"మత్తెక్కించే ఎరుపయుంటుంది" అనుకున్నాను నేను. ఆనక ఆమెవద్ధ శలవు తీసుకుని బయట పడ్డాను. మర్నాడామెను కలుసుకునే సరికి క్రితంరోజు దర్పం ఆమెలో లేదు. తనను రాబిన్స్పీన్ ను వెంటాడినట్టు ఎవరో చెప్పి భయపెట్టారని చెప్పింది. ఎవరో యిద్దరు వ్యక్తులు 'నినోలారూ' లో తన కేసి అదోరకంగా చూశారనీ, అలా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు అనీ అప్పుడు సమాధాన పరుచుకున్నాననీ ఆమె చెప్పింది. "ఆనాటి రాత్రి ఆమెను, సెర్జ్ ని ఎవరో వెంటాడరనే విషయం నే నంతగా నమ్మలేను" అని డిప్యూటీ చీఫ్ ఇన స్పెక్టర్ ఎడ్వర్డ్ పిలి చెప్పాడు.
పాట్ రే అనే ఆమె నాకు రెండో సాక్ష్యం. సెర్జ్ కి సంబంధించిన 'ట్రాన్స్ ఈరా పెట్రో లియం కార్పొరేషన్' లో ఆమె అతనికి కార్యదర్శి. సెర్జ్ ని గురించి ఆమెకు తెలిసినంత మరెవ్వరికి తెలియదు. కాని, ఆమె మాత్రం చాలా నికరంగా, వ్యాపార సరళిలో మాట్లాడింది. మేము ఎవర్ని అనుమానించినా సరే, ఆ వ్యక్తిని తీసుకుపోయి, పాట్ రేకి చూపించి, ఆమెకు ఆ వ్యక్తి పరిచయమేమో అనే విషయం నిర్ధారణ చేసుకున్నాము.
* * *
"సెర్జ్ మీ కెన్నాళ్ళనుండి తెలుసు?" అన్నాను నేను. "ఐదేళ్ళనుంచి" అని ఆమె సమాధానం చెప్పి, తన చేతిలో ఉన్న పెన్సిలుతో ఒక పుస్తకంమీద ఐదు. అని అంకె వేసింది.
"మీ రిద్దరూ మంచి స్నేహితులా?"
"వివాహం కూడా చేసుకుందా మనుకున్నంత స్నేహితులం" అని ఏవేవో గీతలు ఆ పుస్తకం మీద గీసింది.
"అతన్ని గురించి మీకు తెలిసినదంతా చెప్పండి"
ఆమె ప్రారంభించింది. కాని, అదేమంత ప్రేమ కథ కాదు. ఒక రకమైన పోట్లాటలతో, అసూయలతో, రాజీలతో నిండిన కథ. సెర్జ్ తనను గత సోమవారం కలిశాడని చెప్పింది. కాని, మంగళ, బుధవారాలలో చాలాసార్లు ఫోను చేశాడని చెప్పింది.
బుధవారం రాత్రి-అంటే సెర్జ్ ఎస్టిల్ తో నున్నపు డన్నమాట!
"బుధవారం రాత్రి నా కతను ఫోను చేసి నపుడు సుమారు రెండుగంటలయ్యుండచ్చు" అని చెప్పింది. అనగా ఎస్టిల్ వెళ్ళిన తరువాత నన్నమాట అనుకున్నాను.
"ఫోనులో ఏమని చెప్పాడు?" అన్నాను.
"తన ఇంటికి రమ్మన్నాడు. కానీ, నేను చాలా నిద్రమత్తులో ఉన్నాననీ, రాలేననీ చెప్పాను" అంటూ ఆమె ఆ పుస్తకంమీద ఏవో గీతలు గీసింది.
సెర్జ్-పొందిన దానితో సంతృప్తి లేని వాడనీ, పొందదలచుకున్నది పొందలేనివాడనీ, వాటికి ఆశపడే
వాడనీ, ఆవేశపడే స్వభావం కలవాడనీ, పాట్ రే గ్రహించిందని నాకు తోచింది. ఆ మాత్రం తెలివి స్త్రీజాతికి అసహజమేమీ కాదు.
* * *
సెర్జ్ రాబిన్ స్టెన్ కి పరిచయమున్న ఆడవారంతా పాట్ రేకి తెలుసు. ఆమె ఇచ్చిన పేర్ల జాబితా ప్రకారం పరిశోధన ప్రారంభించాను.
మొదట నేను ఒకామెను కలుసుకున్నాను. ఆమె పాట్ రే, ఎస్టీల పేర్లు వింటూనే మండిపడింది. ఆమె పేరు బెట్టీరీడ్. చక్కగా ఎలుగెత్తి మోహనమైన స్వరంతో పాట పాడగలిగిన కంఠం కలది. ఆమె చక్కని గొంతెత్తి పాట పాడితే ఎంతటివాడికైనా చరణం ఎత్తుకొని, ఆమెతో యుగళగీతం పాడాలనిపిస్తుంది. సెర్జ్ కి మొట్ట మొదటి ఇష్టురాలిని నేను ఒక్కతినే అనే దర్పం ఆమెలో ఉంది. ఒక సంవత్సరం అతనితో గడిసింది. ఆమె అతనికన్నా చాలా పొడగరి.
"నిజానికి ఆయన నన్ను వివాహం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు" అందామె. "టెన్నెస్సీలో ఉన్న మా ఇల్లు అమ్మేసి రామంని నా తల్లిని అడిగాను. కానీ, ఆయన్ని గురించిన పుకార్లు వినడంవల్ల నా తల్లి నాతో వచ్చి న్యూయార్కులో ఉండడానికి సమ్మతించలేదు" అంది.
ఆమె చాలా ఖులాసాగానే మాట్లాడింది. కాని ఆ మాటలలో పనికొచ్చే విషయం చాల తక్కువ. పైగా నాకేదో తెలియని విషయం చెప్పినట్టు సంబరపడింది.
'సెర్జ్-ఆయనే నా జీవితస్వామి' అనే వెర్రి ఊహను పెట్టుకుని, బార్బరాకుక్ అనే నటి ఉద్యోగం, సద్యోగం లేక అలాగే ఉండిపోయింది.
ఈ కేసంతా ఆడమయమే! అందరితోనూ మాట్లాడాము. కానీ, అతణ్ణి హత్యచేసే అవసరం ఎవరికీ కలిగిందో బోధపడలేదు. అంధకార బంధురం వంటి ఈ కేసు పరిష్కారంమీద ఏవిధమైన చిన్న వివరం, సహయం అనే కిరణాలు జనం వైపు నుంచి రాలేదు. అతని జీవితంలో ఇంత మంచి ఆడవారికి ప్రమేయ మున్నట్లుంది. గాని, ఒక్క మగవాడికి కూడా ప్రమేయ మున్నట్టు తోచలేదు. రాబిన్స్పీన్ ని ఆడవారంతా తమకు తోచిన రీతిలో ఉపయోగించుకున్నారు. గాని, వారిలో ఎవరికైనా అతనిమీద 'ప్రేమ' ఉందా! లేక అంతమందిలో ఎవరిమీదనైనా అతనికి 'ప్రేమ' ఉందా! అనే విషయం అనుమానాస్పధం. నార్సిసన్ ఒక గ్రీకుదేవతలాగ తన ఆనందాన్ని, అనుభవాన్ని లోపలే యిముడ్చుకున్నాడేమో!
దాదాపు ఒక యాభై మందిని నానా ప్రశ్నలు వేశాక, అతను నిజమైన సంతోషం లేనివాడని, జీవితంలో ఒంటరి అని, తుంటరి అని, డబ్బు పుష్కలంగా పోగుచేసుకున్నాడని, అనవసరపు వూహలు, చెడ్డ స్నేహాలు కలవాడనీ, ఆడవాళ్ళ 'పిచ్చి' అధికంగా కలవాడని, కలవాడు కనుక చెల్లిందని, శుద్ధ చాదస్తుడని, కోపిష్టివాడని, ఎవరెన్ని చెప్పినా వినని మొండివాడని, డబ్బు చేతిలో ఉంటే చేయలేనిది లేదనే స్వభావం కలవాడని, ఆడవారిని కేవలం సంతోషానికి ఉపయోగించుకోవచ్చుననే అభిప్రాయం కలవాడని, నేను అభిప్రాయ పడ్డాను.
కానీ అతనికి తన తల్లి అంటే అమితమైన ప్రేమ. ఆమె ముందతను శాంతంగా ఉంటాడు. తల్లి కొడుకుల మమతలకి వాళ్ళిద్దరే సాటి. కాని, బాహ్యప్రపంచాని కతనో స్త్రీలోలుడు.
స్ఫిన్క్స్ (స్త్రీ ముఖం, సింహ శరీరం కల రాక్షసి) లాగ ఎన్నడూ తన మనస్సులో ఉన్నది బయట పెట్టేవాడు కాదు. ప్రతీవాళ్ళను ద్వేషించే వాడు. తన వ్యాపారానికి, పురోగమనానికి అడ్డువచ్చే చట్టాన్ని దుమ్మెత్తి పోసేవాడు. తను పొందదలుచుకున్న స్త్రీలను లాలించి, బుజ్జగించి నట్టే వ్యాపారంలో పొందదలుచుకున్నవాటిని కూడా లాలించేవాడు.
'మోసగాడు, వంచకుడు' అని మాత్ర అతన్ని అనలేము. ఏ చట్టంలో దొంగదారు లున్నాయో, ఏ చట్టానికి పక్కదారులున్నాయో, తప్పించుకునే మార్గాలున్నాయొ ఫిలడల్ఫియా న్యాయవాదులకన్నా అతనికే ఎక్కువ తెలుసు. నీతికి, నియమానికి వ్యతిరేకంగానే అతను డబ్బు సంపాదించాడనీ నలుగురూ అభిప్రాయపడినా, నిరూపించడానికి తార్కాణాలు లేక-ఆ అభిప్రాయం అట్టే ఉండిపోయింది.
37
పద్మావతి ఒళ్ళు మరిగి పోయింది. మనసు కుమిలి పోయింది. మనుషులు డబ్బును ప్రేమిస్తారని పదేపదే విసుక్కున్నది. నొచ్చుకున్నది. తన ఉద్దేశంలో భాస్కరం సురేఖ పట్ల చూపుతున్న చనువు ఆమె 'డబ్బు'ను చూసేనని - లేకపోతే ప్రేమకు మరో నిర్వచనమిచ్చి అది నిలకడలేనిదనీ మనుషుల అవసరాలతోను అవకాశ అనవకాశాల వల్ల మారుతుందనీ అనుకోవాలి. పద్మావతికి ఉక్రోషంగానూ స్త్రీ సహజమైన యీర్ష్యగానూ ఉన్నందున మరోమాట తోచలేదు.
మర్నాడు 'తలనొప్పి'గా ఉంది జయమ్మగారు కాస్త గాభరాపడ్డది. "మాత్రలు మింగకు కావాలంటే ఏ అంజనమో తైలమో రాసుకుంధువు గాని" అంటూ ఆమె కూతురి వంటిమీద చెయ్యి వేసి చూసింది.
"అబ్బే! ఒళ్ళు వెచ్చగా లేదు....." అన్నది తనకు తనే ధైర్యం చెప్పుకుంటున్నట్లు.
"నే బళ్లోకి పోలేనమ్మా!" కణతలు నొక్కుకుంటూ మంచాన వాలిపోయింది పద్మావతి.
అప్పట్లో అది "మిష"యే ఐనా రానురాను, ఆలోచనల ఉదృతానికి తలవేడికి "శిరోవేధ"గా పరిణమించింది. భాస్కరాన్ని సురేఖనూ పిక్ నిక్ లో చూసిన దగ్గర్నుంచి, ఏ పనీ తోచటం లేదు. ఏ దారీ తెలియడంలేదు.
"సురేఖ నన్ను ప్రేమిస్తున్నానన్నది మోసం! భాస్కరంగారూ అలాగే అన్నాడు కానీ ఆ ఇద్దరూ మోసం చేశారు...... ఇద్దరూ దిగజారి పోతున్నారు."
అదే బాధ, దుఃఖం, కోపం అహం - పద్మావతి భరించలేక లేచి పచార్లు చేసింది.
మధ్యాహ్నం పన్నెండు గంటలైంది. అవతల ఎండ మండిపోతున్నది. ఆమె హృదయం దహించుకు పోతున్నది.
"ఇక ఏం పోతావే అమ్మాయ్! ఎండ జాస్తీగా ఉన్న దవతల" అని జయమ్మగారు కూతురు కాలేజీకి పోతున్నదేమో ననుకొని వారించింది.
"ఇంకెందుకులే! వెధవ కాలేజీ" అని లోపల లోపల గొణుక్కుంది పద్మావతి.
అంతలో సురేఖ గతంలో చాలాసార్లు నవ్వుతూ వేళాకోళమాడిన మాటలు "నీ భాస్కరాన్ని మాత్రం ఎత్తుకుపోనులేవే" అన్నవీ - "లేచి పోడమా! పోతే పోతానుగానీ నీ ప్రియుడితోకాదు..ధైర్యంగా ఉండు" అన్ననీ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. కాస్త మనస్సుకి వూరట.
"కాని...... కాని...... భాస్కరంగారే దాన్ని చూసిందగ్గర్నించీ......ఛీ"-
పద్మావతికి భాస్కరం కావాలి! చదువు కొడం, ఉద్యోగం చెయ్యడం ఇలాంటి వెన్ని చేసినా తృప్తిలేదు. హాయిలేదు "భాస్కరం గార్ని పెళ్ళి చేసుకుందామనుకున్నాను......ఉహ్ఁ! ఈయనకూ ఈయనగారి పిల్లలకూ చాకిరీ చేద్దామనుకున్నాను. కాని......వీళ్ళకు పాడుహోదాముందు ఈ నా ప్రేమ నా గౌరవం అన్నీ అగుపించవ్....." అని బాధ పడ్డది.
అయితే అలా ఎంతసేపు ఆలోచించి మాత్రం......"ఒకవేళ నేనే పొరపడ్డానేమో! పాపం! సురేఖ అన్నట్లు ఆయన కొండ ఎక్కుదామని వస్తూంటేనే పడిపోయి....." ఈ ఆలోచన రావడంతోనే పద్మావతికి చేయిజారిన అమూల్యమైన వస్తువేదో దొరికి నట్లైంది! ధైర్యం కలిగింది......ఆకలేసింది. "అమ్మా" అన్నది గట్టిగా ఉద్వేగంగా.
"కాస్త ఉప్మా చెయ్యవే? అమ్మి?" ఆమె గుమ్మంమీద తలపెట్టుకుని కాసేపు అలా కన్నుమూసుకుని ఉన్నది - కూతురి కేకకు లేచి కూచుని అడిగింది.
"నేనే చేస్తాలేవే...... కాస్సేపు నువ్వు అలాగే పడుకుందూ...." అన్నది పద్మావతి - లేచి వంట ఇంట్లోకి వెళ్తూ.
* * *
"ఛీ! ఛీ! దుర్మార్గురాలిని పాపం! ఆయన కెంత దెబ్బ తగిలిందో......కనీసం దెబ్బతగిలినందుకేనా నేను.....ఆయనను మన్నించవచ్చునే!" కుంపటి అంటిస్తూ తలపోసింది.
"నేను ముందు వెళ్ళిపోయాను. వెనుక ఆయన గారు పడిపోయాడు...... సురేఖ సమయానికి అక్కడ ఉన్నది...... బహుశా గాయమై నెత్తురు కారిందేమో అది దాని రుమాల తీసి కట్టి ఉంటుంది....."-
"అయ్యో! నేనెంత వెర్రిదాన్ని అలా ముందుగా కొండమీదకు పారిపోవడం ఏమిటీ? పాపం! సురేఖా మంచిదే...... ఆయన మంచివారే....." అనుకుంటూ ఉద్వేగంగా లేచింది.
భాస్కరాన్ని, కల్సుకుని క్షమాపణ చెప్పుకుని తన వాణ్ణి చేసుకోవాలి- సురేఖను అనునయంచి బ్రతిమాలి-......
"అమ్మాయ్! అదేమిటే అవతల కుంపటి రగిలి రవ్వలై పోతూ ఉంటే..... నువ్వు వీధిలోకి వెళ్దామన్నట్లు బయట నించున్నావ్?......."
జయమ్మగారు కూతురు ధోరణి చిత్రంగా వుండటంతో విస్మయ మందింది. తానే లేచి గోధుమ రావ్వతీసి 'ఉప్మా', చెయ్యడానికి ఉద్యుక్తు రాలైంది.
గుమ్మంలో నించున్న పద్మావతికి, భాస్కరం వస్తాడేమోనని ఆశ!
"తన పిచ్చి! ఎందుకని? ఎలా వస్తారూ?"-
"పోనీ ! సురేఖ రారాదూ!" అలా ఎన్ని తల పోసినా ఎవ్వరూ రాలేదు. సాయంకాలమయింది.
* * *
మర్నాడు సురేఖను చూడగానే పలకరించాలనుకున్నది పద్మావతి. ఏ పనిమీదా ఆమె మనసు నిలవడం లేదు. ఏ వస్తువు మీదా లక్ష్యం కుదరడంలేదు.....
