శ్రీ అబ్రహాము, నూతక్కి
పిలుపు
దేశాన్ని రక్షింప రావా - మాతృ -
దేశాన్ని దక్కించుకోవా.... ||దేశా||
చీనా - దురంతాలు - చేబూని పంతాలు
కఱకు కత్తులుదూసి - సరిహద్దుపై నిల్చె.... ||దేశా||
మంచుకొండలలోన - పొంచి పండ్లిగిలించు
కించిత్తు చీనా నియంత గొంతుక ద్రుంచి.... ||దేశా||
నీ చెలిమి కోరాడు - నీ బలిమి కోరాడు
నీ నీతి సూత్రాల నిలిచి భజియించాడు -
ఆ పాడు చైనీయు డోయి - నేడు మన పాలి శత్రువైనాడూ.... ||దేశా||
నీ సంపదల పెంపు - నింపు సొంపుల గాంచి
యీసడించిన - చీన మోసగానిని తరిమి.... ||దేశా||
శాంతి సూత్రాల వేదాంతాల బోధించు - మన
కన్న తల్లినే బాకులతో కుమ్మేటి - రాకాసులను
ద్రుంప రావా-మాతృదేశాన్ని దక్కించుకోవా ||దేశా||
భరత చండీశ్వరీ పద పద్మముల గొల్చి - గాండీవివై
శత్రు మూర్ధమ్ములను జీల్చి... ||దేశా||
వీరమార్తాండ తేజస్సమానుడ వీవు
ధీరోత్తముడ వీవు - శౌర్యార్ణవుడ వీవు
సమరసింహానికి శత్రుమూకల చెండి ||దేశా||
* * * *
