Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 14

 

    చాలాసేపు మౌనంగా గడిపాడు. చేతిలో వున్న పుస్తకం మూసి బల్ల మీద వుంచి, కుసుమకు దగ్గరిగా జరుగుతూ...." నేను కొన్ని మాటలడుగుతాను....నీకు వెంటనే ఏమనిపించింది చెప్తావా?" అడిగాడు.
    "మీరు పుస్తకాలు చడువి నాకు డాక్టర్ గా మారాలనుకున్నారంటే ....మీ బిజినెస్ మూల పడుతుంది.
    "బిజినెస్ అంతా ఏమయినా సరే! నువ్వు నాకు ముఖ్యం' అన్నాడు. ఆమె ముఖంలోకి చూస్తూ.
    "అడగండి. యిందులో మీ సరాదా మాత్రం ఎందుకు తీరక పోవాలి?" అంది సర్దుకుని కూర్చుని, దిండు వళ్ళోకి తీసుకుంటూ.
    ఏదో ఆలోచిస్తూ ఎదురుగా కిటికీ లోంచి దృష్టి బయటకు సారించాడు. నిర్మలంగా వున్న నీలాకాశం లో మిణుకు మిణుకు మంటున్నాయి తారలు ఒక్క క్షణం కుసుమ వంక చూచి అడిగాడు.
    "నిర్మలయిన నీలాకాశం చూస్తె ఏం గుర్తుకు వస్తుంది?"    
    "మల్లె పువ్వులాంటి తెల్లని చందమామ."
    "నన్ను చూస్తె?"
    ఒక్కక్షణం కలవరపాటంతా ఆమె కళ్ళల్లో కనుపించింది. "ఏదో నేరం చేసినట్లు.... అది నివారించలేక పోయినందుకు పశ్చాత్తాపం ....."
    ఆమె వాక్యం పూర్తీ చేయకుండానే ....అడిగాడు.
    "డమడమా మ్రోగే వురుములు, ఎర్రని రక్తం....."
    ఒక్కసారి ఆమె గుప్పెట్లు బిగుసుకున్నాయి. ముఖం అరుణిమ దాల్చింది. కళ్ళల్లో ఎర్ర జీరలు స్పష్టంగా కనుపిస్తున్నాయి. భయంతో వళ్ళు జలదరించసాగింది. ఒక్కసారిగా ముఖం దిండులోకి దాచుకుంది.
    మెల్లిగా లేచి వెళ్ళి ఆమె పక్కగా కూర్చుని వీపు మీద నిమరసాగాడు.... డాక్టర్ చెప్పినట్లు ఆమెకు ప్రతి విషయం పాత పడే అంతగా గుర్తు చేయ్యాలి...."
    "కుసుమా?" పిల్చాడు మెల్లిగా.
    ఒక్కసారి తలఎత్తి ప్రభాకర్ వంక చూసింది. భయంతో రెండు కళ్ళూ పెద్దవయ్యాయి. అతని వంక చూస్తూనే అతని గుండెల మీదకు వాలిపోయింది.
    ఒక్క క్షణం ఆశ్చర్యపోయి రెండు చేతులు ఆమె చుట్టూ వేశాడు. పొడిగా, వదులుగా వున్న జుట్టు లోకి చేతిలు పోనిచ్చి , ఆప్యాయంగా నిమరసాగాడు.
    భయంతో యింత దగ్గరవగలిగిన మనిషి, యితర సమయాలలో ఎందుకు రాలేదు....? ఏమిటి కుసుమను యింత భయపెట్టే విషయాలు తనకు ఎందుకు చెప్పదు? కారణం చెప్పడానికి తెలియకపోయినా కనీసం కుసుమ మనసన్నా విప్పి మాట్లాడితే..... తను అర్ధం చేసుకునేందుకయినా అవకాశం దొరుకుతుంది.
    దగ్గరగా గుండెలకు హత్తుకు పోయి వున్న కుసుమ వెచ్చని శ్వాస బరువుగా వినిపిస్తోంది కొద్ది క్షణాలు మౌనంగా గడిపి , మెల్లిగా పిల్చాడు.
    "కుసుమా?"
    తలఎత్తి చూచి కళ్ళు తుడుచుకుని దూరంగా జరిగింది. ఏదో ఒక విధమయిన సంకోచం ఆమె మనసంతా నిండిపోయింది.
    "యిప్పుడింత దగ్గిరగా రాగలిగిన దానివి...." ఎలా పూర్తీ చెయ్యాలో ప్రభాకర్ కే తెలియలేదు.
    సందిగ్ధంగా ఆగిపోయాడు. ఒక్కసారి ఎర్రబడిన కొలకులతో అతని వంక చూచి కళ్ళు దించుకుంది.
    "చెప్పు."
    "....."
    "మానసికంగా బంధింపబడి భావప్రేరితమైన యిద్దరి ప్రేమకు ఫలితం దైహిక చర్య అవునా?"
    "....."
    ఏ భావం లేకుండా చేసే పని కోరిక, కోరిక లేకుండా కలుసుకునే జీవితాలు అసంభవం, కాని స్త్రీ పురుషుల విషయంలో ఈ రెండూ ఏకమయినప్పుడే అతి సామాన్యమయిన వివాహబంధం అవుతుంది."
    "మీరనేది ఏవీ నేను కాదనలేను. కాని అతి సామాన్యమైన  విషయాలే అసంభవ మయినవిగా కనుపిస్తాయి నాకు."
    అది కాదు నేననేది....యింత సామాన్యమయిన విషయాలకు ఎంతో బలీయమయిన కారణమేదో వుంటే కాని యిది సంభవమని నేననుకోను. అదేమిటో నీకు తెలియదన్న విషయం నాకు తెలుసు. కనీసం నీలో భావాలయినా విప్పి చెప్పగలిగితే...
    "నా బావాలకు ఎటువంటి రూపం లేదు. కనీసం వాటిని విడమర్చే శక్తి కూడా నాకు లేదు. నేను ఒకరికి దగ్గిరున్నానంటే.....ఏదో ఊపిరాడనట్లు - నన్నెవరో బంధించేస్తున్నట్లు....' చటుక్కున దిండులోకి ముఖం దూర్చుకుంది.
    ఒక్క క్షణం ఆమె వంక ఏ భావం లేకుండా చూచి నిస్పృహ గా నిట్టురుస్తూ వెనక్కు వాలాడు ప్రభాకర్.

                                 18

    పొద్దున్నే తండ్రితో టిఫిన్ ముగించి, పైకి వచ్చి ఆఫీసుకు వెళ్ళేందుకు రెడీ అవసాగాడు ప్రభాకర్. అతనికి దాదాపు వూహతెలిసినప్పటి నుండి, అది అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజూ చిన్నతనం లో తండ్రితో కలిసి లేవడం, టిఫిన్ తినడం , తండ్రి ఆఫీసుకు వెళ్ళేటప్పుడు తను స్కూలు దగ్గర దిగడం, సాయంత్రం తిరిగి ఆయనతో కలిసి రావడం..... అని అలా ఎన్నేళ్ళుగా జరిగాయో అతనికే గుర్తు లేదు.

 

                                   
    మొన్న మొన్నటి వరకు రంగనాధం గారు కూడా ఆఫీసు వ్యవహారాలు చూస్తున్నప్పుడు కూడా. యిద్దరూ కలిసే ఆఫీసుకు వెళ్ళేవారు. సాయంత్రం తిరిగి వచ్చి కాఫీ తాగి, తను విడిగా బయటకు వెళ్ళేవాడు ప్రభాకర్. అతను చాలా చిన్నతనంలోనే తల్లి పోయాక, రంగనాధం గారు ఒక తప్పించుకోలేని బాధ్యతగా తప్ప, బిజినెస్ విషయాలు అంతగా పట్టించుకునే వారు కారు. ప్రభాకర్ పెరిగి శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాక ఆయనకు తెలియకుండానే ఒక కొత్త ఉత్సాహం కలగసాగింది.
    బయట బాగా ఎండ ఎక్కుతోంది. క్రింద ప్రొద్దు తిరుగుడు పూలు ముఖమంతా ఎత్తి సూర్య దర్శనానికి ప్రయత్నిస్తున్నాయి. మేడ మీద గది కిటికీ లోంచి క్రిందకు చూస్తూ నుంచుంది కుసుమ. పక్క హలులోంచి గోడ గడియారం టంగున మ్రోగింది. ఒక్కసారి వెనక్కి తిరిగి టైము చూచింది.
    అతను వెళ్ళేందుకు రెడీ అయి వుంటారు." అనుకుంటూ, ప్రభాకర్ గదిలోకి వెళ్ళింది. అతను సొరుగు లోంచి యేవో కాగితాలు తీసి ' కేస్' లో పెట్టుకుంటున్నాడు. పక్కనే గోడ నానుకుని నుంచుని, కాలి వేలితో నేలను రాస్తూ నుంచుంది కుసుమ. ఆమె వైపు తిరిగి "నేను మధ్యాహ్నం భోజనానికి రాను..." అన్నాడు. "ఏం చేస్తున్నావు యింతసేపు?' అడిగాడు. తిరిగి, రోజు అలవాటుగా రాకపోయేటప్పటికి .
    అందుకేమీ సమాధానం చెప్పకుండా "నేను మీతో ఓ విషయం చెప్పాలి." అంది.
    "ఏమిటి ?" అడిగాడు ఆమె ముఖం వంక నిశితంగా చూస్తూ.
    ముందు కొద్ది నిముషాలు సందేహించింది తరువాత ఏదో నిర్ణయించుకున్నట్టుగా "నాకు డబ్బు కావాలి." అతనికి తెలియకుండానే రిలీఫ్ గా నిట్టూర్చాడు ప్రభాకర్. పక్కనే వున్న సొరుగు లోంచి తాళం చెవి తీసి కుసుమ చేతి కందిస్తూ "గాడ్రేడ్ లో వుంది. నీకోసమే తెచ్చి వుంచాను. నీకు కావలసింది తీసుకో." అన్నాడు. తాళం చెవి అందుకుని మౌనంగా వుండి పోయింది. ఆక్షణంలో ఎంతో సంతోషం కలిగింది ప్రభాకర్ కు. కుసుమ తనకు దగ్గరగా రాగాలుగుతోంది అనుకున్నాడు. "ఎక్కడికయినా వెళ్ళదలుచు కుంటే నాన్న కారులో వెళ్ళు. నేను డ్రైవరు తో చెప్పి వెడతాను" అన్నాడు.
    ప్రభాకర్ ఆఫీసుకు వెళ్ళి పోంగానే అలమారు తెరిచింది. పైన వున్న సొరుగు తెరిచింది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఒక్క అడుగు వెనక్కి వేసింది. రూపాయలన్నీ కట్టలుగా కట్టి సొరుగులో పేర్చి వున్నాయి. "నా కోసం తెచ్చి పెట్టానన్నారు యింత డబ్బా....." అనుకుంది. ఆ డబ్బు వంక చూస్తుంటే ఆమెకు తెలియకుండానే పెదిమలు ఆదరసాగాయి. వళ్ళంతా చమటలు పట్టింది. ముఖమంతా కందిపోయింది. చేతులు మెల్లిగా వణకసాగాయి.
    వెంటనే దడాలున తలుపులు మూసి వెళ్ళి మంచం మీద పడుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది.
    చాలాసేపటికి గాని లేచి యివతలకు రాలేక పోయింది. వళ్ళంతా ఏదో నీరసం ఆవరించి నట్లుగా ఓపిక లేనట్లుగా అనిపించ సాగింది.
    ప్రయత్నం మీద తనని తను సర్దుకొని బయటకు వెళ్ళేందుకు సిద్దమయి, తిరిగి గదిలోకి వచ్చింది. సొరుగు తెరిచి మరేమీ ఆలోచించకుండా మనసును అదిమి పట్టాలని ప్రయత్నిస్తూ గబగబా రెండు నోట్లు తీసుకొని తలుపు మూసేసింది.
    క్రిందకు దిగేసరికి ప్రభాకర్ చెప్పి వెళ్ళినట్లున్నాడు. వాకిట్లో కారు సిద్దంగా వుంది. దాని వంక చూస్తూనే ఆగిపోయింది. "హాయిగా ఏ బస్ లోనో, టాక్సీ లోనో వెడితే బాగుండును." అనుకుంది నిట్టురుస్తూ.
    కాని పక్క గదిలో ఎవరితో నో మాట్లాడుతున్న మామగారి మాటలు అస్పష్టంగా వినిపిస్తూనే వున్నాయి....'ఆయనకు తెలిస్తే ...." మరేమీ ఆలోచించలేక మౌనంగా వెళ్ళి కారులో కూర్చుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS