Previous Page Next Page 
రాగోదయం పేజి 25


    `"అడపా దడపా డబ్బు తీసుకుని మెడ్రాసు చెక్కేస్తాడు కదా!"
    "అబ్బబ్బ అవన్నీ ఎందుకులెద్దూ?"
    "దానివల్లే కదా వాయనప్పాడు సంబంధం చెడింది."
    "షో" అడ్దోస్తూ అన్నాడు ధర్మారెడ్డి.
    "ఖాళీ" అన్నాడు శేషయ్య.
    "ఈరోజు కోటా అయిపోయిందంతే!"
    "ఇదిగో మామా! ఇది ధర్మ ఖాతాలో జమ వేసుకో. పదిరూపయలందించాడు చౌదరి. అతనికి శేషయ్య తన తమ్ముని విషయం వాడి పెళ్ళి విషయం లేవనేత్తగానే అయన బుర్రలో ఏదో తొలుస్తూ వుందని అది బయటికి వస్తే తనకు మేలవుతుందని గ్రహించాడు. అందుకే పదిరూపాయలు సునాయాసంగా జారవిడిచాడు.
    విరగబడి నవ్వాడు శేఖర్.
    "ఏంటయ్యా అంత నవ్వు!"
    "కరణం మామ ఎత్తు తెలిసిందిలే!"
    "ఏంటోయ్ అది?"
    "చౌదరిని ఎలక్షన్సులో దింపాలని కదూ నీ ఆలోచన\.
    శేషయ్య పెదాలు విచ్చీ విచ్చకుండా వస్తున్నా నవ్వు విరిచాయి. "ఒర్ శేఖర్! గుడి శుభ్రం చెయ్యడం అనుకున్నావా రాజకీయం అంటే! లేకపోతే విగ్రహాలకి పులకావు పెట్టడ మనుకున్నావా కరిణీకం అంటే! అదీ యిదీ కాక దద్దోజనం, పులిహొర మొక్కడమనుకున్నావా , పెద్దరికం అంటే? బుర్ర అనుభవాలతో పండాలి తెలుసా?" అన్నాడు.
    శేఖర్ చిత్రంగా చూసి 'అంతేనా!" అన్నాడు.
    "కాదోయ్ కుర్రకుంకా! అన్న కష్టపడి సంపాదిస్తే పేకాటలో ఖర్చు చెయ్యడం!"
    "బరువు బాధ్యతలు లేకుండా తిరగటం!"
    "ఇంకేం మిగిలాయో తిట్టేయ్ మామా. నీ తిట్లు నాకు దీవెనలు. నీవు కోపం చేస్తే మాకు ఆయుర్వుద్ది. తిట్టు. విషయం తెలియచెప్పు. నేర్చుకుని బాగుపడతాం.' తలవంచి నమస్కరించి అన్నాడు శేఖర్.
    తృప్తిగా తనలో తనే నవ్వుకున్నాడు శేషయ్య.
    "ఏంటి మామా!" అడిగాడు చౌదరి.
    "నాయుడూ, మన ఊరు మేజర్ పంచాయితీ కాబోతోంది. మన ఊరికి అన్నీ వున్నా లేంది ఏమిటి?"
    నాయుడు రెడ్డి ముఖా ముఖాలు చూసుకున్నారు.
    "మనకి క్రికెట్ సొసైటీ లేదు. రేపు వూళ్ళో టముకు వేయించు. అందర్నీ రచ్చబండ పై సమావేశం కమ్మను.  ఇలా యిలా అని చెబుదాం షేర్ కాపిటల్ మెంబర్ షిప్ డబ్బూ కట్టమందాం. వాళ్ళల్లో కొందరిని డైరక్టర్లుగా తీసుకుందాం. అయిదుగురు మనవాళ్ళు అన్నట్టు అడమెంబరు వుంటే బావుంటుంది. భార్గవిని చేర్పిద్దాం. దానికి సెక్రటరీ కావాలి. శేఖర్ ని చేద్దాం."
    అంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా వివరించాడు. శేఖర్ ముఖం వికసించింది ఆ మాటలకు. అందరికి శేషయ్య మాటలు నచ్చాయి.
    అయితే ఇందులో చౌదరికీ ఒరిగేదేమిటో అర్ధం కాలేదేవరికి! జనార్ధన్ ప్రసక్తి రానేలేదు. సెక్రటరీగా జీతం తీసుకునే అతను శేఖర్.
    "మరి జనార్ధన్ ?" చౌదరీ తెగించి అడిగాడు.
    అభయ ముద్ర్రతో ప్రత్యక్షమైన పరమశివుడులా చిరునవ్వు నవ్వుతూ అతను సొసైటీ ప్రేసిడేంటూ" అన్నాడు క్లుప్తంగా.
    చౌదరి ముఖం వికసించింది. కృతజ్ఞత పూర్వకంగా చూశాడు.
    "నువ్వు గ్రామ సర్పంచివి, అతను మునసబు. నేను కరణాన్ని. చౌదరి గ్రామ పెద్ద మనకీ పోజిషనులు చాలు. మనకి తోకలు లేవు చౌదరి తమ్ముడు రికామిగా వున్నాడు బరువు బాధ్యతలూ లేవు డబ్బు చేతిలో తిరుగుతూ వుంటే అతనికి ఉత్సాహంగా వుంటుంది. పైన మనం వున్నాం కాబట్టి బాధ్యత తెలుస్తుంది.'
    "కరెక్టు" అన్నాడు నాయుడు.
    "రేపే చాటింపు వేయించు" అన్నాడు ధర్మారెడ్డి.
    
                                                                11


    పల్లె ప్రజలు నూటికి తొంభై మంది అమాయకులు నిరక్ష్యరాస్యత దానికి తోడు మిగిలిన పదిమంది బ్రతకనేర్చిన వాళ్ళు. వాళ్ళలో ఒకరు చాలా నిజాయితీగా వుంటారు. మిగతా అంతా ఆ తొంబది మందినే ఎలాగో ఓ లాగు దోచుకుని తిందామనే ఆలోచిస్తూ వుంటారేప్పుడూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS