Previous Page Next Page 
ఉద్యోగం పేజి 31

ఆ వీధిలోంచి  ఓ  మనిషి వొస్తుంటే ఆయన్ను ఆపి అడిగేడు.
" ఇక్కడ రంగారావు గారిల్లెక్కడండీ?"
ఆ మనిషి ఓ తడవ జగన్నాధాన్ని ఎగాదిగా చూచి అడిగేడు.
" ఆయన్తో మికేం పని బాబూ!"
" ఇది తిక్క ప్రశ్నగా అనిపించినా జావాబు చెప్పక తప్పలేదు.
" ఆయన మా బంధవు."
"అలాగా.అగిగో ఆ చివరంటా ఉన్నదే పెంకుటిల్లు,అదే. నేనిప్పుడు అక్కడ్నుంచే వొస్తున్నాను, రంగారావు యింట్లోనే ఉన్నాడు."
ఆ పెంకుటింటికి వెళ్ళాడు  జగన్నాధం. ఆ యింటి ప్రహరీగోడ తలుపు ఓ రగా తీసివుంది. అక్కడ నిలబడి లోపలకి తొంగిచూశాడు. ఇంటో మనుష్యు లెవ్వరో వున్నట్టే వుంది. నెమ్మదిగా  'రంగారావుగారూ' అని  పిలిచేడు.
లోపలనుంచి యెవరో పలికారు.
జగన్నాధం ఇంట్లోకి  వచ్చాడు. వచ్చిన వెంటనే అతను చూచిన దృశ్యం అతన్ని కలవరపెట్టింది. నలుగురు మనుషులు చీట్లాట ఆడుతున్నారు. వాళ్ళముందు డబ్బులగుట్టలున్నాయి. మరో మనిషి చింకి చాపమిద బోర్లాపడుకున్నాడు.
సిగరెట్టు పీకలూ, పెట్టెలూ గదినిండా చిందరవందరగా పడి వున్నాయి.
ఎవరండీ మీరు?" అన్నాడో వ్యక్తి నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని.
తాగడం నేరమన్నది నిజమేగానీ, తాగినతర్వాత తాగలేదని చెప్పుకుందికి తీసుకునే శ్రద్ధమమాత్రం సహించడం కష్టం. జగన్నాధానికి అలా  అనిపించింది.
జగన్నాధం తనని తను  పరిచయం చేసుకున్నాడు .అది   విన్నతర్వాత ఓ నలభై  ఏళ్ళ నల్లటివ్యక్తి-
"ఓమిరా! రండి. అలా కూర్చోండి" అన్నాడు మరో చింకిచాపని చూపిస్తూ జగన్నాధం కూర్చోలేదు. మళ్ళా నల్లటివ్యక్తే అన్నాడు-
అతను గళ్ళలుంగీ చిరిగిన బనీనుతో వున్నాడు. అతని కళ్ళు ఎర్రగా వున్నాయి. అతని మొహంనిండాగంట్లు పెట్టినట్టు మచ్చలూను. చూడగానే అనిపిస్తుంది వొట్టి రాక్షసడని. జగన్నాథం   చప్ప్పగా చల్లారిపోయాడు. లోలోపల దేవుడితో నిష్ఠురాలు పలుక్కున్నాడు.
మళ్ళా రంగారావే చెప్పాడు.
" మూడ్రోజుల క్రితం మీ వూరెళ్లాను. పిల్లను చూచాను. నాకు వచ్చింది. మరి నేను నచ్చడం నచ్చకపోవడం మిరు నిర్ణయించాలిట. నేనే మీ ఆఫీసుకు వొద్దామనుకుంటున్నాను. మీరే వొచ్చారు."
సుగుణ వచ్చిందని   వినడం యిది ప్రథమం. చాలా ఆనందిచదగ్గ. విషయమే కానీ రంగారావుకి నచ్చిందని వినగానే వొళ్ళు మండుకొచ్చింది. మూగపిల్లకి  రెండో సమ్మధమంటే గుడ్డికాని మెల్ల అనుకున్నాడే గానీ కేవలం గుడ్డిసంబంధమని  యిప్పుడే తెలుసుకున్నాడు. అతనికింకా అక్కడ మంచోబుద్ది కాలేదు. కదలబోయాడు. కానీ రంగారావు వొదిలేట్టు కనిపించలేదు.
" మంగమ్మ! మా బావగారికి కొంచెం మజ్జిగపట్రా" అన్నాడు.
ఈవరసతో మరింత కుళ్ళిపోయాడు జగన్నాధం. మంగమ్మ మజ్జిగ పట్టుకొచ్చింది. తాగబుద్ధి కాలేదు. కానీ గ్లాసు తీసుకోక తప్పిందికాదు.
"ఇంటిది వున్నుప్పుడూ మంగమ్మే పనిమనిషి" అన్నాడు రంగారావు.
మంగమ్మని చూడగానే పనిమనిషి ని కొత్తవాళ్ళు  చెప్పలేదు. కట్టూ బొట్టూ అన్నీ లక్షణంగా, దివ్యంగా వున్నాయి. చీట్లాట రాయళ్ళకి విసుగనిపించింది. మిగిలిన ముగ్గురూ నిట్టూర్చారు. వాళ్ళ అవస్థ గమనించి తొరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యంతో మజ్జిగ తాగబోయాడు జగన్నాధం.ఏదో తమాషా వాసన ఆ గ్లాసునుంచి రాగానే కడుపులో దేవినట్టయింది. కళ్ళు మూసుకుని  విషం తాగినట్టు తాగేశాడు.  ఆపైన వొస్తానంటూ కదిలాడు.
"మరి మి  నిర్ణయమేమిటిటో చెప్పారుగాదు" అన్నాడు రంగారావు.
" నేనీ వూళ్ళోనే వుంటాను. మరో నాడు చెప్తాను" అనేసి గదినుంచి బైటకొచ్చాడు. బైటకొచ్చాడు. బైటకొచ్చింత  ర్వాతగట్టిగా నిట్టూర్చాడు.
ఇప్పుడతనికి ఏడవాలనిపించింది. సుగుణది చూస్తూ చూస్తూ  ఈ నరకంలో తోసేయడం తన కిష్టలేదు.  అమ్మి వాళ్ళు ఎలా యిష్టపడ్డారో మరి. మూగదైతే మాత్రం సుగుణ మనసెంత నవనీతం? తనకు గుర్తు-మనసు బాగుండంక భోంచేయకపోతే నోరు తెరుచుకు అడగలేక కళ్ళనీళ్ళు పెట్టుకు నేది సుగుణ.ఉదయమే తనకోసం వేడినీళ్ళూ , కాఫీ వగైరాలూ అన్నీ అమర్చి పెట్టేది. తనెప్పుడైనా సుగుణకోసం యేదైనాపట్టుకొస్తే అమితానందంతో లేడిపిల్లలా గంతులేసేది నోరుంటే?నోరుంటే చెప్పేది ' మా అన్న దేవుడు, మా అన్నదేవుడూ' అని అలాంటి పిచ్చితల్లికా ఇంత అన్యాయం చేయడం -వొద్దు.
మరి మూగపిల్లకి మొగుడెటా వొస్తాడోయ్ బడుద్దాయ్ అని యెవరో యెందుకు , తన మనసే అడుగుతోంది. జవాబు చెప్పాలి. ఏమని చెప్పాలి? ఏది చెప్పాలి?
" చెల్లీ!  నువ్వెందుకు పుట్టావసలు!"
గబగబా మేన్ రోడ్డు వెంట నడిచేడు బరాజ్ మధ్యగావచ్చి నదివేపు తొంగిచూశాడు. గంభీరంగావుంది. పరవళ్ళు తొక్కుతోంది. గబగబా యి నదిలో కళ్ళుమూసుకు దూకేస్తే-దూకొచ్చా! తన కెవరూ లేకుపోతే , తను యెవరికి కాకుండా పోగల ధైర్యముంటే దూకేయవచ్చు.ఒట్టిది. అప్పుడిహ దూకమన్నా దూకడు. అస లలాంటి కోరికా కలగదు.
వెన్కకి తిరిగాడు. వెళ్ళిపోతూ బెంగగా ఓ తడవగదివేపు చూచేడు.
"పాపం! నిష్కారణంగా కృష్ణవేణమ్మకి ఆశపెట్టాను. ఏమనుకుంటుందో?"  వేదాంతిలా వచ్చేశాడు.
నదికి దూరంగా వొచ్చేసిన తర్వాత అతనికో వెర్రి ఆవేశం కలిగింది. చప్పున రిక్షాని పిలిచేడు. ఎస్కిమోహోటల్ కి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ హోటల్లో  తృప్తిగా భోంచేశాడు. బైటకొచ్చి కిళ్ళి వేసుకున్నాడు. రెండు గోల్డుప్లేకు  సిగరెట్టు పెట్టెలు కొనుక్కున్నాడు. మళ్ళా రిక్షా యెక్కి రూమ్ కెళ్ళిపోయాడు.
బట్టలు మార్చుకుని  నడుం వాల్చేసమయానికి మథ్యాన్నంపన్నెండు గంటలయింద. జీవితంలో తృప్తిని సాధించే ద్దామన్న అతని ఊహకి నవ్వొచ్చింది. నవ్వేసుకున్నాడు. రెండు గంటల ప్రాంతాల నిద్రకి కళ్లు మూతలు పడ్డాయి!

                                                      *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS