి. కరుణకీ, తనకీ రెండు మంచాలు వేశాక టేబుల్ ఉంచడానికి సరిపోయింది. శ్యామసుందర్ సామానంతా అతని గదిలోనే సరిపోయింది. భోజనాలు కిచెన్ లో!
"బాగుంది ! ఇదో సంసారం మనకి!" అంది హిమబిందు . రెండో రోజు నుంచి మళ్ళీ కాలేజీ మొదలైంది. బిందు ఎక్కువగా ప్రాక్టికల్స్ కోసం ప్రొద్దున్నే తొమ్మిదింటి కే వెళ్ళిపోవలసి వచ్చేది. అందుకని వంట పనంతా కరుణ మీదే పడుతుంది. ఎక్కువగా హిమబిందు నోచ్చుకునేది.
"కరుణా, పాపం! నీకు మహా చెడ్డ చిక్కు వచ్చి పడింది. నేనేమో మహారాణి లా వెళ్ళిపోతున్నాను. నువ్వేమో వండి వార్చి సతమతమై పోతున్నావు."
"నువ్వు మాత్రం చేయడం లేదా ఏమిటి? ఒక్క కూరే గదా నా పని? అయినా నీకూ నాకూ వాదాలేమిటి! స్నేహంలో ఇలాంటి పట్టింపు లెందుకు?" అంటూ త్రోసి పుచ్చింది కరుణ.
ఒక్కొక్క రోజు హిమబిందు వచ్చేటప్పటికి చీకట్లు అలుము కుంటున్నాయి. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉన్న రోజునే అలా అలాస్యంగా ఇల్లు చేరుకునేది. "ఫ్లాస్కు లో కాఫీ ఉంది. తాగు, బిందూ!" అంటూ టేబిల్ మీదున్న ఫ్లాస్కు ను అందించేది కరుణ.
బిందు నవ్వుతూ అందుకుని అనేది :
"కరుణా! ఏ జన్మ దంటావ్ మన స్నేహం! నీ ఋణం ఎలా తీర్చుకోను!"
"మరీ మాటల మూట నవుతున్నావ్, బిందూ, నువ్వీ మధ్య పది రోజుల నుంచి. నీ, నా మధ్య ఋణం ఏమిటసలు?"
"నిజమే! స్నేహంలో ఋణ ప్రసక్తి ఉండగూడదు" అనేది హిమబిందు.
కరుణ పది కాగానే పడుకుంటుంది. హిమబిందు అప్పటి కింకా ఏదో ఓ రికార్డు గీస్తూనో, వ్రాస్తూనో ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే జరిగింది. పదకొండు దాటింది. అయినా ఆమె టేబిల్ దగ్గరి నుంచి కదలనే లేదు.
లైటు వెలుగుతూనే ఉంది. మధ్య నున్న తలుపుల్లోంచి ఆ కాంతి రేఖలు శ్యామసుందర్ గదిలోకి వ్యాపించు తున్నాయి. మెలకువ వచ్చింది తనకి. లేచి చూశాడు తలుపులు తెరిచి.
