Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 14


    అయితే ఎక్కడి కెళ్ళిపోతావ్?" అతని గొంతులో కలవరాపాటు. ఎవరైనా ఏమన్నా అన్నారేమో అన్న అనుమానంతో అందర్నీ కలయ జోశాడో సారి.
    మీరు మళ్ళీ ఆ ఊరు ఎప్పుడు వెళ్తారు?
    ఆ ఊరా, ఆ ఎందుకు?    
    అతన్నడిగి నా స్కూలు ఫైనలు ప్యాసైన సర్టిఫికెట్. మా అమ్మా నాన్నా వున్న ఫోటో తెచ్చి పెట్టండి" మా అమ్మ పేరు....అంటే.
    'అడిగి తెస్తాలే అమ్మా 'ఆమె మాట కడ్డువస్తూ అన్నాడు శ్రీనివాసరావు.
    "అమ్మాయ్ అస్సలు హోటల్లో ఎలా చిక్కు బడ్డావమ్మా?..." అప్పటి వరకూ. ఆ సంగతులేవీ ఆ అమ్మాయిని అడక్కండి మూర్చ పడుతుంది అని చెప్పిన శ్రీనివాసరావు మాటకు ఆడగడం మానేసి కుతూహలాన్ని అణచుకున్న వ్యక్తులిద్దరూ. జానకమ్మ ఈ ప్రశ్న వెయ్యడంతో ఉత్సుకతతో రాధవైపు చూశారు.
    అదంతా ఒక గాథ నిర్భాగ్యపు కథ. "ఇప్పుడెందుకు లేదూ అని శ్రీనివాసరావు అడ్డం వస్తూన్నా. అతను చెప్పిన ప్రకారం తల్లి తండ్రుల పేర్లు మార్చి మిగతా కథ చెప్పుకు పోతూంది రాధ వింటూన్న శ్రీనివాసరావు పలక పడిందానే నెపంతో కళ్ళొత్తుకుంటున్నాడు.
    అమ్మకీ, నాన్నగార్కీ అస్సలు పడేది కాదట, నేను తల్లి కడుపులో ఉండగానే నాన్ననుంచి వేరైనది అమ్మ.
    పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలతో లోకం విసిరే రాళ్ళ దెబ్బలు సహిస్తూ బ్రతుకుతూంది. అమ్మకూ, నాన్నకూ ప్రతిరూపంలా ఇద్దరి ప్లికలూ కలబోసుకు పుట్టానట నేను. అమ్మాయి పుట్టిందానే వార్త విని, "ర......సీతా ఎవుడు నిన్నెప్పుడూ చిన్న చూపే చూస్తున్నాడు ఈ బిడ్డ మగపిల్ల వాడైతే నాకెంత సంతోషంగా ఉండేది. అని సానుభూతీ. ఆమె హాస్పిటల్ నుంచి వచ్చి కోలుకునే దాకా సహాయం. సహకారం అందజేశాడు. అమ్మకి స్నేహితుడూ. ఆత్మీయుడూ, సోదర సమానుడూ అయిన శ్రీధర్ మావయ్య. అమ్మ నాకు రాధ అని పేరు పెట్టుకుందిట. అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసేదట నన్ను చూడ్డానికి ఒక ఆయను పెట్టి. అల్లారుముద్దుగా, ప్రాణానికి ప్రాణంగా నన్ను పెంచుతూన్న అమ్మ ఒక నాడు నాకు జ్వరం వస్తూందనే బెంగతో తొందరగా ఇంటికి చేరాలనే ఆత్రుతతో నైట్ డ్యూటీ నుంచి వస్తూ, స్పీడుగా దూసుకుపోతూన్న లారీ కడ్డుగా నడిచిందట.
    అమ్మ తల పగిలి హాస్పిటల్లో స్పృహ కోల్పోయి ఉంది దిక్కులేని దానిగా.
    నాకిప్పటికీ గుర్తు....ఆ కాళ రాత్రి, విధి వక్రించిన ఆ నిశి, నా జీవితంలో అంధకారం నిలసింది. ఆయా జ్వరంతో ఏడుస్తూన్న నన్ను విసిగి ఇష్టమొచ్చినట్టూ బాదింది. వచ్చీరాని మాటలు నాకు. తల్లికి చెప్పలేననే భరోసాతో. కసితో ఇష్టమొచ్చినట్టు గిల్లింది కొట్టింది. కాని ఎంతకీ రాదు. తుదకు ఉదయం కూడా అమ్మ ఇంటికి  రాలేదు.
    కంగారుపడ్డ ఆయా ఆమె ఆఫీసుకి పరుగు తీసింది. అందరూ కంగారుపడి వాకబు చేస్తే రాత్రి లారీక్రింద పడ్డ స్త్రీ అమ్మ అని తేలింది.
    జ్వరమనే సాకుతో నన్ను కూడా హాస్పిటల్ ల్లో పడేసి తన మానాన తనదారిన పోయింది ఆయా.
    రెండు రోజుల తర్వాత అమ్మకు కొంచెం తెలివొచ్చింది. శ్రీధర్ అడ్రసుకు వైరు చెయ్యమని డాక్టరుకు చెప్పిందట. వైరు అందిన వెంటనే శ్రీధర్ మామయ్య అతని భార్య దుర్గా ఇద్దరూ రెక్కలు కట్టుకు వాలారు. అప్పటికి నాకు జ్వరం తగ్గి అమ్మ కోపం ఏడుపు మొదలు పెట్టాను. అమ్మకు హైరానా పనికిరాదని నన్ను దూరంగానే ఉంచారు. అమ్మ నన్ను చూపించ మని అడిగిందట ఒక్కసారి చూపించి రాధ కేమీ భయంలేదు ఆమెను మేం చూస్తున్నాం అని అభయమిచ్చారు. అక్కడి సిస్టర్సు.
    అప్పుడు శ్రీధర్ మామయ్యకి అమ్మేమో....
    "పోనీ ఊరుకోమ్మా" అడ్డు తగిలాడు శ్రీనివాసరావు.
    శ్రీధర్ కు కన్నీళ్ళతో నిస్సహాయంగా. నన్ను అప్పగించి కన్నుమూసింది అమ్మ,
    శ్రీధర్ ను నేను మామయ్యా అని పిల్చేదాన్ని. శ్రీధర్ అతని భార్య దుర్గా చాలా ఉత్తములు ఉదారులూ. నన్ను వారు తీసుకెళ్ళిన తరువాత వాళ్ళకిద్ధరు మగపిల్లలు పుట్టారు. శ్రీధర్ కి ప్రమోషనొచ్చింది. ఇదంతా నేను అడుగుపెట్టిన ప్రభావమని నన్నింకా మక్కువగా చూసేవారు. నాకు పన్నెండేళ్ళ వయసొచ్చేదాకా హాయిగా స్వేచ్చగా ఏ బెంగా లేకుండా పెరిగాను.
    మరొక క్లిష్టమైన బాటలోకి మలుపు తిరిగిపోయింది నా జీవితం. శ్రీధర్ నన్ను పెంచి అభిమానించే శ్రీధర్ కి టైఫాయిడ్ జ్వర మొచ్చింది. అతని పరిస్థితి అయోమయంగా తయారయింది. భర్త సంపాదన మినహా మరే ఆధారం లేని దుర్గ రాధనేం చెయ్యమన్నారు. పిల్లల్నెలా పెంచామన్నారు? అని ప్రశ్నిస్తూ విలపించింది. మరేమీ నాకు భయం లేదంటూనే, పిల్లల్ని తీసుకు మీ అన్నయ్య దగ్గరికెళ్ళిపో కొంత ప్రావిడెంటు ఫండు వస్తుంది. అంటూ నిగ్రహించుకున్న దుఃఖ వాహిని ప్రవహించిందా అన్నట్లు బోరున ఏడ్చాడు శ్రీధర్ మామయ్య.
    రాధ.....గొణిగింది దుర్గ.
    నా కోసం శ్రీధర్ మామయ్య చాలా బాధ పడ్డాడా అంతిమ క్షణాల్లో. శ్రీధర్ మామయ్య, అమ్మా, పార్వతి అనే ఆవిడ చదువుకు నే రోజుల్లో ప్రాణ స్నేహితులు పార్వతి ఓ పెద్ద హోటలు ప్రొప్రయిటరు భార్య. ఆమెను పిలిపించాడు ఫోన్ చేసి శ్రీధర్ మామయ్య. ఆమెకు నన్ను అప్పగించి అతను రాధ బరువు దించుకుని శాశ్వతంగా కన్నుమూశాడు.
    పార్వతి సహృదయురాలు. ఉదారురాలు ఆమె భర్తా కొడుకులూ కూడా మంచివారే. వారికి నా లాంటి నిర్భాగ్యురాల్ని పోషించడమంటే ఖాతరే లేదు. లక్షల వ్యాపారం వారిది. నాకు తిండికీ, బట్టకీ, చదువుకీ ఎటువంటి లోపం లేకుండా జరిగి పోయింది. అమంమీద ఉండే అభిమానం. వారి ద్ధరిమధ్యా స్నేహానుబంధం పురస్కరించుకుని పార్వతి నన్ను విద్యావంతురాల్ని చేసి తగిన వరుడికిచ్చి వివాహం చెయ్యాలని తలపోసేది.
    నేను స్కూలు ఫైనలు చదివాను. నాకు మంచి మిత్రుడూ సోదరుడూ, పార్వతి రెండవ కొడుకు వాసూరావ్....అని రెండు క్షణాలు మౌనంగా ఆలోచిస్తూండిపోయిన రాధ మళ్ళీ చెప్పడం ప్రారంభించింది.
    నన్ను మళ్ళీ ఏడిపించాడు విధి. పార్వతికక్కే రెండురోజుల విషజ్వరంతో కన్నుమూసింది.
    వంట మనుష్యులూ, పనివాళ్ళూ వున్నా నాకు బాధ్యత ఇంట్లో ఎక్కువైంది. ఆరు నెలలు ఆ ఇంటి బాధ్యత, పార్వతి నడిపించే గృహనిర్వహణా నాపై బడింది. పార్వతి భర్త శ్రీనివాసయ్యరు నన్ను తనయింటి కోడలుగా చేసుకుందామను కున్నాడు.
    కాని....కాని.... నేను అంగీకరించలేక పోయాను శ్రీనివాసయ్యరు నన్ను వత్తిడి చెయ్యలేదు. కోపగించుకోలేదు. కాని నా కన్నా ఎనిమిదేళ్ళు పెద్ద అయిన. విశ్వనాధన్. శ్రీనివాసయ్యరుగారి పెద్దకొడుకు నాపై పగబట్టాడు కాబోలు వేడిగా, చురుగ్గా నావైపు చూసేవాడు.
    అతనికి పెళ్ళి చేసి కోడల్ని తెచ్చుకున్నారు శ్రీనివాసయ్యరు. ఆ ఇంటి కోడలు రమణి పెద్ద కట్నంతో, బంగారు వజ్రాల నగలతో ఆ ఇంట్లో అడుగు పెట్టింది. నిండు కుండ తొణకదస్సలు. రమణి నిండుగా హుందాగా ఉండేది. నాయరను సానుభూతీ, జాలీ కురిపించేది. కాని ఆమెపెద్ద అందగత్తె కాదు. ఆమెయందు అసంతృప్తితో నామీద పగ పెంచుకుంటూన్న విశ్వనాధన్ పరిచయంకోసం పొంచి ఉన్నాడు.
    వాసూరావ్, అతని స్నేహితుడు రామకృష్ణా అప్పుడప్పుడూ నాతో కబుర్లు చెప్పి సరదాగా నవ్వించేవారు. ఆ ఇద్దరూ జంటగా పై దేశం వెళ్తున్నారు. అప్పటికి నాకు మైనారిటీ తీరిపోయింది, అనుకోకుండా క్షణాలోనా జీవితం మరోమలుపు....జీవితంలోముఖ్యమైన మలుపు తిరిగిపోయింది.
    శ్రీనివాసయ్యరు జీవించి ఉన్నంత కాలం ఆ ఇంట్లో వ్యక్తులే అక్రమాలూ, అన్యాయాలూ చెయ్యలేరు. నన్ను మళ్ళీ విధి శిక్షించింది శ్రీనివాసయ్యారు అకస్మాత్తుగా గుండెనొప్పితో కన్ను మూస్తూ, రాధనో ఇంత్య్ధాన్ని చెయ్యి అంటూ. విశ్వనాధన్ కి అప్పగించాడు. ఆయన నాపెళ్ళి చెయ్యాలనే సంకల్పంతో ఆయన జీవించి ఉన్నప్పుడు రెండుమూడు సంబంధాలు తెచ్చారు. కాని నేను సమ్మతించలేదు. తనకేమీ కాని నా ఇష్ట ప్రకారమే పెళ్ళి చెయ్యాలని తలపోసిన శ్రీనివాసయ్యారు ఎంత ఉన్నతమైన వ్యక్తి" ఆమె కళ్ళు నీటితో నిండాయి.
    "ఆయన కర్మకాండ ముగిసిన తర్వాత బంధువు అంతా వెళ్ళిపోయారు. ఉండిపోతానని ఆమె ఆమెను పంపవద్దు ఆమెకు సహయంగానే ఉంటానని నేను ఎంతచెప్పినా వినిపించుకోకుండా రమణిని పురిటికి పంపించాడు విశ్వనాధన్.
    అతని పగ తీర్చుకోడానికి చక్కటి అవకాశం ఏర్పడింది.
    ఆరోజు, ఆరోజు రాత్రి మామూలుగా అతనికి వడ్డన చేస్తూన్నాను. నావై పదోలా క్రూరంగా చూస్తూన్నాడు విశ్వనాధన్. భోజనం ముగించి లేస్తూ, పెళ్ళి చేసుకోవడానికి నీకు నేను నచ్చలేదుకదూ" తయారవ్ అందమైన మొగుడి దగ్గరకు పంపిస్తాను అన్నాడు వణికిపోయాను అతన్నుంచి దూరంగా ఎటన్నా పారిపోవాలను కున్నాను కాని ఎటెళ్ళగలను? భగవంతుణ్ణి దీనంగా ప్రార్ధిస్తూ నిల్చున్న చోటనే చతికిల బడ్డాను. కాలం బరువుగా, భయంగా దొర్లుతూంది.
    యమ కింకర్లు లా హోటలు తాలూకు మనుషులిద్దరు వచ్చి ఏయ్ స్నానం చేశావా? గర్జించారు. నా దగ్గర కొస్తూ వారి వెనుక విశ్వనాధన్ ఉన్నాడు భయకంపితురాల నై పోయి విశ్వనాధన్ కాళ్ళకు చుట్టుకొని రక్షించమని. క్షమించమనీ, ఏడ్చాను ప్రాధేయపడ్డాను ప్రార్ధించాను. తుదకు తిట్టాను శంపించాను కాని అతని కర్కశ హృదయం కరగలేదు. నన్ను స్నానంచేసి బట్టలు మార్చి అందంగా తయారవమని. కమ్చీతో గుర్రాన్ని కొట్టినట్టు కొట్టాడు. విన్నారా నా కథ?
    రాధ....రాదనే పిలువబడే నేను. బాబయ్యగారి గదికి తోయబడ్డాను. అదే మరొక గదిలో మరొక వ్యక్తి అయితే ఈ రాధ సర్వనాశనమై జీవితం చాలించేది. శ్రీధర్ మామయ్య దగ్గర విన్నది కొంతా నా అనుభవం కొంత చెప్పాను. అంటూ బాధగా నిట్టూర్చింది రాధ.
    
                                    *    *    *

    "మీ నాన్నకన్నా తెలివైన దానవమ్మా నువ్వు." అన్నాడు శ్రీనివాసరావు.
    సుబ్బారావంత తెలివైనవాడా ప్రశ్నించారు రంగనాధం. మరేమిటను కున్నారు? పైకి అలా కనిపించేవాడు కాని గట్టివాడు అన్నారు శ్రీనివాసరావు.
    నయం సుబ్బారావూ అతని భార్యా నిజంగా చచ్చిపోయారు కనుక కాని ఆ సుబ్బారావు బ్రతికీ ఉంటే ఏ దేశంలో ఉన్నా జుట్టు పట్టుకు ఈడ్చుకు వచ్చి నన్ను నిలదీసేవారు నాన్న అనుకున్న శ్రీనివాసరావు గుంభనంగా నవ్వుకున్నాడు.
    "నా కేదన్నా ఉద్యోగముంటే చూడండి బాబయ్యగారూ అన్న రాధ మాటకు చిరాగ్గా "బి,ఏ! ఎం.ఏ, ప్యాసైన వాళ్ళకి లేవుగాని, స్కూలు ఫైనలు అదన్నా సర్టిఫికెట్ లేకుండా స్కూలు ఫైనలు ప్యాసయ్యానన్నంత మాత్రాన ఉద్యోగాలెక్కడున్నాయ్ అన్నాడు రంగనాధం.
    అప్పుడు శ్రీధర్ కి అమ్మేమో! అంటూ రాధ నసిగింది. పోయేటప్పుడు రమ నా మాట ఏమన్నా అందేమో! ఎలా! ఇంట్లో ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడ్డం పడదు. రమ ఏం చెప్పిందో ఆఖరి క్షణాల్లో తన జీవితం ముగిసి పోతూన్నందుకు బాధగా ఏమని విలపించిందో రాద జన్మకో కారకుడైన తనను, తిట్టిందో చూడాలనుందో, తెల్సుకోవాలనే ఆత్రుత అరికట్ట లేని శ్రీనివాసరావు "రేపు ఉదయం టౌనుకి వెళ్ళామమ్మా సూపర్ బజారులో ఏవన్నా ఓ ఉద్యోగాన్కి ట్రై చెయ్యొచ్చు నాకు తెలిసినాయన ఒక తను ఉన్నారు కనుక్కుంటాను" అన్నాడు.
    "అలాగేనండీ అంటూ కృతజ్ఞతగా చూసింది రాధ.

                                     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS