మేరీ ఓ మూలగా స్తంభాన్ని ఆనుకుని జగన్నాధం వంక, ఆమ భర్తవంక శ్రద్దగా చూస్తూ నించుంది.
రైలుకదిలింది. జగన్నాధం చేయూపుత నే వున్నాడు.
మేరీభర్త తలుపుదగ్గిర నవ్వుతూ నించూనే వున్నాడు.
రైలు కనుమరు గయ్యింది.
జగన్నాధం అనుకున్నాడు- 'ఆడదాన్ని నమ్మరాదు' అని.
బరువుగా నడచి స్టేషన్ బైటకొచ్చాడు. తలంతా దిమ్ముగావుంది. ఏదో అజ్ఞాతశక్తి తన పీకని నులిమేస్తున్నట్టూ, వొంటిని కోసి నెత్తురు తాగుతున్నటూ వుంది. తూలుతూ నడిచేడు. జేబురుమాల్తో మొహాన్ని కలిగా రుద్దేసుకున్నాడు.
ఉదయం కృష్ణవేణమ్మకి ఆశపెట్టిన సంగతి గుర్తుకొచ్చింది. ఆవేశంతో నదివేపు పరుగెత్తబోయాడు. కానీ కదిలే ముందు తననీడ భయంకరంగా కనిపించడంతో ఉలిక్కిపడి ఆగిపోయాడు. సరిగ్గా ఆ సమాయానికి తనముందు ఓ రిక్షా ఆగింది. రిక్షాలో ని చిదబంరం తనని చూచి పలకరింపుగా నవ్వేడు.
మరెప్పుడైతే అతని స్నేహభావానికి ముగ్దుడై కృతజ్ఞత తెలుపుకునే వాడెను. కానీయిప్పుడు జగన్నాధానికి మనసు స్వాధీనంలో లేదు. గడిచిపోయిన కథకీ, గడవబోయే జీవితానికీ సరిహద్దయిన 'వంచన' అనే పదాన్ని తర్కస్తోంది.
"కమాన్ మైడియర్ బాయ్! హేవ్ ఎలిప్ట్' అన్నాడు రిక్షాలోని చిదంబరం.
అన్యమనస్కరంగా రిక్షా ఎక్కాడు జగన్నాధం. రిక్షా కదిలింది.
" ఇప్పుడు చెప్పు నీకధ" అడిగాడు చిదంబరం.
జగన్నాథం బేలగా అతనివేపు చూసేడు.
"నువ్వు నన్ను క్షమించాలి.ఉదయం పెద్దమనుషుల్తో బిజీగా వున్నాను. పలకరించి నిన్ను అవమానపరచే దాని కంటే చూడకుండా వున్నట్టు నటించడమే మంచిదనుకున్నాను. కాని అనుకున్నంతగా నటించలేకపోయాను. టేకిట్ ఈజీ." మళ్శా చిదంబరమే అన్నాడు.
" నిన్నర్దం చేసుకున్నా" జగన్నాధం నోరు తడిచేసుకున్నాడు.
" దెన్ థేంక్స్.ఊ.... ఈవూళ్ళో ఉద్యోగం వెలగబెడుతున్నావన్నమాట."
తలూపాడు జగన్నాధం.
" పెళ్ళయిందా?"
"లేదు."
"ఎవర్త్నెనా ప్రేమించను."
నవ్వేశాడు చిదంబరం. తర్వాత అడిగేడు.
" భోంచేశావా?"
ఏమన్నట్టు చూశాడు జగన్నాధం.
" ఏం లేదు. వాలకం చూస్తుంటే నిరహారదీక్ష పూనినట్టుంది."
" మరే. పుట్టెడు దిగుల్తో చచ్చేవాడు అలాగే కనిపిస్తాడు."
" నిక్షేపంలాంటి కుర్రాడిని. నీకు దిగులేమిటోయ్!"
" నన్ను విసిగించకు చిదంబరం. ఇంత దూరం తీసుకొచ్చావ్. థేంక్స్. ఇంక మారూమ్ కి పోతాను. రిక్షా ఆపించు."
" వీల్లేదు. కలవక కలవక కలిశాం. నువ్విప్పుడే వెళ్ళిపోతానంటే నే నొప్పేది లేదు. నువ్వు మిరూమ్ కి ఆహ్వానించక పోయినా- ఒఈ ఒక్క రాత్రి మా లాడ్డింగ్ లో గడుపుమరెన్నాళ్ళకు కలుస్తామో."
" కాదు. నన్ను పోనివ్వు."
" ప్లిజ్ . నా మాట తీసేయకు. ప్రాణం మిత్రులం గాకపోయినా కలిసి చదువుకున్నాం. ఉదయం నిన్ను నిర్లక్ష్యం చేసినందుకే నే నెంత పశ్చాత్తాప పడుతున్నానో తెలుసా? అన్నాడు బాధగా చిదంబరం.
వెనక బెంచీలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే చిదంబరం ఈ నాడింత మాటకారి అయ్యాడని తెలిసింతర్వాత జగన్నాధం ఆశ్యర్యపోయేడు.
" జవాబు కావాలి జగన్నాధం. నువ్వు నన్ను క్షమించి నట్టు భావిస్తే నువ్వీ రాత్రి నాతో గడపాలి తప్పదు." అన్నాడు.
జగన్నాధం ఏం మాటాడలేక పోయాడు.
-హోటల్ గదిలో చాలాహాయిగావుంది. అయినా జగన్నాధం మదిలో కావల్సినంత 'గొడవ వుంది.'
" భోం చేశానన్నావ్. పోని యాపిల్సయినా తీసుకో జగన్నాధం" ప్రాధేయ పడుతూ అడిగేడు చిదంబరం.
" వొద్దు. నా నసేం బాగోలేదు"
"అయితే నాదగ్గరో మందుంది. అది వాడు, వొంటికీ మనసుకీ మహమంచిది."
జగన్నాధం తలెత్తినిజమా అన్నట్టు చిదంబరం వేపు చూసేడు. నవ్వు పూర్తయిన తర్వాత సూటుకేసులోంచి ఓ సీసా తీసాడు దాని ఆకారం చాస్తూ నే జగన్నాధం లకలవరపాటు చెందేడు.
"భయపడకు తమ్ముడూ! త్రాగడం ప్రారంభించేడు. చదంబరం తాగుతూ మాటాడుతున్నాడు . తనెలా పెద్దవాడైందీ ఎన్ని తమాషాలు చేసి ఇంత ప్రయోజకుడైందీ చెప్పేడు. మయచేసి బ్రతకటం తెలుస్తే లోకం సలామ్ చేస్తుందిట!
అలా అని చెప్పి నవ్వేడు. ఆ గ్లాసులో మరో తడవ మందు పోశాడు-
"నాలుగేళ్ళక్రితం ఓదిక్కుమాలిన థియేటర్ తాలూకు గేట్ మాన్ కొడుకుని ఇప్పుడు గ్రేట్ మాన్ని. ది గ్రేట్. నాలుగేళ్ళలో నువ్వుపొడిచిందేమి లేదు. కారణం నీకు మాయచేడం తెలియదు.చాతకాదు. తెలుగు సినిమారంగంలో నా పేరు వెలిగి పోతోంది. ప్రొడ్యూసర్ దగ్గర్నుంచీ ఎక్ష్ట్రా వరకూ మా సలహాలు అడుగుతారు. పూర్ ఫెలోస్, వాళ్ళకి తెలీదు. మా నాన్న పట్టి గేట్ మాన్ అని" నవ్వబోయి ఆగిపోయేడు.
