Previous Page Next Page 
రాగోదయం పేజి 42


    "ఇక నువ్వెళ్ళు."
    స్వామి సెలవు తీసుకున్నాడు.
    అతను వెళ్ళగానే శేషయ్య లేచి, భార్యకు తలుపేసుకోమని కేకేసి హడావుడిగా బయలుదేరాడు. నేరుగా చావిట్లోకి వెళ్ళి తలార్లతో మునసుబుని , చౌదరినీ, సర్పంచ్ నాయుడిని రమ్మని కబురు చేశాడు.


    
                                           19

 

    "దేవుడి సొమ్ము తినడానికి భయపడకూడదు. భయస్తుడు ఏమి చేయలేడు. దేవుడికి పోతోందని భయపడకండి. పది సబ్బులు కొన్నవాడికి కాలెండర్ యిచ్చినట్టుగా యిన్ని నగలు గై కొంటున్న మనం స్వామినేం ఖాళీగా వుంచడం లేదు. గిల్టు వైనా, గోల్డు వైనా నగలు నగలే! దుష్టుడనీ, దుర్మర్గుడనీ, మంచివాడనీ, సన్మార్గుడనీ మనలో బేధాలున్నా అయన దృష్టిలో సమానమే. సృష్టి అంతా ఆయనదే కదా!
    "కాబట్టి మనం నగలు మార్చేందుకు చింతిచనక్కర్లేదు."
    కరణం గారి గంభీరోపన్యాసం విన్న నలుగురూ తలూపేరు వినయంగా.
    ఆ తర్వాత కర్యక్రమం చిద్విలాసంగా నిర్విఘ్నంగా సాగిపోయింది. టౌన్ కి వెళ్ళడం, గిల్టు నగలు తేవడం ఒక్కొక్కటే మార్చేయటం నెల తిరిగేసరికల్లా ఏనాడో ఏ రాజుల కాలంలోనో ఏ జమిందారో ముచ్చటపడి మొక్కుబడిగానో చేయించిన నగలు వాళ్ళ ఇళ్ళు చేరాయి.
    శేషయ్య చెప్పినట్టుగా సర్వ సృష్టి తనదే అనుకున్న ఆ చిదానందరూపుడు ఆ మార్పుకేం బాధపడలేదు.
    దొంగతనం, మోసం అనేవి బయలుదేరిన చోటే ఆగవు అవి తమ గమ్యం చేరుకునే దాకా ఆగవు.
    రుచి మరిగిన కుక్క వరిమళ్ల త్రోవ పట్టిందని సామెత. అలాగే చేశారు నలుగురూ దీంట్లో శేఖర్ ని చేరనివ్వలేదు.
    కొండయ్య చౌదరి, రెడ్డి, శేషయ్య, రహస్యంగా సమావేశమయ్యాడు. అసలు రచ్చబండ మీదే కూర్చోవాలని నిర్ణయించుకున్నారందరూ. కాని శేషయ్య అంగీకరించలేదు.
    అందుకే అంతా రెడ్డి యింట్లో చేరారు.
    మునసబు ధర్మారెడ్డి అతిధులకు తగిన సత్కారం చేశాడు.
    అన్నీ ముగిశాక "ఆ యిప్పుడు చెప్పు!" అన్నాడు సర్పంచ్.
    అటు ఇటూ చూసి "రోజులు మారుతున్నాయి. గవర్నమెంటు రోజుకో చట్టం చేస్తుంది. మొన్న లాండ్ సీలింగ్ లో ఎవరెవరు ఎంతెంత తిప్పలు పడిందీ మరచిపోయినారా! నేనున్నాను కాబట్టి మిగిలిపోయినారు. అయినా ఖర్చెంత యింది?" అన్నాడు.
    "అయినా బయటపడినాం గదా!"
    చౌదరీ అన్నీ అట్లాగే అనుకోమాక. రోజులు బాగు లేకపోతే అంతాపోతది.
    "ఇదిగో ధర్మారెడ్డి! నువ్వురూకో కరణం నీ చెప్పనీ,"
    "అద్గదీ మాట. ఈ దాగుడు ముతలతో పనేముంది అసలు విషయాన్ని కొద్దాం!"
    "చెప్పు మరి!"
    "ఇప్పుడు దేవుడికి భూములున్నాయా?"
    శేషయ్య పూర్తీ చేయక ముందే యిదేదో కొత్త ఎత్తనుకున్నారంతా.
    "వాటిని గవరనమెంటుకు తిక్కరేగితే అమ్మేస్తుంది. అదీ తక్కువరేటుకి. అదీ కౌలు చేస్తున్న వీళ్ళకు, అదీ హరిజనులకు, గిరిజనులకు, అప్పుడేమవుతుంది? ఇన్నాళ్ళుగా మనం తలా కొంచెం గుత్తయిచ్చి అనుభవించుకుంటున్న భూములన్నీ గోవిందా అవుతాయి."
    "అవునవును!" ముగ్గురూ ఒకేసారి ఒక్క ముఖంతో అన్నారు.
    గాలి పూర్తిగా బిగించినట్టుంది వాతావరణం.
    "అసలీ ప్రపంచంలో ఒకడు బుద్ధిమంతుడు, తొంభై మంది మూర్ఖులు, మిగతా తొమ్మిదీ లౌకికం తెలిసిన ఫూల్స్ వాళ్ళు, వాళ్ళు ఆ ఒక్క బుద్దిమంతుడిని ఆవలికి నెట్టి, మిగతా వాళ్ళని పాలిస్తారు ఇదీ లోకం!"
    కరణం ముఖం వికసించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS