Previous Page Next Page 
ఉద్యోగం పేజి 30

సుగుణమ్మ అతనికి చెల్లెలు.  పెళ్ళీడు కెదిగిన యువతిఅందాలరాశి. రతనాల బొమ్మ కానీ ఆబొమ్మ నోరు లేని ఆడబొమ్మ . మూగపిల్లకి పెళ్ళేమిటి  వల్లకాడు అని తీసి పారేసే   అనేక మంది మహాతల్లుల మధ్య, తోటి యువతుల మధ్య జీవచ్చంలా బ్రతుకుతున్న అభాగిని.
ఆ ఆభాగినీ జగన్నాధాన్నే నమ్ముకుంది. ఏనాటి కైనా అన్న నాకో దారి చూపించడా అని గంపెడాశతో అవమానాన్ని భరించి మరీకాలం గడుపుతోంది పిచ్చి చెల్లి!
చెప్పాలని వుంది- " ఈ దౌర్భాగ్యుడు  నీకు అన్న. నువ్వు మూగపిల్లవు, నీకు సుఖం లేదుచెల్లీ! ఇంత విషంతిని చావు" అని కానీ, చెప్పలేడు. తన గుండెల్లో తనే కత్తిని దింపుకునేంత సాహసం లేదు.
ఇంటికి పెద్దవాడుగా పుట్టకు. తలపండిపోయేంత అనుభవం నీ నూనూగు మీసాల వయస్సులోనే రుచి చూడాలి. తట్టుకునే సత్తావుంట, జ్యేష్టుడివిగా పుట్టు- లేదూ-అసమర్ధతిని పదిమందిలోనూ వొప్పేసుకుని నీ దారేదో నువ్వు చూసుకో. ఇలా అని జగన్నాధం ఓ మిట్ట మధ్యాహ్నపువేళ ఏమి తోచక డైరీలో వ్రాసుకున్నాడు. దాని క్రిందే మరో వాక్యం ఎర్ర సిరాతో వ్రాసుకున్నాడు  "నాకు ఆసత్తాగానీ, అసమర్ధత వొప్పేసుకునేంత చొరవగానీ లేవు. అందుకే నే  నింత వెధవ నౌతోంది. "
ఈ విషయా లేవీ మేరీకి తెలీవు.
మేరీలాటి ఓ స్త్ర్రీ తన నింతగా గౌరవిస్తున్నదంటే ఆశ్చర్యం అనిపించడం లేదుగానీ విచారంగావుంది. నిజమే.
నాన్న బ్రతికున్న రోజుల్లోసంసారం గుట్టుగా వుండేది. ఆయన అప్పులు చేసేవారని తెలీని చ్చేవారు కాదు. అదిగో అలా వుండాలి మనిషన్నతర్వాత తనని చదివించేను.అడిగినంతా యిచ్చేరు.
బి. ఎ. థర్డు యియర్ లో మేరీతో పరిచయం అదో బంగారుకల! మేరీ తెలుగులో కవిత్వం వ్రాసేది. జగన్నాధం వ్రాసేవాడుకాదు. మేర చక్కగా పాడేది. జగన్నాధం పాడే వాడుకాదు.    
చదువులో బ్రిలియంటనబడే  జగన్నాధం జీవితంలో దద్దమ్మ అవుతాడని ఎవరరుకున్నారు? మేరీతో చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించేడు " నేను దద్దమ్మని మేరీ!" అని.కాని చెప్పలేదు. చెప్పేందుకు అభిమానం అడ్డువచ్చేదు.
మేరీ నవ్వుతే వెన్నెల చిందినట్టె వుంటుందిగానీ ఎందుకలా నవ్వుతుందో ఒక పట్టాన అర్థంకాకపోయినా సరే హాయిగా ఉండే ఆ నవ్వుని మళ్ళా చూడాలి.
ఈరాత్రి మెయిల్ లో మేరీ వొస్తుందిట. స్టేషన్లో కలుసుకోడమూ వొద్దా  అనే అంశం నిన్నటినుంచీ  ఎటూ తేలకుండానే వుండిపోయింది. విషయంగాచూస్తే యిది చిన్నసైజుదే కావచ్చు. లోతుగా ఆలోచిస్తే మాత్రం గుండెదడ ఎక్కువై పోగలదు.
నాన్నగారు మూడు  నెలల్లో స్వర్గస్థు లౌతారనగా ఓ వెన్నెల రాత్రి మనసు పరవశంచెందుతూండగా మేరీకో మాట ఇచ్చాడు: "పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్ళాడుతాను" అని తర్వాత పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.
కులాలకే తల పగల కొట్టుకునేంత ప్రాముఖ్యం ఇచ్చే యి రోజుల్లో మతాంతర వివాహం, ఆ వెన్నెల రాత్రి తను చేసిన శపథ మంత తేలికైన పని కాదు. ఇంటకీ, వంశానికీ ' పెద్ద దిక్కు' జగన్నాధం . జగన్నాధమే తప్పటడుగు వేస్తే. రే్ప్పొద్దున్న రెండు నిండు ప్రాణుల ఉసురు తను కట్టుకోవలసి వస్తుంది' అందులో తండ్రి లేడు. ఆయనంటే, తన బ్రతకేదో తను చూచుకుని మిగతావాళ్ళ బాధ్యత ఆయన కప్పగించేవాడు.
అయితే-జగన్నాధం ఈ పెళ్ళికో ఉపాయం ఆలోచించిపెట్టాడు. ఆచరించడం కొంచెం   కష్టమే అయినా  ఫలితం మాత్రం శ్రయశ్కరం. తనని నమ్ముకున్న ఇద్దరి బ్రతుకులూ ఓదారి  తీసుకొచ్చిన పిదప మేరీని పెళ్ళాడేస్తే భయపెడుతూన్న ' వివాహ' సమస్య తీరినట్టవుతుందని  అతని ఉద్దైశ్యం.
అందుకే నోటికొచ్చినట్టు వాయిదా వేస్తూవొచ్చాడు. అతని పెళ్ళికీ ఈ ఉపాయం మేరీకి చెప్పాలని వుంది. గానీ , చెబుతే తన మొహం ముందే తన అసమర్ధతని ఎద్దేవా చేస్తుందని భయం. పైగా , బాగా డబ్బున్న ఆసామి కూతురు మేరీ. కొంచెం తలతిక్క మనిషని గూడా జగన్నాధం అభిప్రాయం.
- వెనగ్గా వొచ్చిన కారు హారనువిని ఉలిక్కిపడి పక్కకి తప్పుకున్నాడు జగన్నాధం కారు దుసుకుపోయింది. ఓ ముసలాయన జగన్నాధం పరాకుని హెచ్చరించాడు  హేళనగా, సిగ్గుపడి పోయేడు జగన్నాధం.
తను నుంచున్న వీధిని గమించిన తర్వాత తను చేయవలసిన మహత్తరమైన కార్యం గుర్తుకొచ్చింది. ఇప్పటివరకూ ఆ  విషయమైన ఆలోచించ నందుకు  అతను బాధపడ్డాడు.ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు తననీ, హడలుగొట్టిన కారాయన్నీ, హెచ్చరించిన ముసలాయన్నీ  అభినందించేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS