భాస్కరం అట్నుంచి ఇటు తిరిగి ఆమెను గబగబా అనుసరించబోవడంలో గులకరాయి మీద "బూ టు" మడమ పడి జర్రున జారిపోయాడు - అరక్షణంలో అది జరిగిపోయింది......ఆలోగానే
"సురేఖగారూ! మాట!" అని పిలవడం ఆ వెంటనే "అబ్బా!" అనడం కూడా జరిగి పోయాయి.
సురేఖ అట్నుంచి ఇటుతిరిగి చూసేసరికి భాస్కరం కటిక రాళ్ళమీద పడి చేతులమీద కాసుకుని, బాధగా లేస్తున్నాడు.
సురేఖ "అమ్మయ్యో! అదేమిటలా పడిపోయారూ" అంటూ వచ్చింది.
"జారి పడ్డాను.... మరేం ఫర్వాలేదులెండి" అన్నాడు లేచి సర్దుకుంటూ.
అతని ఎడం అరచెయ్యి విచ్చిన దానిమ్మపండు లాగ చిట్లిపోయింది. ఆ చేతిమీదనే ఒరిగి కాసుకున్నా డేమో మొన దేరిన రాళ్ళు మోసి గీసుకు పోయాయి.
నెత్తురు చిమ్ముతున్నది. మంట పెడుతున్నది.
"మై గుడ్ నెస్......మీరంతలా పారిపోతారేం.."
సురేఖకు భాస్కరం అరచేతి నెత్తురు భయం కలిగించింది.
వెంటనే తన 'వానిటీ బాగ్'లోనించి తీసి రుమాలు ఇచ్చింది. "ముందీ నెత్తురుకు రుమాలు కట్టండి" అన్నది.
భాస్కరం చెయ్యి చూసుకున్నాడు. మోచెయ్యి కూడా గీరుకుంది. కాస్త కాలు బెణికింది. "థాంక్స్ ఆ రుమాలు పాడు చెయ్యను ..... నాది ఉంది గాని....." అంటూ కుడిచెయ్యి ఎడమ జేబులోకి దూర్చి చూసుకున్నాడు. కాని రుమాలెక్కడ?
అది ఇంతకు క్రితం తను తీసుకొని చేతి వేళ్ళకి చుట్టుకుంటూ మాట్లాడాడు. ఈ సంరంభంలో అది గాలికి ఎగిరిపోయి అలనల్లనపోయి దూరంగా ఉన్న బ్రహ్మజెముడు దుబ్బులలో చిక్కుకొంది.
"మరేం! ఫర్వాలేదు....... ముందా రక్తం చిమ్ముతోంది చూసుకోండి"
భాస్కరం మొహమాటాన్ని లక్ష్య పెట్టలేక పోయింది, సురేఖ- "ఆ చెయ్యి ఇలా ఇవ్వండి" అతని దగ్గరగా వెళ్ళి అతని చెయ్యి అందుకుని రుమాలు కట్టింది.
ఆరుబయలు ...... దూరాన మేఘాలు......దూరంగా సందడి...... దగ్గరగా ఎండ...... ఆకాశాన మేఘాల క్రిందగా గ్రద్దలు ఎగురుతున్నాయి.
భాస్కరం చెయ్యి మండుతున్నది. గాని సురేఖ మృదువైన చేతులతో, మెత్తని రుమాలు చుడుతూ ఉంటే, తదేకంగా, కృతజ్ఞతా భావంతో ఆమెకేసి చూశాడు. మనసమతా ఉద్దేలంగా ఉన్నది ..... ఆమె తల దించుకుని కట్టుకడుతూ.
"ఏం మనుషులమ్మా! ఇంత సున్నితం... కాస్త పాతుకే ఇంత దెబ్బా?" అన్నది.
భాస్కరం విగ్రహం పుంజుకుని, ఉచ్చ్వాస నిశ్వాసాల వడి నదుముకుని "థాంక్స్" అన్నాడు చెయ్యి వెనక్కు తీసుకుని....... "నా రుమాలు అదుగో అలా అలా విహారం చేస్తోంది .... తెచ్చు కుంటాను....." అని కదలబోయాడు.
"సరిలెండి...... కుడి చెయ్యి పోయిందో..... ఇక క్లాసుకి పాఠాలకి స్వస్తి..... చాల్లెండి.....ఎడ్వంచర్ మీ పద్మావతి నన్ను తిడుతుంది....."
సురేఖ వారించింది.
"మీ ఇష్టం" భాస్కరం ఆమెకు స్వాధీనమై పోయి ఆమె ననుసరించాడు. "ఈమె దేవతామనిషా?" అన్న దతని మనసు.
36
శైలజకు పద్మావతి ఉండాలనే ఉన్నది తను కూడా....... ఆడపిల్లలో పరువు మర్యాదలు, స్వత సిద్దమైన భయం ఇవి జాస్తీ గనుక మనస్సును వారించి మరీ ఏకాంతాన్ని కోరిన ప్రియునితో ఒంటరితనాన్ని వదులుకుందికే సిద్ధమయింది శైలజ "ఇప్పుడప్పుడే కాదు......" అన్నదామె మనసు.
పద్మావతికి మరీ సంకటంగా ఉన్నది పరిస్థితి. 'అవతల సురేఖ భాస్కరం ఇద్దరూ దగా చేశారు. వాళ్ళు నన్ను కొండ ఎక్కించేసి క్రింద కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నా'రనుకుంది. మూర్తికి కూడా భయంగాను బిడియంగాను ఉన్నది. ఇద్దరాడపిల్లలు తనూ.
శైలజను ఏకాంతంగా దూరంగా తీసుకుని పోవాలి అనీ ఉంది మళ్ళీ భయంగానూ ఉంది. పద్మావతి మనసంతా దిగువనే ఉండి పోయింది. కొండంతా, గులక రాళ్ళు చిన్నచిన్న దుబ్బుల మయం - చీపురు మొక్క లున్నాయి అక్కడా అక్కడా ....
"వెధవ పని చేశాను.......భాస్కరంగారు నన్నుమోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు." అనుకుంది. వెనుదిరిగి వెనుదిరిగి చూస్తోనే ముందు ముందుకు వెళ్ళసాగింది పద్మావతి.
శైలజకు మూర్తినీ అనుసరించాలని మనసు పీకుతున్నది - పద్మావతిని చూస్తే భయం- బెంగ- సంకోచం.
"ఏం! అయిందా? అమ్మాయిగారి వెంచర్!?" మీది గుట్టమించి చెయ్యి అందిస్తూ అడిగాడు మూర్తి ఆనందంతోనూ అలసటతోనూ రొప్పుతూ.
"మరేఁ!..... తల్చుకుంటే నేను మిమ్మల్ని దాటేయగలను" శైలజ అనుకోకుండా అతని చెయ్యి అందుకు ముందుకు ఎక్కుతూ అన్నది
"పద్మావతిగారు వెనక పడిపోయింది."అన్నది-
దగ్గరగా చెయ్యిపట్టి లాక్కుంటున్న మూర్తిని వారించి దిగువకు చూసింది శైలజ.
మూర్తికి శైలజ సమ్మోహనం గా అగుపిస్తున్నది. చెమట పట్టిన ఆమె నుదుట ముంగురులు అతుక్కు పోయాయి. ఎండకు సోలి, వాడిన పువ్వులా అయిపోయిందా పిల్లమొహం.....
ముంగురులు సవరించాడు.
ప్రపంచంలోని ఏ శక్తీ, ఏ ఆశా, ఏ భయమూ కూడా అతనికి తోచలేదు. ఆమెను తన గుడెల కదుముకోవాలనిపించింది. అతని కళ్ళల్లో తీవ్రమైన కాంక్ష-ఆ పిల్లను ప్రాధేయపడుతున్నది.
అతని చెయ్యి వదిలి అతని కళ్ళల్లోకి చూసిన శైలజ చలించి పోయింది. చేతులు కన్నా బలమైన మంత్రం ఆ నాలుగు కళ్ళ కలయికకు ఉన్నది. ఆ తరుణంలో - ఎవరూ ఎవరికన్నా బలమైన వారు కారు.
బలహీనతకు దాసులై పోయారు. పద్మావతి వెనుదిరిగి దిగిపోతూండడాన్ని వారు గమనించనే లేదు.
"శైలూ!"
మూర్తి ఆమెను సున్నితంగా అక్కునదుముకుని ముందుకు వంగి జుత్తు మూర్కొన్నాడు. అతని గుండెలమీద చెయ్యివేసి దూరంగా త్రోసి అటుతిరిగి సిగ్గుపడిపోయి అక్కడే కూచుని తల చేతుల్లో దాచుకుంది శైలజ. చిరుచెమటలు కమ్మి గుండె దడదడలాడుతున్నది.
అ ప్రక్కనే మండు టెండలో అదే పండు వెన్నలంత హాయినిస్తోన్నట్లు మోకాళ్ళ మీద ఆని కూర్చొని 'కోపం వచ్చిందా' అన్నాడు. -బ్రతిమాలాడాడు! ఆమె చెంపల నాఘ్రానిస్తూ..
"మీరు దొంగలు" శైలజ చిలిపిగా చూసింది.
"నేను కాదు...... నేను దాసుణ్ణి..... మీరే.....మీరే..... అసలు నువ్వే....."
"నేను..... నేను...... అమ్మయ్యో! పద్మావతి గారు వెళ్ళిపోయిందేమో...... తను చూస్తే ఇంకేమేనా ఉందా?..."
లేచి నలుదిక్కుల చూడసాగింది శైలజ.
మూర్తికి ధైర్యం వచ్చింది.
అటూ ఇటూ చూస్తే ఎండతప్ప యెవ్వరూ లేరు. పద్మావతి దిగిపోయి ఉంటుంది..... "కావాలంటే ఆనక క్షమాపణ చెప్పుకోవచ్చును......"
మూర్తి రెపరెపలాడుతూ ఎగురుతూను ఆమె పయిటను ఆందుకుని ఆమెను దగ్గరికి లాక్కున్నాడు-ఆ పిల్ల కరిగి పోయింది.
రెండు క్షణాలిద్దరూ లోకాన్ని మరిచిపోయారు. ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు..... "ఒక్కటై పోవాలనుంది" ఇద్దరికీ.
"అబ్బ......."
శైలజ ఒక్క ఉదుటున విడిపించుకుని కొంగుతో పెదాలు ఒత్తుకుంటూ చకచకాదిగి పోసాగింది.
మూర్తి గుండె అంతకంటే వాడిగా కొట్టు కుంది. "పడతావ్? మెల్లిగా..... ఆగు....ఆగు నా మీద ఒట్టే..." - భయంతో మూర్తికి చెమట పోసింది. శైలజ మాత్రం ఎవరో నేను తరుముతూన్నట్లు వడిగా అలవాటైనట్లు సునాయాసంగా దిగిపోసాగింది.
* * *
పదకొండు గంటలైంది. తొలి విడత ఒడ్డనలు చెట్ల క్రింద విస్తళ్ళు వేసి ప్రారంభించారు-విస్తళ్ళెగిరి పోతున్నాయి, గ్లాసులు పడిపోతున్నాయి. నవ్వులు కేకలు అల్లర జోరుగా ఉంది. దానికి గాలి తోడైంది...... వోహ్!......
పద్మావతి కాళ్ళు పీకిపోయాయి. ఒళ్ళంతా పులిసినట్లు నొప్పులు, చెమట, దుఃఖం, కోపం, చెప్పులో ఒకటి తెగిపోయింది. కాదనుకున్నా సరే వెతుక్కుంటూ వెళ్ళింది భాస్కరాన్ని.
సురేఖా భాస్కరం మొదట తాము విడిపోయిన "పల్లకీ మామచెట్టు" దగ్గరే ఉన్నారు.
పద్మావతిని చూస్తూనే భాస్కరం లేచి వెళ్ళాడు సురేఖ అప్పటి కప్పుడు అక్కడ వెలసిన దుకాణంలో అరటిపళ్ళు కొంటున్నది- అవీ పద్మావతికి ఇద్దామనే....
"హలోవ్! నువ్వే గెలిచావ్ పద్మా!" అ పిల్ల సానుభూతి కోసమని మరింత కుంటుతూ దెబ్బతగిలిన చేతిని కట్టుతో సహా క్షమాపణ పత్రంలా ముందుకి జారుతూ ఎదురేగాడు భాస్కరం.
పద్మావతి "ఇంకా సిగ్గులేకపోతేసరి" అనుకుని "వోడిపోయాను- మీరేం వెటకారం చేయనక్కరలేదు...." అంది.
"నో! నో!....."
"ఏమిటి నో, నో,..... నా బుద్ధి గడ్డితిని నేను మిమ్మల్ని నమ్ముకుని ఈ పాడు పిక్ నిక్ కని..."
భాస్కరం అనుకున్నదే ఈ ఉధృతం ఐనా కాస్త చకితుడై.
"ఎక్స్ క్యూజ్ మీ! నేను...... నేనూ పడ్డాను పద్మా....." జాలిగా చెయ్యి చూపించాడు.
చెయ్యి కాదు పద్మావతి చూస్త! చేతిని కట్టుకున్న సురేఖ చేతిరుమాల్ని చూసింది. ఒళ్ళు మండిపోయింది. అంతలో "ఓయ్! అరటి పళ్ళు తినవోయ్! సేద తీరుతుందీ.....ఇంతకీ ఆ గంధర్వులు చూసి, నాకర్ధం కాని వర్ణనలతో ప్రారంభించి 'సాయంకాలం వేసుకునే' నల్లటి దుస్తులు ధరించాననీ, అంతకన్నా నల్లటి చేతిసంచీ చేతిలో ఉందనీ, ఆ చేతి సంచిలో ఏవేవో చెప్ప వీలులేని సరుకు లున్నాయని, ఎర్రటి కోటు వేసుకున్నాననీ చెప్పింది :

