Previous Page Next Page 
ఉద్యోగం పేజి 12

"అతనా! వట్టి తిక్కమనిషి. మనం చెప్పేది  వింటూనే మనల్ని మరిచిపోయి తిక్కపోజు పెట్టేసి వెళ్ళిపోతాడా" వటాని! తోచని సమయాన్ని తోచేవిధంగా మల్చుకోడమనే పద్ధతిని 'తిక్క' అంటే నేనేం చేసేది?
కొన్ని రోజుల్లో పుట్టబోయే మాచింరజీవి వయస్సు  క్షణంలో నాలుగేళ్ళు చందమామ. మా యింటికో వెల్తురు.అవునాండి, ఇదు మొదటిభాగం.  వాడుత్త పెంకి ఘటం. వాళ్ళమ్మని క్షణం ఊపిర పీస్చుకోనివ్వడు వాళ్ళమ్మదగ్గిర వాడికి చనువెక్కువ. ఇరవై నాలుగ్గంటలూ మాటలు కావాలి. ముచ్చటపడి యేదైనా వాడితో చెప్పడానికి ప్రయత్నిస్తే యక్ష ప్రశ్నలు,ప్రాణంతీసి పారేస్తాను. ఈ పోరుపడలేక శ్రీమతి వాడిని నా దగ్గరికి పంపింది  ఓనాడు అప్పుడు  మా యిద్దరి మధ్య నడిచిన సంభాఖషణా క్రమం యిది:
"ఒరేయ్  ఏమిట్రా అల్లరి?" నేను.
"అల్లరికాదు గురూ!" వాడు.
"ఒరేయ్ , ఒరేయ్! నాన్నగార్ని  'గురూ' అనకూడదు."
"మరి నువ్వు ఆ కళ్ళజోడునూ వయ్యని గురూ  అంటావేం?"
"వాడా? వాడు వెధవ గనక."
"గురూ అంటే ఏమిటి?"
"ఇదిగో విన్నావా? వీడిక్కడ నన్ను తినేస్తున్నాడు."
"నాకేం తెలీదు" మా ఆవిడ.
"మరి... ఒక్కో మాటునువ్వూ , కళ్ళజోడుమావయ్యా యిద్దరూ కలిసి యెవర్నో తిడతారెందుకూ వాడు వెధవ కాడా?"
 " నీతో నేనువాగలేను రాచిట్టీ! మాటకుముందు నన్ను నువ్వు  అని పిలవకు."
" ఏమని పిలవాలి?"
" డాడీ! అని"
"ఎందుకని."
" పిలవకపోతే."
" కొడతాను."
" ఎందుకని."
" అబ్బబ్బ... చంపేస్తున్నావురా చిట్టిగా."
" నాకివాళ డబ్బు లివ్వలేదు. అమ్మ నడిగితే తం దగ్గిర్లేవంది."
" ఇప్పుడు డబ్బుల్తో పనేమిట్రా?"
" కొనుక్కోవాలి."
"ఏమిటి?"
"సిగరెట్టులు"
" అయ్యబాబోయ్! నిన్ను సిగరెట్లు కాల్చమని ఎవరు  చెప్పార్రా?
"అమ్మ."
"విన్నావా? వీడిని సిగరెట్టు కాల్చమని  సలహా యిచ్చావా?"

                              *    *    *    *
" వాడిని చూచైనా ఆపాడు సిగరెట్టు మానేయండి"మా ఆవిడ పథకం ఇది.
" సర్లే. నువ్వు నోరుమూసుకో  చూడు చిట్టీ నువ్వు సిగరెట్లు కాల్చకూడదు నాన్నా !తప్పు."
" మరి నువ్వు కాల్చుకోవచ్చా?"
" నేను పెద్దవాడిని."
" మరి నేను పెద్దయింతర్వాత కాల్చనా?"
- సిగరెట్టు చివరంటాకాలీ, వేలిని కాల్చేసింది. దాంతో కలనుంచి బయటపడ్డాను. ఛీ...వెధవది, సిగరెట్లు మానేయాలి. ఈదురులవాటు పిల్లలక్కూడా సంక్రమిస్తే అప్పుడేంగావాలికనుక?
నావాడు పార్ధుడిలా కొంచెం అల్లరి కొంచెం బుద్ధిగవుంటేచాలు. మా అక్కయ్య వాళ్ళు నాకు ఆడపిల్ల పుడుతుందనిజోస్యం చెపుతున్నారు. వాళ్ళదంతా స్వార్ధం మా పిల్లకి పెళ్ళి చేసే ప్రయత్నంలో  వాళ్ళతో కాళ్ళబోరానికి రావాలని వాళ్ల ఉద్దేశం. మా అమ్మగూడా వాళ్ల జట్టే. ఎటుతిరిగీ అన్నయ్య, నాన్నగారూ, నేనూ, మా ఆవిడ, అందర్నీమించి మా వదిన- మా అందరికోరి నాకు కొడుకు కావాలనే.
నిద్రకి కళ్లు మూతలు పడుతూన్నవేళ మావాళ్ళంతా గుర్తుకొచ్చేరు. ఆరాత్రి కలల్తోనే గడిపాను.
ఆఫీసుకెళ్ళడం,  అద్దెగదికి రావడం మినహా వేరే వ్యాపకమంటూ లేదు. చాలా యంత్రికంగా ఉన్నదిక్కడ  నా వ్యవహారం సాయంత్రం  ఈ వూళ్ళో చూడటం పడని ఇంగ్లీషు సినిమా 'నార్త్ బై నార్త్ వెస్ట్' ఇంటర్వెలో   ఇక్కడ ఆఫీసులో పన్జేసే మోహన్ రావ్ కలశాడు. మోహన్ రావెంట కొత్తమనిషి  ఒకతనున్నాడు. పరిచయం చేశాడు. శర్మట, మొన్ననీమధ్య ఒక కథ పత్రికలో రాశాట్ట. నేను చదవలేదు గానీ ఆకథ చాలా బాగుందని మోహన్ రావ్ మెచ్చుకున్నాడు. శర్మ మాయిద్దరికీ టీలు తెచ్చాడు.
సినిమా పూర్తయింతర్వాత మోహనరావొక్కడూ నాతోపాటు సెంటర్ వరకూ ఒచ్చేడు. దారిలో అతనన్నాడు,
"ఈ శర్మ మీ యింటివోనరుకి ఒక కథ కూడా  ఉన్నదా."
" ఆహా మొదటి పెళ్ళా ముండగానే  రెండోపెళ్ళాన్ని కట్టుకున్న ఘనుడు , మీరాపని చేయగలరా?"
" నేచేయకపోకయినా చాలామంది చాటుగా చేస్తున్నట్టు తెలుసు."
"ఇందులో తిరకాసూ ఏర్పడిందిలెండి. మొదటిపెళ్ళానికి పిచ్చెత్తిందని   ఒక గొప్ప పుకారు పుట్టింది రెండో పెళ్ళాన్ని పబ్లిగ్గా పెళ్ళాడాడు. మొదటి పెళ్ళాం నిజంగా తనకి పిచ్చెత్తింది కాబోలుననిచెప్పి నూతిలో దూకి చచ్చింది."
" నాకీ విషయాలు తెలియవుసుమా?"
" శ్రీధరరావు డబ్బుకోసం  ఎంతపనైనా చేసేయగల పురగు. ఉత్తమాయమనిషి. కొన్నాళ్ళకి మికూ తెలుస్తుందిలేండి"
మోహనరావు వెళ్ళిపోయాడు . శ్రీధరరావుగురించి  ఆలోచినలుమాత్రం నన్ను విడిచిపెట్టలేదు. కానీ వూరొచ్చింది ఆఫీసుపనిమిద .ఆపనేదో చక్కబెట్టుకు వెళ్ళవలసిన వాడిని అనవసరంగా శ్రీధరరావుగురించి నాకిన్ని ఆలోచనలెందుకు? అని చాలాతడవ లనుకున్నానుగానీ,  ఆచరణలో ఓడిపోయాను. సత్యం  అన్నట్టు నేను   'ఫూల్' నే మో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS