Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 27

 

                                   14
    
    కాలం పరుగెడుతుందా అన్నట్టుగా హెడ్ క్లర్క్ తలపై వేలాడుతున్న గడియారం పండ్రెండుగంటలు కొట్టింది.
    
    "రెండు గంటలు గడిచిపోయాయి! తనేం ఆఫీసు పని చేసింది?" అనుకుంది నంద.
    
    నెలకింత జీతం అని పేరు! రోజు కెంత వస్తుంది?
    
    అందులో పనిచేసే గంటలెన్ని?
    
    గంటకెంతవుతుంది జీతం?  

 

    నిజంగా పనిచేసే కాలమెంత?
    
    నెలకి ఆరువందలు- రోజుకిరవై.    

 

    గంటకు దాదాపు మూడు రూపాయలు గిడుతుంది.
    
    కానీ మొత్తం రోజులో ఏ మూడు గంటలో పనిచేస్తారు.
    
    అంటే గంటకి ఏడు రూపాయలు.
    
    ఏ కూలీకి గిడుతుంది ఈ జీతం? అనుకుందామె.
    
    అంతలో-
    
    ఆఫీసులో కలకలం బయలుదేరింది.
    
    ముందు రూముల్లోని వాళ్ళంతా లేచి నంచుంటున్నారు.
    
    ఏమిటో అని చూసింది నంద.
    
    ఎవరో ఠీవిగా దర్పంగా ప్రవేశిస్తున్నారు ఆఫీసులోకి.
    
    మేనజర్ మహాశయుడు నక్కవినయాలు ప్రదర్శిస్తూ అతన్ని అనుసరిస్తున్నాడు. అద్దాల గుండా చూసింది నంద. 

   

    "ఎవరతను స్టెల్లా?" మెల్లిగా ప్రశ్నించింది.
    
    "నువ్వు చూడలేదు కదూ? అతను హెడ్ ఆఫీసునుంచి వచ్చాడు. పి.ఏ.టు జనరల్ మేనేజరు!"
    
    "ఉహూఁ అందుకన్నమాట ఆ నక్క వినయాలు!" అంది నంద.
    
    అతను నేరుగా ఆఫీసరు గదిలోకి వెళ్ళాడు.
    
    "స్టెల్లా!!" మళ్ళీ పిలిచింది నంద.
    
    "ఏమిటి?"
    
    "ఇతనేవూర్లో చదివాడో తెలుసా?"
    
    "ఊఁ"
    
    "ఎక్కడ?"
    
    "చెప్పింది స్టెల్లా"
    
    ఆశ్చర్యపోయింది నంద.
    
    అతను ప్రమోద్కుమార్ కదూ! అనుకుంది.
    
    ఆమె మాటలు విన్న స్టెల్లా "అవును ప్రమోద్ కుమారే! గిట్టనివాళ్ళు ప్రమోద్ కుమార్ అంటారు!" అంది నవ్వుతూ.
    
    నంద ముఖం కొద్దిగా మాడిపోయింది!
    
    "ఏమిటి అలా అయ్యావు?"
    
    "స్టెల్లా ఇతనింత మంచి పోస్టులో వున్నాడు. మనకేదయినా అపకారం కలిగిస్తాడంటావా?" కొంచెం ఆందోళన ధ్వనించే గొంతుకతో అంది.    

 

    "మనకా! మనకి ఎందుకు అపకారం కలిగిస్తాడు అయినా నందా నీ ముఖం ఎందుకలా అయింది? నీకు తను ఇంతకుముందే తెలుసా?"
    
    "ఊఁ" అర్దోక్తిలో అంది.  

 

    "నందా ఏదయినా లవ్ ఫెయిలా?" కుతూహలంగా అడిగింది స్టెల్లా నందిని నిశితంగా పరిశీలిస్తూ.
    
    ఛ! ఛ! అసహ్యంగా వుంది. ఇతడితోనా లవ్స్ ఎఫెయిర్?    
    
    "మరేమిటి కధ?"
    
    "కధంటూ ఏమీలేదు. ఇతను నా కాలేజ్ మేట్. నేను ఫస్టియర్ లో వుండగా ఫైనలియర్లో వుండేవాడు.
    
    "వూహూఁ! ఇంటరెస్టింగ్ సబ్జక్టే! చెప్పు విందాం!"
    
    ప్రమోద్ కుమార్ తండ్రి చంద్రమోహన్ బిజినెస్ మేన్ అతను నారాయణ పొరుగు మనిషీ అయినా అతనెన్నడూ నారాయణని మనిషిగా గుర్తించి ప్రవర్తించలేదు ధనం హోదా, సంఘంలో పలుకుబడి వున్న అతనికి నారాయణ అంటే పిపీలికతో సమానం!
    
    తన ఆస్తి, ఐశ్వర్యాల ముందు, మామూలు మధ్యతరగతి మనిషి నారాయణ. అతనికి పంట మొక్క పక్క కలుపు మొక్కలా కనిపించే వాడతనికి.
    
    పలకరించాలంటే అసహ్యం అన్నట్టుగా, పక్కపక్కన కలసి వుండటం అవమానం అన్నట్టుగా వుండేవాడతను.
    
    అయితే నారాయణ చిదానంద స్వరూపుడు.
    
    సన్యాసులు నోటితో బోధించే విస్సంగత్వం అతనికి జన్మతః వచ్చినట్టుగా వుంటాడు.
    
    అతనికి చంద్రమోహన్ తనని నిర్లక్ష్యం చేసినా ఒకటే లక్ష్యపెట్టినా ఒక్కటే! పట్టించుకునేవాడు కాడతను.
    
    కానీ చంద్రమోహన్ గుణాలు వారసత్వంగా పుణికి పుచ్చుకున్న ప్రమోద్ దృష్టిలో నారాయణ ఆఫ్ట్రాల్!
    
    ఆయన కూతురు నంద ఒక డాలి బేబీ.
    
    కానీ అతనికి నంద తనని గుర్తించకపోవటం పెద్దలోపంగా అనిపించేది.
    
    కాలేజీలో హీరోగా దాదాపు ఇండియా ప్రెసిడెంట్ అంత ప్రివిలేజ్ అనుభవిస్తోన్న అతనికి నంద తనని నిర్లక్ష్యం చేయటం పెద్ద అవమానంగా అనిపిస్తుంది.    

 

    ఇదెందుకు అనుకున్నాడు. దాన్ని సాధించాలి అనుకున్నాడు. కాలేజీ వదిలేలోగా దీనికి పాఠం చెప్పాలి అనుకున్నాడు.
    
    సమయం కోసం కాచుకుని వున్నాడు.
    
    యుద్ధం ప్రకటించే ముందు రాయబారాలు నడిపినట్టు ఆమెని సాధించబోయే ముందు తన వీరత్వం ప్రకటించాలనుకున్నాడు. చంద్రమోహన్ కుమారరత్నం ప్రమోదకుమార్.    

 

    నందా కాలేజీకి బయలుదేరే సమయానికి సరిగ్గా అతను తన ఇంటిగేట్ ముందు నుంచి సైకిల్ పై కదిలేవాడు.
    
    ఈలలు, వెకిలిచూపులు! హుషారయిన పాటలు సూటి పోటి మాటలు! రేడియో కార్యక్రమాలు వారానికి షెడ్యూలయినట్టుగా అతను ఒక్కరోజూ ఒక్కో కార్యక్రమం నిర్వహించేవాడు.
    
    నందకి తొలువొల్త ఇవి అర్ధం కాలేదు.
    
    పక్కింటి అబ్బాయి, అయినవాళ్ళు సుపుత్రుడు, కలిగి ధనవంతుల కుమారరత్నం షోకిల్లా అనుకుంది.
    
    కానీ వారం తిరిగే సరికల్లా నాటకోత్సవాల్లో ప్రదర్శించబడేనాటకాల్లో చౌకబారు హీరోలాంటి అతని ప్రవర్తన ఆమె అసహ్యం కలిగించింది.
    
    ఆమెలోని అభిజాత్యం బుసకొట్టింది కోపంతో-
    
    ఒకరోజు మామూలుగా కాలేజీకి బయలుదేరింది.
    
    "హలో!" వీధి మలుపు తిరుగుతూ వుండగా సైకిల్ ని ప్రక్కగా తెచ్చి పిలిచాడు ప్రమోద్.
    
    చప్పున "హలో!" అనేసి తలతిప్పి చూసింది. వెంటనే 'నువ్వా!' అంది అసహ్యంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS