Previous Page Next Page 
రాగోదయం పేజి 6


    "ఒరే జనార్దనం!"
    జనర్ధనానికి ఆయనలా మాటిమాటికీ ఒరేఒరే అనటం నచ్చదు. కానీ దానికెవరేం చేయగలరు? అది ఆయన పద్దతి, అలవాటు. అక్కా పుట్టి పెరిగి పెద్దయిన వాళ్ళు వాళ్ళు ఐ.ఏ.యస్ కలెక్టరు కానీ, డాక్టరు కానీ యింజనీరు కానీ హైకోర్టు జడ్జి కానీ ఆఖరికి గవర్నరో ఇండియా ప్రెసిడెంటో అయివచ్చినా వాళ్ళని ఆయన ఒరే అనే అంటాడు. అంతటి స్వతంత్రుడాయన.
    "ఇన్నిసార్లు మద్రాసెళ్ళా వేం తెచ్చావురా?"
    జనార్ధన్ పెదాలు బిగించాడు. సమాధానం యివ్వలేదు.
    "ఒరే, ఈ పరియాయం వెళ్ళినపుడు నాకు ఓ మంచి గొడుగు తెచ్చిపెట్టరా!"
    "అలాగే నండీ."
    "ఎంతవుతుందిరా?"
    "ఫారిన్ దయితే వందదాకా అవుతుందేమో నండీ"
    "వందా, సర్లే! తీసుకురా నేనిస్తాన్లే"
    "అలాగే నండీ!"
    "భడవా, మళ్ళీ వెడతావా అయితే? శుభ్రంగా పెళ్ళి చేసుకుని యింటిపట్టున వుండి పొలం పుట్రా చూసుకుంటూ మీ అన్నా వదినలకి తోడు నీడగా వుండకుండా మళ్ళీ మద్రాసు వెళతానంటావా?" కస్సుమన్నాడు కరణం.
    ఖంగు తిన్నాడు జనార్ధన్. అతనికి నోటమాట రాలేదు.
    "ఇప్పుడే చెప్పాడు మీ అన్నయ్య అదేదో సంబంధం చూశానని నువ్వు సరేనన్నావనీ-ఒరే నువ్విలా తిరుగుతూ వుంటే నీకు పిల్ల నెవరిస్తార్రా భడవా?
    వంచిన తల ఎత్తలేదు జనార్ధన్.
    "నీవేం చిన్నవాడివా? నీకు నీతులు చెప్పాలా? బుద్దిగా బ్రతకలేవు. అన్న ఎన్నని చెబుతాడు. నీ బ్రతుకు నీవు చూసుకోవాలి. బుద్ది పెడదారి పడితే అది కుదుటికి వస్తుందా? ఊహుఁ కుక్కతోక వంకర, నీ బుద్ది అంతే"
    "అది కాదు మామా" గుక్క తిప్పుకున్నాడు జనార్ధన్.
    "అది కాదు" గుక్క తిప్పుకున్నాడు జనార్ధన్.
    "ఏమిటి కాదు, నీ మనస్సులో ఏముందో చెప్పు."
    నువ్వేమన్నావు ఈసారి మద్రాసు వెళితే ఓ మంచి గొడుగు తెమ్మన్నావా లేదా?"
    "అవును!"
    "నేనేమన్నాను?"
    "తెస్తానన్నావు!"
    "అహఁ వెళితే తెస్తానన్నాను అంతేకానీ వెళతా నన్లేదు కదా?"
    "చావుదెబ్బ కొట్టావురా అల్లుడూ" నవ్వుతూ అన్నాడు శేషయ్య.
    జనార్ధన్ ముసి ముసి నవ్వులు నవ్వాడు. అతని సమాధానం చౌదారికి కూడా నచ్చింది.
    "వస్తానండీ! అలా ఊళ్ళోకి వెళ్లొస్తాను!" అని కదిలాడు జనార్ధన్.
    "అవున్లే శిష్యవర్గం వుందిగదా! నాటకాలు తయారు చెయ్యొద్దు మరి వెళ్ళిరా"
    నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జనార్ధన్.
    అతన్నే తదేకంగా చూస్తూ "చౌదరీ నువ్వు అదృష్ట వంతుడివయ్యా" అన్నాడు శేషయ్య.
    "ఎందుకు మామా?"
    "చెప్పనా? ఇలాంటి తమ్ముడు అందరికీ వుంటాడంటావా?"
    "ఏం తమ్ముడో! ఇంటి పట్టున వుండడు గదా?"
    "ఉండకేం చేస్తాడు? తగిలించు ఓ గుదిబండని. సినిమాలకని షికార్లకని వెళ్ళినా గప్పున తిరిగొస్తాడు?"
    "అదే ఆలోచిస్తున్నా"
    "ఆలోచనెందుకు? నాయనప్పాడు సంబంధం ఖాయం చెయ్"
    "మంచిరోజు చూసి వెళ్ళొస్తాం"
    "అదే మాట! చతికిలబడ్డాడు కరణం.
    ఇద్దరిమధ్య నిశ్శబ్దం.
    "చౌదరీ, అర్జంటుగా ఓ పది కావాలోయ్.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS