Previous Page Next Page 
నేను పేజి 57


    అయిష్టాలను దిగమ్రింగటం అలవాటయినందున మౌనంగానే ఊరుకున్నాను.


                             *    *    *


    సాయంత్రమై ఏడు కూడా దాటిపోయింది. సుకుమార్ ఇంటికి రాలేదు.


    ఏడున్నరకు సురేంద్ర వచ్చాడు. "ఎదురు చూడటంలో ప్రతి నిమిషం ఓ గంటలా గడుస్తుంది. మీ కభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి. సుకుమారొచ్చేదాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం" అన్నాడు.   


    ఎందుకో.... ఆ సమయంలో నాకూ ఒక్కదాన్నే ఉండలేక పరమ విసుగ్గా ఉంది. "పదండి" అని లేచి నిల్చున్నాను.


    సురేంద్ర ఇల్లంతా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వాతావరణం ఎంతో హాయిగా, కొత్తగా ఉంది.  


    ఇద్దరం ఎదురెదురుగా ఉన్న కుర్చీలలో కూచున్నాం.


    "సుకుమార్ నా ప్రాణస్నేహితుడు. అతనింత సాదా జీవితం గడపటానికి వీల్లేదు" అన్నాడు సురేంద్ర.


    అతని మాటల్లోని భావాలు ఊహించటానికే ప్రయత్నిస్తున్నాను.


    "జీవితమెంతో అమూల్యమైనది. అది వృధా కావటానికి వీల్లేదు. నాకు ప్రపంచంలో మీరిద్దరే ఆప్తులు. మీ ఇద్దర్నీ చాలా ఉన్నతమైన స్థితిలో నేను చూడాలి. ఇది నా జీవితాశయం. అప్పుడే నాకు మనశ్శాంతి.  


    అతని మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.


    సుకుమార్ ఇంకా రాలేదేమని వ్యాకులపడుతున్నట్లుగా చీటికీమాటికీ రిస్ట్ వాచ్ చూసుకుంటున్నాడు.


    "ఈలోగా కొంచం ఏపిల్ జ్యూస్ తీసుకుందాం."


    దాహంగా ఉండటం వల్ల నేను తల ఊపాను.


    ఫ్రిజ్ దగ్గరకెళ్ళి డోర్ తీసి ఏపిల్ జ్యూస్ బాటిల్ తీసి రెండు గ్లాసుల్లో పోసి తీసుకొచ్చాడు.


    "తీసుకోండి" అన్నాడు చాలా సభ్యతగా గ్లాసు అందిస్తూ.


    నేను కొంచం కొంచం తీసుకుంటున్నాను. అతనూ తీసుకుంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు.     


    ఆ మాటల్లో గౌరవముంది. వినమ్రత ఉంది. ఆరాటముంది.


    ఆలకిస్తూ మధ్య మధ్య అతని ముఖంలోకి చూస్తున్నాను.


    మొదట ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా కనిపించిన అతని ముఖం రాను రానూ మారిపోతోంది. ఇది భ్రమా? నిజమా? మళ్ళీ మళ్ళీ చూశాను. అతని ముఖం ఓ స్కల్ లా గోచరించసాగింది.


    ఏం జరుగుతోంది?


    ఎందుకనో భయమేసింది. అక్కణ్ణుంచి లేచి వెళ్ళిపోదామనుకున్నాను. నిలబడబోయే సరికి కాళ్ళు కదలటానికి నిరాకరిస్తున్నాయి. తల గిర్రున తిరుగుతోంది. చుట్టూ ఉన్న దృశ్యాలన్నీ మసక మసగ్గా మారిపోతున్నాయి.    


    అర్థమయింది. నామీద ఏదో ప్రయోగించబడింది. మంత్రమని నా ఉద్దేశం కాదు. శక్తివంతమైన మందులాంటిదేదో జ్యూస్ లో కలపబడింది.


    "నువ్వు.... ఏం చేశావు?" అన్నాను. నా గొంతు తడబడుతూ ఉండటమే గాకుండా నాకే వినబడటం లేదు.  


    లేచి నిల్చుని నా దగ్గర కొచ్చాడు. చేతులు నా భుజాల మీద పడ్డాయి.  


    శక్తినంతా ఉపయోగించి త్రోసేద్దామని చూశాను. కాని నాలో శక్తి హరించుకుపోయింది.    


    అతని పెదవుల మీద నవ్వు కనబడుతోంది.


    ఆ మనిషిలోని మృగం సాక్షాత్కరిస్తోంది.


    "సతీ!" అన్నాడు.


    నిస్సహాయంగా వింటూ ఉండిపోయాను.


    "సతీ! డియర్! నా అందాల బొమ్మా. మగాడికి ఆడదాని మీద కోరిక కలిగిందంటే, అదెంత బలంగా ఉంటుందో, తీర్చుకునేందుకు ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తాడో ఎంత తెలివైన దానివైనా నీకు తెలీదు. నువ్వు అందాల బొమ్మవు నీ అణువణువులో సొగసులున్నాయి. కవ్వింపులున్నాయి. నా చేత ఉపయోగించబడకుండా అవి వృధా కాబడటానికి వీల్లేదు. అందుకే ఓ బొమ్మా ఇంతకాలం ఓపిగ్గా వేచి ఉన్నాను. ఇప్పు డిహ.... నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీ భర్త రేపటిదాకా ఇక్కడికి రాలేడు. ఈ వ్యూహం నేను పన్నాను. ఈ అందమైన సమయం నాకోసం నిర్మించుకున్నాను. ఈ రోజు నాది. నిన్ను తనివితీరా జుర్రుకుంటాను."   


    "మొహం నా ముఖం మీదకొంచాడు. పెదాలు నా పెదవుల్ని తాకాయి. ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ ముద్దులో అతని కసి తెలుస్తోంది."


    కాని నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ప్రతిఘటించ లేక పోతున్నాను.


    "ఓరి రాక్షసుడా అనుకుంటున్నాను. అంతకన్నా ఏమి చేయలేకపోతున్నాను.


    రెండు చేతుల్తో నా భుజాలు పట్టుకుని నిల్చోబెట్టాడు. అతని చేతుల్లో ఓ బొమ్మలా ఒదిగిపోవటం మినహా ఏమీ చేయలేకపోతున్నాను.     


    ఇష్టంలేని అసహ్యాన్ని నిస్సహాయంగా భరించటం ఎంత దారుణమైన స్థితి!


    అలాగే పొదివి పట్టుకుని బెడ్ రూమ్ వైపు నడిపించుకు వెళుతున్నాడు.       


    లోపలికి వెళ్ళాక ఓ టాయ్ ని గిరాటేసినట్లు బెడ్ మీదకు విసిరేశాడు.  


    మెత్తటి పరుపు మీదకు వెనక్కి పడిపోయి, మసక మసగ్గా చూడగలుగుతూన్న కళ్ళను బలవంతాన తెరిచి ఉంచటం మినహా ఏమీ చేయలేకపోతున్నాను.


    అతను కూడా బెడ్ మీద కొచ్చి నా మీదకు వంగాడు. బుగ్గల మీదా, పెదవుల మీదా ఇష్టమొచ్చినట్లు ముద్దులు పెట్టుకుంటున్నాడు. చేతులు యధేచ్చగా, కసిగా వ్యవహరిస్తున్నాయి.     


    ఆ చేతులు నా జాకెట్ బటన్ విడదీసి, బ్రా ఊడదీసి వక్షోజాల్ని అనాచ్చాదితం చేశాయి.


    "బ్యూటిఫుల్ బ్యూటిఫుల్" అంటున్నాడు.


    కసితీరా అక్కడ కూడా ముద్దులు పెట్టుకొని ఇంకా చెయ్యాల్సిన తతంగమంతా చేసి, తర్వాత చీరె కుచ్చిళ్లు విడదీస్తున్నాడు.                      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS