Previous Page Next Page 
రాగోదయం పేజి 40


    "కానీ వదినా."
    అతన్ని పూర్తిగా మాట్లాడనివ్వలేదామే. "ఇక ఆ తిరుగుళ్ళు మానుకో. ఇంటి పట్టున శుభ్రంగా వుండు. తిను. తిరుగు - నీ యిష్టం. నీ పెళ్ళి చేస్తాం, మా మాట విను."
    ఇహ లాభం లేదనుకుని "అలాగే వదినా!" అన్నాడు చేతులు కడుక్కుంటూ.
    పడ్డ గ్లాసు నిండా పాలు వంచుకుని వచ్చిందామే.
    గటగట తాగేశాడు.
    "జనా! మీ అన్నయ్య ఆ డబ్బుని గురించి నిన్ను అడక్కుండా చూస్తాను. కాని అయితే నువ్వు నాకో మాట యివ్వాలి."
    "ఏమిటోదినా!" వక్క నవుల్తూ అడిగాడు.
    "మళ్ళీ యిలా వెళ్ళనని మాట యివ్వు."
    ఆమె చాచిన చేతిలో చేయి వేశాడు జనార్ధన్.
    తృప్తిగా నిట్టూర్చింది.
    
                              *    *    *    *


    భార్గవి పొలం పనులు చూడడంలో సోముకి ఎంతో అనందం కనిపిస్తోంది. అసలు ఆమెని చూస్తేనే దేవతని చూసినట్టుగా, వుంటుంది. ఉత్సాహంగా వుంటుంది.
    భార్గవి మనస్సు స్పటికం లాంటిది. ఆమెకి సోముని చూస్తేనే పుత్ర వాత్సల్యం పెల్లుబుకుతుంది. అతని పెదతనాన్ని పోగొట్టాలనుకుండామే. తన భర్తలాగే దీనజనోర్ధరణ చెయ్యాలని ఆమె ఆశయం. దేశంలో పేదరికం వుండకూడదు. ఒకడికి లక్షల ఆస్తి. మరొకడికి వందల అప్పు ఏమిటి యీ అన్యాయం అనుకుంటుంది.
    ఈ పేదరికాన్ని పారద్రోలటానికి ప్రభుత్వం ఏంతొ కృషి చేస్తోంది. అయితే ఆకాశగంగా ప్రవాహం ఎంత స్వచ్చంగా ఉన్నా అది భూమిని చేరేసరికి వాతావరణం కలుషితమవుతూ ఉన్నట్టుగా ప్రభుత్వ ఆశయాలు సహాయాలు మహోన్నతంగా వున్నా, అది అట్టడుగున జనానికి చేరేసరికి కుళ్ళిపోతూ వుంది. ఏం చెయ్యాలి దీన్ని ఆపాలంటే?
    ప్రభుత్వం ఇచ్చే సహాయమైనా, బ్యాంకు యిచ్చే ఋణాలైనా అవి వాళ్ళకు అందేసరికి మధ్య నున్న అధికారులు, రాజకీయ నాయకులు స్వాహ చేస్తున్నారు.
    నిరక్షర్యత దీనికంతా మూలకారణం -
    దాన్ని పోగొట్టి వాళ్ళలో ధైర్యం, సామాజిక స్పృహ చైతన్యం ప్రవేశపెట్టాలి తామూ అందరిలాగే మనుషులం అన్న బానిస భావాన్ని పారద్రోలాలి.
    నీ ఋణం తీర్చుకోలేమమ్మా అని సోము అన్నపుడు తన మనసులోని భావాలన్నీ బయట పెట్టిందామే.
    ఆశ్చర్యపోయాడు సోము.
    అతని కామెపై గౌరవం రెట్టింపు అయ్యింది.

 

                                           18

 

    ఆ రోజు కాణీ కూడా బోణి కాలేదు.
    దిగాలుగా కూర్చున్నాడు కరణం శేషయ్య.
    మెలి మెల్లిగా వచ్చాడు పూజారి స్వామి. అతను శేఖరుకి స్వయానా అన్నయ్య.
    "నమస్కారం!"
    "వచ్చావా! రా! నంబి సాతాని ఎదురైన నాగుబాముమేడురైన చెవులు పొతేదురైన చేటు వచ్చు అన్నాడు ఏం మూడిందో!" విసుక్కున్నాడు కరణం.
    మధ్యాహ్నపు గాలి వేడిగా వీచింది. కొద్ది సేపయ్యాక మళ్ళీ గాలి వేపచెట్టు మీదుగా చేదుగా వీచింది.
    ఫక్కున నవ్వాడు స్వామి. "మీరిక్కడికి పోతున్నారు. నాది శకునం కాదులెండి! అలా అనుకున్నా శుభశకునమే!"
    "ఎక్కడికి పోతాను! పొద్దుటి నుంచి పైసా రాలేదు"
    "చెయ్యి పట్టండి!"
    "ఊ"
    "ఇదిగో , ఇరవై పైసలు. ఉదయం హారతిలో వచ్చింది."
    ఆత్రంగా రొంటిన దోపుకున్నాడు శేషయ్య. "హారతి లోదా! అయితే దేవుడి సొమ్మే! మంచి బోణియే!"
    "దేవుడి సొమ్ము తినొచ్చా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS