Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 31


                                       శ్రీ రమణ, ఎస్.వి

    చైనా దురాక్రమణ

    సాగిస్తోంది దురాక్రమణ
    చైనాలోని పశుతత్వం
    శాంతివున్న దేశంలో
    చిచ్చుపెట్ట వస్తున్నది.

        ఎవరెస్టూ, గౌరీశిఖరం
        కబళించగ వస్తున్నది
        అగ్గి చేతపట్టకొని
        ప్రజ్వలిస్తు వస్తున్నది.

    మర ఫిరంగి చేతబట్టి
    మంటగల్ప వస్తున్నది
    మాడ్చివేయ వస్తున్నది
    మసి చేయగ వస్తున్నది.

        కరకుకత్తి చేతబట్టి
        నరికివేయ వస్తున్నది
        కొరివి చేతబట్టుకొని
        కొరికివేయ వస్తున్నది.

    ఇండియా ప్రభుత్వాన్ని
    ధిక్కరించి వస్తున్నది
    దిట్టనంచు వస్తున్నది
    లెక్కచేయ కొస్తున్నది.

        ఇండియాపై కొస్తున్నది
        ఆక్రమించ వస్తున్నది
        ఆగనంటు వస్తున్నది
        హద్దు దాటి వస్తున్నది.

    రణం రణం రణం అంటు
    రంకెవేస్తు వస్తున్నది
    ఉరకవేస్తు వస్తున్నది
    యుద్ధజ్వాలను తెస్తున్నది.

                                                                 *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS