Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 24

 

    అందుకనే ఆయన ఎప్పుడూ జీవితానికి సంబంధించిన విషయాలే డిబేట్స్ కి యిస్తారు. చదువుకునే రోజుల్లోనే జీవితాన్నీ చదువుకోవాలనేది ఆయన సిద్దాంతం!
    
    అప్పుడు చాలామంది రకరకాలకోరికలు వెలిబుచ్చారు మన మేరీ డిగ్రీ కాగానే మంచి ఉద్యోగస్తుడిని చూసి పెళ్ళి చేసుకుని ఉత్తమ గృహిణిగా జీవితం గడపాలని ఉందని చెప్పింది ఉద్యోగాలు చేయడం తన కిష్టం లేదంది. ఒక వేళ భర్త కోరితే చేస్తానంది. తను ఎప్పుడూ ఫారిన్ లైప్ నే కోరతానంది. అక్కడి జీవితం- యిక్కడి- యీ ఇండియాలో - యీ ఆంధ్రాలో జీవితం పోల్చి పోల్చి చెప్పింది- అదృష్టవంతురాలు అనుకున్నది సాధించింది!"
    
    "నందా!" పిలిచింది స్టెల్లా.
    
    "ఏమిటి?"
    
    "నేనూ నిజానికి అలాంటి లైఫ్ నే కోరుతున్నాను. నాకూ విదేశీ వ్యామోహం వుండేది. ముఖ్యంగా నాకు ఇంగ్లండ్ వెళ్ళాలని వుండేది!"
    
    "ఎందుకు?"
    
    "నాకు అమెరికా అన్నా అమెరికన్స్ అన్నా అభిమానం లేదు. నా దృష్టిలో బ్రిటిషర్స్ మాత్రమే గొప్పవారు. బహుశా వాళ్ళు దేశదేశాల్లో పాలించడమే కావచ్చు లేదా మా నాన్న గారెప్పుడూ విదేశీయుల్ని నిందిస్తూ బ్రిటిష్ వారిని పొగడడమే కావచ్చు. ఆయన రావుబహద్దూర్ తెలుసుగదా ఆలాటి నాకు చాలా చేదు అనుభవం అయింది."    

 

    "ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగింది నంద.
    
    "అవును! ఒకసారి నాకు ట్రెయిన్ లో ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతని పేరు క్లైవ్. నిజంగా అప్పటి రాజు నా కోసం వచ్చినట్టుగా ఆనందపడ్డాను. నేను పరిచయం చేసుకునేందుకు నేనెంత ఆరాటపడ్డానో, అతనంత విముఖత చూపాడు. దాంతో నాకింకా ఉబలాటం పెరిగింది!"
    
    "అంతేకదు! అంది నంద.

    

    "కదా మరి!"
    
    "ఎలాగయితేనేం అతనితో ఫ్రెండ్ షిప్ సంపాదించారు ట్రెయిన్ దిగేసరికి అడ్రసు సంపాదించాను. ఇండియా నుంచి తిరిగి లండన్ వెళ్ళగానే ఉత్తరం రాస్తానన్నాడు. అతను యూనివర్శిటీలో చదువుతూ, ఏదో ఉద్యోగం కూడా చేస్తున్నాడట!" ఆగింది స్టెల్లా.
    
    కుతూహలంగా వినసాగింది నంద.
    
    "అక్కడికి వెళ్ళాక అతను రాశాడు. ఇండియన్ అంతా స్వార్ధపరులు. వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు నన్ను ట్రాప్ చేయడానికి చాలామంది ఆడవాళ్ళు ప్రయత్నించారు. పెళ్ళికోసం లేదా తాత్కాలిక సుఖంకోసం తద్వారా డబ్బు! వీళ్ళముందు వాళ్ళ ఆశ ఎంతకయినా వెళుతుంది. ఆఖరికి శీలాన్నయినా లెక్కించరు. అలాంటి మీతో ఫ్రెండ్ షిప్ చేయలేదు అని రాశాడు!"
    
    "కంటెమ్ట్ ఆఫ్ కోర్టు క్రింద కేసు పెట్టాల్సిందే!" ఆగ్రహంగా అంది నంద.
    
    నిట్టూర్చింది స్టెల్లా!
    
    "మనం ఆశ పడటం తప్పు కదా! అనుకుని మౌనం వహించాను.
    
    "మనుషుల్లో చిత్రమైన మనస్తత్వం వుంటుంది. స్టెల్లా సులభంగా డబ్బు సంపాదించాలనీ, సుఖంగా బ్రతకాలనీ, ఎక్కడ లేని కీర్తి తమకు రావాలని వుంటుంది. ఆశ మంచిదే. కానీ దురాశే చాలా చెడ్డది."
    
    "అదీ సహజమేమో!"
    
    "కాదు సహజమన్నంతగా మారిపోయాం మనం! రోజూ పేపర్లో మానభంగాలు, దోపిడీలు వినివిని అవి మనకి సర్వసామాన్యమై పోయినట్టుగా దురాశకూడా ఈరోజుల్లో ఆశగా అయిపోయింది!" అందామె.
    
    "ఇంతకీ డిబేట్స్ లో నువ్వేం కోరేదానివి!" అడిగింది స్టెల్లా.
    
    "మంచి ఇల్లు, ఇంట్లో ప్రతిదానికీ ఓ ప్రత్యేకమైన గది కిచన్, డ్రెస్సింగ్, డైనింగ్, డ్రాయింగ్, బెడ్ రూమ్ వుండాలి విడివిడిగా ఇంట్లో ఒకో వ్యక్తికి ఒక్కో పర్సనల్ రూం బెడ్ రూం వుండాలి! అదోలా చెప్పుకపోతోంది నంద.
    
    "మీ ఇల్లు చాలా ఇరుకా!" అడిగింది స్టెల్లా.
    
    "ఆ, అప్పుడూ, ఇప్పుడూ అందుకే అలా కోరుకున్న దాన్ని ఇంటిచుట్టూ పెరడు- పెరట్లో వెనకవైపు కిచన్ గార్డెన్ చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లు "ఇంటి ముందు పూల మొక్కలు. కారు, టెలిఫోన్..."
    
    "గొప్ప జీవితమే-" నవ్వుతూ అంది స్టెల్లా.
    
    "ఒక్కో గదిలో అలంకరణ ఎలా వుండాలంటే మనింటికి ఎవరు వచ్చినా వాళ్ళ దృష్టిలో ఇల్లు ఒక తీపి గురుతుగా వుండిపోవాలి! ఇక భర్త...
    
    "ఐ.ఏ. యస్. ఆఫీసర్-"    

    "ఉహూ!"
    
    "ఫారిన్ రిటర్న్-"
    
    "అఫ్ కోర్స్..."
    
    "సినిమా నటుడు"    

    "ఊహూ"
    
    అయితే తప్పకుండా ఇండస్ట్రీయలిస్ట్..."
    
    "అవును! ఇంతేకాదు. అతను మాంచి భూస్వామి అయివుండాలి. మాగాణి పొలాలు, మెట్టపొలాలు, తోటలు- వాటిలో ద్రాక్ష, నిమ్మ, కొబ్బరి, మామిడి తోటలు..."
    
    "అమ్మో-"

 

    "స్టెల్లా...ఆయనకి ఊటీలోనో, కొడైకెనాల్ లోనో, కాశ్మీర్ లోనూ ఒక విశ్రాంతి గృహం వుండాలి. మద్రాస్, బెంగుళూర్, హైద్రాబాద్, బాంబే, ఢిల్లీలలో ఒక్కో ఇల్లు వుండాలి. ఎప్పుడూ కేంప్స్ వెడుతూ వుండాలి!"
    
    పకపక నవ్వింది స్టెల్లా.
        
    "కాలేజీలోనూ అందరూ ఇలాగే నవ్వారు. నేను చాలా సీరియస్ అయిపోయాను. మనస్సులో కోరిక చెబితే తప్పా! అని వాదించాను. ప్రిన్సిపాల్, మా తెలుగు హెడ్ నేను కరెక్టే నని వాదించారు. కొందరు ఇది ఇండియా ప్రెసిడెంట్, ప్రధాని కావాలని చెప్పలేదా ఇదీ అంతే అన్నారు!" ఆగింది నంద.    

 

    కాఫీ తీసుకుని వచ్చాడు ఎటెండర్.
    
    "పదకొండైందా? మైగాడ్! ఈ రోజు ఒక్క పేపరు కూడా చూళ్ళేదు నేను!!" అంది స్టెల్లా.
    
    నంద కూడా ఏమీ అనలేదు.
    
    కాఫీ మౌనంగా తాగేసింది.
    
    ఆమె మనస్సంతా చేదుగా వంది.
    
    ఆలోచనలు చుట్టూ బిగుసుకుంటున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS