Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 34


                                    శ్రీ రామారెడ్డి, ముకురాల

    వహ్వా! ఎంత లాహిరి?

    ఎంత లాహిరీ ఉన్నది చూడు!
    ఎంత తడాఖా ఉన్నది చూడు!!

        టుం టుం టుం టుం 'టుంగ్' 'టుంగ్'
        తం తం తం తాం తల్లాఖ్ తల్లాఖ్
        ఝిం ఝిం ఝిం ఝిం ఝిల్లాక్ ఝిల్లాక్
        తదిగిణ గిణతోం తడాంగ్ వెలాంగ్
        ధంపట్ ధంధం ధడక్ ధడక్ లఢక్

            ఎంత లాహిరీ ఉన్నది చూడు
            ఎంత తడాఖా ఉన్నది చూడు

        పంచశీల దస్కత్తుల తోడు,
        పదను బెట్టిన కత్తుల తోడు.
        నీ పప్పూ నా పొట్టూ కలిపెయ్,
        ఉంది బొక్కుదాం చేతులు దులిపెయ్.
        అందర మొకటే అల్లా తోడు,
        అల్లం గలిపిన బెల్లం తోడు.

            ఎంత లాహిరీ..........
            ఎంత తడాఖా.........

        మార్క్స్, స్టాలిన్ మహిమలె నిజమా?
        బుద్ధుడు, మహమదు, బూర్జువ యిజమా?
        టంకం కొడవలి టక టక జూడు,
        తారా చంద్రుల తైతక జూడు.
        యూరపు తోడు యు, యు, ఐ, ఐ,
        తూరుపు తోడు 'తూ తూ మై మై.'

            వారే వహ్వా
            వహ్వా వహ్వా
            ఎంత లాహిరీ.........

    జుకజుక జుకజుం
    జుంజుక జుంజుక
    జుకజుక తికమక.

        కాశ్మీర్ శాలువ కిమ్మతు జూడు
        ఖరీదు దారుల హిమ్మతు జూడు.
        నల్లమందు బుల్లయ్యను జూడు,
        నారాగడ్డం మియ్యను జూడు.

            వారే వహ్వా
            వహ్వా వహ్వా
            ఎంత లాహిరీ.........

        రక్తపతాకా జాతీయత్వం,
        రంగసానిలో పాతివ్రత్యం.
        'అంబ పలుకు, జగదంబా పలుకు'
        మూలనున్న ముసలవ్వా పలుకు.
        బల్లి పలుకు, జంగు బిల్లీ పలుకు    
            'మావ్, మావ్'
        జాతిద్రోహుల జాతీయత్వం,
        జగజంతులలో పాతివ్రత్యం.

        ఎడన వున్న యెల్లమ్మా సాక్షి
        కుడిన వున్న గంగమ్మా సాక్షి
        పొలిమేర పోలేరమ్మా సాక్షి
        నంది సాక్షి, నాగన్నా సాక్షి
        గుడ్, గుడ్, గుడ్, మూడు గుండ్లాటా?
        తమ్మి! నీ యదృష్టమ్మాట!

            వారే వహ్వా
            వహ్వా వహ్వా

        ఎంత లాహిరీ ఉన్నది చూడు
        ఎంత తడాఖా ఉన్నది చూడు.

                                                                 *  *  *  *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS