" అవునూ వీడు చదువుకున్నవాడు వీడికేం రోగం!" అన్నారెవరో
పోలీసులకు చెప్పాలిగాని, మీరు రక్తం వచ్చేలా కొడతారా!"అన్నాడు రుద్రయ్య దగ్గరగా వెళ్ళి.
" వాడు నీ బంధువు అనుకుంటాను."
"నా బంధువు కాడు కాని జాలి."
"ఇలాంటి వారిపై జాలి చూపుతావా! పాపం తగులుతుంది.ఇదిగో ఈ పనిపిల్ల ఏం చేసింది?" ఒక చిన్న పాపను ఎత్తుకు వచ్చారు. రబ్బరు బొమ్మలా ముద్దులు మూట కడుతుందా పాప. సంవత్సరం ఉంటుందేమో,
" ఈ పిల్ల పినతండ్రి ఈ రుద్రయ్య కలిసి ఆ పసిదానికి చేతబడి చేస్తున్నారు. చేతబడి చేయటానికి వెంట్రుకలు కావాలట.ఇదిదో..." బిడ్డ నెత్తుకున్న అతను ఆ పిల్లను తిప్పాడు. పాపిటకు ఒక వైపు న రక్తం చిందుతున్నది.
సిద్ధార్ధ కడుపులో తిప్పినట్లు అయింది.
మనం ప్రగతి సాధించామా!
ఈ చేతబడులు మొక్కుబడులు అంటూ ఏండమావులు వెంటఎందుకు తిరుగుతున్నారు!
సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించి.చైతన్యవంతం చెయ్యవలసిన రచయితలు ఆంగ్ల సాహిత్యాన్ని స్వంతం చేసుకుని చేతబడులు మొక్కుబడులు అనే మూర్ఖపు టాలోచనలవెంట పరుగెడుతున్నారు.
హప్పీ యిజమ్, కృష్ణ కాన్షెస్ నెస్ ఇవన్నీ ఏమిటి? తిన్నదరగని ముర్ఖపు చర్యలు. మనిషి తను అశాంతితో బాదపడుతూ శాంతికోసం ఏదో ఓ ఆలబన వెతుక్కుంటాడు.అది భక్తి కావ్చచు, విరక్తి కావచ్చు
ముద్దులు మూటగట్టే పాపను యెలా పాపను యెలా బాధించారు!
అతనికి ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. మెల్లగా వెనుతిరిగాడు. అతనికి దూరంగా స్వేత కనిపించింది.
" సిద్ధార్ధగారూ! మీరు వెంటనే కల్పించుకోకపోతే ఆ బాలరాజు చచ్చిపోతాడు." అన్నది.
"ఏం ?"ఎందుకో ఆమెనక్కడ చూడటం నచ్చలేదు.
బహుశః మీరు వెంటనే కల్పించుకోకపోతే ఆ బాలరాజు చచ్చిపోతాడు." అన్నది.
" వాళ్ళు రుద్రయ్య పళ్ళు ఊడగొట్టారు చూచారుగా.అలాగే మీ బాలరాజు పళ్ళు ఊడగొడతారు." అన్నది.
"మై గాడ్?" కాళ్ళకు బ్రేకులు పడ్డట్టు ఆగిపోయాడు.
దెబ్బలవల్ల వచ్చిందనుకున్నాడు ఆరక్తం.అతను ఒణికిపోయాడు.
" పళ్ళూ ఎందుకు ఊడగొట్టారు?"
" పళ్ళూడగొట్టి లందరిలోని నీళ్ళు పోస్తే ఆతనిలోని మంత్రశక్తి నశిస్తుందట." అన్నది.
" లంద... అదేమిటి?"
" జంతువుల తోళ్ళు నానబెట్టి శుభ్రం చేసే గొయ్యి."
"మైగాడ్...."
" మీరు ఎన్నిసార్లు పిలిచినా భగవంతుడు రాడుగాని అతడిని రక్షించండి." అన్నది ఆదుర్దాగా.
జనం తలా ఒక రకంగా గోలగా అరుస్తున్నారు.
"నేను చెబితే వింటారనంటావా?"
" మీ నాన్న పేరు ఇక్కడ మీకు అండగా నిలబడుతుంది."
"ఒరేయ్ బాలరాజూ" చదువుకున్నోడివి నీకిదేం బుద్దిరా...." ఒకతను చేతిలో పట్టుకార లాంటిది పట్టుకుని ముందుకు వచ్చాడు.
"ఆగండి..." పరుగు, పరుగున వెళ్ళాడు సిద్ధార్ధ.
"అతనిలో మంత్రశక్తి లేదు, మహిమ లేదు బదిలిపెట్టండి." అడ్డునిలబడ్డాడు.
"పురుషోత్తమరావు కొడుకు...."
"ఒహో! ఇక్కడ ఆయన పెత్తనం తప్పదా!"
" నువ్వెందుకొచ్చవ్!"
" వాడని ప్రాణాలతో వదలం."
జనం ఆ వేశం తో ఊగిపోతున్నారు వారికి నచ్చచెప్పటం మామూలు విషయం కాదు.
"మీరే మగవాళా! అతన్ని ఒక్క దెబ్బకొట్టి , మీరు బయటపడలేరు." అన్నాడు కోపంగా.
కొంచెం తగ్గారు.
