Next Page 
వసుంధర కధలు -11 పేజి 1


    మాణిక్యాలరావు అదే తన తండ్రిపేరు.....అంటే అతను పోరాబదలేదు. సరిగ్గానే చెప్పాడనుకోవాలి!
    "నీకేదైనా అన్యాయం జరిగిందా?" అందామె.
    "చాలా పెద్ద అన్యాయమే జరిగింది" అన్నాడు కుమార్ "నా చెల్లెలు నీ కంటే ఏడాది చిన్నది. ఆమెను నీ తండ్రి ఇలాగే రప్పించుకున్నాడు."
    "నేను నమ్మను" అరిచింది శిరీష.
    "నీ నమ్మకంతో నాకు పనిలేదు" అన్నాడు కుమార్.
    శిరీష క్షణం ఆలోచించి "తండ్రి చేసిన తప్పుకు కూతుర్ని శిక్షిస్తావా? నీకు జరిగిన అన్యాయానికి నేనేం చేయగలనో చెప్పు...." అంది.
    "నాతో కాసేపు మధురక్షణాలు పంచుకోవడమే" అన్నాడు కుమార్.
    శిరీష కుమార్ వంక చూసింది. మనిషి సినిమా హీరోలా వున్నాడు. చూడగానే మంచివాడనిపిస్తుంది. అలాంటి వాడిలాంటి వాడని నమ్మడం కష్టం-అనుభవం అయితే తప్ప....
    "వేరే దారి లేదా నాకు?" అంది శిరీష.
    కుమార్ టైం చూసుకుని "అతను రావడానికింకా గంటన్నర టైముంది...." అని "ఈలోగా మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు.
    ఆమె భయంగా, బెంగగా అతడివంక చూసింది.
    "నా చెల్లెలు నీ తండ్రి చేతిలో పడిందని తెలియగానే పరుగు పరుగున వెళ్ళాను. అప్పటికది గదిలో వుంది. నా కేకలు విని ఆయన బయటకువచ్చాడు. ఎందుకలా అరుస్తావని తిట్టాడు. నా చెల్లెలు డబ్బుకోసం తన దగ్గరకు వచ్చిందని చెప్పాడు. సాక్ష్యం కావాలంటే ఓ గంటపోయాక రమ్మన్నాడు. ఆమె వంటిమీద ప్రతిఘటించిన లక్షణాలుండవుట. నేనింకా అరుస్తూంటే నన్నక్కన్నించి గెంటించి వేశాడు. తర్వాత నా చెల్లెలు  ఇల్లు చేరింది. ఏం జరిగిందో నాకు చెప్పుకుంది" ఆగాడు కుమార్.
    "ఏం జరిగింది?" కుతూహలంగా అడిగింది శిరీష.
    "నా చెల్లెకి తల్లిలేదు. అందువల్ల అది నాకు చెప్పుకుంది. ఏం జరిగిందో నువ్వు యింటికి వెళ్ళి నీ తల్లికి చెప్పుకుందువుగాని...."
    శిరీష ఇంకేమీ అడగలేదు. తను బైటపడడం ఆమెకు యిష్టంలేదు. "పూర్ కుమార్!" అనుకుందామె మనసులో "నువు నాకు నచ్చావు. నువ్వు నన్ను తెచ్చిన పద్ధతి కూడా నాకు నచ్చింది. నన్ను బాధపెడుతున్నానని నువ్వను కుంటున్నావు. కానీ నాకిదొక థ్రిల్ అని నీకు తెలియదు" అనుకుంటూనే తన భావాలు ముఖంలోకి కనబడకుండా జాగ్రత్తపడిందామె.
    శిరీష అనాఘ్రాత పుష్పం కాదు. విచ్చలవిడిగా తిరగడం ఆమెకు అలవాటే! శీలం ప్రాముఖ్యతనామె నటిస్తుంది తప్పితే ఫీలవదు. పెళ్ళి గురించి కూడా ఆమెకు బెంగలేదు. డబ్బుతో తండ్రి వరుణ్ణి కొనగలడని ఆమెకు తెలుసును.
    కుమార్ లేని "అతను రావడానికింకా గంట టయిముంది" అని "ఈ గంటా మనది!" అన్నాడు.
    "అతను.....అతను.....అని నన్ను భయపెట్టవద్దు-ప్లీజ్!" అందామె సన్నగా వణుకుతున్న కంఠంతో.
    "నీ భయం నాకు సరదా" అతను అదొకలా నవ్వేడు.
    ఆ నవ్వు శిరీషకు నచ్చింది. కానీ పైకి చెప్పలేదు.
    అతడామెను సమీపించాడు. ఆమె అభ్యంతరాన్ని నటించింది.
    అతడామెను హింసిస్తున్నాననుకుంటున్నాడు. ఆమె సంతోషిస్తోంది.

                                     2

    శిరీష ఏడుపు నటిస్తూ "నన్నన్యాయం చేశావు. పెళ్ళి చేసుకో" అంది. కప్పుకున్న చేతివ్రేళ్ళ సందుల నుండి ఆమె అతడి ముఖాన్ని చూస్తోంది.
    సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది "అతను వచ్చాడు" అంటూ లేచాడు కుమార్.
    శిరీష గుండె దడదడలాడింది. అతను నిజంగా వస్తాడా?
    "ప్లీజ్-అతన్ని పంపేయ్."    
    కుమార్ క్రూరంగా నవ్వి "నిన్ను శారీరకంగా, మానసికంగా హింసించడమే నా ఆనందం" అన్నాడు.
    కుమార్ తలుపు తీశాడు. అతను వచ్చాడు.
    శిరీష అతడి వంక ఆశ్చర్యంగా చూసింది.
    "ఇదీ నీకాబోయే భార్య అసలు స్వరూపం. బరితెగించిన ఆడది. ఆమెలో ఎక్కడా ప్రతిఘటించిన లక్షణాలు లేవు. కావాలంటే పరీక్షించుకో."
    "అక్కర్లేదు. ఆమె అసలు స్వరూపం తెలిసింది. ఇంక నేనీమెను శాశ్వతంగా నా దాన్ని చేసుకోలేను. తాత్కాలికంగా ఈ పూటకు నాదాన్ని చేసుకుని తర్వాత నా హృదయం లోంచీ శాశ్వతంగా చెరిపేస్తాను...."
    "కుమార్ ఎంతపని చేశాడు?" అనుకుందామె. ఇతడి పైన తన తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటళ్ళుడిగా చేసుకుని అన్ని బాధ్యతలూ అప్పగించాలనుకుంటున్నాడు. ఇంటి ఆయువుపట్టుమీద దెబ్బతీశాడు.
    అతను ఆమెను సమీపించాడు.
    "రమేష్-ప్లీజ్ నా జోలికిరాకు" అంది శిరీష.
    "నన్ను నువ్వు ఆపలేవు" అన్నాడు రమేష్.
    "ఇది హత్యకన్నా ఘోరం రమేష్!" అందామె.
    "నీ విషయంలో నేను హంతకుడికన్నా ఘోరమయిన వాడిననుకో!"
    "ప్లీజ్ రమేష్!" అందామె.
    రమేష్ అక్కడ బీరువా తెరిచి ఓ లుంగీపంచ, షర్టు తీసి ఆమె చేతికిచ్చి-"వెళ్ళి స్నానం చేసి-ఇవి కట్టుకుని రా!" అన్నాడు.
    కాసేపు అవీ యివీ చెప్పినా ఆమెకు తప్పలేదు.
    స్నానాల గదిలోకి వెళ్ళింది.
    బయటనుంచి కుమార్, రమేష్ ల మాట లామెకు వినిపిస్తున్నాయి. కుమార్ అంటున్నాడు. "ఆమె నిజంగా భయపడుతున్నట్లుంది. ప్రమాదముండదు గదా!"
    "ప్రమాద మెందుకుంటుంది? వేశ్వ ఒకరాత్రిలో ఒకోసారి పదిమంది మగాళ్ళను భరిస్తుంది...." అన్నాడు రమేష్.
    తన కిక్కడనుంచి మోక్షంలేదని గ్రహించింది శిరీష. ఆమె స్నానంచేస్తూ మానసికంగా ఉల్లాసంగా వుండడానికి ప్రయత్నించింది. స్నానం కాగానే రమేష్ ఇచ్చిన బట్టలు వేసుకుంది.
    గది తలుపులు తీసింది. జరుగబోయేది తల్చుకుంటుంటే ఆమె శరీరం వణుకుతోంది.
    "గుడ్! వెళ్ళి పౌడరు, సెంటు రాసుకుని రా-" అన్నాడు రమేష్ ఆమెవంక కాంక్ష నిండిన చూపులు ప్రసరిస్తూ.
    శిరీష ఏమీ మాట్లాడలేదు. గదిలో కుమార్ లేడు. ఇదే అనుభవం కుమార్ చెల్లెలికి జరిగిందా? జరిగితే అంతకంటే ఘోరం వుండదు. అయితే ఒక ఆడదానికి జరిగిన అన్యాయం తీర్చుకునే మార్గం ఇదేనా? మరో ఆడదానికి అన్యాయం చేయడమే తప్ప పురుషుడికి మరో విధంగా బుద్దిరాదా?
    ఇది పురుష ప్రపంచం......తానీ అన్యాయాన్ని సహించక తప్పదు.....
    శిరీష భగవంతుణ్ణి ప్రార్దించుకుంది. తన ప్రాణాలు రక్షించమంది.
    ఆమె పౌడరు రాసుకుంది. సెంటు జల్లుకుంది. రమేష్ బాహువుల్లో ఇమిడిపోయింది. రమేష్ అంటే ఆమెకిప్పుడు నరనరాలా ద్వేషం....
    కానీ తప్పలేదు.....
    నిస్సత్తువగా మంచంమీద పడివుంది శిరీష. ఆమెవంటి మీద బట్టలు సరిగ్గాలేవు. సర్దుకునే ఓపికకూడా లేదు.
    "రమేష్ వెళ్ళిపోయాడు" అది కుమార్ కంఠం.
    "ఊఁ" నీరసంగా మూలిగిందామె. ఆమె తల గోడ పక్కకు తిరిగివుంది. ఇటు తిప్పే ఓపిక కూడా వున్నట్లు లేదు.
    "అలా నీరసపడిపోతే ఎలా?" అన్నాడు కుమార్ వెటకారంగా-"ఇప్పుడే తెలిసింది. ఇంకా మూడోమనిషి వున్నాడని!"
    శిరీష గుండె ఆగిపోయినట్లయింది.
    "నేను చచ్చిపోతాను" అని ఆమె అరవాలనుకుంది. అయితే పెదవిదాటి మాట బయటకు రాలేదు.
    "అయిదు నిముషాలే టయిం......" అన్నాడు కుమార్ "అవసరమయితే నువ్వు మళ్ళీ స్నానంచేయాలి. మనసు నుల్లాస పరుచుకో-"
    అతణ్ణి వేడుకుని ప్రయోజన ముండదని ఆమెకుతెలుసు. వేశ్య ఒక్కరాత్రికి పదిమందిని భరిస్తుందని తెలుసు. అదెలా సాధ్యమో? అందులో ఇంత బాధ ఉన్నదా?
    ఆమెలో ఓపిక కలగలేదు.
    అయిదు నిముషాలు గడిచినట్లున్నాయి. ఎవరో గదిలో ప్రవేశించారు. అడుగుల చప్పుడు ఆమెను సమీపించింది.
    "ఇటు తిరుగు.....నిన్నేమీ చేయను. ఇలా నిస్త్రాణగా వున్న ఆడదాన్ని వళ్ళంతా తడిమి ఆనందించడం నాకు సరదా-ఈ మనుషుల్ని నేనే నియమించాను.....ఒక్కసారి ఇటు తిరుగు."
    ఆమెకు మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. కానీ కదిలే ఓపిక కూడా లేదు. అతడి చేతులు తన వంటిమీద అస్తవ్యస్తంగా వున్న బట్టల్ని మరింత అస్తవ్యస్తంగా చేశాయి. ఆ తర్వాత.....అతడి చేతులు ఆమెను తనవైపు తిప్పుకున్నాయి.
    తెరిచీ.....తెరవని......కన్నులతో ఆమె అతికష్టం మీద అతణ్ణి చూసింది. అంతే-ఆ కన్నులు పెద్దవయ్యాయి.
    "అమ్మా-శిరీషా!" అన్నాడు మాణిక్యాలరావు.
    "సార్!" అంది వెనుకనుంచి కుమార్ కంఠం-"పరీక్షగా చూడండి. ఆమెవంటిమీద ప్రతిఘటించిన లక్షణాలు కనబడవు. పైగా మనిషి ఘుమఘుమ లాడిపోతోంది కూడా!"
    "కుమార్-దుర్మార్గుడా-ఎంత పనిచేశావు?"
    "సార్! ఎప్పుడూ మీవల్ల ఇదేపని జరుగుతోంది. ఇంతకాలం మీరు ఆ యువతుల ముఖాలను పరిశీలనగా చూడలేదు. చూస్తే వాళ్ళలోనూ మీకు కూతురు కనబడివుండేది" అన్నాడు కుమార్.
    మాణిక్యాలరావు కుమార్ ను దుమ్మెత్తి పోస్తున్నాడు. కుమార్ అవేమీ పట్టించుకోకుండా శిరీషవంక తిరిగి-"మిస్ శిరీషా! నీ తండ్రి లతాసదనంలో యేం చేస్తాడో తెలుసుకున్నావు గదా-ఈయన నా చెల్లిని వేశ్యావాటికకు అమ్మేశాడు. ఆయన్నడిగి ఆమెను నాకు తిరిగి యిప్పించు. ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆడదానిగా వేశ్య పడేబాధను అర్ధం చేసుకునే వుంటావు. నాకీ సాయంచేయి" అన్నాడు.
    శిరీష నీరసంగా మూలిగి, కళ్ళుతిరిగి పక్కమీద అచేతనంగా పడిపోయింది.


                                               :-అయిపోయింది:-


Next Page 

WRITERS
PUBLICATIONS