Previous Page Next Page 
రాగోదయం పేజి 55


    చవుదరి లేచి కిందికి వెళ్ళేడు. అతన్ననుసరించాడు మునసబు ధర్మారెడ్డి. వాళ్ళ వెనకే వెళ్ళాడు నాయుడు. శేఖర్ ఆఖర్మ క్రిందికి కదిలేడు. అందరూ వెళ్ళిపోయాక స్వామీజీ, శిష్యురాలు ముఖముఖాలు చూసుకున్నారు. ఆయన ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది.
    "ఇక్కడికి వచ్చేస్తున్నారా!" భయం భయంగా అంది శిష్యురాలు.
    "విశాలాం భయపడొద్దు! మనం యీ వైపు మెట్ల ద్వారా క్రిందికి వెళదాం. పద, ఆలస్యం చేయకు." ఉన్నట్టుండి హఠాత్తుగా అన్నాడు స్వామీజీ.
    గబగబా మెట్ల వెంట దిగి పెరటి మార్గంగా బయటపడ్డారు. ఇద్దరూ అటూ యిటూ చూడకుండా వెళ్ళిపోయారు. నేరుగా కరణం యింటికి వెళ్ళారు. శేషయ్య ఇంట్లో లేడు. ఆయన భార్య ఒక్కతే వుంది. వీళ్ళని చూడగానే సంబరపడిపోయి ఆహ్వానించింది. ఉపచారాలయ్యాక వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి ఓ గది చూపించింది.
    ఇక అక్కడ పోలీసు జీపు ఆగుతూ వుండగానే చౌదరి ఎదురు వెళ్ళాడు. యస్సైగారికి నమస్కారం చేశాడు. అంతలో మునసబు, నాయుడు, శేఖర్ కూడా వచ్చారు! ఆహ్వానాలయ్యాయి.
    కుర్చీలో కూర్చుంటూనే "చవుదరీ! కాస్త కాఫీలు మా గొంతులో పోయించు! అబ్బబ్బ ఏం వూరయ్యా మీది. ఈ రాయలసీమలో వుద్యోగం కాదుగానీ అది మా ప్రాణాల మీదికి వచ్చింది. ఏం వూళ్ళో! ఏం మనుషులో." అన్నాడు యస్.ఐ.
     అంతలో కాఫీలు పట్టుకుని వచ్చాడు నౌకరు. ఆ వెనకే చవుదరి తమ్ముడూ వచ్చేడు. కాఫీలయ్యాయి.
    సిగరెట్ ముట్టించి "రెడ్డి! ఈ వూళ్ళోకి ఓ హంతకుడు వచ్చాడట గదయ్యా! ఆచూకి కనిపెట్టావా?" అని అడిగేడు.
    అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. హంతకుడా?" అన్నాడు అప్రయత్నంగా నాయుడు.
    "ఆ! హంతకుడే. టౌనుకి అటువైపున్న ఓ పల్లెలో ఓ షావుకారి భార్యను చంపేడు. నగలతో సహా పారిపోయి వచ్చాడు. మనిషి ఆచూకి పట్టుకోవటం కష్టంగా వుంది. ఏ క్షణాన ఏ వేషం వేస్తాడో ఎవరం చెప్పలేం ఇదిగో ఫోటో"
    ఫోటో అందుకున్న ధర్మారెడ్డి అప్రయత్నంగా "స్వామీజీ పోలికలున్నాయా!" అన్నాడు.
    "స్వామీజీనా!
    "బాబాజీగారా ?"
    ఆశ్చర్యంగా అడిగేరు అందరూ.
    వెంటనే అందుకున్నాడు యస్.ఐ. "స్వామీజీనా? ఎక్కడ?" అంటూ లేచి నుంచున్నాడు.
    "ఆహా స్వామీజీ పై గదిలో వున్నార్లే. సర్వసంగ పరిత్యాగులు. ఆయన ఎక్కడ ఈ హంతకుడు ఎక్కడ?" మృదువుగా వారించాడు చౌదరి.
    "అయినా ఒకసారి చూస్తే తప్పేమిటి? పద!"
    "అవును! అయితే సందేహం! కాకుంటే దర్శనం!" అన్నాడు శేఖర్.
    అందరూ మేడపైకి దారితీశారు.
    అయితే అక్కడ స్వామీజీ, అమ్మాజీ యిద్దరూ లేరు! అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి సామాను అక్కడే వదిలేసి వెళ్ళాడు స్వామీజీ.
    యస్సై కనుబొమలు ముడిపడ్డాయి. ఎక్కడున్నాడో వెతకండి! అన్నాడు కఠినంగా.
    మేడపై భాగం అంగుళం అంగుళం వెతికేరు. దిగివచ్చి యిల్లంతా చూశారు.
    "నా అనుమానం నిజమయితే అతనే హంతకుడు! పదండి వూరు వూరంతా గాలిద్దాం."
    "యస్సైగారూ!"
    ఠక్కున జేబులోంచి నోట్లకట్ట తీశాడు చౌదరి! ఇదుంచండి! నా యింట్లో హంతకుడున్నాడంటే అది నాకు అవమానం. తర్వాత యింకెక్కడయినా పట్టుకోండి."
    ఆ డబ్బు అందుకున్నాడు యస్సై. అతని ముఖం వికసించింది. ఇదిగో మీ ముగ్గురూ స్టేట్ మెంట్స్ యివ్వండి అన్నారు. పైకం జేబులో పెట్టుకోబోతూ ఏదో అనుమానం వచ్చి చూసి "ఆయ్" అని అరిచాడు.
    "ఏమిటి సార్ ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS