Previous Page Next Page 
రాగోదయం పేజి 46


    సోము ముఖంలో నరాలు బిగించుకున్నాయి. తమాయించుకున్నాడు.
    కరణం ప్రాసిక్యూషన్ లాగా వ్యవహారం ప్రారంభించాడు.
    "సోమూ! నువ్వు రాత్రి పాఠశాలలో జయన్నకి తోడుగా వుండిపోయావా?"
    "అవును."
    "రాత్రంతా వున్నారా."
    "అవును!"
    అ సమాధానం వినగానే మళ్ళీ ధూ --అని వూశాడు చౌదరి.
    "ఏందయ్యో! కాండ్రిస్తున్నావు ఎవరి మీద? మా మీదనా? అయితే నేనూ వూస్తా!" కస్సుమంది చంద్రమ్మ.
    "నోర్ముయ్ హా" అరిచాడు జానయ్య.
    "ఆహా నువ్వుర్కో - ఎందట యీనా పంచాయితీ ?"
    "నువ్వుర్కోమన్నానా? నోర్ముయ్!"
    "ఒరే జానిగా ఆడపెత్తనం తంబళి దొరతనం అని ఊర్కే అనలేదు రా! పెండ్లానికి భయపడాలేందిరా!" హేళనగా అన్నాడు చౌదరి.
    "ఇట్లాటోల్లంతా పెండ్లాల కాళ్ళు పిసుకుతారు!"
    "ఒసేయ్!" గర్జించాడు చౌదరి.
    ఇదో ఒసే గీసే అన్నావంటే చీపురు తిరగేస్తా ఎమిటనుకున్నావో! మర్యాద యిచ్చి మర్యాద పుచ్చుకో అని గాండ్రించింది చంద్రమ్మ.
    వ్యవహారం ముదురుతోందని శేషయ్య కలుగజేసుకున్నాడు. "చౌదరీ నువ్వురూకో - అట్టా మాట మిగులోద్దూ చంద్రమ్మా! చిన్నా పెద్దా చూడొద్దు. నలుగుర్లో వున్నాం యాదగా చూడు!"
    చౌదరీ పళ్ళు కొరికాడు.
    "అయ్యగోరూ! మీరు పెద్దోళ్ళు పిలిచి పిలిపించుకోండి. మీరు తిడితే పడనీకి లేం మేం - మీ తిండికి తిన్నామా తిడ్తే నోర్ముసుకోడానికి-"
    "అద్సరే! రాత్రంతా జయన్నతో వున్నట్టే నీ కొడుకు వప్పుకున్నాడు గదా?"
    "అవును - అందులో అబద్దం ఏవుంది?" జయాన్న వైపు చూసింది. అతను తలూపి తల వంచుకున్నాడు.
    "మరింక వాదనకేం తావుంది చంద్రమ్మా?"
    "ఏందయ్యాగారూ"
    "జానయ్యా! చంద్రమ్మా, సోమన్నా జయన్నా అందరూ వినండి. రాత్రి తలారి వెంకటస్వామి తమ్ముడు చౌదరి జీతగాడు సుబ్బుగాడు సోమన్నని చౌదరి తోటకి కావలి పొమ్మన్నాడు. పదిహేను రూపాయలు కూలి కూడా అన్నాడు. సోము సరే అన్నాడు.ఒప్పుకుని, కానీ వెళ్ళలేదు అవునా సోమన్నా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS