ఆరోజు భూపతిదావు అంతగా ఆలోచించలేదు-కాని మెమొరీలో ఆ అపరిచితుడు, అతని మాటలు రికార్డ్ చేయబడ్డాయి.
ఆ తరువాత మరికొన్నాళ్ళకు క్రమంగా పొక్కుతున్న కొన్ని నీలి వార్తలు తొలిసారిగా ఆలోచింప జేశాయి.
నిప్పు రాజుకుంటే ఆపటం ఎవరితరం కాదు- ముఖ్యంగా కార్మికవర్గంలో నిప్పురాచుకుంటే అది దావానలంగా అంతకంతకు వ్యాపించుకుంటూ వెళుతుందే తప్ప చల్లారిపోవటం అంతతేలికయిన విషయంకాదు.
వాటి తాలూకు ఆలోచనలమీద తీసుకున్న నిర్ణయమే....ఈనాటి మీటింగ్.
"మనం ఎప్పురో కొన్ని నిర్ణయాలు తీసుకొన్నాం-మన సిబ్బందికి క్వార్టర్స్ కట్టించాలని......హెల్త్ కండిషన్స్ మరింత మెరుగు పర్చాలని, లాభాల్లో వాటా ఇవ్వాలని, ఈ విషయం మన సిబ్బందికి తెలుసు. మరింకేకారణం చూసి అందోళనకు దిగుతారో నా కర్థంకావటంలేదు. ఐనా మన కంపెనీల్లో పనిచేసే సిబ్బందిలో ఎప్పుడూ, ఏ విషయం లోనూ, ఏకోశానా చిన్న అసంతృప్తిని కూడా మనం గమనించలేదు" ఒక డైరక్టర్ అన్నాడు.
"కార్మికుల్లో అసంతృప్తి కలిగితే దాన్ని వ్యక్త పరచటానికి బస్సుల్ని తగలెట్టారు మనవాళ్ళు.....ఘోరాలు చేయరు.....హర్తాళ్ చేయరు. ఆ పేరుతో పని ఎగ్గొట్టరు....జషాన్, కొరియా దేశాల కార్మికుల్లా తమ అసంతృప్తిని బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకోవడం ద్వారానే వ్యక్తపర్చే ఆరోగ్యకరమైన పద్ధతి అలవర్చుకున్న గొప్ప సిబ్బంది మన దగ్గరుంది. మరెందుకు మనం భయపడాలి.....?" అని మరో డైరెక్టర్ అన్నాడు.
అంతా వింటూనే ఆలోచిస్తున్నాడు భూపతిరావు.
సరీగ్గా ఇదే సమయంలో సత్యరాజ్ అసహనంతో చిందులు వేస్తున్నాడు- అర్థాంతరంగా రవి ఎందుకు ఫోన్ డిస్కనెక్ట్ చేసాడో అతనికి అర్థం కాలేదు.
(జపాన్, కొరియా, లైవాన్ దేశాలలో కార్మికవర్గంలో పెల్లుబికే అసంతృప్తిని సమ్మెద్వారానో, హర్తాక్ ద్వారానో, హింస, సత్యాగ్రహం ద్వారానే వ్యక్తపర్చారు. మేనేజ్ మెంట్ తమ డిమాండ్స్ తీర్చకపోతే దానికో గడువు పెడతారు. ఆ గడువులోపు తమ డిమాడ్స్ ని అంగీకరించకపోతే, ఆ మరుసటి రోజునుంచి బ్లాక్ బ్యాడ్జెస్ తమ యూనిఫామ్స్ మీద పెట్టుకుని డ్యూటీకి హాజరవుతారు.
కొన్ని రోజులు అలాచేసినా డిమాండ్స్ పరిష్కరింపబడకపోతే పాజిటివ్స్ట్రయిక్ ప్రారంభిస్తారు, అంటే మామూలు వర్కింగ్ అవర్స్ ఎనిమిది గంటలనుకుంటే పాజిటివ్ స్ట్రయిక్ ప్రారంభం అయిన రోజు మంచి రోజుకు 9 గంటలు పనిచేస్తారు. రోజుకు గంట చొప్పున సిబ్బంది తమంతమేతామే ఎక్కువ గంటలు వర్క్ చేయటం ప్రారంభిస్తారు, దాంతో మేనేజ్ మెంట్ గిల్టీగా ఫీలయి, తమ సిబ్బంది డిమాండ్స్ పరిష్కరించటానికి ముందుకొస్తుంది.
ప్రపంచ దేశాల కార్మికులకు, యజమానులకు అంతు పట్టని దేశ భక్తి ఈ మూడుదేశాల కార్మాకుల్లో వుంది.
మన దేశంలోలాగా ఆటోల్ని, బస్సుల్ని, రైళ్ళను ధ్వంసం చేసుకోరు. దేశసంపదను బూడిదపాలు చెయ్యారు.
గంటన్నరపాటు బోర్డ్ రూంలో తర్జన భర్జన జరిగాక ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భూపతిరావు సీట్లోంచి లేచాడు.
ఛేయిర్మన్ తన అభిప్రాయాలేమిటో వెలిబుచ్చకుండానే బయలుదేరేందుకు సిద్ధం కావడం ఎనిమిదిమంది డైరెక్టర్స్ లో ఒకరికి మాత్రం అసంతృప్తిని మిగిల్చింది. అతనే ప్రముఖ పారిశ్రామికవేత్త భాగ్యరాజ్ అనుంగు సహచరుడు. ఆ ఎనిమిదవ డైరక్టర్ ఎవరన్నది నిర్దష్టంగా తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం భూపతిరావు వున్నాడు.
అందుకే తన నిర్ణయాలేమీ వెలిబుచ్చలేదు భూపతిరావు.
ఓ పెద్ద పధకంద్వారా, చాపక్రింద నీరులా భాగ్యరాజ్ మనిషి నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ లోకి ప్రవేశ పెట్టబడ్డాడు.
భూపతిరావు అందరివేపు ఓసారిచూసి, ఇక వస్తానన్నట్లు తల పంకించి వడివడిగా బయటకు నడిచాడు.
బోర్డ్ రూం బయట తండ్రికోసం ఎదురు చూస్తున్న దినేష్ మౌనంగా ఆయన్ని అనుసరించాడు.
తండ్రి ఏం చెబుతాడో......ఏం చేయమంటాడో.....అని తండ్రివేపే చూస్తూ, ఆయన వెనుకే నడుస్తున్నాడు నెమ్మదిగా.
భూపతిరావు కారుదగ్గర ఓ క్షణం ఆగాడు-తల తిప్పకుండానే బోర్డ్ లోని రహస్యాలెలా బయటకు పొక్కుతున్నాయి....? ఆ ఎనిమిదవ డైరక్టర్ ఎవరు...? నాకు సాధ్యమైనంత తొందరలో తెలియాలి....." అంటూనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆయన.
6
ఉదయం ఆరు గంటలు కావస్తోంది.
యూనివర్శిటీ హాస్టల్ గదుల్లోకి ఇంకా నులి వెచ్చని ఉదయ కిరణాలు జొరబడలేదు.
రూం నెంబరు 116 లో పడుకున్న ముగ్గురు యువకులు మాత్రం కాస్త కదిలారు......మూడు ఇనుప మంచాలూ ఓసారి కిర్రుమన్నాయి.
ఆ ముగ్గురికి మాత్రం ఉదయం ఆరు గంటలకే లేవటం, జాగింగ్ చేయటం, చేస్తూ ఆ రోజు ప్రోగ్రమ్ ఫిక్స్ చేసుకోనటం అలవాటు.
ఓ బ్లాంకెట్ ఒకింత పక్కకు తప్పుకుంది. మరి కొద్ది క్షణాలు తేడాతో మిగతా రెండు బ్లాంకెట్స్ కాస్తంత పక్కకు తప్పుకున్నాయి.
మరి కొద్దిక్షణాలకి ఆ ముగ్గురూ లేచి మంచాలమీదే చలిమూలంగా ముడుచుకు కూర్చున్నారు.
ముగ్గురు కళ్ళు నులుముకుంటూ తలలు పైకెత్తుతుండగానే ఓ కిటికీ రెక్క విసురుగా తెరుచుకుని అందులోంచి డైలీ పేపర్ దూకుడుగావచ్చి రెండు మంచాలకు మధ్యగా పడింది.
ముందుగా రాజు ఆ పేపర్ అందుకున్నాడు ఓసారి పేపరంతా క్రిందనుంచి పైవరకు చూసి ఓ చోట ఆగిపోయి, ఆశ్చర్యంగా చూశాడు. అతని కళ్ళలో అదో రకమైన మెరుపు క్షణంపాటు తళుకుమ్మని మాయమైంది.
"రాయిల్ భూటాన్ లాటరీ గెల్చుకున్న అదృష్టవంతుడు" అని ఓ న్యూస్ టైటిల్ పైకి చదివి మిగతా న్యూస్ తనలో తానే వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోయాడు.
