శ్రీ వెంకటేశ్వరరావు, నార్ల
నవశకం
చీకటి తెర తొలగునులే - ఇక నీ
వాకిట సిరి వేలుగునులే.... ||చీకటి||
రేపన్నది వచ్చునులే-ఆపన్నుల మెచ్చునులే
కన్నుల తడి నొత్తునులే-చిన్నగ వొడికెత్తునులే
ఇక నీ వాకిట సిరి వెలుగునులే.... ||చివరి||
చిత్తము చిగురొత్తునులే-ఎత్తుగ ధ్వజమెత్తునులే
సత్యము పురి విప్పునులే- నృత్యము ధర నొప్పునులే ||ఇకనీ||
నవశకమే విరియునులే-నవ్యాభ్రము కురియునులే
న్యాయం బిల నిలుచునులే-నవజీవం పిలుచునులే ||ఇకనీ||
* * * *
