Previous Page Next Page 
నేను పేజి 58


    నన్ను పూర్తిగా నగ్నంగా చేసేశాడు. అనుభవించటానికి తొందరేముంది, తనకు అడ్డేముంది. అన్న అహంకారంతో నా అందాలన్నీ కళ్ళతోనే జుర్రుకుంటూన్నట్లుగా కాసేపు చూస్తూ నిలబడ్డాడు.   


    అతని ముఖంలో విజయగర్వంతో కూడిన దరహాసం మెరుస్తోంది.


    తర్వాత మెల్లగా ప్రక్కమీదకొచ్చి నా మీద వ్రాలాడు.


    అతని చేతులు నా శరీరంలోని భాగాలని.... ఎక్కడెక్కడో స్పృశిస్తున్నాయి. పెదాలు ఎక్కడెక్కడో ముద్దు పెట్టుకుంటున్నాయి.       


    "నువ్వు లోపల కూడా ఇంత అందంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు.


    ఛీ అనుకున్నాను.


    ఒక మేధావిని చౌకబారు రౌడీ హత్య చేస్తాడు. అది అసంగతమే. కాని పెద్ద పెద్ద మేధావులు చాలా అల్పమైన అంతానికి గురి కాబడుతూంటారు. ప్రపంచంలో ఇలాంటి సంఘటనలెన్నో జరుగుతూంటాయి.   


    నా శరీరంతో ఇష్టమొచ్చినట్లాడుకుంటూ, నన్ను ఓ టాయ్ లా వాడుకుంటూంటే ప్రేక్షకురాలిగా ఉండిపోయాను.


    అలా ఎన్నిసార్లో....


    మధ్య మధ్య 'థాంక్యూ.... థాంక్యూ' అంటున్నాడు ఆ పదాన్ని కలుషితం చేస్తూ.


                                                           22


    మా పోర్షన్ లోకి ఎప్పుడొచ్చానో, ఎలా తీసుకురాబడ్డానో తెలీదు. మర్నాడు ఎంతసేపు గడిచిపోయిందో కూడా తెలీదు. మధ్య మధ్య మెలకువ వస్తూన్నా, మత్తుగా నీరసంగా ఉండి మళ్ళీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి.      


    ఎప్పటికో....


    "సతీ! సతీ!" అన్న పిలుపు వినిపిస్తూంటే కళ్ళు బలవంతాన తెరిచి చూశాను.      


    సుకుమార్.


    "ఇప్పుడు టైమెంతయిందో తెలుసా? ఎందుకిలా పడుకుని ఉన్నావు? వొంట్లో బాగోలేదా?"


    "ఇలారా" అన్నట్లు చూస్తూ నాలోకి కొంత శక్తి తిరిగి వచ్చినట్లు గ్రహించి చేతులు జాచాను.


    "సుకుమార్ ఇలా రా! నా పక్కకి కూచో."


    వచ్చి నా ప్రక్కనే కూర్చున్నాడు.


    "సతీ! ఏం జరిగింది? నామీద కోపమొచ్చిందా? ఏం చెయ్యను చెప్పు. ఆఫీసు పనిమీద అర్జంటుగా ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి చెప్పటానిక్కూడా టైము లేదు. సురేంద్రకు ఫోన్ చేసి నీకు మెసేజ్ ఇవ్వమని చెప్పాను. కబురందలేదా?"  


    అతని ముఖంలోకి చూశాను. అమాయకమైన ఆ కళ్లు.... జాలితో కడుపు తరుక్కుపోయింది.    


    "సుకుమార్! ఇలా నా చేతుల్లోకి రా!"


    గుండెల మీద వ్రాలిన అతన్ని నా చేతుల్లో పెనవేశాను.


    మధ్యలో ఎప్పుడో.... ఆ స్థితిలో సురేంద్ర. అన్న మాటలు లీలగా గుర్తొస్తున్నాయి.


    "ఇలా జరిగిందని సుకుమార్ కు చెప్పకు. నాకేం భయంలేదు. నన్ను వాడేమీచెయ్యలేడు. తలుచుకుంటే నేనే వాడ్నేమయినా చెయ్యగలను. కానీ నీ గురించే చెబుతున్నాను. వాడికి తెలీటం వల్ల మీ ఇద్దరి మధ్యా అగాధం ఏర్పడుతుంది. నీ కుటుంబ జీవితం నాశనమవుతుంది. మీ ఇద్దరిమధ్య చెడకుండా వుండాలంటే దీన్ని రహస్యంగా అట్టే పెట్టుకో.... చాలా మంది ఆడవాళ్లు అందుకే గప్ చుప్ గా ఊరుకుంటారు."  


    "సతీ! ఎందుకింత....?"


    "సుకుమార్. నీకో విషయం చెప్పాలి. పర్యవసానం ఎలా ఉన్నా సరే."


    మెల్లమెల్లగా జరిగిందంతా చెప్పేశాను.


    అతని శరీరంలోని వొణుకు తెలుస్తోంది. వేదన, ఆవేశం కలబోసి ఉన్న వొణుకు. అతని రక్తం మరుగుతూన్నదని అర్థమవుతోంది.  


    ఉన్నట్లుండి నా చేతుల్లోంచి విడిపించుకుని లేచి నిలబడ్డాడు.


    కళ్లలో ఎర్రటి జీర తెలుస్తోంది.


    "అతనెంత సెన్సిటివో తెలుసు."


    "సతీ! పెళ్లికాకముందు ఎవరివో. ఆ తర్వాత పూర్తిగా నాదానివి. నువ్వు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా జీవిత సత్యాలు చెప్పినా అందుకే నేను ఆకళింపు చేసుకోలేదు. చేసుకునే శక్తి నాకు లేదు కాబట్టి. నాకు తెలిసిందల్లా ఒకటే. మనిద్దరి మధ్యా ఇంకొకర్ని భరించలేను. ఇంకొకరు నిన్ను తాకటం భరించలేను...."


    "సుకుమార్. ఈ సమస్యకు పరిష్కారం నన్ను చెప్పనీ. నిర్ణయం నువ్వు తీసుకోకు."


    "నో. నిర్ణయం తీసుకోవల్సింది నేను."      


    విసురుగా బయటికెళ్లి పోయాడు.


    నా శరీరంలోకి ఇంకా పూర్తిగా శక్తి రాలేదు. లేచి కూర్చుందామని ప్రయత్నించి కూడా బలహీనంగా మళ్లీ వెనక్కి వ్రాలిపోయాను.


    పావుగంట గడిచి ఉంటుంది. సుకుమార్ తూలుకుంటూ లోపలకొచ్చాడు. బట్టలన్నీ చిరిగి వున్నాయి. జుట్టు రేగిపోయి, వొళ్లంతా చెమటలతో, అక్కడక్కడ రక్తాలు చిమ్ముతోంది. దెబ్బలు ముఖం మీద కూడా కనబడుతున్నాయి.


    "రాస్కెల్. నే వస్తానని ఊహించి నలుగురు రౌడీలని పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు."


    అతని ముఖంలో కసి, అవమానం, బాధ.


    వాడ్రోబ్ దగ్గరికెళ్లి అందులోంచి విస్కీ సీసా బయటకు తీశాడు డ్రింక్ చెయ్యటం మానేశాక ఆ సీసా అలానే ఉండిపోయింది.


    "నేను "సుకుమార్! సుకుమార్!" అని పిలుస్తోన్నా వినిపించుకోకుండా బాటిల్ నోటి దగ్గర పెట్టుకుని గడగడ త్రాగేస్తున్నాడు. నాకు చాలా భయంగా వుంది. కాని ఏమీ చెయ్యలేని, వారించలేని స్థితిలో ఉన్నాను.       


    నోటి దగ్గర పెట్టుకున్న బాటిల్ క్రిందకు దింపకుండా త్రాగేస్తున్నాడు. ఇంచుమించు సగం వరకూ త్రాగేశాక ఇహ శక్తి లేనట్టు క్రిందకు గిరాటేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS