Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 27

 

    వెంకటలక్ష్మీ స్పృహ తప్పి కుప్పకూలి పోయింది.
    ప్రకాశరావు ముఖం తెల్లగా పాలిపోయింది. మనోరంజని అరుంధతి ముఖం వంక చూసి గర్వంగా నవ్వింది.
    సుందర్రావు భుజాలెగరేసి ప్రకాశరావు వంక చూసి చిలిపిగా నవ్వాడు.
    బంగారు బొమ్మలా ఉన్న పదేళ్ళ వెనుకటి వెంకటలక్ష్మీ ని కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయింది అరుంధతి.
    
                                *    *    *    *

    "ఇప్పటికే నిన్ను క్షమిస్తున్నాను. లేచిరా!" తార గొంతు విని నిద్రలో ఉలికిపడి లేచాడు రవి.
    అది నిద్రకాదు. అతనికి నిద్ర పట్టలేదు. తార గొంతు అతనికి కలలో వినిపించలేదు! అసలతనిని ఆమె కంఠస్వరం విడువనే లేదు. అనుక్షణమూ అతని హృదయంలో నుండి, తార "నిన్ను క్షమిస్తున్నాను" అని పిలుస్తూనే ఉంది.
    రవి కాలేజీకి వెళ్ళలేదు. లైబ్రరీ కి వెళ్ళలేదు. శ్రీధర్ ఇంట్లో తన గదిలోంచి బయటకు రాలేదు. అద్దంలో తన ముఖం తను చూసుకోవటానికి తనకి భయం వేసింది. తన ముఖం ఇంకొకరికి చూపించటానికి కతనికి సిగ్గు వేసింది.
    ఒక్క క్షణం తార తన ప్రక్కన నిలబడితే చల్లగా ఒక్క మారు చూస్తె, తన దుఃఖమంతా నశించి పోతుంది. కానీ, తన కార్హత ఎక్కడిది? రాక్షసులూ, పిశాచాలూ అని వర్ణిస్తారు. ఆ ఉపమానాలేవీ తనకు సరిపోవు. తనను పోల్చటానికి నిఘంటువు లలో పదాలు దొరకవు.
    డాక్టర్ శ్రీధర్ కొన్నాళ్ళు రవి విషయం పట్టించుకోలేదు. కానీ, అతడు బొత్తిగా గది వదిలి రాకపోవటం వల్ల అనుమానంతోచి రవి దగ్గరకు వచ్చాడు. రవి ముఖం చూసి ఆశ్చర్య పోతూ "నీకు వంట్లో బాగుండలేదా? నాకెందుకు చూపించుకోలేదూ?" అన్నాడు.
    రవి మనసులో లావా మరుగుతోంది. తన కధ విన్న ఎవరైనా తన నసహ్యించుకొంటారని అతనికి రూడిగా తెలుసు! అయినా డాక్టర్ కు అంతా చెప్పేసాడు.
    "నన్ను తిట్టండి డాక్టర్! నన్ను చీదరించుకొండి! నన్ను వెలివేయండి! ఏదైనా ఇంత విషమిచ్చి నాకీ యమయాతన నుండి విముక్తి కలిగించగలరా?"
    డాక్టర్ అతని వంక జాలిగా చూసాడు.
    "క్రిష్టియన్స్ వర్ణించే ఆ ఆదిమ మానవుడి మొదలు ఈ నాటి వరకూ , అందరినీ సైతాన్ వశపరచుకొంటూనే ఉన్నాడు. భగవంతుడు మానవునకు ప్రసాదించే ఉత్తమోత్తమమైన వరాలనెన్నింటినో ఈ సైతాన్ చేతుల్లో ధారపోసి మానవుడు విలవిలలాడుతూనే ఉన్నాడు.
    కానీ, రవి దేవత లేప్పటికీ దేవతలే! ఒకసారి నిన్ను క్షమించగలిగిన తార నిన్ను మళ్ళీ క్షమించగలదు. వెంటనే తార దగ్గిరకు వెళ్ళు!"
    "ఏ మొహం పెట్టుకొని, తార దగ్గిరకు వెళ్ళను డాక్టరు గారూ?"
    "వెర్రివాడా! తార నీ బలహీనతలు చూసి అసహ్యించుకునే వ్యక్తే అయితే, ఆమె హృదయంలో స్థానం పొందగలిగేవాడివే కాదు. ఎదుటి వారి బలహీనతలకు సానుభూతి చూపిస్తూ , వారిలో అణగిమణగి ఉన్న ఉత్తమ శక్తులను ప్రభోదించే అమృత హృదయం గల తార, నువ్వెన్ని మహా పాతకాలు చేసినా కూడా క్షమిస్తుంది."
    "డాక్టరు గారూ! నే నామేనెంత దారుణంగా అవమానించానో , మీకు తెలియదు!"
    "తెలుసు! అయినా తార నిన్ను క్షమిస్తుంది. ఆమె ప్రేమ మూర్తి-- నిన్ను ప్రేమించిన తార నీలోని ఎంతటి దోషాన్నయినా క్షమిస్తుంది. వెంటనే వెళ్ళు. ఒకవేళ తార నిన్నసహ్యించుకొని తిడ్తుందనుకో! నీకు నష్టమేమిటీ? అందుకు నువ్వు అర్హుడివి కావా?"
    ఈ మాటలు రవికి చాలా నచ్చాయి. తార తనను క్షమించగలిగితే తనను దేవతలు ఆశీర్వదించినట్లే! అలాకాక, తార తన నసహ్యించుకొని నిందిస్తే, తన గుండె మంట కొంత ఉపశమిస్తుంది.
    ఆసాయంత్రమే లైబ్రరీ కి వెళ్ళాడు రవి. తార ఒక్క నెల మాత్రమె పని చేసిందనీ, తర్వాత రిజైన్ చేసిందనీ తెలిసింది. ప్రకాశరావు'గారింటికి వెళ్ళాడు. ఇల్లు తాళం వేసి ఉంది! చివరకు వెంకటలక్ష్మీ కూడా ఎక్కడకు వెళ్ళిందో?
    తార బహుశా ఇంట్లోనే ఉండి ఉంటుంది. ఆమెను కలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. సుందరరావును తలచుకోగానే రవికి శరీరమంతా దహించుకు పోయింది. తిన్నగా సుందర్రావు ఇంటికే వెళ్ళాలి! తారను కలుసుకొని, సుందర్రావే తనకు వల పన్నాడని తెలియజెయ్యాలి. తను మూర్కుడూ, బలహీనుడు గనుక ఆ వలలో చిక్కిపోయానని ఆమెకు చెప్పుకోవాలి! తరువాత తార తనను అసహ్యించుకొన్నా, క్షమించినా ఈ విషయం మాత్రం చెప్పి తీరాలి.
    రవి సుందర్రావు ఇంటిని సమీపించేసరికి ఆవరణ లో ఎందరో గుమిగూడి ఉన్నారు. ఎవిటేమిటో గుసగుస గా చెప్పుకొంటున్నారు. సన్నగా ఏడుపులు, వినిపిస్తున్నాయి. రవికి గుండెలు దడదడలాడాయి. కాళ్ళు వణికాయి. గుంపును తోసుకొంటూ లోపలకు వెళ్ళాడు.
    కటిక నేల మీద కట్టెల శయ్య పై అంతిమ ప్రయాణానికి సిద్దంగా ఉన్నది తార!
    కెవ్వున కేక వేసాడు రవి!
    తలవంచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న సుందర్రావు రవి కేక విని దిగ్గున తలెత్తాడు. రవిని చూస్తూ ప్రళయరుద్రుడయ్యాడు.
    "ఇడియట్! మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావురా! బంగారం లాంటి నా చెల్లెల్ని పొట్టన పెట్టుకొన్నది చాలక "తగుదునమ్మా" అని వచ్చావా? సుందర్రావు చెల్లెలు కదా మూటలు తెస్తుందని ఆశపడి, ప్రేమ, ప్రేమ అన్నావు. నేనేమీ ఇవ్వనని తెలిసేసరికి పో పోమ్మన్నావు. ఇది ఆత్మహత్య కాదు! హత్య! హత్య చేసింది నువ్వు! నీ మొహం చూస్తుంటే నీ పీక పిసికేయ్యాలనుంది . గెటవుట్!"
    సుందర్రావు రవి నోక్కతోపు తోశాడు. ఆతోపుకు రవి బోర్లా పడ్డాడు. లేచి కడసారి తార నొక్కసారి చూడాలని రాబోతుంటే సుందర్రావు సైగ నందుకొన్న నౌకరు బయటకు ఈడ్చుకు పోయాడు.
    అక్కడే కూలబడ్డాడు రవి.
    "ఇప్పటికీ నేను నిన్ను క్షమిస్తున్నాను"
    "అవునా తారా? ఇంకా నన్ను క్షమించగలవా?  ఎక్కడున్నావు నువ్వు? నిజంగా నేనే నిన్ను హత్య చేసానా? ఈ లోకానికి నీ బౌతిక శరీరం శాశ్వతంగా దూరం కాకముందు చివరిసారి ఒక్కసారి నీముఖం చూసే ప్రాప్తం లేదా?"
    తను లోపలకు వెళ్ళి తారను చూడలేడు. తన మాట చెల్లదు. తనేమీ చెయ్యలేడు. తనచేత ఏ పనైనా చేయించగలిగే తార లేదు. తనచేత నిర్భయంగా చాటగలిగే ఆ దీరురాలీని, మంచితనం మూర్తీభవించిన ఆ ముగ్ధను, తాను స్వయంగా గుండెల్లో పొడిచాడు. రవి ఆ గేటు దగ్గిరే కూలబడ్డాడు. తారను చూడాలి! ఆ కళ్ళు మూతపడ్డా, ఆ పెదిమలు కదలక పోయినా తన నీ స్థితిలో చూసిన ఆమె తప్పక తన నాశ్వాసిస్తుంది.
    అహం పూర్తిగా నశించి ఆర్తితో తన గేటు దగ్గిర దుమ్ములో కూలబడ్డ రవిని చూసి ఉంటె నిజంగానే తార మృత్యుదేవతను జయించి వెనక్కు తిరిగి వచ్చి, అతని నోదార్చేదేమో?
    కానీ, బ్రతికినంత కాలమూ, ఆడంబరాలను అసహ్యించుకొన్న తార అత్యంతాడంబరంగా వందమంది తనను చుట్టి రాగా మేళ తాళాలతో సాగిపోయింది.
    సుందర్రావు కు తన చెల్లెలి పై గల అభిమానం ప్రకటించుకోవడాని కిదోక్క మార్గమే మిగిలింది. తార మీద జల్లిన పూవ్వులను తప్ప మరేమీ చూడలేకపోయాడు రవి. ఆమెకు కడసారి పుష్పాంజలి అర్పించుకోవడాని కైనా నోచుకోలేదు. అనంత మైన ఆత్మ బలంతో తార పూడ్చిన అంతస్తుల అఘాతం ఆమె కన్ను మూయగానే మరింత విస్తృతి చెందింది. తార వెనుక సాగుతున్న డ్రమ్ వాయిద్యం , కాలపురుషుడు తన గుండెల మీద మ్రోగిస్తున్న విలయ సంగీతం తో శృతి కలుస్తుండగా , తాను కూడా అందరి వెనుకా తారకు అరమైలు దూరంలో నడిచాడు.
    కాలం ఎలా సాగిందో , ఏం జరిగిందో రవికి తెలియదు. అతనికి తెలిసింది, ఎట్ట ఎదురుగా కన్పిస్తున్న బూడిద! సూట్లూ, కారులు , భవనాలూ అన్నీ వైభోగాలూ, జీర్ణం చేసికొన్న బూడిద! మంచి చెడ్డల కతీతమైన బూడిద!
    గొప్పవాళ్ళూ, బీదవాళ్ళూ , అకారులు, అనాకరులూ , ఉన్నతులూ, నీచులూ, అందరికీ మిగిలేది అదే! మానవుడు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, సర్వ సమానత్వాన్ని సాధించగలిగిన దశ!
    రవి అక్కడి నుండి కదిలి రాలేదు. కొందరతడిని పిచ్చి వాడన్నారు. కొందరు మహా భోగి అన్నారు. కోందరతడిని చూసి నవ్వుకొన్నారు. కోందరతడిని గౌరవించి పూజించారు.
    రవికి మాత్రం బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఇప్పుడతడు బయటకు చూడటం లేదు. తనలోకి చూసు కొంటున్నాడు. తనలో జాజ్వలంగా మెరిసే తారలో మరేదో దివ్య స్వరూపం లీలగా తోస్తుంది. దాని నవగాహన చేసికోవడానికి సాధన చేస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS