Previous Page Next Page 
ఉద్యోగం పేజి 9


                               బంధితులు

హెమింగ్వేమీద  అభిమానం చాలా  వున్నది  నాకు. ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవనూలేదు. చదివిన ఒక్క పుస్తకంలోవే ఆయనంటే ప్రాణం పెట్టే స్థితి కొచ్చేను. 'ఓల్టు మాన్ అండ్ దిసీ!'
నా పెళ్ళి నాడు   ఓ మిత్రుడు ఆ పుస్తకాన్ని కానుకగా యిచ్చేడు. 'తోచినుప్పుడల్లా చదువుకో, మంచిపుస్తకం' అని చెప్పి రెండుముక్కలు ఇంగ్లీషులో మొదటి పేజీమిద రాసి వుంచాడు.
వయస్సు ముదిరిన బెస్తవాడు, అతనికి మనోహరమైన కొన్ని జ్ఞాపకాలు, అతనికో కుర్రనేస్తం, వాళ్ళిద్దరి స్నేహం సముద్రం, దానిలోని సొరచేపలూ, సముద్రంమ్మిద ఎగిరే చిన్న చిన్న పిట్టలూ- వీటన్నిటితో సంబంధమైనకథ తయారయింది. రాసిన పద్ధతికి చేతులు రెండూ జోడించేయాలి.
ఆ మధ్య పెళ్ళయిన కొత్తలో ( ఆ షాఢమాసంలో కాబోలు) ఆకధను యావత్తూ తెలుగులో రాసేను. స్నేహితులకు చూపించాను. చదివి బాగుందని మెచ్చుకున్నారు. ఆనక, అసలు పుస్తకమూ చదివేశారు.
ఆ పుస్తకాని కొక యోగ్యతావత్ర మివ్వడం నా ఉద్దేశంకాదు.  అందకు నా స్తోమతెంత? నాకునచ్చిన పుస్తకం గురించి  పదిమందికి చెప్పుకోడం, వాళ్ళది చదివారని తెలిసినా గూడాను( నా అలవాటు.)
ఈ కధకీ ఆపుస్తకానికీ ఏవిధమైన సంబంధమూ లేదు. కాపోతే ఆపుస్తకాన్ని మూడో తడవ చదవటానికి ప్రారంభించిన వేళా విశేషం చెప్పకోదగ్గది! ఒకపేజీ తిప్పేనో లేదో నాగది గుమ్మంముందు ఓ కుర్రాడు తారట్లాడుతూ కనిపించేడు.
చాలామంది కూర్రాళ్ళనింతకుముందు నే నెన్నోసార్లు చూసేను. మాఅక్కయ్యాకీ, అన్నయ్యకీ పిల్లలున్నారు. అవకాశం దొరికితే నెత్తినెక్కి రాజ్యం చేసేందుకు పెంకిఘటాల్లో క్లాస్ వన్ రౌడీలు! అస్తమానూ అల్లరి అయినా ముద్దుగానే వుంటారు.
ఈ కుర్రవాడి విషయం వేరు. తొమ్మిదేళ్ళ వయస్సుంటుందేమోబొమ్మలా , అచ్చుపోసిన బంగారు బొమ్మలా మెరిసి పోతున్నాడు. తృటిలో నన్ను ఆకర్షించాడు. పుస్తకంమూసి వాడివేపు కన్నార్పకుండా చూడటం మొదలుపెట్టాను.
నా గది గుమ్మమెక్కి వీధివేపు చూస్తూ నించున్నాడు వాడు కాసేపలా నించుని,అకస్మాత్తుగా గంతువేయడంలో విశేషమేదో జరిగుంటుందని అనుమానించేను.
లేచి వెళ్ళి వాడి పక్కన నించుని చూసేను. గుమ్మం ముందు నిల్చిన వర్షపునీట్లో రెండు కాగితప్పడవలున్నాయి. ఓ పడవ మునిగిపోయివుంది. రెండోదానికి రాయి అడ్డు తగలడంతో ఆగిపోయి వుంది.
నేను వాడిపక్కన నించునివున్నట్లు గమనించేడు కాబోలు, తలెత్తి నావేపు  చూసేడు. ఆనక గుమ్మందిగి నీళ్ళలో నించున్నాడు. తర్వాత అన్నాడు.
" మా బుజ్జిపడవ మునిగిపోయింది."
"మంచిపని జరిగింది. రెండోది నీదేమిటీ?"
తలూపేను. వాడిమొహంలో వెల్తురు తళుక్కున మెరిసింది. అప్పుడు మరింత ముచ్చటగా కనిపించేడు.
కాసేపటికి వాడి పడవ రాయిని తప్పించుకొనిముందుకు సాగింది. కదుల్తోన్న పడవని చూస్తున్నాడు.
" నీ పేరేమిటోయ్?"
"పార్థు" స్పష్టంగా చెప్పాడు.
" పడవలు చేయటం నీకుబాగా చాతొచ్చేమిటి?"
"..."
" ఏం చదువుతున్నావ్?"
" నాలుగు"వాడి పడవ దూరంగా వెళ్ళింది. పారుడు జారిపోతున్న తననిక్కర్ని పైకి లాక్కుంటూ  ఆపడవని వెంబడించాడు, అక్కడక్కడ వాడితో పాటు నాకూ ఆడుకోవాలని పిచింది. గది తలుపువేసి గుమ్మంది గేనన్న మాటే గాని మరో   అడుగు ముందుకు వేయలేక పోయేను.
సరిగ్గా నాగది ముందు ఓ డాబా వున్నది. ఆడాబా మిద ఓ ఆడకూతురు తీరిక చేసుకునిపార్ధుడివైపు కుతూహలంగా చూస్తోంది. నన్ను చూచిగూడా ఆమె అక్కడ్నుంచి కదల్లేదు. నా పెద్దరికం చెప్పున గుర్తుకు రావడంతో మళ్ళీ వెంటనే గదిలోకి వొచ్చేసి తలుపు వేసేను.
ఈ వూరికి ప్రత్యేకమైన ఆఫీసు పనిమిద వొచ్చేను. మూడు నెలలపాటు నేనీవూళ్ళో వుండాలి. మా వాళ్ళందరిని వొదిలేసి నేనొక్కడ్నే   అక్కడి కొచ్చేసేను.  ఈగది కుదుర్చుకోడం చాలా సులభంగా జరిగిపోయింది. అన్ని సదుపాయావూ  వున్నాయి. మంచి పొరుగు. ఈవూరొచ్చిన పదిరోజుల్లో రాసిన  అయిదు త్తరాల్లో శ్రీమతికీ విషయాలన్నీ రాసేను. శ్రీమతి నుంచి ఆవాళ వొచ్చిన జాబులో నే తీసుకున్న గది తాలూకు సదుపాయాల గురించి రాయమని రాసింది. ఏమిటో ఖంగారు మనిషి.
నాకు గదినిచ్చిన శ్రీధరరావుగారు బడిపంతులు ఇంటి దగ్గర   'ప్రైవేట్లు'గొడవున్నది కేవలం ఆయన స్వార్జితంతో నే లంకంత యిల్లు కట్టేశాడు.  ఆయన ముందు చూపున్న మనిషనీ, రెండో పెళ్ళితో సుఖంగా వున్నాడనీ టూకీగా ఆయనగురించి తెలిసిన వివరాలు.
ఇంట్లో మొత్తం ఎంత మంది జనాభా వున్నారో తెలీదు. చాలా నిశ్సబ్దంగా వుంటుంది. ఇల్లు. అప్పడప్పుడూ పార్ధూ, బాబ్జీల సందడి మినహాయిస్తే మరేయితరుల గొంతూ సాధారణంగా  వినిపించదు.
ఓ రోజు  బాగా పొద్దు పోయింతర్వాత గదిగొచ్చేను మనసంతా ఇటిమిద వుండటం చేత త్వరగా నిద్ర పట్టింది కాదు. ఏమైనా చదివేందుకు మనసొప్పలేదు. లైటు ఆర్పి సిగరెట్టు  ముట్టించేను. నోరు చేదుగా తయారయ్యేంతవరకూ సిగరెట్ల కాల్చాను. రాత్రి పది దాటిందనుకుంటాను. పక్క వాటాలో పార్ధుడేదో గొణుగుతున్నాడు, ఎవరో సముదాయిస్తున్నారు. కాసేపటికి పార్ధుడు పాట పాడమని అడిగేను ఆవిడ పాడింది.
గోపాలకృష్ణుడు నల్లన
గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్ళు చల్లన
పాటపాడవే నాగుండె ఝల్లున....
పాటవింటూనే, నాకెప్పుడో పరిచయమైన గొంతుని గమనించి ఉలిక్కిబడి లేచి కూర్చున్నాను. ఓసుందరమైన రూపాన్ని ఊహించాను. అంతలోనే కాదని  సరిపెట్టుకు న్నాను, మళ్ళా అవుననిపించింది.
లైటు వేశాను ఉన్నపళంగా ఆపాట పాడుతున్నానిడను చూడాలను కున్నాను.  సభ్యత స్ఫరణకొచ్చి ఆ ప్రయత్నం మానుకొన్నాను. పాట ఆగిపోయినా, నా మనసు లోని బొమ్మ చెరిగిపోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS