"పురుషోత్తమరావుగారి చిన్నబ్బాయిని"
ఎస్సై కళ్ళు ఎందుకో పత్తి కాయలు అయ్యాయి.
"మీరు......మీరు....... పురుషోత్తమరావు గారి అబ్బాయా! నిజంగానా!"
"అవును -"
"మీరు ఇక్కడికి రావటం మీ నాన్నకు తెలుసా!"
"నేనేం మైనర్ లా కనిపిస్తున్నానా --"
అతను ఏదో అనబోయి మాట మింగేసాడు అదేమిటో అర్ధం కాలేదు.
సిద్దార్ధకు అర్ధం అయింది. జంగయ్యది హత్యే. అందులో మధఉమూర్తి ప్రమేయం ఉంది. పోలీసులకు బాగా ముట్టజెప్పాడు. అందుకే వాళ్ళంతా నిశ్చింతగా ఉన్నారు. అతను పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చాడు.
నా కొడుకో! నా సీనో - నా కడుపున ఎందుకు పుట్టావు నాయనో! నా బంగారమో! నువ్వు దగాచేసి పోయావా కొడుకో! నేనేమన్న సీనూ! నా కడుపున చిచ్చు పెట్టావు నాయనో!"
ఆగాడు.
"పాపం పారతమ్మ బాబూ" అన్నారెవరో.
పార్వతమ్మ పైకి ఏడ్చి తన హృదయభారం దింపుకుంటుంది. రాధిక కుమిలిపోతుంది.
అతను ఇంటికి వచ్చి త్వరగా తయారయ్యాడు లోకల్ ట్రైన్ ఉందింకా.
"సిధ్దూ!" తండ్రి పిలిచాడు.
"ఏమిటి నాన్నా!"
"ఈ రోజు నా స్నేహితుడు ఒకాయన వచ్చాడు. రాత్రికి వస్తారట. నువ్వు ఎక్కడికి వెళ్ళకు" అన్నాడు.
"అలాగే, కాని మీరుంటారు కద నాన్నా!"
"ఉన్నా నువ్వుండాలి. నిన్ను చూడాలనే వస్తున్నాడు. యెవరనుకున్నావు! హైద్రాబాద్ లో పెద్ద కంట్రాక్టర్......" అన్నాడు అతిశయంగా.
మీరు ఉంటున్నారు కదా. నేనెందుకు నాన్నా?"
"నాకు పిల్లనివ్వాలని రావటంలేదు" అన్నాడు కోపంగా.
అప్పుడు అర్ధం అయింది. స్వేత విసిరిన సటైర్.
"నాకిప్పుడు పెళ్ళికేం తొందర!"
"మరి దేనికి తొందరో చెప్పు."
"అది కాదు నాన్నా! ఉద్యోగం రావాలి.........."
"గతిలేనివారికి ఉద్యోగం, సద్యోగం అంటూ పడిగాపులు పడాల్సినగతి పట్టిందేమో, మనకు కాదు. మీ ఇద్దరి పెళ్ళిళ్ళు చేయాలని ముచ్చటగా వుంది" అన్నాడు.
"అదికాదు.........."
"ఏది కాదు, నువ్వేం అడ్డు చెప్పకు!"
"అవున్రా చదువు అయింది! అభ్యంతరం దేనికి?"
"చదువు అవుతుండగానే పెళ్ళీ చేసుకోవాలా! ఒక జైలునుండి మరో జైలుకు వెళ్ళిరావాలా!" అన్నాడు.
"అంటే ఇల్లో జైలులా ఉందా!"
"మరి అంతేకదా --" విసురుగా బయటికి నడిచాడు తండ్రి పిలిచినా వినిపించుకోలేదు.
"అన్నయ్యా!" గేటు దగ్గర అడ్డుకుంది రాధిక.
"ఆ పనిమీదే వెళ్తున్నాను"
"శ్రీను బ్రతికే వున్నాడా!"
ఒకేసారి చెప్పి ఆ అమ్మాయిని బాధ పెట్టటం దేనికి? మెల్లమెల్లగా అలవాటు చేయాలి.
"ఏమో చెప్పలేను......" ఆ మాత్రం దానికే ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి.
"అన్నయ్యా!"
"నా ప్రయత్నలోపం లేదమ్మా. నువ్వు ధైర్యంగా వుండు" హామి ఇచ్చాడు.
అతను వెళ్తుంటే రాధిక వెక్కిళ్ళు వినిపించాయి.
అతనేం చేయలేడు.
