"నువ్వు ఈ ఇంటి కోడలివి కాగలవా రాధా! అంటే విశ్వనాధన్ నిన్ను చేసుకోవాలను కుంటున్నాడు....బలవంతమేం లేదు. నీకు ఇష్టమైతేనే అని ఆమెవైపు పరిశీలనగా చూస్తున్నారు శ్రీనివాసయ్యరు.
తానూహించని ఎప్పుడూ అలా అనుకోని....అతని ప్రశ్నకు దిమ్మెరపోయి షాక్ తిన్నట్టయి చలనంలేకుండా ఉండిపోయింది కొన్నిక్షణాలు. శ్రీనివాసయ్యరు......ఆ నాడు తను దిక్కులేని అనాధగా పసిదానిగా దీనంగా రోదించే తన నాదరించి ఓదార్చి ఆశ్రయమిచ్చి, తన నొక వ్యక్తిగా రూపొందించిన శ్రీనివాసయ్యరు. వ్యాకుల మనస్సుతో. తీరని ఆవేదనలో అంతులేని దుఃఖంతో భార్యా వియోగ బాధతో తననాయింటి కోడలిగా చేసి ఏదో తన ఇంట్లో లోపించిన ఆనందాన్ని తిరిగి సృష్టించాలనే తాపత్రయంతో, తాను అతని మాట కాదనదనే విశ్వాసంతో అలా ఆశగా అర్ధిస్తూన్నట్టున్న అతని ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలి? ......విశ్వనాధన్ తనను కోరుకుంటున్నాడా? భగవాన్ అతని చురుకైన చూపులూ, కటువుగా ఉండేమాటలూ, ఇంకా అతను నౌకర్లను శాసిస్తూంటే ఎన్నోసార్లు అతణ్ణి ఏవగించుకుంది తఃను. అతన్కి దయా, ఉదారతా, ఏకోశానా లేవు. అతను తన్ను కోరుకుంటున్నాడా?..... తనను కాదు. తన అందాన్ని...వయస్సుని ......అనుభవించాలనే తృష్ణ..... తనకు తెలుసు. శ్రీనివాసయ్యరుకూ తెలుసు విశ్వ నాధన్ తిరుగుబోతని. అలాంటి అతనికి భార్యయై అతన్ని భర్తగా ప్రేమించలేని తను అతన్ని ఏం సుఖపెట్టగలదు?
గొంతు నొక్కెసే కృతజ్ఞత. ఎదురు తిరిగే స్వార్ధం తన హృదయంలో గుప్తంగా దాగిన రామకృష్ణ మా ఉప్పుతిని మనిషిగా బ్రతికావ్. నన్నెలా కాదంటావ్? వికటంగా నవ్వే విశ్వనాధన్. తల తిరిగిపోతూంది రాధకు. ప్రస్తుత కర్తవ్యం ఏమిటో! ఏమని చేస్తే తాను నిందితురాలూ కృతఘ్నురాలు కాకుండా ఉండగలదో.....నిర్ణయానికి రాలేకా, జవాబు తెలియకా జలజలా కన్నీరు కార్చింది రాధ.
"ఎందుకమ్మా కన్నీరు?.......ఆ కన్నీటికి అర్ధం నువ్వే చెప్పాలి. ఈ ఇంటి కోడలిగా నేను కోరినందుకు కృతజ్ఞతా పూర్వక ఆనంద బాష్పాలా...... లేక....
"కాదు. బాబయ్యా....నన్ను క్షమించండి. విశ్వనాధన్ ని ఒక అన్నగా మాత్రమే ప్రేమిస్తున్నాను. అలానే ప్రేమిన్చాగాలను. నా హృదయంలో వేళ్ళునాటిన ఆ భావాన్ని మరొకలా మార్చి, భార్యగా అతనికి న్యాయం చేకూర్చలేను. అతన్ని సుఖపెట్టలేను, మరోలా నన్నపార్ధం చేసుకోకుండా దీంతో నన్ను క్షమించండి బాబయ్యా" ఏడ్చింది రాధ.
"ప్చ్ పొరపాటు చేశాను. తొందరపడ్డాను. మీకక్కి మనిషి కళ్ళల్లోకి చూస్తూ భావాలు చదివే స్తాననేది నన్ను. ఇప్పుడు ఎదుటమనిషి చెప్పే మాటలే అర్ధం కావడంలేదు. నామతి పూర్తిగా పోతూంది. మరి ఈ సంభాషణ అంటే ఇప్పుడు మన మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా మరచిపోదాం. ఊ.....పోయి రెస్టు తీసుకో అన్నారు శ్రీనివాసయ్యరు. పిచ్చివాడిలా నవ్వుతూ.
అతనివైపు జాలిగా చూసి వెళ్ళిపోయింది రాధ.
* * *
ఆ సాయంత్రం మామూలుగా వచ్చిన రామకృష్ణకు. తనకూ, శ్రీనివాసయ్యరుకూ జరిగిన సంభాషణ చెప్పింది రాధ.
విని కొన్నిక్షణాలు మౌనంగా ఏదో ఆలోచించిన రామకృష్ణ "ఉండు రేపు వాసుతో మాట్లాడతాను. ఎలా అన్నా మన పెళ్ళి జరిపించేలా చూస్తాను" అన్నాడు.
"నాకేమో భయంగా ఉందండీ.......ఇంట్లో విశ్వనాధన్ కి కనిపించడానికే భయంగా ఉంది" అంది రాధ.
"ఛ.....ఛ......బైట ఎలా తిరిగినా తండ్రంటే భయమూభక్తీ ఉన్నాయి తెల్సా అతన్కి.........అతనేం చేస్తాడు నిన్ను? శ్రీనివాసయ్యరింట్లో ఎటువంటి అత్యాచారాలూ జరగవు అతను జీవంచి ఉన్నంతవరకూ అంటూ ధైర్యంచెప్పాడు రామకృష్ణ.
పూలూ, స్వీట్లూ, ఏవేవో చిన్న చిన్న కానుకలు అప్పుడప్పుడు తెస్తున్నాడు రామకృష్ణ సంతోషంగా తీసుకుంటూంది రాధ.
* * *
"మొదటేమో అనుకున్నాను కాని ఆ అమ్మాయి వంశం, సంప్రదాయం అనుమానాస్పదమైనవీ, నీ భార్య అయిన అమ్మాయి మన స్టేటస్సూ, సంప్రదాయం వీటితో సరితూగాలాని నచ్చజెప్పి పెళ్ళి చూపులకి తీసుకెళ్ళారు విశ్వనాధన్ ని శ్రీనివాసయ్యరు.
పెద్ద కట్నకానుకలతో ఆ ఇంటి కోడలిగా వచ్చింది రమణి. నాలుగైదు రోజుల పరిచయంతో, నవ్వతూ వదినా అని పిల్చే రాధవైపు ఆదరంగా చూసేది రమణి. ఇంటి పనులన్నీ సవరిస్తూ. చనువుగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే రమణికి అభిమానపాత్రురాలైంది రాధ.
రామకృష్ణా అలానే ఆమె దృష్టిలో సహృదయుడైన వ్యక్తిగా స్థానం సంపాదించుకున్నాడు.
పార్వతి పోయి సంవత్సరం దాటింది. సంవత్సరకాలంలో రెండు సంబంధాలు తెచ్చారు రాధకోసం శ్రీనివాసయ్యరు. మృదువుగా తన అయిష్టాన్ని తెలియపరచింది రాధ.
"నీకు ఇష్టమైన వరున్నే చేస్తానమ్మా, ఎప్పుడైనా? అలా భయపడుతూ కాక తండ్రికి కూతురు చెప్పినట్టు నాకు ఇష్టంలేదు బాబయ్యా! నేను అతణ్ణి చేసుకోను. తర్వాత మీ ఇష్టం అని చెప్పాలి" అంటూ ఆయన కోసం, చిరాకూ అభినయిస్తూ చెప్తూంటే అక్కడ వున్న రామకృష్ణతో సహా అతని కుటుంబం సభ్యులంతా గలగలా నవ్వారు.
"మీరు దైవస్వరూపులు బాబయ్యా!" మీ ఆశ్రయం పొందగలిగిన నేనెంత అదృష్టవంతురాలీని?" వణికే చేతులతో నమస్కరించింది రాధ.
"పిచ్చితల్లి" నిన్ను చేపట్టే అదృష్టవంతు డెవరో అంటూ ఆమె తల నిమిరాడు శ్రీనివాసయ్యరు.
* * *
ప్రతి రోజూ మీ నాన్నగార్కి.........రాధ పెళ్ళి సంగతి అడుగు అని చెప్పి చెప్పి విసిగి పోయిన రామకృష్ణ "ఏరా! వాసూనేను రాదను పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టంలేదులా ఉంది." అంటూ నిష్టూరమాడాడు.
"రేపు రాధ పుట్టినరోజుగా.....గుర్తు చేసుకుంటాలే" అన్నాడు వాసూరావ్.
గులాబి పూల ప్రింటు చీరా, దానికి మేచ్ అయ్యే జాకెట్ పీసూ తెచ్చాడు రామకృష్ణ.
ఆ రోజు రాధ తన పుట్టినరోజు పిండి వంటలు చేసి అందమైన బట్టలు కట్టింది. తనవైపు ఆప్యాయంగా. తృప్తిగా, సంతోషంగా చూసే పార్వతిని తలచుకుని ఎన్నిసార్లో కన్నీరు కార్చింది.
సాయంత్రం హుషారుగా రాదను చూడ్డానికి వచ్చిన రామకృష్ణ దిగాలుగా కూర్చున్న రాధ దగ్గరకోస్తూ, కంగారుగా "ఏం అలా వున్నావ్? వంట్లో బాగుండ లేదా?" ప్రశ్నించాడు.
"వంట్లో కాదు. మనసులో, మా అందరికన్నా మా అమ్మకోసం ఎక్కువ ఏడుస్తోంది రాధ. పాపం అందుకే అంటారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడని". అమ్మ ఈమెనే గారాబం చేసేది. ఇప్పుడు నాన్నగారు.......ఏ తల్లో కని మా యింట్లో పారేసింది." చురుగ్గా రాధవైపు చూస్తూ అన్నాడు విశ్వనాధన్. "తనను కూడా ఇటీవల పెళ్ళికొడుకుల్ని కాదన్నట్టే కాదని వుంటుందనీ, శ్రీనివాసయ్యరు అలా తనకి చెప్పకుండా తనకే ఇష్టంలేనట్టు నటించారనీ పసిగట్టిన విశ్వనాధన్ కొన్నాళ్ళుగా ఏవేవో సూటీ పోటీ మాట అంటూనే అన్నాడు రాధ నొచ్చుకునేలా.
ఒక్కసారి అతనివైపు తెల్లబోయి చూసి-"ప్చ్ పోనీండి. అలాటి మాటలతో ఆమెను నొప్పించడమెందుకు?" అన్నాడు రామకృష్ణ.
వారిద్దరివైపూ ఓసారి అసహనంగా చూసి వెళ్ళిపోయాడు విశ్వనాధన్.
"రాధా! లే. నేను తెచ్చిన చీరలో నిన్ను చూడాలని వచ్చాను. ఇంకేదో కానుక తెచ్చాను. ఊ లేవాలి...... తొందరగా" అన్నాడు చిన్నగా నవ్వుతూ రామకృష్ణ.
"కూర్చోండి వస్తాను అంటూ వెళ్ళిన రాధ పావుగంటలో అందంగా తయారయి, గులాబి పూవులా వచ్చింది. అక్కడ ఎవ్వరూలేరని గమనించి, రామకృష్ణ పాదాలు స్పృశిస్తూ నమస్కరించి "ఈ పై నడవబోయే నా
జీవితం మీ చేతుల్లో ఉంది" అంది నెమ్మదిగా ఆర్ద్రకంఠంతో.
"ఛ.....ఛ.....అదేమిటి? అలా మొక్కడాలు, అనీ నాకు ఇష్టంకావు. నీకో మంచి శుభవార్త చెబుతాను. వెనక్కి తిరుగు" అన్నాడు రామకృష్ణ.
"శుభవార్త వినడానికి వెనక్కి తిరగాలా? కొంటెగా నవ్వింది రాధ వెనుదిరిగి నిల్చుంటూ.
ఆమె తలలో గులాబీపూవు తురుముతూ "పి.హెచ్.డి. రీసెర్చికి నేను పైదేశం వెళ్ళబోతున్నాను,"
"నిజంగా!" సంతోషం చాటున ఏదో కలవరం వ్యక్తమయింది ఆమె గొంతులో...
"అవును. నిజమే. మీ బాసు ఇవ్వాళ....ఇవాళ మన సంగతి వాళ్ళ నాన్న గార్ని అడుగుతా నన్నాడు."
"ఏవిటండీ ఆ కంగారు..... మన సంగతి వాళ్ళ నాన్నగారికేం తెలుసు?"
"ఇప్పుడు తెలిసి ఉంటుంది. నీ తలలో నేను గులాబి ఉంచుతూంటే ఆయన వరండాలోంచి వెళ్తూ చూశారు.....ఆ గొంతులో ఏదో కలవరం.
"అయితే వారిద్దరి ప్రేమ సంగతీ ఏమిటని. వాసూరావ్ ని అడగొచ్చు......సరే గాలివాన రాబోతూంది తట్టుకోవాలి ఇద్దరం. కాని కృష్ణా వారూ వారూ, సంగతి వదిలేయ్ నేనడుగుతున్నాను. మీరేమిటాలోచించారు మన సంగతి. మీ అమ్మా నాన్నా వాళ్ళతో చెప్పారా? అడిగింది రాధ" కాస్త సిగ్గు చిలిపితనం కలిసి.
"అమ్మా నాన్నతో చెప్తే అస్సలీ జన్మకు మనిద్దరికీ పెళ్ళికాదు. అందుకే మీ బాబయ్యని ఒప్పించి నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
"మీరు పై దేశం ఎప్పుడు వెళ్తారు!"
"బహుశా ఈ నెలాఖరున, వాసూరావ్ కూడా సెలక్టయ్యాడు"
"నాకేదో భయంగా ఉంది.......ఎన్నాళ్లుంటారక్కడ.
"రెండేళ్ళేగా, బహుశా.......ప్చ్ ఎంతలో! తిరిగి వచ్చేస్తానుగా మళ్ళీ ఈ ఛాన్సు వదులుకుంటే..."
"అబ్బే వద్దు. వెళ్ళండి.......బాబయ్య బ్రతికున్నంత కాలం నన్నెవరూ, ఏమీ చెయ్యలేరు."

గర్వంగా అంది రాధ.
"మరి వెళ్ళిరానా?"
"మా బాసు, ఇంకా రాలేదు. అహ ఉండండి కాఫీ, టిఫిన్ తీసుకోకుండానే.....మీరు వచ్చారని వదినకు చెప్తాను."
"ఆమె......ఆమె....." అంటూ రాధ వైపు చూశాడు రామకృష్ణ.
"అవును తల్లి కాబోతూంది. ఆమె పుట్టింటి నుంచి జాబు వచ్చింది కాని బాబయ్య ఇప్పట్లో పంపించడానికి వీల్లేదని వ్రాశారు. కక్కి పోయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయన వదనంలో ఆనందం కన్పిస్తూంది. ఆ......కూర్చోండి మరి" అంటూ లోపలికి వెళ్ళింది రాధ.
కాఫీ టిఫిన్ కానిచ్చి......నే వచ్చి వెళ్ళినట్టు వాసుకి చెప్పు" అంటూ వెళ్ళిపొయాడు రామకృష్ణ.
అతని వెనుక గేటువరకూ నడిచి తిరిగి వస్తూన్న "రాధ, రాధా!" అన్న తీవ్రమై కటువుగా ధ్వనించిన శ్రీనివాసయ్యరు పిలుపుకి, పెనుగాలికి రాతలా ఊగిందొక్కసారి.
"నీతో మాట్లాడాలి ఒక్కసారి నాగదికిరా..."అదే గొంతుతో ఆజ్ఞాపించారాయన.
దడదడ లాడే గుండెతో వణికే కాళ్ళతో నెమ్మదిగా. తడబాటుగా అతని గదివైపు నడిచింది రాధ.
రాధ గదిలోకి రాగానే గది తలుపు గడియ పెట్టి. తాను కూర్చుని. ఆమెను కూర్చోమని కుర్చీ చూపించారాయన.
నెమ్మదిగా తల వాల్చి కూర్చుంది రాధ........
"అతనితో......అంటే రామకృష్ణతో నీ పరిచయ మెంతవరకూ నడిచింది. అహ.....కాదు. ఏదో మంచికుర్రాడు మన కుటుంబంతో సరదాగా తిరుగుతున్నాడనుకున్నాను. కాని...అతనికీ. నీకూ ఏదో గట్టి స్నేహమే ఉన్నట్టుందే!" అన్నారు వ్యంగ్యంగా నవ్వుతూ.
