Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 17


    తెల్లవారుజామునే లేచి కాఫీ, స్నానం అన్నీ కానిచ్చి వెళ్ళబోతూ ఏం నువ్వింకా తయారు కాలేదూ! అన్నాడు శ్రీనివాసరావు రాధ నుద్దేశించి.
    "మీరు వెళ్ళండి బాబయ్యా పిన్ని వంట్లో బాగుండలేదు ఇంటిదగ్గర కొన్ని పనులయ్యాక వస్తాను" అంది రాధ.
    ఏం వంట్లో బాగుండలేదా? ఏమిటి సుస్తీ కుదిపి లేపాడు శాంతని.
    అబ్బా ఏం లేదు వెళ్ళండి అంది శాంత బద్ధకంగా వత్తిగిలి.
    "ఏం లేదంటూ పీకమీదకు తెచ్చి పెట్టకు రాధా తాతయ్యనో సారి డాక్టరుకి కబురుచెయ్యమని పిన్నిని చూడమను," అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు.
    మధ్యాహ్నం కేరియరు పట్టుకు పొలాన్కి వచ్చిన రాధవైపు ఆత్రుతగా చూస్తూ "నువు; తీసుకువచ్చావే పనిరాళె వారిచేతన్నా నటించుకు రాలేకపోయావా? పిన్నికెలా వుంది? డాక్టరుకి చూపించారా ఏమిటి చెప్పారాయన, ప్రశ్నలవర్షం కురిపిస్తూన్న శ్రీనివాసరావు వైపు చిరునవ్వుతో చూస్తూ ఎందుకు బాబయ్యా కంగారు నాకుచిన్న తమ్ముడు పుడతాడు" అంది రాధ,
    "ఛ పో నీ మొహం హాస్యం చేస్తున్నావ్? నిజం చెప్పు మందేమైనా ఇచ్చారా డాక్టరు?"
    "నిజం చెప్తే అబద్దమంటారు. డాక్టర్నే అడగండి" నది రాధ నమ్మీ నమ్మలేకా సతమతమై గబగబ నాలుగు మెతుకులు కతికి పద ఇంటి కెళ్దాం అంటూ ఇంటికొచ్చేశాడు శ్రీనివాసరావు.
    ముఖమంతా సంతోషం నింపుకొని నవ్వుతూ గుమ్మంలో నిల్చున్న జానకమ్మ రాధ ఏమైనా చెప్పిందా? ఇప్పుడే వచ్చేశావు ఇన్నాళ్ళకి భగవంతు డనుగ్రహించాడు బాబూ అంది.
    "నాకు నమ్మకం చాలదమ్మా." శాంత కాపరాని కొచ్చి ఎన్నేళ్ళ యిందంటావ్! అడిగాడు అతని గొంతులో ఏదో కలవరం.
    "పద్దెనిమిదేళ్ళు పైన అయింది అయినాదాని వయసెంత రా నలభై రాలేదు అంది జానకమ్మ.
    గబగబా శాంతవున గదివైపు నడిచాడు శ్రీనివాసరావు.
    నీరసంగా కళ్ళు మూసుకు వత్తిగిలి పడుకున్న శాంత పక్కలో కూర్చుంటూ"శాంతా" పిల్చాడు శ్రీనివాసరావు ఆమె ముంగురులు సవరిస్తూ.
    పెళ్ళికి ముందెలా సిగ్గుపడేదో అంతకన్నా ఎక్కువ సిగ్గుపడ్తూ బరువుగా కనురెప్పలెత్తి ఒక్కసారి "అతనివైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ చూపులు వాల్చింది సనత.
    నిజమే నంటావా?.....ఇప్పుడెలా? అతని గొంతు కంపించింది. భయంగా!
    "ఎవరన్నా నవ్వగలరు. ఎలా ఏమిటి?
    కాదు శాంతా, చాలా కాలాన్కి..
    "ఒక్కసారి ఎవరన్నా పెద్ద డాక్టరుని.....లేడీ డాక్టరు చేత టెస్టు చేయించుకుంటాను.....వెళ్దాం" అంది శాంత.
    మర్నాడే పట్నం తీసుకెళ్ళి మంచిపేరున్న లేడీ డాక్టరుకి చూపించాడు శాంతని.
    ఆమె శ్రీనివాసరావు భయంతో వేసే ప్రశ్న లకు నవ్వుకుంటూ "మరేం ఫర్వాలేదు నెలకొక సారి తీసుకొచ్చి టెస్టు చేయించండి డెలివరీకి మా నర్సింగ్ హోమ్ జాయిను చేద్దురుగాని అంటూ అభయమిచ్చింది.
    తేలిగ్గా నిట్టూర్చి సంతోషంగా భగవంతుడికి నమస్కరించి లేడీ డాక్టరుకి ఒక నమస్కారం మనసారా చేసి ఇంటికి బయల్దేరేడు శ్రీనివాసరావు.
    ఇదే ఇలాటి టైము లోనే రమ తన ఇంటికి రావడం గుర్తొచ్చి అతని మనస్సు పశ్చాత్తాప భారంలో బరువెక్కింది పాపో బాబో పుట్టాక మళ్ళీ పోట్లాడుకుందాం ఎంత తియ్యగా వుండేది రమ గొంతు నాతో పోట్లాట ఆమె ఒక వినోదంగా భావించింది. కాబోలు అలా దీనంగా అర్ధిస్తూ రోదిస్తూన్న రమణి ఎంత కఠినంగా తూలనాడాడు. సూటిగా ఒకేమాతకు మనిషీ మనమూ సర్వం కృంగిపోయేలా చాలా రోజులాయి నీకూ నాకూ సంబంధం లేదు నీకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కాదు' ఎంత గుండె నిబ్బరంతో దైవం న్యాయం అన్నీ త్రోసిపుచ్చు రమ మీది ప్రతీకార వాంఛతో అనరాని మాట అనటానికి సాహసించాడు చీకట్లోకి అలసి నీరసంగా ఉన్న రమ తన బిడ్డను గర్భంలో దాచుకుని తన ఇంట్లోంచి క్రూరంగా నెట్టవేయబడి వెళ్ళిపోయింది వెళ్తూ తనవైపెలా చూసింది? అసహ్యంగా నిరసనగా ద్వేషం కోపం ఏమి చెయ్యలేని నిస్సహాయతా దైన్యం ఎన్నో భావాల సమ్మిళితమైన ఆమె చూపులు తట్టుకోలేక ద్రోహిలా వంచకుడిలా న్యాయస్థానంలో నేరస్థుడిలా తల వంచేడు. తల్లి తండ్రీ తోబుట్టువులూ ఎవ్వరూ లేని రమ గర్భవతిగా నిందితురాలిగా భర్త వదిలిన భార్యగా. ఇనుప ముక్కులు తొడిగి కాలుజారిన స్త్రీలను పొడిచే సంఘంలో మొండిగా బ్రతికి తానెరిగిన సత్యాన్ని ధృవపరచి శ్రీనివాసరావు కూతురంది. రాదను తన బిడ్డను భర్తా లోకం ఎవ్వరు కాదన్నా తన తండ్రి శ్రీనివాసరావని దృఢంగా రాధ మనస్సులో నాటిపోయింది.
    "ఏమండీ ఆ బస్ మన ఊరు పోదూ?" శాంత ప్రశ్నకు గత స్మృతులతో చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుని 'ఆ ఏమిటంటున్నావ్?' అన్నాడు శ్రీనివాసరావు.
    "సరి ఎప్పుడో ఏదో జరుగుతుంది కాబోలని మతిపోతూంది కాబోలు బస్ కండక్టరు టిక్కెట్లిస్తున్నాడు తీసుకోండి" తొందర చేసింది శాంత.
    బస్ దిగి ఇంటికి వస్తూ "రాధ మనింటికి వచ్చిన వేళ మంచిది" అంది శాంత నెమ్మదిగా.
    "అదేకాదు రాధను మనింటికి తీసుకొచ్చి కొంత పాపం కడుక్కున్నానులా ఉంది. వంటలూ బాగున్నాయ్.... దైవం రక్షించి అమ్మా, నాన్నా, నేనూ, అందరం భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాం వంశం నిలబెట్టమని.....నాకూ మా అక్కయ్యకు రెండేళ్ళు వారైతే రాధకూ అంటూ నసికి ఇరవై యేళ్ళు వార ఉంటుంది. నాలాటి వాడ నన్ను మించిన వాడా" చిన్నగా నవ్వుతూ దగ్గరఓ ఎవరూ లేరని నెమ్మదిగా ఉన్నాడు శ్రీనివాసరావు.
    "చాలు రెండు పెళ్ళిళ్ళూ వయసు ముదిరేక పిల్లలూ క్షణానికో విషం మారుస్తూ ఊసర వెల్లిలా రంగులు మార్చి పదవులకోసం అబబ్ద్ధాలూ అన్యాయాలూ, మీ పోలికే రావాలి" అంటూ నవ్వి "అబద్ధమా" కవ్వించింది శాంత.
    "నే ఒక్కన్నేనా, నువ్వుమాత్రం ఎంత ప్రచారం చేశావు నీకు భాగం లేదనుకోకు." గొణిగినట్టని నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. ఏవేవో సంఘటనలు గుర్తొచ్చి.
    వాకిట్లో నించోమని కోడలికి దిగ దుడిచి పారబోసింది జానికమ్మ. సంతోషంగా నవ్వుతూ "ఏమిటి చెప్పారు బాబయ్యా!" అడిగింది రాధకి.
    గ్లాసు మంచినీళ్ళు తాగి వాలు కుర్చీలో కూర్చుని "లేడీ డాక్టరు తనతో చెప్పినదంతా విపులంగా, తల్లీ తండ్రీ రాదా అందరూ వింటూంటే చెప్పాడు శ్రీనివాసరావు.
    ఆ కుటుంబ వ్యక్తు లందరి హృదయాలూ సంతోషంతో పులకించాయి భక్తి ప్రవత్తులతో భగవంతుడికి నమస్కరించింది జానికమ్మ. తన కన్నా ముందు ప్రపంచాన్ని వదిలిపోయిన భార్యను పెద్ద ముత్తయిదువగా తమ ఆరాధ్య దేవతగా భావించిన శ్రీనివాసరావు ఆమెకు మనస్సులోనే అంజలి ఘటించాడు. రాధను కంటికి రెప్పలా, నా ప్రాణాన్కి ప్రాణంగా చూసుకుంటానని అనంత విశ్వంలో లీనమై పోయిన ఆమెకు వాగ్దానం చేశాడు.
    ఆ ఇల్లు ఆనంద నిలయమైంది అతను జవాబు వ్రాయకున్నా మేనల్లుడికి నెలకొక ఉత్తరం వ్రాసి డబ్బు అవసరమైతే వ్రాయాలంటూ వ్రాస్తున్నాడా ఉత్తరంలో.
    మరొకసారి రాదను కదిపి చూశాడు. వివాహ ప్రయత్నాలు చేస్తానని.    
    అప్పటికే బాగా చనువూ అభిమానం ఆ ఇంట్లో ఆర్జించిన రాధ నేను మీకు బరువని తోస్తే, నాకేదన్నా నని చూపించి మీ ఇంట్లోంచి తరిమెయ్యండి బాబయ్యా అంతేకాని......." అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
    "అబ్బా అలా బాధపడకమ్మా? నువ్వు బాబయ్యా నాకు పెళ్ళి చెయ్యి నాకు భర్త కావాలి అనేదాకా ఆప్రశక్తి తీసుకురాను సరా!" అంటూ ఆమె కన్నీరొత్తాడు శ్రీనివాసరావు.

                                     *    *    *

    ఎన్ని ఉత్తరాలో రాధకు వ్రాసి జవాబురాక విసిగి చిరాకుపడి పోతూన్న రామకృష్ణ, ఓ రోజు తనూ, వాసూరావ్ ఇద్దరూ మాత్రమే ఉన్నప్పుడు ఇంటిదగ్గర నుంచి నీకేమన్నా ఉత్తరాలు వస్తున్నాయా?" అని అడిగాడు.
    "వస్తున్నాయే ఆమధ్య చెప్పాను కాబోలు అన్నయ్యకు కూతురు పుట్టిందని."
    మౌనంగా ఉండిపోయిన రామకృష్ణవైపు కొంటిగా చూస్తూ, "ఈ కృష్ణుడికి రాధాదేవిగారు లెటరు వ్రాయడం ఆలస్యం చేసిందేమో! అవునా?" అన్నాడు నవ్వుతూ వాసూరావ్.
    "ఆలస్య మేమిటి? నా బొంద తానెప్పుడేనా, నాకు ఉత్తరం వ్రాస్తే కదూ!"
    "నువ్వు వ్రాస్తున్నావా?" అదే నవ్వుతో అడిగాడు వాసూరావ్.
    "నవ్వకురా.....నా గుండెల్లో మండిపోతూంది. చాలాకాలం అంటే ఓ సంవత్సరం నే నసలు ఆమెకు లెటర్సు వ్రాయలేదు. ఏమన్నా విశేషాలుంటే మీ అన్నయ్య నీకు వ్రాస్తాడుగా..అయినా మీ అన్నయ్య మీద నాకు నమ్మకం లేదు. మా ఇద్దరికీ ఏదో అక్రమ సంబంధమని రభస చేస్తాడు. అందుకని వ్రాయడం మానేశాను"        
    "ఇప్పుడు రభస చెయ్యడనే ఉద్దేశ్యంతోనే వ్రాశావా?" వ్యంగ్యంగా నవ్వాడు వాసూరావ్! అతని మాట మధ్యలో-
    "నే చెప్పేమాట పూర్తిగా విను వాసూ!.....నువ్వూ నాలా పెళ్ళయిన క్షణంలో ప్లెయినెక్కి ఉంటే తెల్సేది ఆ బాధేమిటో. మీ అన్నయ్యకే ఉత్తరం వ్రాసి ఆ కవర్లోనే ఒక ఉత్తరం వ్రాసి పెట్టాను రాధకివ్వమని..."
    "అన్నయ్య కేమిటి వ్రాశావ్?
    "రాధకు నేను ఉతరం వ్రాస్తున్నందుకు మీరు కోపగించుకోవద్దనీ ఆమె నాకు కాబోయే భార్యనీ, మీరు సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహకారాన్ని అందజెయ్యాలనీ వ్రాశాను."
    జవాబు వ్రాశాడా!
    లేదు.....మీ అన్నయ్య ఏవో పనుల తొందర్లలో ఉంటారు. తాను వ్రాయవచ్చుగా....ఏమిటో నాకు మతి పోతూంది. పొరపాటు చేశావేమో!
    "మతి పోగొట్టుకోకు పొరపాటేం జరిగిపోలేదు. మా రాధ చాలా మంచిది. నీకు పూర్తిగా మనసిచ్చి ఆరాధిస్తూంది. అది గ్రహించే నేనవాళ అలా మీ రిజిష్టరు మారేజికి ఎంకరేజి చేశాను. ఎందుకు వ్రాయదో నేను మందలించి ఉత్తరం వ్రాస్తానుండు.
    "పోనీలే తనను నొప్పించకు తాను క్షేమంగా ఉంటే నాకంటే చాలు. క్షేమంగా నే ఉంది. "ఇక్కడ అంతాక్షేమం అని అన్నయ్య వ్రాస్తున్నాడుగా. ఈసారి లెటర్ లో ఇలా వ్రాయి. "రాధ ఏదన్నా పరీక్షకు చదువుతూందా అని?"
    "నువ్వేం వ్రాశావు రాధకు? అప్రయత్నంగా ప్రశ్నించాడు వాసూరావు.
    "ఇప్పట్లో మనం ఎలానూ ఇల్లు చేరాంగా! ఊరకనే ఏం చేస్తుంది? పి.యు.సి చదవమని వ్రాశాను..... ఎనిమిది ఉత్తరాలు వ్రాశాన్రా ఒక దానికీ జవాబులేదు ఇప్పుడు నాకేం చెయ్యాలని పిస్తోందో తెల్సా?"
    "చాలా ఓర్చుకున్నావ్ ప్చ్ పాపం ఏమిటి చేస్తావ్ మీ మామయ్యలా వదిలేస్తావేమిటి?"
    "ఇంత నిర్లక్ష్యమైతే ఏం చెయ్యాలి?
    "అయితే నీది నూటికి నూరుపాళ్ళు ప్రేమ పెళ్ళి..కాని బావా ఈ బావమరది సాక్షి సంతకం పెట్టిన రాధ అన్నయ్యను మరచిపోయి మాట్లాడకు అన్నాడు వాసూరావ్.
    చిన్నగా నవ్వి..." చదువూలేదు సంధ్యా లేదు. ఇప్పుడు క్షణాల్లో రెక్కలుకట్టుకు రాధ ముందువాలి ఎందుకు వుత్తరం వ్రాయదో. ఆ మౌనాన్కి అర్ధమేమిటో అంతబిడియం ఎందుకు పడుతూందో అస్సలు ఆమె తల్లితండ్రులెవరో ఇంత బెల్లంకొట్టినరాయిని ఏ తల్లి కన్నదో అడగాలనుంది"
    ఓ......ఇన్నాళ్ళూ, లేనిది, ఇప్పుడామె తల్లితండ్రులూ, వంశం అడుగుతున్నారు అబ్బాయి గారు. పెళ్ళికి ముందు ఆమె కులం, మతం, సంప్రదాయం ఇవేమీ నాకు అక్కర్లేదు. ఆమె రూపం గుణం నాకు నచ్చాయి ఆమె నాకు భార్య అయితే జీవితంలో ఇంకేమీ భగవంతుణ్ణి నేను కోరుకోను. మా అమ్మా నాన్నా ఎవరడ్డుతగిలినా దేవుడేవచ్చి వద్దని చెప్పినా ఆమెనే పెళ్ళిచేసుకోవాలనుంది. ఒరేయ్ వాసూ.... దేశం వదిలి వెళ్ళిపోయేలోపున రాధన నాదాన్ని చెయ్యరా?.....చేతులు పట్టుకు ఏడ్చావే ఆ డైలాగ్సన్నీ మరచిపోయేవా? కృష్ణా! కొంచెం తీవ్రంగా, ఆవేశంగా ఉంది వాసూరావ్ గొంతు.

 

                           


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS