ఉదయం పార్దుడ్ని కదిపి విషయం తెలుసుకుందామనుకున్నాను. స్నానం ముగించి అద్దం ముందు నించున్న వేళ పార్ధుడు సంచి వూపుకుంటూ మరో ఇద్దరి నేస్తాల్తో స్కూలుకి వెళ్ళబోతున్నాడు. గబగబా గుమ్మం దగ్గర కొచ్చేశాను. పార్ధుడ్ని పిలిచేందుకు నోటిదాగా వొచ్చిన మాటని, నాగది గుమ్మం ముందున్న డాబా అమ్మాయిని చూసి దాచేసుకున్నాను లోపలికొచ్చి కూర్చున్నాను.
ఆ క్షణంలో డాబా వారి అమ్మాయి మిద కోపం చాలా వొచ్చింది. ఆవిడకి మరేం పని లేనట్టు డాబా మిద అస్తమానం ఆ విహారాలేమిటి? కళ్ళింతవి చేసుకుని నేలమిద బతుకుతూన్న మమ్మల్ని చీమల్తో పోల్చి చూడట మేమిటి? నాన్ సన్స్.
ఆఫీసు కెళ్ళేంత వరకూ పాట పాడినావిడ కోసము ఎదురు చూసేను. ఏ పని మిదై తిరుగుతూ ఆవిడ నాకు కనిపిస్తుందేమోనని. కనపించలేదు గడిచిన కొద్ది రోజుల్లో ఆమె నాక్కనిపించే వుంటుందిగానీ, ఎప్పుడూ ఈపాట పాడకపోవడాన నే నావిడ్ని అంత శ్రద్ధగా చూసి ఉండను.
సాయంత్రం ఆఫీసునుంచి తిరిగి రాగానే తిన్నగా కిటికీ దగ్గిర కుర్చీ వేసుక్కుర్చున్నాను.
కొన్నేళ్ళక్రితం తెలుగు సినీమా చూసేను. ఆ సినీమాలో వో పాట విని ముగ్ధుడి న్యయేను. తర్వాత అదే పాట అనేకమంది పాడుతుండగా విన్నాను గానీ అప్పుడు నే నంత ఆనందించలేదు.
నేను కాలేజీలో చేరిన కొత్తరోజుల్లో సుందరశివరావు వాళ్ళ మామిడితోటలో అదేపాట ని వినడం జరిగింది. నిజం చెప్పాలంటే ఆ సినీమాచూస్తూ ఆ పాట విన్నప్పుడు గూడా నేనంతగా చలించలేదెమో. పాట పూర్తయింతర్వాత నా కనుకొలకులో నీళ్ళు నిలవడం గమనించి సత్యం మెల్లిగా అన్నాడు-
"ఈ మాత్రం దానికే ఏడుస్తావేం రా, ఫూల్!"
నిజానికి నేను ఫూల్ నేమో! సినీమాచూస్తూ- శ్రీరాముల వేషథారికి నమస్కారం చేసేయగల పిచ్చివాడిని. వేదిక ఎక్కిలం కేశ్వరుడి పగల గొట్టేయగల పిచ్చివాడిని.
"మా ముద్దు కృష్ణయ్య లీలలు
మంజుల మధు మురళీ లీలలు
మాకేరిసారి కల గోలలు
మాకు ఆనందవారధి వోలలు!"
ఆనాడు అనుకున్నాను సుందరశివరావు అదృష్టవంతుడని. అపర సరస్వతీ దేవి సత్యవతి మనసుని గెలుచుకున్నాడు. సత్యవతినీ, సుందరశివరావునీ ఆనాడే చూసేను, సత్యవతి కమ్మని కంఠం తేనెలొలకగా , ఆ మధురానుభూతిని ఈ గుండెల్లో దాచుకున్న భాగ్యం ఆనాడే కలిగింది.
మా కాలేజీ ప్రెసిడెంట్ గిరికి సుందర శివరావు పోటీ చేసి హెచ్చు మెజారిటితో ఎన్నకయ్యేడు. ఆ శుభ సందర్భాన్ని పుసర్కరించుకొని అతని మిత్రులందరికీ పార్టీ ఇచ్చేడు. ఆసాయంత్రం వాళ్ళ మామిడి తోటలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన పార్టీకి మా సత్యం వెంట నేనూ వెళ్ళేను.
సుందర శివరావుతో నా కేవిధమైన తెలీదు. సత్యం మా మేనబావ. వాడు సుదంరశివరావు, సత్యవతుల క్లాలుమేటు. వాళ్ళందరూ మంచి స్నేహితులు.
నేను సత్యంతో తిరగడం మూలంగా ఆనాటి పార్టీకి నేనూ వెళ్ళవలసి వచ్చింది, పైగా- నా ఓ టు సుందరశివరావుకే వేశాను.
సుందరశివరావు ఏర్పాటు చేసిన పార్టీ తాలూకు పూర్తి వివరాలు సరిగ్గా జ్ఞాపకం లేవుగానీ, మనసుకి న్చచ్చిన ముచ్చటైనసన్నివేశాలు కొన్ని యిక్కడ ఎత్తి రాస్తాను.
పార్టీ జరుగుతున్నప్పుడు సుందరశివరావు సత్యవతిని తన సరసన నిలబెట్టుకుని ఇంగ్లీషులో ఉపున్యాసం చెప్పేడు. వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకున్నట్టు , త్వరలో వాళ్ళ పెళ్ళి జరగబోతున్నట్టూనూ.అప్పుడు సత్యవతి మొహంలో సిగ్గులు మొగ్గలు తొడిగింది. పెద్దకళ్ళని సగానికిముసి, హాయిగా నవ్వింది-.చాలు- ఆనవ్వు నా కిప్పటికీ గుర్తు! ఒక మనిషికి అన్నీ అందూబాటులో ఉన్నప్పుడు కులాసాగా నవ్వితే ఆ నవ్వు అలాగే వుండి తీరుతుంది.
సత్యవతి నవ్వేసి తలదిదించుకుంటూన్న సమయంలో నా పక్కన కూర్చున్న సత్యం ' వన్స్ మోర్ ప్లీజ్!' అన్నాడు.
సుందరశివరామయ్య అంతకుమునుపు చెప్పిన నాలుగు మాటల్నే మళ్ళా చెప్పేడు పాపం!
నాకు తెలుసు- మా సత్యం వన్స్ మోర్ అభ్యర్థన సుందరశివరామయ్య యొక్క అమోఘమైన ఉపన్యాస శిల్పానిక్కాదు, సత్యవతి అందమైన నవ్వు నుద్దేశించి. సుందర శివరావు ఆ తర్వాత చాలా చెప్పేడు.అదే మామిడి తోటలో మేమందరం మెచ్చుకునే రీతిలో ఓ సుందరమైన తాజ్ మహాల్ కట్టించే ఉద్దేశముందనీ, దాన్లో వాళ్ళిద్దరే కాపురముంటారని చెప్పేడు.
అతని ఊహాగానం విని అసూయ చెందినవాడిన్నేను. ఆ ' నేను' కి ప్రేమించటం తెలీదు.అధవా ప్రేమించినా, సుందర శివరావు కట్టించబోయే తాజమహలు మాటల్లో సైతం చెప్పకోగల తాహతు ఆరోజుల్లో లేదు. అందుచేతనే సుందరశివరావు బంగారు జీవితమ్మిద జెలసీ చెందేను.
పార్టీ ముగిసినంత తర్వాత కాబోయే అర్ధాంగిచాత పాట పాడించేడు.
ఇళ్ళకి వెళ్ళబోయేముందనుకుంటాను, అందర్తో పాటు లేచి నించున్న సుదరశివరావు గబిక్కిన కూర్చున్నాడు. మామిడి చెట్టుకి నడుం ఆనించి సత్యవతి వేపు అమాయకంగా చూసేడు. అందరం ఖంగారు పడిపోయేము. అప్పుడ తెలిసింది. అన్నీవున్న మనిషికి ,అన్నీ ఉన్నాయనీ విషయం గుర్తుకొచ్చి. గుండెల్లో పోటు రావడమనేది ఒక రకమైన వ్యాధి 'అతి' భరించలేని నాజూకుతనంగల మనిషి సుందరశివరావు.
సత్యవతి కొంచెం సేపతనికి ఉపచారంలాంటిదేదో చేసింది. అతని గుండెలమిద సున్నితంగా ఆమె చేతిని రాసింది. ఒక్కొక్క అందమైన చేతికి వైద్యరీత్యా విలువెంతో నాకు ఆనాడే తెలిసింది.అలాంటి ఆడపిల్ల సన్నిధిలో మరణమే కలిగినా అదీ ఒగ గొప్ప అదృష్టంగానే భావించవచ్చు మరేంఫరవాలేదు. వెధవ బ్రతుకు- నీరసంగా రసహీనంగా ఎన్నాళ్ళు బ్రతికితే మాత్రం ఏం ప్రయోజనం గనక?
కాసేపటికి సుందరశివరావు లేచి నించుని పెదాలమిదుగా నవ్వేసి అన్నాడు.
" ఐయా మాల్ రైట్ మైడియర్ ఫ్రండ్స్ థేంక్యూ సత్యా! థేంక్యూ వెరీ మచ్."
ఆ రోజుల్లో సుందరశివరావులా తిరుగుదానిపించేది నాకు. అతనిలా సిగరెట్లు కాల్చేస్తూ, అతనిలా తెలివిగా (అందంగా) మాట్లాడుతూ, అతనిలా సరదాగా- ఎన్నో కోరికలు! రానీ, ఆదేం పాపమో! ఆ పార్టీ ముగిసిన మరుసటి రోజునుంచే అతను నన్ను చూచి గూడా పలుకరించేవాడు కాదు. అక్కడికీ రెండు మూడు తడవలు అతన్ని పలుకరించి నా అభిమానం చంపుకున్నానేగానీ, అతన్నేనుకున్నంత ' చొరవ, గల మనిషికాడు. ఏ పుట్టినరోజు పండుగలాటిదో నేనూ, ఏర్పాటుచేసి సుందర శివరావున, అతని ప్రేమనీ, అతని సొసైటీని యావన్మందిని పిలిచేసి ఇంకేదో చేసేయాలనిపించింది. కానీ, అతనీ చుట్టూ తావున్న 'హంగు' ని చూచి ఆ కోరిక చంపుకునేవాడిని.
