Previous Page Next Page 
నేను పేజి 41


    ఓ రోజు ఉదయం వైదేహి వాళ్ళ తల్లిదండ్రులొచ్చారు. చేతిలో శుభలేఖ ఉంది.


    "మా అమ్మాయి పెళ్ళి" అంటూ శుభలేఖ అందించి ఆహ్వానించారు. వాళ్ళింట్లో హడావుడీ, ఏర్పాట్లూ చూస్తుంటే ఆ సంగతి తెలుస్తూనే వుంది.


    మర్నాడే పెళ్ళి. దగ్గర్లోనే ఉన్న కళ్యాణమండపంలో. పెళ్ళి వాళ్ల శక్తికి మించి కూడా బాగా చేశారు. వైదేహి పెళ్లికూతురు అలంకరణతో కళకళలాడుతూ ఉండడమే గాకుండా ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.  


    ప్రపంచంలో చాలా సహజంగా కనిపించే సుందర దృశ్యాలలో ఇదొకటి.


    కొన్ని క్షణాలు నాలోంచి 'నేను....' చెరిపేసుకుని ఆ దృశ్యాన్ని ఎన్ జాయ్ చేశాను.       


    మనుషుల్ని జీవితాంతం నీడలా వెంట పెట్టుకుని ఉండేదీ, వెంటాడుతూ ఉండేదీ ఈ ద్వంద ప్రవృత్తే.      


                               *    *    *


    మూడురోజులు గడిచి ఉంటాయి.... అర్థరాత్రి తలుపులు గట్టిగా బాదుతూన్నట్లు చప్పుడయితే ఉలికిపడి లేచాను. ఎవరై ఉంటారు!      


    ఆ రాత్రివేళ తలుపులు తెరవటానికి సంకోచిస్తూ కొంచెం సేపలా కూర్చుండిపోయాను.


    "అక్కా! తలుపు తియ్. నేను...."


    వైదేహి గొంతు. ఇహ ఆలోచించలేదు. లేచి, లైటువేసి తలుపులు తీశాను.


    వైదేహి గభాల్న లోపలికొచ్చి నన్ను వాటేసుకుంది. "తలుపు వేసేయ్ అక్కా. తర్వాత చెబుతాను."    


    ఆమె శరీరమంతా వొణికిపోతోంది.


    ఆమె చెప్పినట్లు చేశాక చేయి పట్టుకుని మంచం మీదకు తీసుకెళ్ళాను.


    "నాకా మొగుడొద్దక్కా. నేనతన్తో కాపరం చెయ్యలేను."


    అప్పుడు గుర్తొచ్చింది ఆ ఉదయం నుంచీ వాళ్ళింట్లో హడావుడిగా ఉన్నదని. ఈ రోజుల్లో కూడా కొంతమంది శోభనం లాంటి దానికి హంగామా చేస్తారు. అలాంటిదేమైనా అయి ఉంటుందనుకుని, దాన్ని గురించి తర్వాత మరిచిపోయాను.  


    "వాడు మనిషి కాదు. రాక్షసుడు. వాడ్ని ఒక్క సెకను కూడా భరించలేను" మళ్ళీ వైదేహి అంది. ఆమె కళ్లవెంట నీళ్ళు కారుతున్నాయి.


    విషయం కొంత అర్థమవుతున్నా "ఏం జరిగింది?" అన్నానప్రయత్నంగా.


    అంటూనే ఆమె ముఖంలోకి చూశాను. పెదిమలు చీలి, చిట్లి నెత్తురు బిందువులు చిమ్ముతున్నాయి. చెంపల నిండా గాట్లు, రక్కులు.


    "సెక్స్ అంటే నాక్కొంత వరకూ ఊహలున్నాయి. ఎంతో మధురంగా ఉంటుందని భావించి, మురిసిపోయాను. కాని.... ఇంత పైశాచికత్వమా? ఏం జరిగిందన్నావు కదూ. చూడు"      


    ఆ షాక్ లో, కోపంలో, కసిలో, ఉద్రేకంలో ఆమె సిగ్గు గురించి కూడా మరిచిపోయింది.


    జాకెట్ హుక్స్ తీసింది.


    అమాయకమైన వక్షోజాలు, ఇంకా పూర్తిగా వికసించని ఆ చిన్నారి పువ్వులు, నలిగి, పళ్ళగాట్లతో రక్తాలోడుతూ గొల్లున విలపిస్తున్నాయి.


    లంగా పైకి తీసింది.


    మోకాళ్లు, తొడలు, ఇంకా పైకి....


    మైగాడ్?


    చీల్చి పారేసినట్లు, ప్రపంచంలోని శాడిజమంతా ప్రోగుచేసి అక్కడే ప్రదర్శించినట్లు, కత్తులతో నరికినట్లు.


    నాకు కళ్లు తిరిగాయి.


    తూలిపడబోయి సర్దుకున్నాను.


    "వాడెలాంటి మనిషో అర్థం కావడం లేదు. నా వొళ్లు ఇలా చిత్రవధ చేశాక 'హమ్మయ్య' పీడ వదిలింది. ఇహ సేద తీరుదామనుకుంటూండగా మళ్ళీ మీద పడేవాడు. ఆ శక్తేమిటో, ఆ జుర్రుకోవటమేమిటో.... ఛీ. తట్టుకోలేకపోయాను. ఈ కంపరం భరించలేకపోయాను. బాత్ రూమ్ కెళ్లొస్తానని చెప్పి నీ దగ్గరకు పారిపోయొచ్చేశాను."    


    నువ్విక్కడికి వచ్చావని తెలుసా?"


    "తెలిసే ఉంటుంది. నేనింకెక్కడికి పోనని వాళ్లకి నమ్మకం."


    టైము చూశాను. ఇంకా మూడు కాలేదు. అంటే.... ఇంచుమించు రాత్రి పదిగంటలకు ఈ తతంగం మొదలయితే కేవలం అయిదు గంటల వ్యవధిలో ఆమెకు సంసారమంటే ఏవగింపు కలిగిందన్నమాట. ఆమె మానసికస్థితి ఈ స్వల్పకాలంలో మారిపోయిందన్నమాట.


    వైదేహిని చూస్తే జాలేసింది. కొన్ని కొన్ని పొరపాట్లు ఉంటాయి. అవి పొరపాట్లని తెలిసే మనిషి చెయ్యకుండా ఉండలేడు.


    ఇంకో చిత్రమేమిటంటే.... చాలా చిన్న చిన్న విషయాల్లో మనిషి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి తూచి తూచి అడుగు వేస్తాడు. అతి ముఖ్యమైన సమస్యల్లో తేలిగ్గా తప్పటడుగు వేస్తాడు. అలాంటి వాటిల్లో పెళ్ళి ఒకటి.   


    ఇంకా అయిదారు నిమిషాలన్నా గడిచి ఉండదు. బయట్నుంచెవరో దబదబ తలుపులు బాదుతున్నారు.


    "అక్కా! వాళ్ళొచ్చేశారు" అంది కంపితస్వరంతో వైదేహి.   


    "ఫర్వాలేదు" అంటూ లేచి వెళ్లి తలుపు తీశాను.


    వైదేహి తల్లిదండ్రి నిలబడి ఉన్నారు.


    "మా అమ్మాయి వచ్చింది కదూ" అంటూనే లోపలకు దూసుకొచ్చారు."


    "ఇదిగో ఇక్కడే ఉందిగా. ఏమే?....  ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్లు పారిపోయి వచ్చావు. రా యింటికి" అంటూ తల్లి చెయ్యి పట్టుకుని లాగుతోంది.   


    "నేను రాను. అక్క దగ్గరే ఉంటాను" అంది వైదేహి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS