అందుకే మళ్లీ బి.ఎస్. సి లో జాయినయ్యాను. నాన్న వద్దన్నారు. మళ్ళీ ఆరోగ్యం పాదవుతుందే మోనని. కానీ, నా మనసుకో వ్యాపకం ఉండాలి. లేకపోతె మళ్ళీ పిచ్చెక్కినంత పనవుతుందని అమ్మ వెళ్లమన్నది. హాస్టల్లో నలుగురితో పాటు నవ్వుతూ, సరదాగా ఉండాలని ప్రయత్నించే దాన్ని. కానీ లోనుంచి ముల్లులా ఆ స్మృతులు నా మనస్సుని పొడుస్తూనే ఉండేవి.

కరుణ స్నేహంతో కొంచెం హాయి లభించింది. కాని మనస్సు విప్పి చెప్పుకోవాలంటేనే భయంతో వణికి పోయాను. మళ్ళీ ఆ షాక్ వస్తే? బావా, నేనూ ఒసారి కొండగట్టు కు వెళ్లాం. ఆ శివాలయం లో నిలబడి ఎంతో భక్తీ శ్రద్దలతో చేతులు జోడించాడు బావ మిలా. ఆ కధ చెప్పించు కున్నాడు నాతొ. అందుకే మళ్ళీ ఆ స్మృతులు కదిలి కొండ మీద ఏడ్చాను. షాక్ లా వచ్చి మీ ఇంటి దగ్గర పడిపోయాను. 'ఇదే హార్ట్ ఎటాక్ అవుతుంది నీ మనస్సు నిలాగే బాధపెడితే' అని డాక్టర్లు చెప్పారు."
"అబ్బ! ఎంత నరకం అనుభవించావు! బిందూ! కొన్ని కీవితాల్లో ఎందుకో దుఃఖం నిండి ఉంటుంది." అతని గొంతు రుద్దమైంది.
"ఈ వేళ సినిమాకు వెళదామా , బిందూ? నీ మనస్సుని అనవసరంగా కదిలించాను. కాస్త రిలీఫ్ గా ఉంటుంది. సినిమా చూస్తె!"
అతని కంఠం లో మోగిన అభిమానం ఆమెని ఊపివేసింది.
'శ్యామ్! నా గురించి నీకెందు కింత బాధ? నీ హృదయం ఈర్ష్యతో నన్ను ద్వేషించడం లేదా ఇంకా? ఈ బిందు ని ఇంకా ప్రేమిస్తూనే ఉందా నీ మానస్సు?"
అతని ఉద్దేశ్యం మారితే తనతో ఇలా ప్రవర్తించలేదని ఊహించింది. కానీ, నమ్మకం బలపడటం లేదు పూర్తిగా. 'ఇదంతా నతనేమో' అన్న ఊహ కలుక్కుమంటూనే ఉంది అప్పుడప్పుడు.
సినిమా చూసి వచ్చారు. కానీ, హిమబిందు మనస్సు ఇంకా పూర్తిగా తేరుకొనే లేదు. గత స్మృతుల నుంచి.
తలుపులు గడియ పెట్టబోతుంది . శ్యామ్ పిలిచాడు.
'ఓ మంచి మాట చెప్పాలి, బిందూ!" అంటూ లోనికి వచ్చాడు.
"అమ్మను ఒప్పించాను, బిందూ , మన పెళ్ళికి! వచ్చే నెలలో."
"ఆగండి! నాకెందుకో భయంగా ఉంది. ఈ బంధం ఇలాగే మిగిలి పోనివ్వండి. పెళ్ళితో ముడి పెట్టకండి. బావను మరిచిపోలేను నేను!"
"భయమెందుకు?! నీ మనస్సుకి నేను కొత్త వాణ్ణి కాదుగా? నన్ను ప్రేమిన్సుతున్నా నంటావు మరి పెళ్లి అంటే వణికిపోతా వెందుకు? ఎన్నాళ్ళి లా స్నేహితులుగా ఉందాం? లోకం ఏమనుకుంటుంది?"
"మీకు తెలియదు నా మనః స్థితి! ప్లీజ్! నన్ను ఆ ఊబి లోకి లాక్కండి! మనస్సున మీరంటే ఇష్టం ఉంది! కాదని ఇంకా ఎన్నాళ్ళు అబద్దం చెప్పగలను! అయినా మీకు నిజం చెప్పకుండా ఉండలేనే? హిమబిందు విధవ!....అలాగే ఉండి...."
"బిందూ! ఆ మాట అనకు! నేను వినలేను!" వెంటనే బాధతో అతని కంఠం గద్గదమైంది.
నివ్విందామె విరక్తి గా.
"ఉన్న నిజం అది! మీరు వినలేరు! కానీ అంత మాత్రాన ఆ గతాన్ని ఎలా రూపు మాపగలుగుతాం?"
"ఈ శ్యామ్ కూడా చనిపోయినట్టే అయితే!"
"అదేం మాట?! ఛా!"
"ఇదీ ఉన్నమాటే, బిందూ! పెళ్లి కాలేదేమో గాని నా మనస్సుకి నువ్వు 'శ్యాం భార్యవి' ఎప్పటి నుంచో!"
ఆశ్చర్యంతో అలాగే చూస్తుండి పోయిందామె. ఆ మాటలోని ఊహల్లో దూరి క్షణాల్లో నిలువెల్లా విద్యుత్తులా ప్రాకిపోయింది.
"మాట్లాడవేం , బిందూ?! ఇంకా ఆ నీ నిజం మారలేదా?"
ఆమె కళ్ళలో నీళ్ళు నిందుకు వచ్చాయి. అది దుఃఖమూ గాదు. ఆనందమూ గాదు పూర్తిగా . రెండూ కలిసి తన హృదయాన్ని పరవశింప జేశాయి.
"అనలేను! కానీ మీకు నేను ఆనందాన్ని పంచలేనేమో! బావ స్మృతుల తో వేగిపోయే ఈ మనస్సు........"
"నెమ్మదిగా ఈ నీ శ్యామ్ స్నేహంతో తేరుకుని చల్లబడుతుంది, నువ్వేమీ దాచలేదే నీ గురించి! మనః పూర్తిగా నేనే ఒప్పుకున్నాను, బిందూ! నువ్వేమీ నన్ను బలవంతం చేయలేదు.
"పెదనాన్నా, అమ్మా ఏమంటారో?"
"మీ పెదనాన్న ఎంతో సంతోషంగా అంగీకరించారు, బిందూ! మీ అమ్మగారు కూడా కాదనలేదు!"
"ఇదేమిటి? మీకెలా తెలుసు?!"
"అమ్మ మామయ్య ని పంపించింది మీ ఊరు!"
"అతను ఇన్నాళ్ళు ఇందుకా అక్కడున్నది!" అని విస్తు పోయిందామె.
"ఏమో ! నాకంతా ఇంద్ర జాలంలో ఉంది! నా మనస్సు కాదనీ అనలేక పోతున్నది. ఔననీ అంగీకరించలేకపోతున్నది! మళ్ళీ పెళ్లి కూతుర్ని అవలేను! అంతమందిలో మీ ముందు కూర్చుని పూల దండలతో .....ఉహూ....నా వల్ల గాదు! క్షమించండి."
"పోనీ, ఆడంబరంగా వద్దులే! తిరుపతి లో వెళ్లి క్లుప్తంగా జరిగేట్టు చేయమంటాను. మామయ్య ని ఏర్పాట్లు! బంధువు లెవరూ వద్దు! అమ్మా, నాన్నా, మామయ్య లే!"
"ఆ దేవుడు నవ్వుతాడెమో?"
"ఎందుకూ?"
"ఎందుకని చెప్పను? మరోసారి పెళ్లి కూతుర్ని అవుతానని కలలో కూడా అనుకోలేదు!"
"వింతగా మాట్లాడుతున్నావు నువ్వు! ఊరికే భయపడకు! నీ మనస్సు గతాన్ని మరువలేక ఇలా మాధనపడుతుంది. తరవాత ఈ భయం క్షణాల్లో కరిగిపోతుంది దానంతట అదే!"
ఆమె మాట్లాడలేక పోయిందా పైన, శ్యామ్ వెళ్ళిన తరవాత కూడా అలాగే కూర్చుండి పోయింది అక్కడే ఎంతోసేపు! ఎప్పటికో లేచి వెళ్లి భగవద్గీత తెరిచింది.
తరువాత కాలం ఎలా గడిచిందో ఆ ఇరువురికీ తెలియలేదు. ముహూర్తాలు పెట్టిన్చామని హిమబిందు కి జాబు వచ్చింది! ఆ జాబు తన మనస్సుని ఊపివేసింది. ఆప్రయట్నంగానే కనులు అశ్రు సిక్తా లయ్యాయి.
'శ్యామ్! నేను ఓడిపోతున్నాను! బావ నెలా మరిచి పోయాను! ఉహూ! మరిచి పోలేదు! నా మనస్సు నన్ను మంత్రించి మర్చి వేస్తున్నది! ఎందుకింత వేగంగా స్పందించు తున్నాయి నా గుండెలు! ఆనందం లోనా? విచారం తోనా? నరకానికి వెడుతున్నానో, స్వర్గానికి పోతున్నానో తెలియకుండా ఉందే!? శ్యామ్! ఎందుకిలా నా మనసు చుట్టూ రంగుల వల అల్లుతున్నావు?" వాపోయిందామె మనస్సు.
"ఉత్తరం వచ్చిందా, బిందూ? నాకూ అమ్మ వ్రాసింది వేళే! ఈ నాలుగు రోజులు గడవడం దుర్భరంగా ఉంది నాకు! నా మనస్సేలా ఉందొ చెప్పనా?
"ఉన్మీల స్మదుగంధ లబ్ధ మధుస వ్యాదూత
చూతాంకుర
క్రీడత్కోకిల కాకలీ కలర వైరుద్గీర్ణ కర్ణజ్వరాః
నీయన్తే పధికై కధం కధను సిధ్యా నానుధాన
క్షణ
ప్రాప్త ప్రాణ సమా సమాగమ రసోల్లా సైరామీ
నసారా'
ఎంత అందంగా వర్ణించాడు మనస్సుని జయదేవకవి! అవ్యక్తమధురంగా వినిపించే కోకిల కంఠం కూడా కర్ణ కఠోరంగా ఉందట విరహంతో వేగిపోతున్న మనస్సు లకి! రోజు లేలాగో కష్టంగా , తమ ప్రాణ సఖిని చూస్తున్నామని కలగంటూ గడుపుతున్నారట! వింటున్నావా, బిందూ?"
సిగ్గుతో ఆమె కనులు క్రిందికి వాలిపోయాయి! మనస్సున తీయని భావ మేదో పులకింతలు రేపింది!
'నీకు సిగ్గు లేదు! శ్యామ్, మరీ హద్దుమీరి పోతున్నావు! ఎందుకిలా దాచుకోవలసిన మధుర రహస్యాన్ని నాకు కనిపించుతావు? మరీ చిలిపిదై పోయింది నీ మనస్సు!
మధురోహాలతో మనస్సేక్కడికో తేలిపోయింది. ఆ సాయంత్రం అతనితో మాట్లాడాలంటే సిగ్గు ముంచుకు వచ్చింది. మాటిమాటికీ అతడు మనస్సు తూలిపోయినట్టు ఏవేవో చెబుతున్నాడు. వినాలనీ ఉంటుంది. విని అతని ముందు మనో భావాల్ని దాచుకోలేక సతమత మై పోతానేమో అని వినగూడదనీ అనుకుంటుంది.
మరునాడే ఇరువురూ ప్రయాణ మయ్యారు. అతడు గుంటూరు వెళ్ళిపోయాడు. ఆమె చిక్కవరం వెళ్ళింది.
* * * *
తిరుపతి కొండ మీద వివాహం జరిగింది. బంధువు లెవరికీ తెలియపరచలేదు. ఆఖరికి అతను స్నేహితుల్ని గూడా ఆహ్వానించ లేదు. ఎంతో నిరాడంబరంగా జరిగిపోయింది. హిమబిందు నిలువెల్లా వణికిపోయింది అతనికి పూలదండ వేస్తూ!
అతని కళ్ళలో ఆనందం పరవళ్ళు తొక్కుతుంది. తిరుపతి నుంచి తిన్నగా గుంటూరు చేరుకున్నారిరువురూ.
"మీ ఉత్సాహాన్ని పాడు చేశాను గదూ? మీ అమ్మగారెంతో వైభవంగా , కన్నుల పండువుగా చేయాలనుకుని ఉంటారు మీ పెళ్లి! నా మూలాన ఇలా చప్పగా ముగిసిపోయింది!"
"అమ్మకి నిరుత్సహంగానే ఉంది! కానీ, నాకిదే బాగుంది, బిందూ! ఆ వైభవం జరగాలంటే ఇంకా కొన్నాళ్ళు విరహం తప్పదు! నీ పుణ్యమా అంటూ త్వరగా ఒడ్డు చేరుకున్నాను!"
"అబ్బ! మీతో మాట్లాడ కూడదసలు" సిగ్గుతో లోనికి వెళ్ళిపోయిందామె.
ఆ రాత్రి అతడు స్నేహితుల్ని పిలిచి పార్టీ ఇచ్చాడు. అందరూ శ్యామ్ ని అభినందించారు. హిమబిందు అందాన్ని శ్లాఘించారు.
స్నేహితులతో మాట్లాడుతూ పది గంటల వరకూ అలాగే కూర్చుండి పోయాడు . అందరూ వెళ్ళిన తరువాత లోనికి వచ్చాడు.
"మహారాణి గారు ఏం చేస్తున్నారో? ఓ...." టక్కున ఆగిపోయాడు హిమబిందు ని చూస్తూ.
వేణుగోపాల్ డైరీ చదువుతూందామె. అతని మనస్సున పొంగి పరవళ్ళు తొక్కుతున్న ఆనందాన్ని క్షణం లో గడ్డ కట్టించిందా దృశ్యం!
కానీ నిగ్రహించు కున్నాడు ఉద్వేగాన్ని వెంటనే.
"ఈ డైరీ చదవనిదే నిద్ర పట్టదు నాకు!" అంటూ లేచిందామె.
"నేనూ వ్రాస్తానయితే ఓ డైరీ నిక!"
"వద్దు ! వద్దు!"
"ఎందుకని , బిందూ, వద్దంటున్నావు? నేనూ వేణు లాగే చని....."
"ఆపండి ! దయచేసి !" అతని నోటికి చేయి అడ్డం పెట్టింది.
"బిందూ! మరీ ఇంత భయపడి పోతావేమిటి? నీ మనస్సు మరీ సున్నితం! నేనెలా ఇమిదిపోవాలి ఆ మనస్సులో!" అతడామె ముఖాన్ని ముద్దులతో నింపివేశాడు , కౌగిట్లో బంధించి.
అతని కళ్ళలో ఎరుపు జీర చూడగానే హిమబిందు వణికి పోయింది. ఆమె చేతులు చల్లబడి పోయాయి.
"ఏమైంది , బిందూ! ఎందుకిలా వణుకు తున్నాయి? నీ చేతులు!" అత్రతతో అతడు ఆమెని మంచం మీద కూర్చో బెట్టాడు.
"నా మనస్సెం బాగుండలేదీ వేళ ఎందుకనో!"
అతని ఉత్సాహం చల్లబడి పోయిందా సమాధానంతో ఏదో చెప్పాలనుకుని మౌనంగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.
ఆమె గుండెలేంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆమె కళ్ళలో కదిలిన భయం, అయిష్తమూ అతణ్ణి నిరుత్సాహంతో ఊపి వేశాయి.
అలాగే నిశ్శబ్దంగా నిలుచుండి పోయాడెంతో సేపు .. హిమబిందు ఏడుస్తుందని తెలిసీ దగ్గరకు వెళ్ళలేక పోయాడు.
'బిందూ! మధుర క్షణాల్లోనే నీ మనస్సు నన్ను వ్యతిరేకిస్తున్నదా? నాకు తెలుసు! ఈ రాత్రి ఈ వెన్నెల్లో ని హాయి మనకు అందదు! ఎందుకిలా వణికి పోయావ్? బావేనా ఇంకా నీ సర్వస్వం? నిన్ను మార్చలేదేమో నా అనురాగం! ఆ డైరీ ని చదవకు, బిందూ! నీ మనస్సుని మరీ కోసి వేస్తుంది అని నీకెలా చెప్పాలి? అపార్ధంతో మరింత అయిష్టం పెరుగుతుందేమో అలా అంటే!"
కిటికీ మూసి సోఫా లాక్కుని పడుకున్నాడు కొంతసేపటికి. కనులు మూత పడటం లేదంత సేపటికీ.
బిందూ కళ్ళు విప్పి చూసింది.
"పడుకో, బిందూ! ఎందుకు లేచావు? నేనూ మనిషినే! కాదన్నప్పుడు నిన్ను స్పర్శించడులే ఈ శ్యామ్ దొంగలా!"
"క్షమించండి! మీ కళ్ళలో ఇన్నాళ్ళూ ప్రేమే కనిపించింది. కాని........"
"ఈ వేళ కోరిక కనిపించిందంటావు? అంతేగా? కోరిక లేకుండా మనస్సేలా ఉంటుందో చెప్పు! భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రేమే కామంగా మారుతుంది!"
అసహనంగా నిట్టూర్చిందామె.
"మీకు చెప్పాను, మిమ్మల్ని సుఖ పెట్టలేనేమో అని!"
"చెప్పలేదని అనడం లేదు. జరిగింది ఇక విచారించినా తిరిగి రాదు. మనస్సుని క్షోభ పెట్టగూడదు బిందూ!"
".........."
"ఏదో నచ్చ చెబుతున్నాడని అనుకోకు! నేనేదో ,మహా త్యాగం చేశానని, అందుకు నువ్వు ప్రతిగా తలవంచాలని అపార్ధం చేసుకోకు."
అప్పటికీ ఆమె కనులెత్తి చూడనే లేదు. అతడు లేచి లైటు తీసి వేశాడు.
"వద్దు, వద్దు! చీకట్లో నాకు నిద్ర పట్టదు! లైటు వేయండి!"
"నీ భయం నాకు తెలుసు, బిందూ! అమ్మకి తెలిసి పోతుంది మన రహస్యం!"
ఆ చీకట్లో అతని ముఖం ఎలా ఉందొ చూడలేక పోయింది. కానీ, అతడు జీవితంలో అపురూపమైన దాన్ని పోగొట్టు కున్నట్లు నిరాశతో తనను తాను ఓదార్చు కుంటున్నాడని ఆ కంఠనా ధ్వనించిన బాధ చెబుతుంది.
ఆమె హృదయం ద్రవించి పోయింది. కానీ, ఆ దృశ్యం! కౌగిట్లో బంధించి తనని తిని వేయాలన్నట్లు ఊపిరి సలపనీయకుండా ముద్దులతో ముంచి వేయడం గుర్తుకు వచ్చి మళ్ళీ ముడుచుకు పోయింది మనస్సు.
